
టెన్త్, ఇంటర్‌లో హాస్టల్ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి అర్బన్: సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో ఉంటూ టెన్త్, ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అభినందించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లాలోని అన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌కు చెందిన విద్యార్థులు కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిని ప్రత్యేకంగా అభినందించారు. మరింత ఏకాగ్రతకు యోగా, ధ్యానం విద్యార్థులకు నేర్పించాలని సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారి విక్రమకుమార్‌రెడ్డిని ఆదేశించారు. అంతరం విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలతోపాటు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆత్మకథ అయిన వింగ్స్ ఆఫ్ ఫైర్‌ను విద్యార్థులకు బహుమతిగా అందజేశారు. ఎస్సీ హాస్టల్స్‌లో పదో తరగతిలో టీ.విశ్వనాఽథ్–586, బీ.హనుమంతు–580, పీ.భావన–577, డీ.భగీరత్–566, నీలాకుమార్–559, పీ.భానుశ్రీ–555, ఎం.గుణశేఖర్–552, ఎన్.దినేష్–550 ఉత్తమ మార్కులు సాధించగా.. ఇంటర్‌లో బీ.హైమావతి–942, ఎం.నీలావతి–929, డీ.లక్ష్మిప్రసన్న–915, ఆర్.యువశ్రీ–913, ఎన్.రాజు–911, జీ.సంజయ్–911 అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్టు తెలిపారు.

టెన్త్, ఇంటర్‌లో హాస్టల్ విద్యార్థుల ప్రతిభ