
హైదరాబాద్,సాక్షి: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చిక్కుల్లో పడ్డారు. కంచ గచ్చిబౌలి భూముల(Kancha Gachibowli land issue) అంశంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు (Smita Sabharwal) పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
మార్చి 31న 'హాయ్ హైదరాబాద్' అనే ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఒక గిబ్లీ (Ghibli)చిత్రాన్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఆ చిత్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (hyderabad central university)లోని 'మష్రూమ్ రాక్' ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు, వాటి ముందు గిబ్లీ శైలిలో నెమలి, జింక ఉన్నాయి. అయితే వైరల్ చిత్రం నకిలీదని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేసినందుకు స్మితా సబర్వాల్‌కు బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్ సెక్షన్ 179 కింద నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నోటీసులపై ఆమె ఏవిధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
FREE SPEECH - TELANGANA MODEL!
In probably a first, police booked a case against an IAS for a RETWEET!
Smitha Sabharwal, IAS, principal secretary of Youth Advancement, Tourism & Culture is the latest to be served notices by the Telangana police.
The Crime: She retweeted an… pic.twitter.com/5g5rTALYex— Revathi (@revathitweets) April 16, 2025