పదిలో ‘దివ్యమైన’ మెరుపులు
తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు, భవిత కేంద్రాల ప్రత్యేక అవసరాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటారు. జిల్లా నుంచి 172 మందికి గాను 156 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 101 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో నారాయణవనం మండలం, పాలమంగళం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన మేరువా ఆశిష్ 481 మార్కులతో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచాడు. అలాగే పిచ్చాటూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని పీ.సాత్విక 449 మార్కులతో ద్వితీయ స్థానం, తిరుపతి బైరాగిపట్టెడలోని ఎస్పీ జేఎన్‌ఎం విద్యార్థి షేక్ హర్షద్ 430 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచాడు. వీరిని శనివారం డీఈఓ కేవీఎన్.కుమార్ అభినందించి వారికి ట్యాబ్‌లను బహూకరించారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్యా కో–ఆర్డినేటర్ డీ.చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఓ గోపాలకృష్ణ, ఏఎస్‌ఓ రుక్మాంగధ పాల్గొన్నారు.
క్రీడా పోటీల్లో సత్తా చాటిన దివ్యాంగ విద్యార్థులు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఏలూరు జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీడబ్యూఎస్‌ఎన్ క్రీడా పోటీల్లో తిరుపతి జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరచి పతకాలు సాధించారు. ఈ పోటీల్లో పల్లమాల ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి ఎం.ప్రతాప్ బేస్ బాల్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించాడు. అలాగే 100, 200 మీటర్ల పరుగు పందెంలో శ్రీకాంత్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. వీరిని శనివారం డీఈఓ కేవీఎన్.కుమార్ అభినందించి జ్ఞాపికలతో సత్కరించారు. కోచ్‌లు గోపీకృష్ణ, నాగరాజు, జిల్లా సహిత విద్య కో–ఆర్డినేటర్ డీ.చంద్రశేఖర్‌రెడ్డి, సెక్టోరిల్ ఆఫీసర్లు, ఐఈఆర్‌డీలు పాల్గొన్నారు.
పదిలో ‘దివ్యమైన’ మెరుపులు


