commit
-
పెళ్లి అయిన మూడు రోజులకే.. ‘నవ వరుడి’ ఆత్మహత్యాయత్నం..
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): జగిత్యాల జిల్లా కేంద్రంలోని మార్కండేయనగర్కు చెందిన బాబా పెళ్లి అయిన మూడు రోజులకే కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. బాబాకు మూడు రోజుల క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. అప్పటినుంచి వీరద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విషయమై యువకుడు గురువారం జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు.. ఇద్దరికీ సర్దిచెప్పి ఇంటికి పంపించారు. శుక్రవారం మళ్లీ ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన బాబా పదునైన కత్తితో చెయ్యి, వీపు భాగాల్లో కోసుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దూషించిన వ్యక్తిపై చర్య తీసుకోండి కథలాపూర్(వేములవాడ): అటవీశాఖకు చెందిన భూమిని కబ్జా చేశాడని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి తనను దూషించాడని సెక్షన్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన పిట్టల రాజం అటవీశాఖకు చెందిన భూమిని కబ్జా చేసి, చెట్లు నాటాడు. దీనిపై ప్రశ్నించి, వాటిని తొలగించిన అటవీశాఖ సెక్షన్ అధికారి శ్రీనివాస్‌ను అతను దూషించాడు. ఈ మేరకు బాధితుడు శుక్రవారం ఠాణాలో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చర్య తీసుకోవాలని కోరారు. చదవండి: అదనపు కట్నం కోసం వేధింపులు.. ఎనిమిది నెలల నిండు గర్భిణి పై.. -
విషాదం: అమ్మా.. ఎంత కష్టమొచ్చిందో..
సాక్షి, ఖమ్మం: ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబంలో చిన్నపాటి కలహాలు ఆమెను ప్రాణం తీసుకునేలా చేశాయి. క్షణికావేశానికి లోనైన ఆ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. తాను చనిపోతే పిల్లలు దిక్కులేనివారు అవుతారని అనుకుందో ఏమో కడుపుతీపిని సైతం చంపుకొని వారినీ తనతో పాటే తీసుకెళ్లింది. ఆ చిన్నారులు అమ్మా వద్దు వద్దు అంటున్నా క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం తనతో పాటు ఇద్దరు చిన్నారులను విగతజీవులుగా మార్చింది. ఈ విషాదకర ఘటన ఖమ్మం నగరంలో బుధవారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మంలోని బస్టాండ్ సెంటర్లో పూల వ్యాపారం చేసే శ్రీనివాస్ తన మూడో కూతురైన వనితను బావమరిది డోన్వాన్ రవికుమార్‌కు ఇచ్చి 12 ఏళ్ల కిందట వివాహం చేశాడు. వారికి మొదట ఒక సంతానం కలిగి చనిపోగా తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆటోడ్రైవర్ అయిన రవి కుటుంబంతో కలిసి ఖానాపురం యూపీహెచ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఏడాదిన్నరగా వనిత నగరంలోని ఓ మార్ట్‌లో పనిచేస్తూ కుటుంబ పోషణలో భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తోంది. అప్పుడప్పుడు రవికుమార్‌కు, వనితకు మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నా పెద్దవాళ్లు సర్దిచెప్పేవారు. తర్వాత భార్యాభర్తలు కూడా సర్దుకొని పోయి బాగానే ఉండేవారు. కొన్ని రోజుల క్రితం భర్తకు కరోనా రావడంతో వనిత పిల్లలు చైతన్య(7), రోహిణి(6)లతో కలిసి తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో రవికుమార్ మంగళవారం రాత్రి ఆమెకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో ఇద్దరు ఫోన్లో ఘర్షణపడ్డారని.. బుధవారం ఉదయం భర్త వద్దకు వెళ్లగా ఆమెకు, రవికుమార్‌కు మరలా గొడవ జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మున్నేరులో దూకి.. బుధవారం మార్ట్‌లో పనిచేయడానికి వెళ్లాల్సిన వనిత అక్కడకు వెళ్లకుండా ఇద్దరు పి ల్లలను తీసుకొని ఆటోలో కాల్వొడ్డుకు చేరుకుంది. అక్కడ నుంచి మోతీనగర్ వైపు ఉన్న మున్నేరు ఒడ్డుకు వెళ్లింది. మొదట పిల్లలను మున్నేరు నీటిలో తోసేసి అనంతరం తాను కూడా దూకింది. సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ముగ్గురిని కాపాడేందుకు నీళ్లలో దూకి వారిని ఒడ్డుకు చేర్చిచూడగా అప్పటికే ప్రాణాలు విడిచారు. ఏదైనా కష్టం ఉంటే తమకు చెప్పాల్సిందని, తామందరం లేమా అని ఆమె సోదరుడు కోటి, సోదరీమణులు, తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. ఆర్థిక ఒత్తిళ్లతోనే.. ఇదిలా ఉండగా వనిత, రవికుమార్ మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగినా అవి తాత్కాలికమేనని.. ఆమె భర్త కూడా భార్యను, పిల్లలను వదిలిపెట్టి ఉండేవాడు కాదని కొంతమంది బంధువులు చెబుతున్నారు. అయితే ఇటీవల వనిత ఒక స్కీమ్‌కు సంబంధించి తాను చేరడంతో పాటు మరికొందరిని కూడా చేర్పించిందని, దానికి సంబంధించిన డబ్బును స్కీమ్ నిర్వాహకులు ఇవ్వకపోవడంతో ఆమెకు అవతలివారి నుంచి ఆర్థిక ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని కొంతమంది బంధువులు అంటున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను రెడ్‌క్రాస్ సొసైటీ శాశ్వత సభ్యుడు అన్నం శ్రీనివాసరావు తన బృంద సభ్యులతో కలిసి మార్చురీకి తరలించారు. చదవండి: బర్త్‌డే కేక్ కట్ చేశాడు.. అందరూ కటకటాల పాలయ్యారు -
నారాయణ విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య
-
ఆత్మహత్యల బాటలో అన్నదాతలు
-
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
సిరిసిల్ల(కరీంనగర్ జిల్లా): సిరిసిల్ల మండలం రగుడు వద్ద ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సాయి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి చెందిన ఎల్లమ్మ ప్రేమించుకుని ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లిని అమ్మాయి తరపు బంధువులు వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భయపడిన జంట వేములవాడకు వచ్చి రగుడు వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించారు. -
కాల్వలో దూకి వివాహిత ఆత్మహత్య
ఐరాల: చిత్తూరు జిల్లా ఐరాల మండలం పి.కట్టకిందపల్లి వద్ద హంద్రీనీవా కాల్వలోకి దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సరళ(26)గా పోలీసులు శుక్రవారం ఉదయం గుర్తించారు. కాగా, సరళ ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
జవాను ఆత్మహత్య
ఛత్తీస్‌గఢ్: విధుల్లో ఉన్న ఓ జవాను అనూహ్య రీతిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను తాను కాల్చుకుని నిలువునా ప్రాణాలు తీసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్ లోని బిజాపూర్ జిల్లాలో పవిత్ర యాదవ్ (44) అనే జవాను సీఆర్పీఎఫ్ 168వ బెటాలియన్‌లో జవానుగా పనిచేస్తున్నాడు. బిజాపూర్ పట్టణంలోని ఓ జైలు పక్కన విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం ఒక్కసారిగా తుపాకీ పేలిన చప్పుళ్లు వినిపించడంతో తోటి జవాన్లు వెళ్లి చూడగా అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చేతిలోని తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. పవిత్ర యాదవ్ ఉత్తరప్రదేశ్ లోని బరేలికి ప్రాంతానికి చెందినవాడు. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. దర్యాప్తునకు ఆదేశించారు.