సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూదాన్ భూముల కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు. జనార్థన్ రెడ్డితో పాటుగా మరో ముగ్గురిని కూడా ఈడీ అధికారులు విచారించనున్నారు.
రాష్ట్రంలో భూదాన్ భూముల కుంభకోణంపై ఈడీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నేడు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు. ఆయనతో పాటుగా మరో ముగ్గురిని ఈడీ అధికారులు విచారించనున్నారు. వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డి, మరో ఇద్దరికి ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విచారణను హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆర్డీవో, ఎమ్మార్వోను విచారించి ఈడీ కీలక వివరాలను సేకరించింది.
ఇదిలా ఉండగా.. మేడ్చల్ జిల్లాల్లో అమోయ్ కుమార్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జరిగిన భూ లావాదేవీలపై బాధితులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఈడీ అధికారులు ఇప్పటికే అమోయ్ కుమార్‌ను పలుమార్లు ప్రశ్నించారు. రూ.కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇతరులకు కేటాయించడంపై ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు అమోయ్ కుమార్, మహేశ్వరం తహశీల్దార్ వాంగ్మూలాలను నమోదు చేశారు. వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అప్పటి ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ జ్యోతితోపాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు. వారు ఇచ్చిన కీలక పత్రాల ఆధారంగా భూ ఆక్రమణలపై పూర్తి ఆధారాలను ఈడీ సేకరించి డీజీపీకి నివేదిక సమర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment