
ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల అప్‌డేట్స్..
టన్నెల్‌లో రోబోలతో సహాయక చర్యలు: మంత్రి ఉత్తమ్
- టన్నెల్ వద్ద సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్
- మంత్రి ఉత్తమ్ కామెంట్స్..
- సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఇలాంటి క్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదు
- 14 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉంది
- చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు
- అక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసే వాళ్లకు సైతం ప్రమాదం
- అందుకే రోబోల సాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నాం
👉ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నేటితో సహాయక చర్యలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఇక, టన్నెల్‌లో జీపీఆర్ గుర్తించిన అనుమానిత ప్రాంతాలనే క్యాడవర్ డాగ్స్ మళ్లీ గుర్తించాయి. మరోవైపు.. టన్నెల్‌లో సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేడు మరోసారి సమీక్షించనున్నారు. హెలికాప్టర్‌లో మంత్రి ఉత్తమ్ దోమలపెంట చేరుకోనున్నారు.
👉ఇక, హైదరాబాద్‌కు చెందిన అన్వీ రోబోటిక్స్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు వరసగా రెండోరోజు కూడా సొరంగంలోని పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో టీబీఎం చుట్టుపక్కల, అక్కడి నుంచి మరికొంత దూరంలో కొన్ని ప్రదేశాలను గుర్తించినట్లు సమాచారం. ఇంతకుముందు క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలనే ఇవి కూడా గుర్తించినట్లు తెలిసింది.
👉ఇదిలా ఉండగా.. సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్ నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు టీబీఎం కత్తిరింపునకు అవసరమైన సామగ్రిని లోకో ట్రైన్ ద్వారా సొరంగంలోకి తెప్పించుకున్నారు. రాకపోకలకు అనుకూలంగా ఉండేందుకు కూలిపడిన మట్టి దిబ్బ వరకు పొక్లెయిన్ వెళ్లేలా టీబీఎంను ఒకవైపు కత్తిరిస్తున్నారు. టీబీఎం భాగాలను కత్తిరించే పనిలో సహయక సిబ్బంది వేగం పెంచారు. రోజుకు సుమారు ఐదు అడుగుల మేర తొలగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరో రెండు రోజుల్లో మట్టి కూలిన ప్రదేశం వరకు పొక్లెయిన్ చేరుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలగించిన టీబీఎం సామగ్రిని లోకో ట్రైన్‌తో బయటకు పంపిస్తూ రాకపోకలకు క్లియర్ చేస్తున్నారు.
