
సూర్యాపేటలో వివాహమహోత్సవానికి హాజరైన వైఎస్.విజయమ్మ
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రవి కన్వెన్షన్ హాల్‌లో శనివారం జరిగిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి సమీప బంధువు, గుంపుల తిరుమలగిరి ఉప సర్పంచ్ నల్లబోలు రాఘవరెడ్డి కుమార్తె వివాహ మహోత్సవానికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు సోనియారెడ్డి, నవకిరణ్‌రెడ్డిని ఆశీర్వదించారు. ఆమె వెంట పిట్టా రాంరెడ్డి తదితరులు ఉన్నారు.
చదవండి: (రేవంత్ రెడ్డికి మంత్రి పువ్వాడ సవాల్.. ‘నిరూపిస్తే కాలేజీని సరెండర్ చేస్తా’)