
నేటి నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు
తిరుపతి అర్బన్: తిరుపతి నగరంలోని రెండు కేంద్రాల్లో ఆదివారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఆర్వో నరసింహులు తెలిపారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణాధికారులతో సమావేశమయ్యారు. డీఆర్వో మాట్లాడుతూ జూపార్క్ రో డ్డులోని డిజిటల్ జోన్ ఐడీజెడ్ కళాశాలతోపాటు కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షలు ఉంటాయన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మ ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వ రకు పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ పరీక్షలకు మొత్తం 1,929 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. అధికారులు నవ జ్యోతి, ఆరోగ్యరాణి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్‌లో 26 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,536 మంది స్వామివారిని దర్శించుకోగా 30,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.37 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
నీట్–ఎస్‌ఎస్‌లో 132వ ర్యాంకు
చిల్లకూరు: డాక్టర్ ఆఫ్ మెడిసన్‌లో భాగంగా పీజీ అయి న తరువాత రాసే నీట్–ఎస్ ఎస్‌లో గూడూరు వైద్యుడికి 132వ ర్యాంకు వచ్చింది. గూడూరు ఏరియా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ పర్వత కీర్తికుమార్ గ త నెలలో చైన్నెలో నిర్వహించిన జాతీయ స్థాయి నీట్–ఎస్‌ఎస్ పరీక్షకు హాజరయ్యారు. శుక్రవా రం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో కీర్తికుమార్ 132వ ర్యాంకు సాధించారు. దీంతో ఆయన ని వాసం ఉండే కర్నాల వీధి ప్రాంతంలో సంబరా లు మిన్నంటాయి. ఈ సందర్భంగా డాక్టర్ మా ట్లాడుతూ అత్యవసర విభాగంలో పనిచేయాలనే ఆలోచనతో నీట్–ఎస్‌ఎస్ రాసినట్టు తెలిపారు.

నేటి నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు