రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల రైతన్నలు పెద్ద ఎత్తున బలవన్మరణాలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక వేల సంఖ్యలో అన్నదాతలు తనువు చాలిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పెదకడబూరుకు చెందిన రైతు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పురుగుల మందు తాగి ఓ రైతు తనువు చాలించగా ఆయన భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రైతు దంపతుల ఆత్మహత్యాయత్నంతో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మిగిలారు.