సుప్రీం కోర్టులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ ఎదుట కోల్‌కతా కమిషనర్ హాజరు కావాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కుంభకోణాలకు సంబంధించిన ఆధారాల ధ్వంసం అంశంపై కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను విచారించే విషయమై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.