
సీఆర్‌పీఎఫ్ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా ఇంట తుపాకీ పేలింది.
సాక్షి, హైదరాబాద్: సీఆర్‌పీఎఫ్ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా ఇంట తుపాకీ పేలింది. ఆయన వద్ద పని చేసే ఓ జవాన్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం సికింద్రాబాద్ బేగంపేటలోని చికోటి గార్డెన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
మృతున్ని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవేందర్ కుమార్‌గా గుర్తించారు. సీఆర్‌పీఫ్ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా వద్ద విధులు నిర్వహిస్తున్నాడు దేవేందర్. సూసైడ్‌కు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: బెట్టింగ్‌లో భారీ నష్టం.. అయ్యో మధు!