
ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో 15 రోజుల్లో సహయక చర్యలు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రమాదం అత్యంత బాధకార ఘటన అన్నారు.
సాక్షి, మహబూబ్‌నగర్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో మరో 15 రోజుల్లో సహయక చర్యలు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రమాదం అత్యంత బాధకార ఘటన అన్నారు. గడచిన 40 రోజులుగా సహయక బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయని తెలిపారు. మిగిలిన బాధిత కుటుంబాలకు వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు తెలిపారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టును వచ్చే రెండున్నర ఏళ్లలో ఎస్‌ఎస్‌బీసీ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. ఇవాళ మంత్రి.. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహయక చర్యలను పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగిన రోజు నుండి నేటి వరకు జరుగుతున్న సహాయక చర్యల గురించి ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌లు మంత్రికి వివరించారు. సహయక బృందాల పనితీరును మంత్రి అభినందించారు.