అమ్మాయితో భార్యకు అడ్డంగా దొరికిన జీహెచ్‌ఎంసీ అధికారి | GHMC Janaki Ram Caught His Wife In Apartment | Sakshi
Sakshi News home page

అమ్మాయితో భార్యకు అడ్డంగా దొరికిన జీహెచ్‌ఎంసీ అధికారి

Published Fri, Feb 21 2025 11:32 AM | Last Updated on Fri, Feb 21 2025 12:35 PM

GHMC Janaki Ram Caught His Wife In Apartment

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డునపడేస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. సొసైటీలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు సైతం వివాహేతర సంబంధాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో పరువు తీసుకుని నవ్వుల పాలవుతున్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీకి చెందిన ఓ అధికారి బాగోతం బట్టబయలైంది. తన కంటే 20 ఏళ్ల తక్కువ వయసున్న అమ్మాయితో సదరు అధికారి వివాహేతర సంబంధం పెట్టుకోగా అతడి భార్య వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు.

వివరాల ప్రకారం.. జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకీరామ్‌ను వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమెతో కలిసి నగరంలోని వారాసిగూడలో మకాం ఉంటున్నాడు. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో భార్య కళ్యాణికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో జానకీరామ్‌ ఎక్కడికి వెళుతున్నాడని కళ్యాణి నిఘా పెట్టింది. దీంతో, వారాసిగూడలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు గుర్తించింది.

దీంతో, ప్లాన్‌ ప్రకారం భర్తను ఫాలో చేసిన కళ్యాణి.. అపార్ట్‌మెంట్‌లోని గదిలో వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరినీ ఆమె చితకబాదారు. అనంతరం, కళ్యాణి మాట్లాడుతూ.. జానకీరామ్‌ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర బంధం పెట్టుకున్నాడని అన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాడని  ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం వెళ్లడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిద్దరిని స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో జానకీరామ్‌కు తగిన బుద్ది చెప్పాలని పోలీసులను కళ్యాణి కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement