
సాక్షి, హైదరాబాద్: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మైనారిటీల రెసిడెన్షి యల్ పాఠ శాలలో విషాహారం ప్రభావంతో 31 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలుకావడం పట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల పరిస్థితి గురించి జిల్లా యంత్రాంగాన్ని అడిగి తెలుసుకోవాలని రాజ్‌భవన్ అధికారులను ఆదేశించారు.
విద్యార్థులందరూ కోలుకున్నారని, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఈ ఘటనపై ఆరా తీస్తున్నారని రాజ్‌భవన్ అధికారులు గవర్నర్‌కు నివేదించారు. విద్యార్థులంతా డిశ్చార్జ్ అయినట్లు తెలుసుకుని గవర్నర్ ఊపిరి పీల్చుకున్నారు.