ఛత్తీస్గఢ్: విధుల్లో ఉన్న ఓ జవాను అనూహ్య రీతిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను తాను కాల్చుకుని నిలువునా ప్రాణాలు తీసుకున్నాడు. ఛత్తీస్గఢ్ లోని బిజాపూర్ జిల్లాలో పవిత్ర యాదవ్ (44) అనే జవాను సీఆర్పీఎఫ్ 168వ బెటాలియన్లో జవానుగా పనిచేస్తున్నాడు. బిజాపూర్ పట్టణంలోని ఓ జైలు పక్కన విధులు నిర్వర్తిస్తున్నాడు.
బుధవారం ఉదయం ఒక్కసారిగా తుపాకీ పేలిన చప్పుళ్లు వినిపించడంతో తోటి జవాన్లు వెళ్లి చూడగా అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చేతిలోని తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. పవిత్ర యాదవ్ ఉత్తరప్రదేశ్ లోని బరేలికి ప్రాంతానికి చెందినవాడు. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. దర్యాప్తునకు ఆదేశించారు.
జవాను ఆత్మహత్య
Published Wed, Jun 17 2015 12:02 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement