తనకు నమ్మకమున్న వ్యక్తికి ఓటు వేశానని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఆదివారం జరుగుతున్న మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన ఆయనను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మనసుకు నచ్చిన, నమ్మకమున్న వ్యక్తికి తన ఓటు ఉపయోగించానని చెప్పారు. మా పనితీరు గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా.. మున్ముందు బాగుందా అనే విషయం తాను ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యే ప్యానెల్ పనితీరు అనంతరం ఏ విషయమైన చెప్పగలమని అన్నారు. అలాగని, గతంలో పనిచేసిన ప్యానెల్ సరిగా పనిచేయలేదని చెప్పబోనని, వారు మంచే చేశారని, వచ్చే కొత్త ప్యానెల్ మరింత బెటర్గా పనిచేస్తుందని తాను భావిస్తున్నానని అన్నారు.