హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారు స్టీరింగ్ పట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలను బుజ్జగించేందుకు తెలంగాణ శాసనమండలి నేత డీ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీలను బుజ్జగించేందుకు డీఎస్ పావులు కదుపుతున్నారు. వారితో ఆయన ఫోన్లో మంతనాలు జరుపుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో డీఎస్ భేటీ కానున్నారు. కాగా ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు డి.శ్రీనివాస్‌కు, షబ్బీర్ అలీకి కౌన్సిల్లో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ పదవులివ్వడంపై ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్, రాజలింగం, జగదీశ్వర్‌రెడ్డి,భానుప్రసాద్‌రావు , భూపాల్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఇక కాంగ్రెస్‌లో ఉంటే పదవులు సీనియర్లకే వస్తాయి తప్ప పార్టీ కోసం కష్టపడ్డ తమలాంటి వారికి రావనేది వారి ఆరోపణ.