
మత్తు ఇంజక్షన్ ఇచ్చిన నిందితుడి అరెస్ట్
కోట: కోట ఎన్‌సీఆర్ నగర్‌లో ఈ నెల 10న సోలా ప్రమీలకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంగారు గాజులు అపహరించిన కేసులో నిందితుడు నిజమాల సంపత్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ పవన్‌కుమార్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. డయాబెటిక్ వల్ల ఏర్పడిన గాయాలతో బాధపడుతున్న కోట మండలానికి చెందిన సోలా ప్రమీలకు నెల్లూరు అపోలో ఆస్పత్రి డయాగ్నస్టిక్ సెంటర్‌లో పనిచేసే సంపత్‌కుమార్ వైద్యం చేస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన ఆమె ఇంటి వద్దకు వచ్చి చికిత్స చేసిన అనంతరం మత్తు ఇంజెక్షన్ వేశాడని చెప్పారు. ఆమె స్ఫృహ కోల్పోయిన తర్వాత సుమారు రూ.2.9 లక్షల విలువైన బంగారు గాజులను అపహరించాడని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని ఊనుగుంటపాళెం రోడ్డు వద్ద గురువారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఇండియన్ హ్యూమన్ రైట్స్ నూతన కమిటీ
తిరుపతి కల్చరల్: ఇండియన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటి కరప్షన సెల్ రాష్ట్ర, జిల్లా, నగర నూతన కమిటీ ప్రతినిధులను ఎంపిక చేసినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కాణిపాకం మురళి తెలిపారు. గురువారం సంస్థ కార్యాలయంలో కమిటీ ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎం.హరిబాబు, జిల్లా అధ్యక్షుడుగా ఆవుల మునిరెడ్డి, తిరుపతి నగర కమిటీ అధ్యక్షుడుగా ఎస్.దేవిశ్రీ ప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా భవనశ్రీ రమేష్‌ని ఎంపిక చేసినట్టు తెలిపారు.

మత్తు ఇంజక్షన్ ఇచ్చిన నిందితుడి అరెస్ట్