వీఐపీల డ్రైవర్స్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ చేస్తాం: మంత్రి పొన్నం | minister ponnam prabhakar Media Chit Chat Over Mahalakshmi Scheme | Sakshi

వీఐపీల డ్రైవర్స్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ చేస్తాం: మంత్రి పొన్నం

Published Sat, Feb 24 2024 3:50 PM | Last Updated on Sat, Feb 24 2024 4:01 PM

minister ponnam prabhakar Media Chit Chat Over Mahalakshmi Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వీఐపీల దగ్గర ఉన్న డ్రైవర్స్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం మంత్రి పొన్నం మీడియా చిట్‌ చాట్‌లో మాట్లాడారు. ‘మహాలక్ష్మి కింద కండక్టర్లు అనవసరంగా టికెట్లు కొడితే.. పట్టుబడితే చర్యలు తీసుకుంటాం. గతంలో రెగ్యులర్‌గా 44 లక్షల ప్రయాణాలు ఉంటే.. ఇప్పుడు 55 లక్షలకు పైగా ఉంది. ఆటోవాళ్లకు రూ. 12 వేల హామీ ఇచ్చాం.. నెరవేరుస్తాం. ఆటోలు కొనుగోలు పెరిగింది, ఆటోలకు నష్టం ఉంటే కొత్తవి ఎందుకు కొంటారు?.

... కుల గణనపై అధికారులకు శిక్షణ ఇస్తాం. బిహార్‌లో 2.5 లక్షల మంది అధికారులను కేటాయించి ఒకొక్కరికి 150 ఇల్లు ఇచ్చారు. ఇక్కడ కూడా ఇళ్లను బట్టి.. అధికారులను నియమిస్తాం. నోడల్ ఆఫీసర్‌గా బీసీ వెల్ఫేర్ డిపార్టుమెం‍ట్‌ ఉంటుంది. కవితకు సీబీఐ నోటీసులు వాయిదాల పద్ధతిలో వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, అందుకే మళ్లీ కొత్త డ్రామా’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement