
హైదరాబాద్: తెలంగాణలో టెట్ దరఖాస్తుల గడువును పెంచారు. ఈ నెల 20 వరకు గడువును ప్రభుత్వం పెంచింది. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఆప్లికేషన్‌ను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు సాక్షి ముందే కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపినట్లు సాక్షి తన కథనంలో పేర్కొంది.
ఇదీ చదవండి: 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు!