Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt handed over AP state treasury to private individuals1
రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు'

అప్పుల కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బరితెగించింది. రూ.9 వేల కోట్ల అప్పు కోసం 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్‌ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ను ప్రైవేట్‌ వారికి అప్పగిస్తోంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నిధులను వారే డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు.తద్వారా ఆ గనులపై పెత్తనం అంతా అప్పు ఇచ్చిన వారిదే ఉంటుంది. పైగా ఆ గనుల్లో ఏం జరిగినా.. ఎన్ని అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నా కూడా ప్రశ్నించ కూడదట! కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయకూడదట! ఈ గనులను తమ ఇష్టం వచ్చిన వాళ్లకు అప్పగించేలా ఘనత వహించిన విజనరీ చంద్రబాబు ప్రభుత్వం సదరు అప్పు ఇచ్చిన వారికి హక్కులు కట్టబెట్టింది. ఏమిటీ పరిణామం.. ఎందుకీ బరితెగింపు.. ఇందులో లోగుట్టేంటి.. అంటూ వివిధ రంగాల నిపుణులు విస్తుపోతున్నారు. ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఇంతకు మించిన కేస్‌ స్టడీ మరొకటి అక్కర్లేదంటున్నారు. 436 గనులపై కల్పించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడం, రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంలోని భాగంసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ప్రైవేటు కంపెనీకి రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సర్వ హక్కులు ధారపోయడం విస్తుగొలుపుతోంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్ల రుణాన్ని సమీకరించడం కోసం 436 చిన్న తరహా గనులపై ప్రైవేట్‌కు పెత్తనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎవరూ ప్రశ్నించలేని లీజు, మైనింగ్‌ హక్కులను ప్రభుత్వం.. ప్రైవేట్‌ వారికి ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ గనుల్లో అక్రమ మైనింగ్‌ జరిగినా, పర్యావరణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నా ప్రశ్నించడానికి వీల్లేని విధంగా రక్షణ కల్పించడం కలకలం రేపుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఏవైనా తేడాలు వచ్చినా కూడా లీజు హక్కులను రద్దు చేసే అవకాశం ఉండదు. కనీసం అందులో మార్పులు చేయడానికి, సవరించడానికి సైతం ఆస్కారం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం మారినా, తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మార్చకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు. ఏదైనా కారణాలతో బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించలేకపోతే డిబెంచర్‌ ట్రస్టీ (పైవేటు కంపెనీ) ఆ ఖనిజాలపై మైనింగ్‌ హక్కులను వేరే వారికి బదిలీ చేసే హక్కు సైతం కట్టబెట్టారు. కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం ఇన్ని వెసులుబాట్లు, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. వివాదాలు వచ్చినా నిస్సహాయతే! ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడు దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఒప్పందంలో ఏమైనా ఇబ్బందులు, వివాదాలు వస్తే తర్వాత ప్రభుత్వం దానిపై ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని కల్పించడం చట్ట విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన లీజులపై గనుల శాఖకు పూర్తి అధికారాలు ఉంటాయి. మైనింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా.. ఏ సమయంలోనైనా లీజు రద్దు చేసే అధికారం గనుల శాఖకు ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో అటువంటి ఆస్కారం లేకుండా చేశారు. ఆ గనుల తవ్వకాల్లో నష్టాలు వచ్చినా ప్రభుత్వమే భరించక తప్పదు. ఏ గనుల్లో అయినా అనుకున్నంత ఆదాయం రాకపోతే అంతే విలువైన వేరే గనుల్ని మళ్లీ ఏపీఎండీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్‌ ప్రక్రియ లేకుండా మైనింగ్‌ లీజులు, మైనింగ్‌ హక్కులను ఎవరికీ కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల కేటాయింపునకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు తనఖా పెడుతున్నారంటే ఆయన ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సహజ వనరులను ప్రజల మేలు కోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. పోటీ బిడ్డింగ్‌ లేకుండా, ప్రభుత్వ ఆస్తులను రుణం కోసం తాకట్టు పెట్టడం చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి ఖనిజ ఆదాయం ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కానీ బాండ్‌ హోల్డర్లు మాత్రం లాభాలు గడిస్తారు. డీఎస్‌ఆర్‌ఏ ద్వారా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వారికి హక్కులా? మరోవైపు ఇదే ఒప్పందంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి నేరుగా రాష్ట్ర ఖజానాను అప్పగించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. అప్పులు చెల్లించేందుకు డీఎస్‌ఆర్‌ఏ (డెబిట్‌ సర్వీస్‌ రిజర్వ్‌ ఎకౌంట్‌) తెరుస్తోంది. ఏపీఎండీసీకి వచ్చే ఆదాయాన్ని డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని చెబుతోంది. ఒకవేళ డీఆర్‌ఎస్‌ఏ ఖాతాలో నిధుల లభ్యత లేకపోతే.. ఆర్‌బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల నుంచి తీసుకునే అధికారాన్ని బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు ఇస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు ఇలా హక్కులు ఇవ్వలేదని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎండీసీ భవిష్యత్‌ ఆదాయంపై అప్పులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకుంది. కేవలం 11 నెలల్లోనే బడ్జెట్‌ లోపల.. బడ్జెట్‌ బయట రూ.1,54,865 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా గురువారం ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ (నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌) బాండ్లు జారీ చేసి రూ.9 వేల కోట్ల నిధుల సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాండ్లకు ఆర్ధిక భద్రత కల్పిస్తూ 436 గనులను కేటాయించి ఆ గనులను తాకట్టు పెట్టింది. తద్వారా ఆ గనుల నుంచి భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిందని అర్థం. ఆ గనుల ద్వారా వచ్చే ఆదాయంతో బాండ్లు కొనుగోలు చేసిన వారికి అప్పును చెల్లిస్తామని చెప్పింది. ఒకవేళ గనుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గితే.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కొత్త గనులు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే.. ఏపీఎండీసీకి భవిష్యత్‌లో వచ్చే ఆదాయంపైనా అప్పులు చేస్తోందన్నది స్పష్టమవుతోంది. సంపద సృష్టితో అద్భుతాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పని చేయలేకపోగా ఉన్న సంపదను కూడా అడ్డగోలుగా తాకట్టు పెడుతున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాండ్ల జారీకి సంబంధించి నియమించబడిన డిబెంచర్‌ ట్రస్టీ లేదా ట్రస్టీ తరఫున వ్యవహరించే ఏ ఇతర వ్యక్తికైనా 436 గనులపై సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పుట్టకే ఎన్‌సీడీ బాండ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డు సృష్టించింది. ఇక రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు çసుముఖత వ్యక్తం చేయక పోవడంతో బడ్జెట్‌ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్లను సమీకరించడానికి పూనుకుంది. ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలంటే ఏపీఎండీసీకి మంచి రేటింగ్‌ అవసరం అవుతుంది. ఇందుకోసం ముంబయికి చెందిన ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థను ప్రభుత్వం సంప్రదించింది. ఏపీఎండీసీ ఆస్తులు, ఆదాయం, అప్పులపై అధ్యయనం చేసిన ఆ సంస్థ ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చింది. అంటే.. డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిధులు లేకపోతే ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన వారి ఖాతాలో జమ చేసేందుకు అంగీరించడం. అందువల్లే ఏపీఎండీసీకి ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చిందని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాజ్యాంగ ఉల్లంఘనే ఏపీఎండీసీ జారీ చేసే బాండ్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి (అప్పు) చెల్లించేందుకు డీఎస్‌ఆర్‌ఏ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం తెరుస్తుంది. ఆ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఆరు నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో ముందుగానే నిల్వ ఉంచాలి. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నేరుగా డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిధులు జమ చేస్తారు. అంటే.. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌పై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇవ్వడమేనని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని నిలువునా ఉల్లంఘించడమేనని తేల్చి చెబుతున్నారు. సాధారణంగా ఆర్బీఐ నుంచి ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ), వేజ్‌ అండ్‌ మీన్స్‌ (చేబదులు) ద్వారా తీసుకునే అప్పును రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా చెల్లించడంలో విఫలమైతే.. వాటిని వడ్డీతో సహా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ఆర్బీఐ మినహాయించుకుటుంది. కానీ ఇలా ప్రైవేటు వారికి పెత్తనం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రమాదకర ప్రయోగమని నొక్కి చెబుతున్నారు. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులే⇒ గనుల తాకట్టుపై అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన ⇒ ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ ఒత్తిడి వల్లే ఇలా.. ⇒ ఏమాత్రం అడ్డుచెప్పని గనుల శాఖ కార్యదర్శి ⇒ ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు ⇒ అన్ని శాఖల్లోనూ ఇలా చేయాలనే ఒత్తిడి రావచ్చుబాండ్ల జారీ ద్వారా రూ.9 వేల కోట్లను సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతిచ్చే విషయంలో ఐఏఎస్‌ అధికారి అయిన ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ (ఆర్ధిక శాఖ) పీయూష్‌ కుమార్, మరో ఐఏఎస్‌ అధికారి అయిన గనుల శాఖ కార్యదర్శి కమ్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీయూష్‌ కుమార్‌ తీవ్రంగా ఒత్తిడి తేవడం వల్లే ఈ వ్యవహారం ముందుకు కదిలినట్లు చర్చ జరుగుతోంది. తమకు మంచి పోస్టింగ్‌లు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలాడిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ఐఏఎస్‌ అధికారులు చర్చించుకుంటున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బాండ్‌ హోల్డర్లకు సర్వ హక్కులు కల్పించడం, ఈ క్రమంలో ఏపీఎండీసీ, గనుల శాఖ ప్రయోజనాలు, స్ఫూర్తికే విఘాతం కలిగేలా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బాండ్ల కోసం ఏకంగా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులు నేరుగా ప్రైవేటు వ్యక్తులు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వడం చిన్న విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఇచ్చిన ఉత్తర్వులు, ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదని, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం కూడా వీటిని మార్చకూడదనే రీతిలో ఉత్తర్వులివ్వడం సరికాదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని చూపి.. మిగతా అధికారులు సైతం ఇలాగే చేయాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తారని, అప్పుడు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక ఐఏఎస్‌ అధికారి అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా నిబంధనలు, రాజ్యాంగ నియమాలను మరచిపోకూడదని.. వాటి విషయంలో రాజీ పడితే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందని తెలిపారు. సర్వీస్‌ రూల్స్‌ను ఉల్లంఘించి మరీ పొలిటికల్‌ బాస్‌ చెప్పారని పనిచేస్తే, మునుముందు ఆందోళన తప్పదని చెబుతున్నారు. తాము ఇచ్చిన ఉత్తర్వులు న్యాయస్థానాల్లోనూ నిలబడే విధంగా ఉండాలని, రాజ్యాంగ ఉల్లంఘన అని తెలిసినా ఉత్తర్వులు ఇవ్వడం న్యాయస్థానాల్లో నిలబడవని చెబుతున్నారు. అదే జరిగితే సర్వీసులో మాయని మచ్చగా మిగిలి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Pak Minister Hanif Abbasi Open Threat To India2
భారత్‌పై దాడి కోసం 130 అణు బాంబులు.. పాక్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్‌ 130కి పైగా అణు ఆయుధాలతో పాటు ఘోరి, షాహీన్, ఘజ్నవి మిసైళ్ళను సిద్ధం చేసినట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలిచిన పహల్గాం ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్‌ తన చర్యల ద్వారా దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సింధూ నదీ జలాల నిలిపివేత, పాకిస్తాన్ జాతీయుల వీసాలు రద్దు, ఇతర వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక దీనంగా చూస్తోంది.ఈ క్రమంలో హనీఫ్‌ అబ్బాసీ భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేశారు. భారత్‌ ఇండస్ వాటర్‌ ఒప్పందాన్ని నిలిపివేస్తే యుద్ధానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. యుద్ధం చేసేందుకు తాము సన్నంద్ధంగా ఉన్నామని, దేశ వ్యాప్తంగా అణు ఆయుధాల్ని సిద్ధం చేశామన్నారు. ఆ అణు ఆయుధాలు ప్రదర్శన కోసం కాదని, భారత్‌పై దాడి చేసేందుకేనని చెప్పారు. "Pakistan's nuclear missiles are not for decoration. They have been made for India," threatens Railway Minister Muhammad Hanif Abbasi pic.twitter.com/UqCCRmpXx6— Shashank Mattoo (@MattooShashank) April 27, 2025 స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘నీటి సరఫరాను ఆపితే మనతో యుద్ధం చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉండాలి. మన వద్ద ఉన్న సైనిక పరికరాలు, మిసైళ్ళు ప్రదర్శన కోసం కాదు. మన అణు ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. నేను మళ్లీ చెబుతున్నాను, ఈ బాలిస్టిక్ మిసైళ్ళు, అవన్నీ భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంతకుముందు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించిందని ఒప్పుకున్నారు. దాని ఫలితమే ఈ దుర్భర పరిస్థితులకు కారణమని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

PM Modi Big Message Over Pahalgam Incident In Mann Ki Baat3
భారతీయుడి రక్తం మరిగిపోతుంది.. వారికి ఊహించని శిక్ష ఖాయం: మోదీ

సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో పహల్గాం దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన.. వారు ఊహించని శిక్ష పడుతుందని హెచ్చరించారు. అలాగే, కశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే ఉగ్రవాద సూత్రదారులు దాడులు చేశారని మోదీ ఆరోపించారు.ప్రధాని మోదీ ఈరోజు మన్‌ కీ బాత్‌లో మాట్లాడుతూ..‘కశ్మీర్‌ను నాశనం చేసేందుకే ఉగ్రవాదుల దాడి జరిగింది. కశ్మీర్‌లో అభివృద్ధి వేగం పెరిగింది, టూరిస్టులు సంఖ్య పెరిగి ఆదాయం వృద్ధి చెందింది. దీన్ని ఓర్వలేక దాడులు చేస్తున్నారు. ఈ దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుంది. ప్రపంచం భారతదేశం పక్షాన నిలుస్తోంది. ప్రపంచం మొత్తం 140 కోట్ల భారతీయులతో కలిసి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా పోరాటానికి మద్దతుగా ఉంది.Our Hon PM Thiru @narendramodi avl, in the 121st episode of Mann Ki Baat, reaffirmed that the victims of the Pahalgam terrorist attack will definitely get justice and the perpetrators & conspirators of this terrorist attack will face the harshest response! pic.twitter.com/ISq01DYpS5— K.Annamalai (@annamalai_k) April 27, 2025బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాను. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన, వారు ఊహించని శిక్ష పడుతుంది. భారత్‌లోని ప్రజల ఆగ్రహం ప్రపంచం మొత్తంలో ప్రతిఫలిస్తోంది. ప్రపంచ నాయకులు ఫోన్ చేసి, లేఖలు రాసి, సందేశాలు పంపి తమ సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని గట్టిగా ఖండించారు. మనం సంకల్పాన్ని బలపర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మన సంకల్పాన్ని బలోపేతం చేయాలి.దేశం ఇప్పుడు ఏకతాటిపై మాట్లాడుతోంది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఏకతా శక్తి అవసరం. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న శక్తులు కశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలనుకుంటున్నాయి. దేశం ఐకమత్యమే మన విజయానికి ఆధారం. పహల్గాంలో జరిగిన దాడి ఉగ్రవాదుల మూర్ఖత్వాన్ని, నిస్సహాయతను చూపిస్తుంది. 22 ఏప్రిల్ పహల్గాం ఉగ్రదాడి ప్రతీ భారతీయుడి మనసును కలచివేసింది. ప్రతీ రాష్ట్రం, ప్రతీ భాషకు చెందిన వారు బాధిత కుటుంబాల కష్టాన్ని తలచుకుంటున్నారు. ప్రతీ భారతీయుడి గుండె ఉగ్ర దాడి దృశ్యాలను చూసి రగులుతోంది అంటూ చెప్పుకొచ్చారు.

India Warships Carry Out Missile Firings In Arabian Sea4
సరిహద్దుల్లో టెన్షన్‌.. విధ్వంసక క్షిపణి పరీక్ష చేపట్టిన భారత్‌

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత సరిహద్దుల్లో పాక్‌ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది.వివరాల ప్రకారం.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా.. ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్‌ నేవీ సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు క్షిపణి పరీక్షలకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అయితే, మూడు రోజుల క్రితమే భారత్‌ ఇదే సముద్రంలో మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ (ఎంఆర్‌-ఎస్‌ఏఎం)తో సీ స్కిమ్మింగ్‌ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌ను కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌లుగా పేర్కొంటారు.#IndianNavy Ships undertook successful multiple anti-ship firings to revalidate and demonstrate readiness of platforms, systems and crew for long range precision offensive strike.#IndianNavy stands #CombatReady #Credible and #FutureReady in safeguarding the nation’s maritime… pic.twitter.com/NWwSITBzKK— SpokespersonNavy (@indiannavy) April 27, 2025

Grandparents Old Houses Renovated With Modern Features 5
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!

ధాన్యాగారంగా మిద్దెలు.. చంటిబిడ్డ ఊయలకు దూలాల సహకారం.. ఉమ్మడి కుటుంబాలకు చిరునామాలు ఈ పెంకుటిల్లు. 75 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఠివీగా నిలబడ్డాయి. అందానికి అందం.. ఆహ్లాదం పంచుతున్న ఈ ఇళ్లు నవతరాన్ని పాతకాలం నాటి రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి. తాతలు కట్టించిన ఈ పెంకుటిళ్లపై మమకారంతో వారసులు ఆధునిక సొబగులు అద్దుతున్నారు. బోధన్‌: పల్లెల్లో అనాదిగా వ్యవసాయమే ముఖ్య జీ వనాధారమైన ధనిక, మధ్యతరగతి రైతు కుటుంబాలు తమ అవసరాలకనుగుణంగా మట్టి గోడల తో పెంకుటిళ్లను విశాలంగా నిర్మించారు. పాడి పశువులు, ధన ధాన్యాలు పదిలపర్చుకునేలా అపురూప ఆకృతులతో మట్టి, టేకు కర్రలు ఉపయోగించి కట్టుకున్న ఇళ్లు ఏళ్లు గడిచినా చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. తాతలు కట్టించిన పెంకుటిళ్లపై మమకారంతో వారసత్వ సంపదగా గుర్తించి వాటికి రూ. లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టి ఆధునికతను జోడిస్తున్నారు. ఈ పెంకుటిల్లు వయస్సు 75 ఏళ్లు సాలూర మండల కేంద్రంలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివంగత ములిగే వీరన్న కట్టించిన ఇళ్లు ఇది. 75 ఏళ్ల క్రితం పాండ్రి మట్టి (తెల్లమట్టి),పై కప్పు, టేకు కర్రలు, కుమ్మరి పెంకు, దూలాలు, వాసాలు ఉపయోగించి పటిష్టంగా నిర్మించారు. 3 ఫీట్ల వెడల్పాటి మట్టి గోడలు, 15 ఫీట్ల ఎత్తుతో రెండస్తుల ఇల్లు నిర్మించి దశాబ్దాలపాటు అందులోనే నివసించారు. ములిగే æ వీరన్న మనుమడు ములిగే జయరాం రెండేళ్ల క్రితం పైమొదటి అంతస్తును తొలగించి మరమ్మతులు చేయించారు. పైకప్పు కుమ్మరి పెంకుకు బదులు బెంగుళూర్‌ పెంకుని అమర్చారు. మట్టి గోడలకు సిమెంట్‌తో ప్లాస్టరింగ్‌ చేయించి, రంగులద్ది అందంగా తీర్చిదిద్దాడు. ఇంటిలోపల, ముందు భాగంలో ఆహ్లాదకర వాతావరణం కోసం పూలు, పండ్ల మొక్కలు పెంచారు. నాటి మట్టిగోడల పెంకుటిల్లు ప్రస్తుతం అందమైన పొదరిల్లులా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. తాత కట్టించిన ఇంటిపై మమకారంతో సౌకర్యవంతంగా మార్చుకొని కుటుంబసభ్యులతో కలిసి జయరాం నివసిస్తున్నాడు. మట్టి గోడలు వేడిని గ్రహించి, ఇళ్లు వేడిగా మారకుండా నిరోధిస్తాయని, దీంతో ఇళ్లంతా చల్లదనంతో ఉంటుందని జయరాం అంటున్నారు. శీతాకాలంలో వెచ్చదనం, వేసవి కాలంలో ఎండలు దంచి కొడుతున్నా చల్లదనాన్ని పంచుతోందని చెబుతున్నారు. ఈ ఇళ్లంటే ఎంతో ఇష్టం మా తాత కట్టిన ఇళ్లంటే మాకెంతో ఇష్టం. ఆ రోజుల్లోనే డూప్లెక్స్‌ ను మరిపించేలా క ట్టించారు. మా పిల్లల కు సైతం ఈ ఇళ్లంటే ఎంతో మక్కువ. అప్పుడప్పుడు మరమ్మతులు చేయిస్తూ ఇక్కడే నివసిస్తున్నాం. – బండారు హన్మాండ్లు సేట్‌  ఎండకాలం చల్లగా... చలికాలం వెచ్చగా.. రుద్రూర్‌: ప్రస్తుత ఎండలతో ఏసీ లేదా కూలర్‌ లేనిదే ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది. కానీ పాతకాలంలో మట్టితో కట్టిన ఇళ్లు చల్లదనాన్ని పంచుతున్నాయి. పొతంగల్‌ మండల కేంద్రంలో 75 ఏళ్ల క్రితం బండారు అరుణ్‌ సేట్‌ తండ్రి విఠల్‌ సేట్‌ నిర్మించిన ఇళ్లు పాత కాలంనాటి వైభవానికి అద్దం పడుతోంది. అప్పట్లో మట్టి, డంగు సున్నం, టేకు కర్రలతో ఈ ఇళ్లు నిర్మించారు. మధ్యలో ఖాళీగా ఉంచి నాలుగు వైపులా రెండతస్తులతో డూప్లెక్స్‌ను మైమరించేలా తీర్చిదిద్దారు.

SRH Went To Maldives In Middle Of IPL 20256
IPL 2025: సీఎస్‌కేపై గెలుపు.. సేద తీరడానికి మాల్దీవ్స్‌కు వెళ్లిన సన్‌రైజర్స్‌ టీమ్‌

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో గతేడాది రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆశించిన ఫలితాలు రావడం​ లేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై గెలిచిన సన్‌రైజర్స్‌.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది (లక్నో, ఢిల్లీ, కేకేఆర్‌,గుజరాత్‌). తర్వాత పంజాబ్‌పై సంచలన విజయం సాధించి (246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి).. ముంబై ఇండియన్స్‌ చేతుల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది.తాజాగా సీఎస్‌కేను వారి సొంత ఇలాకాలో ఓడించి, సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. ఇకపై వారు ఆడాల్సిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరతారన్న గ్యారెంటీ లేదు. సన్‌రైజర్స్‌ తమ తదుపరి మ్యాచ్‌ను మే 2న (గుజరాత్‌తో) ఆడనుంది. ఆతర్వాత మే 5న ఢిల్లీతో, మే 10న కేకేఆర్‌తో, మే 13న ఆర్సీబీతో, మే 18న లక్నోతో తలపడనుంది.Sun, sea, and a team retreat for our Risers in the Maldives! 🏖️✈️ pic.twitter.com/CyE0MvZHy3— SunRisers Hyderabad (@SunRisers) April 26, 2025అత్యంత​ కీలకమైన మ్యాచ్‌లకు ముందు వారం రోజుల విరామం లభించడంతో సన్‌రైజర్స్‌ యాజమాన్యం తమ ఆటగాళ్లను రీ ఫ్రెష్‌మెంట్‌ కోసం మల్దీవ్స్‌కు పంపింది. మాల్దీవ్స్‌లో ఆరెంజ్‌ ఆర్మీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ లభించింది. తమ ఆటగాళ్లు మాల్దీవ్స్‌లో సేద తీరుతున్న దృశ్యాలను సన్‌రైజర్స్‌ తమ సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఏం పొడిచారని లీగ్‌ మధ్యలో సేద తీరడానికి వెళ్లారని కొందరంటుంటే.. సన్‌రైజర్స్‌ అభిమానులేమో కీలక మ్యాచ్‌లకు ముందు తమ ఆటగాళ్లకు ఈ మినీ వేకేషన్‌ అవసరమేనని సమర్దిస్తున్నారు.కాగా, ఈ సీజన్‌ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్‌పై భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్టుగానే తొలి మ్యాచ్‌లో ఆ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌పై 286 పరుగుల రికార్డు స్కోర్‌ సాధించి విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ సూపర్‌ సెంచరీతో మెరిశాడు. ఆ మ్యాచ్‌ తర్వాత మళ్లీ గెలవడానికి సన్‌రైజర్స్‌కు ఐదు మ్యాచ్‌ల సమయం పట్టింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్‌ రెండో విజయం సాధించింది. తాజాగా సన్‌రైజర్స్‌ సీఎస్‌కేపై గెలిచినా అది వారిపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా లేదు. సీఎస్‌కే నిర్దేశించిన 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ జట్టు ఆపసోపాలు పడింది.

Former IPS Officer PSR Anjaneyulu Facing Health Issues7
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులకు అస్వస్థత

గుంటూరు,సాక్షి: మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యం కోసం పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును హుటాహుటీన జీజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు రిమాండ్‌లో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోంది. ఈ క్రమంలో.. ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయుల్ని(PSR Anjaneyulu) అరెస్ట్‌ చేసింది. ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసుకుగానూ ఏపీ సీఐడీ ఆయన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Gold price to crash soon claims top gold miner8
బంగారం భారీగా పడిపోతుంది!

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ తారాస్థాయికి చేరాయి. భారత్‌లో అయితే 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.లక్ష దాటి తర్వాత కాస్త తగ్గింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న బంగారం ధరలతో ఆందోళన చెందుతున్న వారికి ఉపశమనం కలిగించే వార్తొకటి వచ్చింది. వచ్చే 12 నెలల్లో బంగారం ధర భారీగా పడిపోయే అవకాశం ఉందని కజకిస్థాన్ గోల్డ్ మైనింగ్‌ సంస్థ సాలిడ్ కోర్ రిసోర్సెస్ పీఎల్‌సీ సీఈఓ చెబుతున్నారు.12 నెలల్లో బంగారం ధరలు (ఒక ఔన్స్‌) 2,500 డాలర్లకు చేరుకుంటుందని సాలిడ్ కోర్ రిసోర్సెస్ సీఈఓ 'విటాలీ నేసిస్' రాయిటర్స్‌తో చెప్పారు. అయితే 1,800 - 1,900 డాలర్ల స్థాయికి చేసే అవకాశం లేదు. సాధారణంగా బంగారంపై ఓ స్థాయి వరకు ప్రతిస్పందన ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నది (ధరలు పెరగడం) ఓవర్ రియాక్షన్' అని కజకిస్థాన్ రెండో అతిపెద్ద గోల్డ్ మైనర్ సాలిడ్‌కోర్‌ నేసిస్ అంటున్నారు.ఎంతకు తగ్గొచ్చు? నేసిస్ చెబుతున్నదాని ప్రకారం.. ఒక ఔన్స్‌ అంటే 28.3495 గ్రాముల బంగారం ధర 2,500 డాలర్లకు తగ్గుతుంది. అంటే 10 గ్రాముల ధర దాదాపు రూ. 75,000 లకు దిగొస్తుంది. సాంప్రదాయకంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులకు వ్యతిరేకంగా రక్షణ కవచంగా భావించే బంగారం ధర ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 26 శాతం పెరిగింది. ఎందుకంటే యూఎస్ సుంకాలు మాంద్యం భయాలను రేకెత్తించాయి. ఈ క్రమంలో గత మంగళవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం రికార్డు స్థాయిలో 3,500.05 డాలర్లను తాకింది.👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!ప్రస్తుతం ధరలు ఇలా..అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 26 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,310- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,170ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Mollywood: Malayalam Cinema Box Office Report March, 20259
మార్చి రిపోర్ట్‌: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!

మలయాళ సినిమా (Mollywood)కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వరుసగా బాక్సాఫీస్‌ ఫెయిల్యూర్స్‌ నిర్మాతలను ఊపిరాడకుండా చేస్తున్నాయి. కేవలం ఒకటీరెండు చిత్రాలు మాత్రమే నిర్మాతలను గండం గట్టెక్కిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో లాభాల పంటకు బదులుగా నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలు మార్చిలోనూ అదే వైఖరిని కొనసాగించాయి.15 సినిమాల్లో ఒక్కటే హిట్టుకేరళ చలనచిత్ర నిర్మాతల మండలి.. మార్చి బాక్సాఫీస్‌ రిపోర్ట్‌ (Mollywood: March Box Office Report)ను రిలీజ్‌ చేసింది. ఈ నివేదిక ప్రకారం.. మార్చిలో 15 చిత్రాలు విడుదలవగా ఒక్కటి మినహా మిగతావన్నీ ఫ్లాప్స్‌గా నిలిచాయి. ఈ సినిమాలన్నింటి బడ్జెట్‌ రూ.194 కోట్లు కాగా కేవలం రూ.25.88 కోట్ల షేర్‌ మాత్రమే తిరిగొచ్చింది. పెద్ద, చిన్న సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడ్డాయి. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఎల్‌ 2 : ఎంపురాన్‌ ఒక్కటే సూపర్‌ హిట్‌ సాధించింది. రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఔసెప్పింటె ఓసియతు మూవీ కేవలం రూ.45 లక్షలు రాబట్టడం గమనార్హం.> రూ.2.70 కోట్లతో నిర్మితమైన పరివార్‌ సినిమాకు రూ.26 లక్షలు వచ్చాయి.> రూ.3.65 కోట్లు పెట్టి తీసిన వడక్కన్‌ మూవీ కేవలం రూ.20 లక్షలే తిరిగి రాబట్టింది.> రూ.70 లక్షలతో నిర్మితమైన డసెట్టంటె సైకిల్‌ చిత్రం అతి కష్టమ్మీద రూ.8 లక్షలు వసూలు చేసింది.కాపాడింది ఈ ఒక్కటే..మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ ఎల్‌ 2: ఎంపురాన్‌. ఈ మూవీకి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. లూసిఫర్‌ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. రూ.175 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.చదవండి: పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి

India Effect Pakistan takes Emergency steps for pharma supplies10
భారత్‌తో పెట్టుకుంటే అంతే సంగతి.. పాకిస్తాన్‌లో ఔషధ ఎమర్జెన్సీ!

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండు దేశాల ప్రజలు తమ స్వదేశాలకు చేరుకుంటున్నారు. ఇక, ఉగ్రదాడి కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం సైతం దెబ్బతింది. ఈ క్రమంలోనే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపేయడంతో రెచ్చిపోయిన పాక్‌ ఆవేశంతో భారత్‌తో వాణిజ్య బంధాన్ని తెంచుకుంది. దీంతో, అసలుకే ఎసరు వచ్చే పరిస్థితిని తెచ్చుకుంది.భారత్‌తో వాణిజ్య బంధాన్ని తెంచుకున్న పాకిస్తాన్‌కు ఔషధాల పరంగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో ఔషధ ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది. తాజాగా ఔషధాల నిల్వల్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని సంబంధిత విభాగాలకు పాక్‌ వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ప్రస్తుతం భారత్‌ నుంచి పాకిస్థాన్‌.. 30-40 శాతం ఔషధ ముడి సరకు, ఔషధంలో వాడే ప్రధాన పదార్థం, చికిత్స ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ అప్రమత్తమైంది. ఔషధ రంగంపై నిషేధం ప్రభావం గురించి అధికారిక నోటిఫికేషన్ లేనప్పటికీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధమయ్యాయని పాకిస్థాన్‌ ఔషధ నియంత్రణ సంస్థ (డీఆర్‌ఏపీ) శనివారం వెల్లడించింది.అనంతరం, డీఆర్‌ఏపీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. చైనా, రష్యా, ఐరోపా దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు . రేబిస్‌ టీకా, పాము కాటు మందు, క్యాన్సర్‌ చికిత్సలకు అవసరమైన ఔషధాలను, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ తదితరాలను అత్యవసరంగా నిల్వ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించామని వివరించారు. తగు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. అయితే, ఔషధాల ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్తాన్‌లో బ్లాక్‌ మార్కెట్‌ దందా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. దీనిపై తగు చర్యలు తీసుకునేందు కూడా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. భారత ఫార్మానే పాక్‌కు కీలకం..ప్రస్తుతం, పాకిస్తాన్ తన ఔషధ ముడి పదార్థాలలో భారత్‌పై ఆధారపడుతోంది. వీటిలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (API), వివిధ అధునాతన చికిత్సా ఉత్పత్తులు ఉన్నాయి. ముఖ్యంగా, క్యాన్సర్ నిరోధక చికిత్సలు, జీవ ఉత్పత్తులు, వ్యాక్సిన్‌లు, సెరా, యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ మరియు యాంటీ-స్నేక్ వెనమ్‌ను భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇక, చాలా వరకు భారత్‌ చెందిన మందులు.. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్, తూర్పు సరిహద్దు మీదుగా పాకిస్తాన్‌లోకి అక్రమంగా రవాణా చేయబడుతున్నాయి. బ్లాక్ మార్కెట్ నుంచి మందులు తరలిస్తున్నారు.🚨 Crisis Brews in Pakistan's HealthcareAfter suspending trade with India over the Pahalgam attack fallout, Pakistan faces a looming pharmaceutical shortage.Authorities scramble to secure vital drug supplies from China, Russia, and Europe, as 30%-40% of raw materials were… pic.twitter.com/Gz9HCEiLXt— Instant News 247 (@instant_news247) April 26, 2025భారత్‌తో పెట్టుకుంటే పాతళానికి పాక్‌..ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌ స్వీయ తప్పిదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ.. దివాళా అంచుకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, చిరకాల మిత్రదేశం చైనా పుణ్యమా అని కొద్దిగా కోలుకుంటోంది. కానీ, ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇలాంటి స్థితిలో భారత్‌తో స్వల్పకాల యుద్ధం చేసినా పాక్‌ ఆర్థిక వ్యవస్థ నిండా మునగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 50 ఏళ్ల కిందట పాకిస్థాన్‌.. దక్షిణాసియాలో ధనిక దేశం. స్వాతంత్య్రం వచ్చాక ఆ దేశం మంచి ఆర్థిక వృద్ధిని కనబరచింది. ముఖ్యంగా 1960, 1970లలో ధనిక దేశంగా వెలుగొందింది. బలమైన ఆర్థిక నిర్వహణ, భారీగా విదేశీ సాయం, వ్యవసాయం, పారిశ్రామిక వృద్ధిపై దృష్టి వంటి అంశాలు బాగా కలిసొచ్చాయి.అనంతర కాలంలో.. దుష్పరిపాలన, సైనిక నియంతలు, సీమాంతర ఉగ్రవాదాన్ని ‍ప్రోత్సహించడం వంటి చేయడంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అందుకే.. నేడు దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశాల్లో పాక్‌ ఒకటిగా మారింది. కోవిడ్‌ మహమ్మారితో కుదేలైన పాక్‌ ఆ తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. పాక్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే.. టీ పొడిని దిగుమతి చేసుకోవడానికి అప్పు చేయాల్సి వస్తోందని.. అందువల్ల టీ వినియోగాన్ని తగ్గించాలని స్వయానా పాక్‌ ప్రణాళిక శాఖ మంత్రి అహ్‌సాన్‌ ఇక్బాల్‌ కోరారు. దీంతో, ఎంతటి దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేయడం వల్ల పాక్‌ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో సైనిక ఘర్షణ, యుద్ధం వంటి పరిస్థితులు వస్తే.. అది పాకిస్తాన్‌ను మరింత దెబ్బతీస్తుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement