‘అందరి ముందూ అవమానించాడు.. జనమంతా చూస్తుండగా చేయి చేసుకున్నాడు.. ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాడు.. ఈ అవమానం భరించలేక అంతం చేయాలని నిర్ణయించుకున్నాం.. నలుగురు స్నేహితులం కలసి పరీక్ష రాయడానికి వెళ్తున్న సుధీర్‌ను నడిరోడ్డుపై వేటకొడవళ్లతో నరికి హత్యచేశాం..’సుధీర్ హత్య కేసులో కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులు వెల్లడించిన విషయాలివీ.