టర్కీలో ఓ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభకార్యక్రమంలో ప్రసంగిస్తున్న రష్యా రాయబారిని ఓ అనుమానిత ఉగ్రవాది కాల్చిచంపాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఆ వ్యక్తిని హతమార్చారు. ఈ ఘటన సోమవారం టర్కీలోని అంకారా సిటీలో జరిగింది. సిటీలో ఓ ఎగ్జిబిషన్ లో టర్కీలో రష్యా రాయబారి ఆండ్రీ కర్లోవ్ మాట్లాడుతుండగా వెనకనుంచి వచ్చిన ఆగంతకుడు గన్ తో ఆండ్రీపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.