Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Waqf Amendment Act Supreme Court hearing LIVE updates1
వక్ఫ్‌ పిటిషన్లపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను(Waqf Petitions) సుప్రీంకోర్టులో ఇవాళ (ఏప్రిల్‌ 16న) విచారణ ముగిసింది. తదుపరి విచారణను రేపటి మధ్యాహ్నానికి వాయిదా వేసింది. వక్ప్ సవరణ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పాలని ఆదేశించింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ విచారణ చేపట్టనుంది. కేంద్రం కేవియెట్‌ పిటిషన్‌ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వక్ఫ్‌పై సుప్రీం కోర్టు సీజేఐ సంజీవ్‌ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైంది. అయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయి.హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీలు లేదు’ అని పేర్కొన్నారు. .. వక్ప్ సవరణ చట్టం పిటీషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. వక్ఫ్ అంటే ఇస్లాంకు అంకితమైందన్నారు. .. కేంద్రప్రభుత్వం తరఫు వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపాము. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమే. హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి’ అని వాదించారు. ..ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీలు లేదు’ అని స్పష్టం చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రేపటికి వాయిదా వేసింది. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ప్రతిపాదించిన మధ్యంతర ఉత్తర్వులుకేసు విచారణ నేపథ్యంలో కోర్టు వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను డినోటిఫై చేయకూడదు . వక్ఫ్ బై యూజర్ అయినా, వక్ఫ్ బై డీడ్ అయినా సరే వాటిని డినోటిఫై చేయవద్దు. వక్ఫ్ భూమా, ప్రభుత్వ భూమా అనే అంశంపై కలెక్టర్ విచారణ జరుపుతున్నప్పుడు దానికి వక్ఫ్ సవరణ చట్టంలోని నిబంధనలను అమలు చేయవద్దు వక్ఫ్ బోర్డు , సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగిలిన వారంతా తప్పనిసరిగా ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉండాలి

Ap Tax Share Should Be Increased To 50 Percent: Buggana Rajendranath2
రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలి: బుగ్గన

సాక్షి, విజయవాడ: రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర పర్యటనలో ఆ సంఘ ప్రతినిధులను కలిసిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. పన్నుల వాటా లెక్కకు 2011 జనాభా లెక్కల పరిగణన 1971 తర్వాత పలు రాష్ట్రాలలో జనాభా తగ్గింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. కాబట్టి పన్నుల వాటాలో ప్రత్యేక బోనస్‌ కూడా ఇవ్వాలని ఆర్థిక సంఘానికి బుగ్గన నివేదించారు.పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలి:16వ ఆర్థిక సంఘానికి పార్టీ తరపున విజ్ఞప్తి చేశాం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా గురించి ప్రస్తావించాం. 14వ ఆర్థిక సంఘంలో డాక్టర్‌ వైవీ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాను తొలిసారిగా 32 శాతం నుంచి 42 శాతం వరకు పెంచుతూ సిఫార్సు చేశారు. ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘం డాక్టర్‌ ఎన్‌కె సింగ్‌ ఉన్నప్పుడు 41 శాతం ఇచ్చారు.అయితే 42 శాతం సిఫార్సు చేసినా, వాస్తవంగా నిధులు వచ్చే సరికి అందులో 10 శాతం తగ్గుతుంది. అంటే మనకు నికరంగా వచ్చేది 32 శాతమే. ఎందుకంటే కేంద్రం సెస్సులు, సర్‌ఛార్జ్‌ల పేరుతో ఆ వాటాలో కోత పెడుతుంది. అందుకే మా పార్టీ నుంచి ఏం కోరామంటే, పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వమని కోరాము. ఎందుకంటే, రాష్ట్రాలకు అవసరాలు, ఖర్చులు ఉంటాయి అని చెప్పాం. అందుకే కనీసం 50 శాతం ఇస్తే, 40 శాతం నిధులు వస్తాయి కాబట్టి.ఆ రాష్ట్రాలకు ప్రత్యేక బోనస్‌ ఇవ్వాలి:రాష్ట్రాలకు పన్నుల వాటా నిర్ధారణకు గతంలో 1971 జనాభా లెక్కలు తీసుకునే వారు. కానీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే పలు రాష్ట్రాలు అనేక విధానాల ద్వారా జనాభా తగ్గించాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు ఇప్పుడు నష్టం జరుగుతోంది. కాబట్టి, కుటుంబ నియంత్రణ బాగా అమలు చేసి, జనాభా తగ్గించుకున్న రాష్ట్రాలకు ప్రత్యేకంగా బోనస్‌ ఇవ్వాలని కోరాం.2014–19 మధ్యలోనే రాష్ట్ర అప్పులు ఎక్కువ:రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత 14,15 ఆర్థిక సంఘాలు వచ్చాయి. 14వ ఆర్థిక సంఘం సమయంలో టీడీపీ, 15వ ఆర్థిక సంఘం ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉంది. ఒక కఠోర వాస్తవం ఏమిటంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2014–19 మధ్యలోనే రాష్ట్ర అప్పులు దారుణంగా పెరిగాయి. కానీ, గత కొన్నేళ్లుగా ఒక సెక్షన్‌ ఆఫ్‌ మీడియా, వైయస్సార్‌సీపీ ప్రభుత్వంపై దారుణంగా దుష్ప్రచారం చేసింది. ఇంకా చేస్తోంది.రాష్ట్ర విభజన తర్వాత, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2014–19 మధ్యలోనే ఎక్కువ అప్పు చేశారు. అప్పుడే అప్పు శాతం ఎక్కువ. 2019–24 మధ్య కోవిడ్‌ ఉన్నా, వైఎస్పార్‌సీపీ ప్రభుత్వంలో చేసిన అప్పు శాతం తక్కువ. ఆ లెక్కలు కేంద్ర ప్రభుత్వ విభాగాలే తేల్చి చెబుతున్నాయి. అన్నింటికీ పక్కాగా గణాంకాలు ఉన్నాయి. అయినా ఇష్టానుసారం అప్పుల లెక్కలు చెప్పారు. రూ.14 లక్షల కోట్లు అని, రూ.12 లక్షల కోట్లు అని నోటికొచ్చిన అంకెలు చెప్పారు.ఇప్పుడు వారంతా ఏమయ్యారు?:వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మంగళవారం అప్పు చేస్తున్నారని, రాష్ట్రం మరో శ్రీలంక అవుతోందని విషం చిమ్మారు. అదే పనిగా దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు వారంతా ఏమయ్యారు?. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంత కంటే దారుణంగా ఎక్కువ అప్పు చేస్తోంది. పైగా, ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదు. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్‌ ఉన్నా, ఒక్క పథకం కూడా ఆపలేదు.5 ఏళ్లలో ఏం కడతారు?:మనకు అధికారం ఇచ్చింది 5 ఏళ్లకా? అంత కంటే ఎక్కువా?. ఆ సమయంలో ఒక రాజధాని కడతారా? లేక ఒక నగరం కడతారా?. అసలు మనకున్న శక్తి ఎంత?. మన దగ్గర ఒక బైక్, ఒక కారు కొనే డబ్బులు ఉన్నప్పుడు విమానం కొంటానంటే ఎలా? ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తోంది అదే. మరి ఆ అప్పు తిరిగి ఎవరు చెల్లించాలి. మా పార్టీ విధానం అప్పుడైనా, ఇప్పుడైనా ఒక్కటే. సామాన్యులు బాగుండాలి. వారు అభివృద్ధి చెందాలి. వారికి ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కావాలి అని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు.

Match-Fixing alert in IPL 2025? BCCI warns IPL Teams3
మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు.. ఐపీఎల్ టీమ్స్‌కు బీసీసీఐ అలెర్ట్‌?

ఐపీఎల్‌-2025కు మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు పొంచి ఉందా? అంటే అవునానే అంటుంది భార‌త క్రికెట్ బోర్డు. తాజాగా ఐపీఎల్‌లో మొత్తం ప‌ది జ‌ట్లకు బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడ‌ని.. ఓనర్లు, ప్లేయర్లు, కోచ్‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని బీసీసీఐ సూచించినట్లు క్రిక్‌బజ్‌ పేర్కొంది.క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలు ఉన్న‌ట్లు బీసీసీఐ అవినీతి నిరోధక భద్రతా విభాగం (ACSU) గుర్తించినట్లు తెలుస్తోంది. స‌ద‌రు వ్య‌క్తి ఇటీవలి కాలంలో చాలా మంది ప్లేయ‌ర్లు, కోచ్‌ల‌తో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్న‌ట్లు క్రిక్‌బజ్‌ తెలిపింది.డబ్బే కాకుండా విలువైన వస్తువులు గిప్ట్‌లు ఎరగా వేస్తాడని క్రిక్‌బ‌జ్ త‌మ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ క్ర‌మంలోనే అత‌డు ఎవరినైనా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని బీసీసీఐ సూచించింది. కాగా ఐపీఎల్‌-2025 సీజ‌న్‌ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. గుజ‌రాత్ టైటాన్స్‌, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిట‌ల్స్, పంజాబ్ వంటి జ‌ట్లు దూసుకుపోతుంటే.. ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ వంటి టాప్ జ‌ట్లు త‌డ‌బ‌డుతున్నాయి. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో గుజ‌రాత్ టైటాన్స్ అగ్ర‌స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: IND vs ENG: టీమిండియాలోకి ట్రిపుల్ సెంచ‌రీ వీరుడు.. ఐదేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ?

TDP high Command seriously warns MLA Ganta Srinivasa rao4
గంటాతో కూటమికి తలనొప్పులు.. పిలిచి మరీ క్లాస్ పీకిన అధిష్టానం

రాష్ట్రంలో తెలుగుదేశం..కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉన్నా మంత్రిగా హోదా నిలబెట్టుకునే స్థాయి నాయకుడైన గంటా శ్రీనివాస్‌కు ఇప్పుడు వట్టి ఎమ్మెల్యేగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. గతంలో మంత్రి హోదాలో కలెక్టర్లు.పెద్ద పెద్ద అధికారులతో హడావుడి చేసే గంటా ఇప్పుడు భీమిలి వరకే పరిమితం అవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే తన ఉనికిని చాటుకునేందుకు అప్పుడప్పుడూ అత్యుత్సాహం చూపిస్తున్నారు. అయితే ఈ ఓవర్ యాక్షన్ని ప్రభుత్వం..పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన చర్యలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో చీవాట్లు పెడుతూ.. కాస్త హద్దుల్లో ఉండాలని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.విజయవాడలో మంగళవారం జరిగిన ఓ ముఖ్య సమావేశానికి విశాఖ నుంచి బయల్దేరిన గంటా నేరుగా విజయవాడ వెళ్లాల్సి ఉండగా సదరు విమానం ఆయన్ను ముందుగా హైదరాబాద్ తీసుకెళ్లి..అక్కణ్ణుంచి విజయవాడ డ్రాప్ చేసింది.. ఎందుకూ అంటే విశాఖ నుంచి బెజవాడకు డైరెక్ట్ విమాన సర్వీస్ లేదు.. రద్దు చేశారని తెలిసింది. దీంతో ఉదయం వెళ్లాల్సిన గంటా మధ్యాహ్నానికి విజయవాడ చేరుకున్నారు.దీంతో ఆయన ‘ఆంధ్ర టూ ఆంధ్ర వయా తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టు మీద టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని లేనిపక్షంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మన వారే కదా ఆయనకు చెబితే సరిపోయేది కానీ ఇలా ట్విటర్లోకి ఎక్కి రచ్చ చేయాలా అని చీవాట్లు పెట్టింది. సీనియర్ ఎమ్మెల్యే అయినా ఇలా బాధ్యత లేకుండా ఉంటే ఎలా అని అడిగింది.ఇదిలా ఉండగా.. వతిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని గంటా వియ్యంకుడు, పురపాలక మంత్రి నారాయణ ప్రకటన చేసిన తరుణంలోనే రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానమే లేదంటూ గంటా శ్రీనివాసరావు ట్విట్టర్లో సెటైర్ వేశారు. అధికార పార్టీ నాయకుడివైన నువ్వు ప్రభుత్వం పరువు తీయడం ఏమిటని అధిష్టానం ప్రశ్నించింది.వాస్తవానికి గంటా శ్రీనివాస్ గతంలో కూడా ప్రభుత్వానికి ఋషికొండ భవనాల తలుపులు తెరిచి హడావుడి చేశారు. ఫోటోలు విడుదల చేశారు. ఆ సందర్భంలో కూడా ఆయనకు పార్టీ నుంచి అక్షింతలు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్.. ప్రభుత్వంలో నంబర్ టూ అయిన లోకేష్..ఇంకా మంత్రులు ఉండగా కేవలం ఒక ఎమ్మెల్యే అయిన మీరు రుషికొండ భవనాలను చూడడానికి ఎందుకు వెళ్ళారు..మీకు అంత అత్యుత్సాహం ఎందుకు అని అప్పట్లోనే టిడిపి పెద్దలు ప్రశ్నించారు. ఇక ఇప్పుడు కూడా ఈ ట్వీట్ దెబ్బతో చీవాట్లు పడ్డాయి. మొత్తానికి గంటాకు ఈ టర్మ్ బాలేనట్లుంది.::సిమ్మాదిరప్పన్న

Tax payers choosing old regime to act quickly5
‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే..

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని పన్ను చెల్లింపుదారులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ పాత పన్ను విధానంలో కొనసాగాలా లేక కొత్త విధానంలోకి వెళ్లాలా అనేది ఎంచుకునే పనిలో ఉన్నారు. డిడక్షన్లు, మినహాయింపులకు ప్రసిద్ధి చెందిన పాత పన్ను విధానం గణనీయమైన పెట్టుబడులు, ఖర్చులు ఉన్నవారికి ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎంపికగా ఉంది. కానీ దీనికి పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా పాటించాల్సిన నిర్దిష్ట అవసరాలు ఉన్నాయి.జీతం పొందే ఉద్యోగులుపాత పన్ను విధానం కింద ట్యాక్స్‌ పేయర్స్‌ సుమారు 70 డిడక్షన్లను క్లెయిమ్ చేయవచ్చు. వీటిలో సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఎన్‌పీఎస్‌ వంటి పెట్టుబడులకు రూ.1.5 లక్షల వరకు, గృహ రుణ వడ్డీకి రూ.2 లక్షల వరకు, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) కోసం మినహాయింపులు ఉన్నాయి. అయితే, ఈ విధానాన్ని ఎంచుకోవడానికి త్వరపడాల్సిన అవసరం ఉంది. జీతం పొందే ఉద్యోగులు తాము ఈ పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నట్లు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తమ యజమానులకు తెలియజేయాలి. తద్వారా టీడీఎస్‌ (TDS) సరిగ్గా లెక్కించేందుకు వీలుంటుంది. ఈ సమాచారం ఇవ్వకపోతే యజమాన్యాలు కొత్త విధానాన్ని డిఫాల్ట్‌గా అప్లయి చేస్తారు. ఇది తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది కానీ డిడక్షన్లు తక్కువగా ఉంటాయి.వ్యాపారులువ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు ప్రక్రియ మరింత కఠినంగా ఉంటుంది. వారు పాత విధానాన్ని ఎంచుకోవడానికి ఐటీఆర్‌ గడువు జూలై 31 లోపల ఫారం 10-IEA ను ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. ఈ ఫారాన్ని ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇది వారిని పాత విధానంలో లాక్ చేస్తుంది. కొత్త విధానానికి తిరిగి మారడానికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. గడువు తప్పడం లేదా ఆలస్యంగా ఐటీఆర్‌ దాఖలు చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు కొత్త విధానంలోకి డీఫాల్ట్‌గా వెళతారు. ఇది వారికి విలువైన డిడక్షన్లను కోల్పోయేలా చేస్తుంది.ఇదీ చదవండి: ఐటీ రిటర్నుకు సిద్ధంకండి.. బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి..పన్ను ప్రణాళిక సౌలభ్యంపాత విధానం ఆకర్షణ దాని పన్ను ప్రణాళిక సౌలభ్యంలోనే ఉంది. ముఖ్యంగా హెచ్‌ఆర్‌ఏ లేదా సెక్షన్ 80సీ పెట్టుబడుల వంటి సంవత్సరానికి రూ.2.5 లక్షలకు మించిన డిడక్షన్లు ఉన్న అధిక ఆదాయ వ్యక్తులకు ఇది అనువుగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు కూడా ఎక్కువ మినహాయింపు పరిమితుల (60–79 సంవత్సరాల వారికి రూ.3 లక్షలు, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షలు) నుండి ప్రయోజనం పొందుతారు. అయితే, ఇది అదనపు డాక్యుమెంటేషన్, ఉదాహరణకు అద్దె రసీదులు, పెట్టుబడి రుజువులు, ఐటఆర్‌ దాఖలు సమయంలో లేదా ఆడిట్ సమయంలో ధ్రువీకరించడానికి అవసరం.రెండూ పోల్చుకోండి..ఆదాయపు పన్ను విభాగం ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి రెండు పన్ను విధానాలనూ పోల్చిచూసుకోవాలని ట్యాక్స్‌ పేయర్స్‌కు పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పాత విధానం ప్రయోజనాలు వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడతాయి. కొత్త విధానం డిఫాల్ట్‌గా ఉన్నందున, పాత విధానం ప్రయోజనాలను పొందడానికి పన్ను చెల్లింపుదారులు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి.

Tollywood Hero Raj Tarun and Lavanya Issue In Tollywood6
రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యపై దాడి.. ఎవరు చేశారంటే?

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది మొదలైన ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలోనే వీరిద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు కూడా పెట్టుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితమే రాజ్‌ తరుణ్‌పై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. కానీ అంతలోనే రాజ్ తరుణ్- లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కోకాపేటలోని లావణ్య నివాసానికి వెళ్లి రాజ్ తరుణ్ పేరేంట్స్‌ ఆమెపై కొందరితో దాడి చేయించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు లావణ్య పైన దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కేసులు వెనక్కి తీసుకున్న లావణ్య..రాజ్ తరుణ్ మీద కేసులు వెనక్కి తీసుకుంటానని.. రాజ్, తాను విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని లావణ్య తెలిపారు. ‘నేను మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లాను. నాకు తెలియకుండానే నేను బట్టలు మారుస్తున్నపుడు వీడియో తీసుకున్నాడు. అవి పెట్టుకుని నన్ను బెదిరించాడు. నేను నా వీడియోలు డిలీట్ చేయటానికి ప్రయత్నించాను. ఆ టైం లో నన్ను చంపటానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను వశపర్చుకుంటున్నాడు. మస్తాన్ సాయి ఆగడాలు పోలీసులు బయటపెట్టాలని లావణ్య కోరారు.

Delhi Govt Wont Ban CNG Autorickshaws: Transport Minister 7
సీఎన్‌జీ ఆటోలపై నిషేధం!.. ఢిల్లీ మంత్రి క్లారిటీ

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ ఆటోలపై నిషేధం అంటూ జరుగుతున్న ప్రచారంపై ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పంకజ్‌ కుమార్‌ సింగ్ స్పష్టత నిచ్చారు. సీఎన్‌జీ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలతో భర్తీ చేయనున్నారనే వార్తలను మంత్రి పంకజ్‌ కుమార్‌ సింగ్‌ కొట్టిపారేశారు. సీఎన్‌జీతో నడిచే ఆటోరిక్షాలపై నిషేధం విధిస్తామన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు.ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా ఢిల్లీ సర్కార్‌ పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఢిల్లీలో ఎలాంటి ఆటోలను తాము నిలిపివేయబోమని ఆయన ప్రకటించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని.. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి.త్వరలోనే 'ఈవీ పాలసీ 2.0'ను తీసుకురావడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సీఎన్‌జీ ఆటోలపై బ్యాన్‌ విధిస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో రవాణా శాఖ మంత్రి స్పందిస్తూ సీఎన్‌జీ ఆటోలపై నిషేధం విధించబోమంటూ క్లారిటీ ఇచ్చేశారు.

Gachibowli Police issue notice to IAS officer Smita Sabharwal8
Smita Sabharwal: చిక్కుల్లో ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌

హైదరాబాద్‌,సాక్షి: ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ చిక్కుల్లో పడ్డారు. కంచ గచ్చిబౌలి భూముల(Kancha Gachibowli land issue) అంశంలో ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌కు (Smita Sabharwal) పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.మార్చి 31న 'హాయ్ హైదరాబాద్' అనే ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఒక గిబ్లీ (Ghibli)చిత్రాన్ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఆ చిత్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (hyderabad central university)లోని 'మష్రూమ్ రాక్' ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు, వాటి ముందు గిబ్లీ శైలిలో నెమలి, జింక ఉన్నాయి. అయితే వైరల్ చిత్రం నకిలీదని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేసినందుకు స్మితా సబర్వాల్‌కు బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్ సెక్షన్ 179 కింద నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నోటీసులపై ఆమె ఏవిధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.FREE SPEECH - TELANGANA MODEL! In probably a first, police booked a case against an IAS for a RETWEET! Smitha Sabharwal, IAS, principal secretary of Youth Advancement, Tourism & Culture is the latest to be served notices by the Telangana police. The Crime: She retweeted an… pic.twitter.com/5g5rTALYex— Revathi (@revathitweets) April 16, 2025

Danish Woman After Living In India For 10 Months9
'బెస్ట్‌ డెసీషన్‌': భారత్‌పై డెన్మార్క్‌ మహిళ ప్రశంసల జల్లు..

మన భారతదేశం ఖ్యాతీ ఖండాంతరాలకు కూడా చేరవవుతోంది. అందుకు నిదర్శనం ఇటీవల కాలంలో పలువురు విదేశీయలు పంచుకున్న తమ భారత పర్యటన అనుభవాలే. ప్రతి విదేశీయుడు ఇక్కడ ఉండటం అదృష్టంగా భావిస్తుంటే మనమే ఎంత గొప్పవాళ్లం అనిపిస్తోంది. అంతెందుకు మన భారతీయులే ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లి సెటిల్‌ అయ్యి కూడా.. మళ్లీ ఇక్కడకు వచ్చేస్తున్నారు. మాతృభూమే గొప్పదని కితాబిస్తున్నారు. మనం పుట్టిన దేశం కాబట్టి మనకు నచ్చుతుంది. కానీ ప్రాంతాలు, భాష, సంస్కృతుల్లో ఎంతో వైవిధ్యం ఉన్నప్పటికీ విదేశీయలు ఈ వాతావరణాన్ని ఇష్టపడుతుండటమే అత్యంత విశేషం. తాజాగా ఆ కోవలోకి మరో డెన్మార్క్‌ మహిళ కూడా చేరింది. పైగా ఆమె ఎలాంటి ప్లాన్‌ చేయకుండానే భారత్‌కి వచ్చి మంచి పనిచేశానంటోంది. మరీ ఆమెకు అంతగా భారత్‌లో ఏం నచ్చాయో చూద్దామా..!.డెన్మార్క్‌ దేశ రాజధాని కోపెన్‌హాగన్‌లో నివశించే ఎస్మెరాల్డా అనే మహిళ భారత పర్యటను వెళ్లాలనే నిర్ణయం తీసుకుని మంచి పనిచేశానని అంటోంది. ఆ కోపెన్‌హాగన్‌ నగర వాతావరణంతో విసుగొచ్చేసిందని, మంచి మార్పుకావలని కోరుకున్నట్లు చెబుతోంది. అందుకోసమే తానెంతో ఇష్టపడ్డ స్నేహితులు, ఉద్యోగాన్ని, నాకిష్టమైన అపార్ట్‌మెంట్‌ తదితరాలన్నింటిని వదిలేసి మరీ భారత్‌ పర్యటనకు వచ్చేసిందట. ఇది తాను తీసుకున్న నిర్ణయాల్లో బెస్ట్‌ అని చెబుతోంది. వేసవిలో మాత్రమే కోపెన్‌హాగన్‌ సరదాగా ఉంటుందే తప్పా..మిగతా సమయాల్లో బోరుగానే ఉంటుందని వాపోతోంది. అంతేగాదు తన నగరాన్ని నిద్రాణమైన ప్రదేశంగా అభివర్ణిస్తోందామె. ఇక భారతదేశంలో రిషికేశ్ నుంచి గోవా, ముంబై అంతటా చేసిన పర్యటనల్లో పొందిన అనుభవాలను డాక్యమెంట్‌ చేసి మరీ..ఇన్‌స్టాగ్రాంలో వీడియో రూపంలో షేర్‌ చేసింది. ఆ వీడియోలో ఎస్మెరాల్డా భారత్‌పై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ.. వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలు, ఉత్సాహభరితమైన సంస్కృతి, ప్రజల ఆదరణను ఎంతగానో కొనియాడింది. ఈ భారత పర్యటనలో తన గురించి తాను తెలుసుకోగలిగానంటోంది. ఇక్కడ ప్రకృతి, వైవిధ్య భరితమైన సంస్కతి తనను ఎంతగానో కట్టిపడేశాయంటోంది. అంతేగాదు భారతదేశం తనలోని కొత్తకోణాలను పరిచయం చేసిందట. ఇక్కడ జర్నీ ఓ అపూర్వ అనుభవాన్ని అందిచాయట. పైగా ప్రపంచాన్ని అన్వేషించే అవకాశాన్ని కూడా అందించిందని అంటోంది. చివరగా ఈ భారత పర్యటన తన జీవితాన్నే మార్చేసిందని చెబుతోంది. నిజానికి తాను యూరోపియన్ వేసవి సాహసయాత్రకు బయలుదేరే ముందు అనుకోకుండా భారతదేశ పర్యటనకు వచ్చానని, అనుకోకుండా ఇంకో నెల ఇక్కడే ఉండేలా ప్లాన్‌ చేసుకున్నట్లు వివరించింది. ఇలా ఆమె దాదాపు పది నెలలు భారత్‌లో గడిపిందట.అంతేగాదు వర్షాకాలంలో భారత్‌కి మళ్లీ తిరిగి రావాలనుకుంటున్నట్లు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొంది. ఇప్పుడు ఆ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అంతేగాదు నెటిజన్లు కూడా ఆల్‌ది బెస్ట్‌ చెబుతూ..భారతదేశానికి వస్తూ ఉండండి అని ఆమెను ఆహ్వానిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Astrid Esmeralda 🧚🏽‍♀️ Solo traveler (@astrid__esmeralda) (చదవండి: Train With ATM: దేశంలోనే తొలి ఏటీఎం రైలు..! ఎక్కడంటే..)

Ysrcp Wins No Confidence Motion Against Adoni Municipal Chairperson10
ఆదోని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన వైఎస్సార్‌సీపీ

సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోని మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్‌సీపీ నెగించుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌ శాంత వంటెద్దు పోకడలకు వ్యతిరేకిస్తూ, వార్డుల అభివృద్ధిలో సహకరించడం లేదంటూ చైర్మన్‌పై వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరారు.కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్‌ భరద్వాజ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌ శాంతకు వ్యతిరేకంగా 35 కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకుని 36 మంది ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్‌సీపీ నెగ్గించుకుంది. కాగా, ‘‘వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తామని ఆశ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయినా రూ.10 పని కూడా చేయలేదన్నారు. వార్డుల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీలో చేరడం వల్ల చీవాట్లు తప్ప ఏమీ ఒరగలేదు.’’ అని 11, 12 వార్డుల కౌన్సిలర్‌ వాసీం అన్నారు. నిన్న ఆయన మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్‌ సమక్షంలో తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే.ఆయన నిన్న(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానన్నారు. సాయిప్రసాద్‌రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. వార్డులో పెద్దల మాటలను గౌరవించి, జరిగిన పొరపాటు తెలుసుకొని తిరిగి సాయన్న సమక్షంలో పార్టీలోకి వచ్చానన్నారు. 2029లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానన్నారు. కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement