నాడు ప్రజలను నరకాసురుడు ఇబ్బంది పెడితే నేడు నారాసురుడు పెడుతున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆనం రామనారయణ రెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పాలన నరకాసురుడిని తలిపిస్తుందన్నారు. బెల్ట్ షాపులు తీసేయ్యలేదని, ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగితే పట్టించుకోలేదని, అవినీతి పెరిగిందని, ఇసుకాసురులు పెరిగిపోయారని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో నారాసురుడి రాజకీయ సంహారంతోనే ఏపీ ప్రజలకు నిజమైన దీపావళి వస్తుందన్నారు. హుదూద్, తిత్లీ తుఫాన్లతో చంద్రబాబు లబ్దిపోందుతున్నారని ఆరోపించారు. తుఫాన్ బాధితులకు ఎదో సాయం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.