kukatpally
-
మద్యం మత్తులో యువతుల హుల్ చల్
-
HYD: మద్యం మత్తులో యువతి హల్చల్.. బైక్‌ను ఢీకొట్టి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం సేవించిన యువతి అతి వేగంతో కారు నడిపి బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు కావడంతో పోలీసులను ఆశ్రయించారు.వివరాల ప్రకారం.. మద్యం సేవించిన యువతి కారు నడిపి కూకట్‌పల్లిలో గురువారం అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవ్ చేసి ఓ బైకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్‌కు గాయాలు కావడంతో సదరు వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా 212 పాయింట్స్ రీడింగ్ నమోదైంది. దీంతో, ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
KPHB మెట్రో స్టేషన్ వద్ద కారు బీభత్సం
-
HYD: గాయత్రి హాస్టల్ కేసులో షాకింగ్ విషయాలు
తూర్పుగోదావరి: అశ్లీల వీడియోల పేరుతో యువతిని బెదిరిస్తూ నాలుగేళ్ల నుంచి డబ్బులు గుంజుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో డీఎస్పీ జి.దేవకుమార్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. నిడదవోలుకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న గాయత్రీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదే హాస్టల్లో ఉంటున్న కాజా అనూషాదేవితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గుంటూరు జిల్లా ఓబులనాయుడుపాలేనికి చెందిన నీనావత్ దేవా నాయక్ అలియాస్ మధు అనే వ్యక్తిని అనూషాదేవి వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్నేహితురాలికి తన భర్తను పరిచయం చేసింది. అనూషాదేవితో ఉన్న పరిచయం, ఒకే హాస్టల్లో ఉండడంతో బాధితురాలు ఆమెతో అత్యంత సన్నిహితంగా ఉండేది. దీంతో దేవనాయక్ వేరే వ్యక్తి ఫోన్ చేసినట్లుగా బాధితురాలికి ఫోన్ చేసి తన వద్ద ఆమె న్యూడ్ వీడియోలున్నాయని, వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరించారు. అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. విడతల వారీగా ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బులు వేయించుకునేవాడు. ఇలా కూడబెట్టిన సొమ్ముతో చిన్న కాకానిలో అపార్ట్మెంటు కోనుగోలు చేశాడు.కారు, బుల్లెట్, పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేశాడు. కాగా..తనను ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తున్న విషయాన్ని అనూషాదేవికి బాధితురాలు తెలిపింది. ఈ విషయం మళ్లీ దేవానాయక్ దృష్టికి వెళ్లింది. వేరొకరి ద్వారా సెటిల్మెంట్ చేసినట్లు బాధితురాలిని నమ్మించాడు. అలాగే పలు అవసరాల కోసం బాధితురాలి దగ్గర డబ్బులు కాజేశాడు. కాగా.. అనూషాదేవి, ఆమె భర్త దేవానాయక్లు తనను మోసం చేస్తున్నారని బాధితురాలు గుర్తించించి. దీంతో తల్లిదండ్రులతో కలిసి నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. ఇలా ఆమె 2021 నుంచి 2025 వరకూ దాదాపు రూ. 2,53,76,000 మోసపోయింది. మరో రూ.14 లక్షలు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించింది. మూడు రోజుల్లో కేసు ఛేదనబాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మూడు రోజుల్లో దేవా నాయక్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి రూ.1,81,45,000 విలువైన 938 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2.250 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.75 లక్షల నగదు, కారు, బుల్లెట్ స్వా«దీనం చేసుకున్నారు. చిన్నకాకానిలో కొనుగోలు చేసిన అపార్ట్మెంటును స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా స్వా«దీనం పర్చుకున్నారు. -
కూకట్ పల్లిలో వైఎస్ జగన్ బర్త్ డే సెలెబ్రేషన్స్
-
కూకట్‌పల్లిలో భారీ చోరీ
మూసాపేట: కూకట్‌పల్లిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..టంగుటూరుకు చెందిన మధుసూదన్‌రావు, సంధ్యారాణి దంపతులు కూకట్పల్లి జయానగర్‌లోని శ్రీ సీతా ప్యాలెస్ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులుగా వీరు అవసరాల నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నారు. గురువారం సాయంత్రం మధుసూదన్‌రావు ఇంటికి వచ్చి దుస్తులు తీసుకొని వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం డ్రైవర్ ఫోన్‌చేసి ఇంటి తలుపు తీసి ఉందని ఫోన్ చేసి చెప్పగా వెంటనే ఇంటికి వచ్చి చూసిన మధుసూదన్‌రావు దొంగతనం జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.గురువారం రాత్రి సుమారు 11.47 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మెట్ల మార్గంలో ఫ్లాట్‌లోకి వెళ్లినట్లు సీసీకెమెరాలో నమోదైంది. దొంగలు బెడ్రూమ్లోని డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక ఉన్న బీరువా తాళాలు తీసుకొని..బీరువాలో ఉన్న సుమారు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 82 తులాల బంగారు నగలు, రూ.10 లక్షల విలువ చేసి డైమండ్ నెక్లెస్, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం 7.30 ప్రాంతంలో వాచ్మెన్ మొక్కలకు నీరు పోసేందుకు వెళ్లగా..ఫ్లాట్ డోర్ తెరిచి ఉందని గమనించి డ్రైవర్‌కు తెలియజేశాడు. వెంటనే డ్రైవర్ యజమానికి తెలపటంతో వారు వచ్చి చూసుకోగా బంగారు నగలు దొంగతనం అయినట్లు గమనించారు. కాగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనుక ఉన్న తాళాన్ని తీసుకొని దొంగతనం చేయటంతో తెలిసిన వారి పనై ఉండవచ్చని బాధితులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సినీ నటుడు శ్రీ తేజ్ పై చీటింగ్ కేసు
-
కూకట్‌పల్లిలో యాంకర్ సుమ సందడి (ఫొటోలు)
-
కూకట్‌పల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం (ఫొటోలు)
-
హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య
కూకట్పల్లి (హైదరాబాద్): హైడ్రా అధికారులు తమ ఇళ్లు కూడా కూల్చివేస్తారేమో అన్న భయంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..కూకట్పల్లి రామాలయం సమీపంలోని యాదవబస్తీకి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ (56 ).. భర్త శివయ్యతో కలిసి సొంత ఇంటిలో నివసిస్తోంది. వీరికి నల్లచెరువు సమీపంలో మరో రెండు ఇళ్లు, కారు షెడ్డు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇచి్చన భార్యాభర్తలు పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కావడంతో తమ ఇళ్లను వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.అయితే గత ఆదివారం హైడ్రా అధికారులు నల్లచెరువు ఎఫ్టీఎల్లో ఉన్న కొన్ని అక్రమ నిర్మాణాలను తొలగించారు. వీటికి ఎదురుగానే రోడ్డుకు ఆవతలి వైపు బుచ్చమ్మ ఇళ్లు, కారు షెడ్డు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను సైతం హైడ్రా అధికారులు కూల్చేస్తారని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీంతో బుచ్చమ్మ ఆందోళనకు గురై శుక్రవారం సాయంత్రం భర్త హాల్లో ఉండగానే బెడ్రూమ్లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడి మా కోసం ప్లాట్లు కొని ఇళ్లు కట్టించారు. అయితే హైడ్రా వాళ్లు చుట్టుపక్కల ఇళ్లు పడగొడుతున్నారు. మా ఇళ్లూ అలాగే అవుతాయనే టెన్షన్‌తో మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది..’ అని బుచ్చమ్మ కుమార్తె సరిత చెప్పింది. -
‘అయ్యో.. దేవుడా!’.. హైడ్రా పంజా-బోరుమంటున్న జనం (చిత్రాలు)
-
కూకట్ పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్
-
కూకట్‌పల్లిలో హైడ్రా.. బీఆర్ఎస్ నేత అక్రమ నిర్మాణాలు కూల్చివేత
సాక్షి, కూకట్పల్లి: హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కూకట్‌పల్లిలో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి.కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. నల్లచెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. నల్లచెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా.. 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించారు. నల్లచెరువుపై సర్వే చేశారు. ఇందులో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్‌జోన్‌లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. కూల్చివేతల సందర్భంగా బాధితుల ఆవేదన.. కన్నీటిపర్యంతం నివాసం ఉన్న భవనాలను మినహాయించి చెరువు ఆక్రమించి నిర్మించిన 16 షెడ్ల యజమానులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం, ఆదివారం తెల్లవారుజామునే హైడ్రా అధికారులు, పోలీసులు కూకట్పల్లి చేరుకున్నారు. చెరువు పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం జరుగుతోంది. అలాగే, అమీన్పూర్ పరిధిలోనూ హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఈ నిర్మాణాలు ప్రముఖ బీఆర్ఎస్ నేత, బిల్డర్ చంద్రశేఖర్ నిర్మించారని గుర్తింపు. ఈ సందర్బంగా ఆయనను లోపలికి అనుమతించని అధికారులు. ఈ క్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కోర్టు నోటీసులు ఉన్నా పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. కనీసం మా సామాగ్రిని అయినా తెచ్చుకోనివ్వండి అంటూ కొనుగోలుదారులు ప్రాధేయపడుతున్నారు. మరోవైపు.. కూల్చివేతల సందర్భంగా అధికారులు మీడియాను అనుమతించలేదు. ఇది కూడా చదవండి: కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్ -
కూకట్‌పల్లిలో మట్టుబెట్టి.. అందోల్‌కు తరలించి..
జోగిపేట(అందోల్): భార్యపై అనుమానంతో కూకట్‌పల్లిలో హత్య చేసి మృతదేహాన్ని అందోల్‌కు తరలించాడు. అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించేందుకు యత్నించాడు. మృతురాలి కుటుంబీకులు అనుమానంతో నిలదీస్తే హత్య చేసిన విషయాన్ని బయటపెట్టాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అందోల్‌కు చెందిన వెండికోలు నర్సింహులు చాలాకాలంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతంలో స్థిరపడి ఇక్కడే నివసిస్తూ గ్యాస్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం మెదక్ జిల్లా చిటు్కల్‌కు చెందిన ఇందిర (33)ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలగకపోవడంతో ఐదేళ్ల క్రితం మరో మహిళను రెండో వివాహమాడాడు. దీంతో ఆమెకు ఇద్దరు సంతానం. ఈ క్రమంలో అతను కూకట్‌పల్లిలో మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు. అందులోనే ఇద్దరు భార్యలతో సంసార జీవితాన్ని గడుపుతున్నాడు. మొదటి భార్య ఆ భవనంలోనే కిరాణ షాపు నడుపుతోంది. కొన్ని రోజులుగా ఇందిరకు ఫోన్‌కాల్స్ ఎక్కువగా రావడంపై నర్సింహులు అనుమానం పెంచుకున్నాడు. దీనివల్ల కొంతకాలంగా ఇద్దరూ గొడవపడుతున్నారు. ఆదివారం కూడా గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే కోపాద్రిక్తుడైన అతను టవల్‌ను గొంతుకు చుట్టి ఇందిరకు శ్వాస ఆడకుండా చేసి హత్య చేశాడు. కూకట్పల్లి నుంచి అందోల్‌కు మృతదేహం తీసుకెళ్లి అనారోగ్యంతో మృతిచెందినట్లుగా చెప్పే ప్రయత్నం చేశాడు. మృతురాలి కుటుంబీకులు అనుమానంతో గట్టిగా నిలదీస్తే తానే చంపినట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో మృతురాలి తల్లి మొగులమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా నర్సింహులుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరం ఒప్పు కున్నట్లు సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. ఇందిర మృతదేహన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకుని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బేగంపేట, అబిడ్స్, కోఠి, నాంపల్లిలో భారీ వర్షం కురిసింది. మియాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, బోడుప్పల్ సహా పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది. సాయంత్రం కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Very heavy smashing rain at Tellapur side. #Tellapur #HyderabadRains pic.twitter.com/dquYSIRmZx— Jagadish Reddy (@Jagadish_M) September 6, 2024 #06SEP 5:10PM⚠️Heavy Rain Spell ahead for West, Central, South &East #Hyderabad City.#Serilingampally, #Patancheru, #Kukatpally, #Begumpet, #Secunderabad,Abids,Khairatabad,Shaikpet, Charminar, Lb nagar Surroundings will see good Rains during the next 1hr⛈️⚠️#Hyderabadrains pic.twitter.com/vgpORYwzwg— Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2024 Raining #Khajaguda 🌧️🌧️#Hyderabadrains pic.twitter.com/rnJ9GNbLBy— Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2024 -
గాల్లోకి డబ్బులు.. యూట్యూబర్ హర్షను అరెస్ట్ చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్‌లో రీల్స్ చేయడంపై తెలంగాణ పోలీసుల వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీడియోల కోసం పబ్లిక్‌ను ఇబ్బంది పెట్టొదని తెలిపారు. రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా.. పిచ్చి చేష్టలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరించారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ మధ్యలో డబ్బులు గాల్లోకి చల్లి వాహనదారులకు ఇబ్బంది కలిగించిన యూట్యూబర్ హర్ష అలియాస్ మహాదేవ్‌ను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.‘తమ కెరీర్ లక్ష్యాలపై దృష్టిసారించాల్సిన యువత దారి తప్పుతుంది. సమాజానికి ప్రమాదకరంగా మారి, వారి కుటుంబాలను కూడా ప్రమాదంలోకి నెడుతుంది. ఇలాంటి దుశ్చర్యలపై పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోరు. కఠిన చట్టాలు ప్రయోగించి జైలు ఊచల వెనక బందీ చేస్తారు తస్మాత్ జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.యువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేయడాలు… పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివాటిని ఉపేక్షించబోరు. కఠినచట్టాలు ప్రయోగించి జైలుఊచలు లెక్కబెట్టిస్తారు. pic.twitter.com/j2MEdYuiLx— Telangana Police (@TelanganaCOPs) August 23, 2024కాగా గురువారం కూకట్పల్లి యూట్యూబర్ పవర్ హర్ష అలియాస్ మహదేవ్ హల్చల్ చేశాడు. ట్రాఫిక్ మధ్యలో డబ్బును గాల్లోకి విసిరాడు. దీంతో డబ్బులను పట్టుకోవడానికి ప్రజలు పరుగులు పెట్టారు. ఇంతకముందు కూడా చాలాసార్లు ట్రాఫిక్‌లో డబ్బులు గాల్లోకి చల్లుతూ రీల్స్ పోస్ట్ చేశారు. కరెన్సీ నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బైక్‌పై స్టాంట్లు కూడా చేశాడు. వీటిని సోషల్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో పోస్టు చేస్తుంటాడు. హర్ష వ్యవహారంపై వాహనదారులు మండిపడుతున్నారు. -
గాల్లోకి కరెన్సీ నోట్లను విసురుతూ.. యూట్యూబర్ ఓవరాక్షన్
సాక్షి,హైదరాబాద్: తెలుగు యూట్యూబర్ హర్ష మరోసారి ఓవర్ యాక్షన్ చేశాడు. గురువారం కూకట్ పల్లిలో రద్దీగా ఉండే ప్రాంతంలో డబ్బును గాల్లోకి విసిరి రీల్స్ చేశాడు. నోట్లు వెదజల్లడంతో వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు ప్రయత్నించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. గాల్లోకి నోట్లు విసురుతున్న రీల్స్ వైరల్ కావడంపై ప్రజలు, నెటిజన్లు సదరు యూట్యూబర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా యూట్యూబర్ హర్ష ఇప్పటికే పలు మార్లు డబ్బుల్ని గాల్లోకి చల్లుతూ రీల్స్ చేసి పోస్ట్ చేశాడు. కరెన్సీ నోట్ల కట్టలను గాల్లోకి చల్లుతూ బైక్ పై స్టంట్లు చేయడం,విసిరిన డబ్బుల్ని దక్కించుకునేందుకు వాహనదారులు ప్రయత్నించడంపై వెల్లువెత్తాయి. ఈ తరుణంలో మరోసారి డబ్బుల్ని గాల్లోకి విసరడంతో ట్రాఫిక్‌జామ్ కావడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబర్‌పై తగు చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి పోలీసులకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. YouTuber’ & Instagrammer’s Reckless Stunt of Throwing Money in Traffic Sparks Outrage in HyderabadCyberabad police will you please take action?A viral video showing a YouTuber and Instagrammer tossing money into the air amidst moving traffic in Hyderabad’s Kukatpally area has… pic.twitter.com/YlohO3U3qp— Sudhakar Udumula (@sudhakarudumula) August 22, 2024 -
హైదరాబాద్‌లో మళ్లీ దంచికొట్టిన వాన.. తెలంగాణకు ఐదురోజులు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరవ్యాప్తంగా దట్టమైన మేఘాలు కమ్ముకుని జడివాన కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా భారీ వర్షం పడింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ సిబ్బంది హెచ్చరించారు. ఇదే సమయంలో హెల్ప్‌లైన్ నెంబర్లు ఇచ్చారు.హెల్ప్‌లైన్ నెంబర్స్ ఇవే:040-21111111, 9000113667నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి, పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్ పూర్, ఖైరతాబాద్, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో, రోడ్లపై ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.#Hyderabadrains!!Now raining in Gachibowli 🌧️⚠️ pic.twitter.com/nLt7pXCZ3W— Telangana state Weatherman (@tharun25_t) August 16, 2024 మరోవైపు.. తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, గురువారం సాయంత్రం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో, జనజీవనం అస్తవ్యస్తమైంది. Ee varsham andira eee Hyderabad laaa 🌦️⛈️🌧️☔️💧#HyderabadRains pic.twitter.com/v1bKqPSDqB— Heisenberg (@abhinayrdy) August 16, 2024 #Gachibowli#HyderabadRains pic.twitter.com/YzMEKvpkvu— Jagadish Reddy (@jagadish757) August 16, 2024 -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం సమయంలో వర్షం కురుస్తుండటంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాగా, హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. బుధవారం సాయంత్రం కూకట్పల్లి, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, చందానగర్, మియాపూర్, జగద్గిరిగుట్ల సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించిపోయింది. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #Hyderabadrains!!Now iosalted thunder storm rains for west Hyderabad City places like Kukatpally serilingampally nizampet miyapur Quthbullapur places see good rains 🌧️🌧️⚠️ pic.twitter.com/aJlZvA4rSg— Telangana state Weatherman (@tharun25_t) August 14, 2024 -
కూకట్‌పల్లిలో కాంచీపురం నారాయణి సిల్క్స్ వస్త్ర షో రూమ్ ను ప్రారంభించిన సినీనటి లావణ్య త్రిపాఠి (ఫోటోలు)
-
ప్రొటోకాల్ ఉల్లంఘన.. స్పీకర్‌కు కూకట్పల్లి ఎమ్మెల్యే ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు. మూడు సార్లు ప్రజల మద్దతుతో భారీ మెజారీతో గెలుపొందిన తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటే కొందరు అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ పనులు చేయకుండా పబ్బం గడుపుతున్నారని ఫిర్యాదు చేశారు.ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి శాసనసభ్యుడి హక్కులకు భంగం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించినట్లు కృష్ణారావు తెలిపారు. -
అనగనగా ఓ సాగర కన్య (ఫోటోలు)
-
హైదరాబాద్ కూకట్ పల్లి లో సదరన్ ట్రావెల్స్ బ్రాంచ్ ప్రారంభం
-
కూకట్పల్లి మల్లికార్జున థియేటర్లో వైఎస్ జగన్ అభిమానులు హంగామా చేశారు
-
కూకట్ పల్లిలో లారీ బీభత్సం..కారు నుజ్జు నుజ్జు
-
ఊపిరి ఉన్నంత వరకు జైల్లోనే
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని బొటానికల్‌గార్డెన్ వద్ద రెండు గోనె సంచుల్లో ఏడు ముక్కలుగా దొరికిన బింగి దారుణహత్య కేసులో కూకట్పల్లి సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. నలుగురిని దోషులుగా తేలుస్తూ వారు బతికి ఉన్నతంకాలం జైల్లోనే ఉండేలా జీవితఖైదు విధించింది. బిహార్‌లోని బాంకా జిల్లా మోహన్‌మల్టీ గ్రామానికి చెందిన బింగి అలియాస్ పింకి అలియాస్ శాలినిది నిరుపేద కుటుంబం. రాజస్తాన్‌లో ఓ ఇటుకల పరిశ్రమలో పనిచేసే ఈమె తండ్రి దబ్బోలెయ్యా ఏడాదికి ఓసారి మాత్రమే సొంతూరుకు వచ్చి వెళ్లేవాడు. 2005లో ఉత్తరప్రదేశ్‌లోని సన్బల్ జిల్లా చాందూసిటౌన్కు చెందిన దినేష్ తో బింగి వివాహం జరగ్గా, వీరికి ముగ్గురు సంతానం. భర్తతో విభేదాలు ఏర్పడిన తర్వాత బింగికి చాందూసి ప్రాంతానికే చెందిన వికాస్ కశ్యప్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వికాస్‌తోపాటు ఒక కుమారుడిని తీసుకొని బింగి 2017లో సొంతూరుకు వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడ వికాస్‌కు మరో మహిళ మమత ఝాతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీంతో బింగిని వికాస్‌ను వదిలిపెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వికాస్, భర్త అనిల్ ఝాలతో కలిసి మమత హైదరాబాద్‌కు వచ్చింది. అప్పటికే మమత ఝా కుమారుడు అమర్‌కాంత్ ఝా నగరంలోని దలాల్ స్ట్రీట్ బార్లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. వీరంతా కలిసి సిద్ధిఖీనగర్‌లోని ఓ ఇంట్లో దిగారు. వికాస్, మమత సిద్ధిఖీనగర్‌లోనే చాట్‌బండార్ నిర్వహించేవారు. హైదరాబాద్‌కు వచ్చి హతం: అతికష్టం మీద వికాస్ చిరు నామా తెలుసుకొని బింగి వీరి వద్దకు చేరుకుంది. అప్పటి నుంచి వికాస్, మమత మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటికే బింగి 8 నెలల గర్భిణి. ఆమెను ఆస్పత్రికి తీసు కెళితే ఖర్చు అవుతుందని, బిడ్డ పుడితే వికాస్ డబ్బులన్నీ వారికే ఖర్చుపెట్టాల్సి వస్తుందని భావించిన మమత ఆమె హత్యకు పథకం వేసింది. దీనికి వికాస్ సహా మిగిలిన వారూ సహకరించడానికి అంగీకరించారు. 2018 జనవరి 27 రాత్రి 12 గంటల ప్రాంతంలో మమత, వికాస్‌లు బింగితో గొడవపడ్డారు. ఈ క్రమంలో మమత బింగి మెడ పట్టుకుని బలంగా గోడవైపు తోసింది. దీంతో బింగి కుప్పకూలిపోగా మమత, వికాస్ ఆమె నోరు, కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకున్నారు. మమతతోపాటు ఆమె భర్త అనిల్ ఝా, కుమారుడు అమర్‌కాంత్ ఝా బింగి శరీరంపై ఇష్టమొచి్చనట్టు పిడిగుద్దులు కురిపించారు. దీంతో బింగి చనిపోయింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి.... బింగి మృతదేహాన్ని ఒకరోజంతా బాత్రూమ్లోనే ఉంచారు. మర్నాడు అమర్‌కాంత్ ఎలక్ట్రికల్ కటింగ్ మెషీన్, రెండు గోనె సంచులు తీసుకొచ్చాడు. మెషీన్‌తో బింగి తల, మొండెం, కాళ్లు, చేతులు ముక్కలుగా చేసి రెండు గోనె సంచుల్లో ప్యాక్ చేశారు. అమర్‌కాంత్ తాను పనిచేస్తున్న బార్లో ఫ్లోర్ మేనేజర్, ఒడిశావాసి అయిన సిద్ధార్థ బర్దన్‌కు చెందిన బైక్ తీసుకొచ్చాడు. మమత సాయంతో గోనె సంచుల్నీ తీసుకువెళ్లి బొటానికల్ గార్డెన్ వద్ద పడే శారు. దీనిపై జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల ద్వారా సమాచారం అందుకున్న గచ్చి»ౌలి పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ లో నీలిరంగు చొక్కా ధరించి.. ముఖానికి కళ్లద్దాలు పెట్టుకున్న వ్యక్తి, గోనెసంచులతో మహిళ వెనుక కూర్చు న్న దృశ్యాలు కనబడ్డాయి. నిందితులు వినియోగించిన ఆ బైక్ బౌద్దనగర్‌కు చెందిన విజయ్‌కుమార్ బాద్రే పేరు మీద ఉంది. అతడి నుంచి 2009లో శశికుమార్‌గౌడ్ వద్దకు చివరకు సిద్ధార్థ బర్దన్ చేతికి వచ్చింది. ఇతడు హఫీజ్‌నగర్‌లో రాంగ్రూట్లో వెళుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో విధించిన ‘స్పాట్ పేమెంట్ చలాన్’ద్వారా అతడి ఫోన్ నంబరు తెలిసింది. అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, అమర్‌కాంత్, మమత, వికాస్, అనిల్ పేర్లు వెలుగులోకి వచ్చి కేసు ఓ కొలిక్కి వచ్చింది. 13 రోజుల్లోనే పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాతే హతురాలు బింగి అని తేలింది. కేసు దర్యాప్తు చేసిన గచ్చిబౌలి పోలీసులు నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసు విచారించిన కూకట్‌పల్లిలోని ఆరో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ కోర్టు దోషులుగా తేలిన నలుగురూ బతికి ఉన్నంత కాలం జైల్లోనే ఉండేలా శిక్ష విధించింది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఇన్స్పెక్టర్ ఎం.గంగాధర్ (ప్రస్తుతం ఏసీపీ) దాఖలు చేసిన చార్జ్‌షీట్ పోలీసు అకాడమీలో ఓ సబ్జెక్ట్‌గా మారింది. -
Brahmamudi Serial Actors Photos: కూకట్‌పల్లిలో బ్రహ్మముడి సీరియల్ నటుల గ్రాండ్ బారాత్ (ఫోటోలు)
-
జాడ లేని జనసేన.. పవర్ స్టార్ ప్రభావం ఏదీ?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో జనసేన అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన గుర్తు గ్లాస్ పగలిపోయేలా జనాలు పవన్‌కు పట్టించుకోలేదు. ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా జనసేనను ప్రజలు పట్టించుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల హవా సాగుతోంది. అధికార బీఆర్ఎస్ ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. బీజేపీ 8 చోట్ల ఆధిక్యం కనబరుస్తోంటే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన జనసేన జాడ అస్సలు కనిపించకుండా పోయింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగింది. బీజేపీతో పొత్తుతో మొత్తం 8 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. కౌంటింగ్ ప్రారంభమై పలు రౌండ్లు ముగిసినా ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క చోట కూడా ప్రభావం చూపించలేకపోతున్నారు. పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా ప్రచారం చేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అయినా ఓటర్లు పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గంలో తమ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ గెలుస్తారని జనసైనికులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో 5 రౌండ్లు ముగిసే సరికి జనసేన అభ్యర్థి వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. -
కూకట్పల్లి నియోజకవర్గంలో మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు
-
ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం
-
Hyderabad: ‘డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తా’.. యువతి బెదిరింపులు.
సాక్షి, హైదరాబాద్: అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తానంటూ ఓ యువకుడిని ఒక యువతి వేధింపులకు గురి చేస్తున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన కిరణ్‌కుమార్ కృష్ణానగర్‌లో ఉంటున్నాడు. ఏడాది క్రితం అతను రూం షేరింగ్ కోసం ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చాడు. ఓ యువతి స్పందించి తాను షేర్ చేసుకుంటానని చెబుతూ కూకట్‌పల్లిలో రూం తీసుకోవాలని కోరింది. దీంతో ఇద్దరూ కలిసి గదిలో ఉంటున్నారు. అయితే తాను వేశ్యనని ఆమె చెప్పడంతో, తన ప్రవర్తన నచ్చక కిరణ్ ఆమెను బయటికి వెళ్లాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో పాటు తాము సన్నిహితంగా ఉన్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానంటూ బెదిరించింది. అంతేగాక తనపై లైంగిక దాడిచేశాడని సైబరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. వారు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత అతడి నుంచి ఆమెకు రూ.4.70 లక్షలు పరిహారంగా చెల్లించాడు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ చేయడంతో కిరణ్‌కుమార్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. ఈ నెల 13న రాత్రి ఆమె కిరణ్‌ను సారథి స్టూడియో వద్దకు రప్పించి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అతడిపై దాడి చేసింది. గురువారం అతను మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బీజేపీలో జనసేన కుంపటి
హైదరాబాద్: కాషాయ పార్టీలో జనసేనతో పొత్తు చిచ్చు రేపుతోంది. నగరంలో మూడు సీట్ల కోసం జనసేన పార్టీ పట్టుబడుతోంది. కమలం పార్టీ నేతలు మాత్రం అవి వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మల్కాజిగిరి స్థానాలు పొత్తులో భాగంగా తమకు వదిలేయాలని జనసేన ఒత్తిడి చేస్తోంది. శేరిలింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా రవి యాదవ్‌ను రంగంలోకి దింపాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నేరుగా అధిష్టానం పెద్దలను డిమాండ్ చేశారు. ఒకవైపు బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ పార్టీకి రాజీనామా చేయడం.. అదే సమయంలో కొండా అధిష్టానం పెద్దలకు అల్టిమేటం జారీ చేయడం ఉత్కంఠకు కారణమవుతోంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని కొండా పట్టుబడుతున్నారు. చివరకు శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థిని మూడో జాబితాలో అయినా ప్రకటిస్తారా? మరికొన్ని రోజులు పెండింగ్‌లోనే ఉంచుతారా? అన్నది ఆసక్తి కరంగా మారింది. కూకట్పల్లి సీటుపై జనసేన భారీ ఆశలు పెట్టుకుంది. ఈ స్థానం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని బీజేపీ స్థానిక నేతలు రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేశారు. జనసేన పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ వదిలేస్తుందన్న సమాచారంతో వడ్డేపల్లి రాజేశ్వరరావు, మాధవరం కాంతారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. లోకల్ కేడర్ ఒత్తిడికి అధినాయకత్వం తలోగ్గుతుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ తదితరులు బీజేపీ నుంచి టికెట్ కోసం ఆశిస్తున్నారు. బీజేపీ మాత్రం మల్కాజిగిరి సీటు జనసేనకు పొత్తులో వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా సీట్లపై క్లారిటీ? హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ స్థానాలపై మూడో జాబితాలో క్లారిటీ రానుంది. ఇప్పటికే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తెలంగాణ మూడో జాబితాకు ఆమోద ముద్ర వేసింది. పార్టీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి సీఈసీ ఆమోదించిన అభ్యర్థులకు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. ముషీరాబాద్‌కు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తనయ బండారు విజయలక్ష్మి, అంబర్‌పేటకు గౌతమ్ రావు పేర్లు ఖరారైనట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం కీర్తి రెడ్డి, విక్రమ్ గౌడ్, దీపక్ రెడ్డి పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్‌కు బండ కార్తీక రెడ్డి, కంటోన్మెంట్‌కు మాజీ మంత్రి శంకర్ రావు కుమార్తె సుస్మిత పేర్లను వివేక్ ప్రతిపాదించారు. వివేక్ పార్టీ వీడటంతో కంటోన్మెంట్ స్థానానికి తులసీ విజయ రాం పేరు తెర మీదకు వచి్చంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం తోకల శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఎల్బీనగర్ సీటు తనకే ఇవ్వాలని సామ రంగారెడ్డి పట్టుబడుతున్నారు. గ్రేటర్ పరిధిలో మెజార్టీ సీట్లు మూడో జాబితాలో వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
జనసేన వద్దు బాబోయ్ అంటున్న బీజేపీ
-
కూకట్పల్లి బరిలో హరివర్ధన్‌రెడ్డి..?
హైదరాబాద్: మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో అలకబూనిన సీనియర్ నాయకుడు పార్టీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డిని బుజ్జగించే పనిలో అధిష్టానం పడింది. ఏళ్లుగా మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్న హరివర్ధన్ను దూరం చేసుకుంటే పార్టీ అభ్యర్థి గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు జిల్లాలోని కూకట్పల్లి నియోజకవర్గం టికెట్ కేటాయించి, అక్కడి నుంచి బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. హరివర్ధన్‌రెడ్డి నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయం చేసిన నాయకుడు. గతంలో మేడ్చల్, పరిగి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి జిల్లాలో క్రియాశీలక నాయకుడిగా ఉన్నారు. నగరంలోని హబ్సిగూడ నుంచి కాంగ్రెస్ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికై ఐదేళ్ల పాటు పనిచేశారు. మేడ్చల్ టికెట్ ఆశించిన హరివర్ధన్‌రెడ్డి తాను గెలుపు గుర్రమైనా బీసీ నినాదంతో టికెట్ రాలేదని ఆయన వాదన. దీంతో తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని, సర్వే రిపోర్టులను బయటపెట్టాలని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. కూకట్పల్లి నుంచి బరిలోకి.. అసమ్మతితో రగులుతున్న హరివర్ధన్‌రెడ్డికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన్ను జిల్లాలోని కూకట్పల్లి నుంచి బరిలోకి దించాలని రెండవ లిస్ట్‌లో పేరు చేర్చినట్లు సమాచారం. హరివర్ధన్‌రెడ్డి నివాసముండే బోయిన్పల్లి ప్రాంతం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉండటం, ఆయనకు గతంలో నగరంలో పనిచేసిన అనుభవం ఉండటం, కూకట్పల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నాయకుల మధ్య పెద్దగా పోటీ లేకపోవడంతో ఆయనను అక్కడి నుంచి రంగంలోకి దించాలని రేవంత్‌రెడ్డి దూతలు మల్లు రవి యత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు సెకండ్ లిస్ట్‌లో ఆయన పేరు ఖరారు చేసి జాబితాలో నమోదైందని హరివర్ధన్‌రెడ్డి అనుచరులు జాబితాను చూపిస్తున్నారు. హరివర్ధన్‌రెడ్డి మాత్రం తాను పోటీ చేసేది.. లేనిదీ.. దసరా పండగ తర్వాత ప్రకటిస్తానని చెబుతున్నారు. -
డీజే పాటకు డ్యాన్స్ ఇరగదీసిన మంత్రి మల్లారెడ్డి
-
నేడు ‘లులు’ మాల్ ప్రారంభం
కూకట్పల్లి: ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన షాపింగ్ మాల్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా కూకట్‌పల్లిలో ఏర్పాటు చేస్తున్నట్లు ‘లులు’ గ్రూప్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అ్రషఫ్ అలీ పేర్కొన్నారు. ఈ షాపింగ్ మాల్‌ను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ చొరవతో రూ.500 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ లులు మాల్‌ను మొదటి విడతలో రూ.300 కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలి పారు. మరో రూ.200 కోట్లతో అత్యాధునిక హంగులతో లులు మాల్‌ను తీర్చిదిద్దుతామని అష్రఫ్ అలీ తెలిపారు. ఈ మాల్ తెలంగాణ ప్రజలకు అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని వివరించారు. భారతదేశంలో కొచ్చి, తిరువనంతపురం, బెంగళూరు, లక్నో కోయంబత్తూరులలో ఇప్పటికే లులు మార్కెట్ ను ప్రారంభించారు. ఈ మాల్లో అంతర్జాతీయ బ్రాండ్లతో కూడిన షాపింగ్ ఔట్లెట్లు, 1,400 మంది సీటింగ్ కెపాసిటీతో 5 స్క్రీన్స్‌తో సినిమా హాళ్లు, ఫుడ్ కోర్టు, పిల్లల వినోద కేంద్రం ఉంటాయని తెలిపారు. ఈ మాల్ ద్వారా 2 వేల మందికి పైగా సిబ్బందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. తాజా ఉత్పత్తులు, కిరాణా సామాగ్రి, ఫ్యాషన్, గృహోపకరణాలు, ఎల్రక్టానిక్స్, మొబైల్స్, సాంకేతిక, జీవనశైలి ఉత్పత్తుల కోసం లులు ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్ బ్రాండ్ పేర్లతో ప్రత్యేక విభాగాలను కలిగి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఆనంద్ ఏవీ. నిషద్ ఎంఎ, వి.నందకుమార్, షిబు ఫిలిప్స్, మేనేజర్ అబ్దుల్ ఖాదీర్, రెజిత్ రాధాకృష్ణన్, అబ్దుల్ సలీం, ఇ.అష్రన్, నౌషద్ కిజక్కుప్పరల్ తదితరులు పాల్గొన్నారు. -
కూకట్ పల్లి అడ్డగుట్టలో విషాదం
-
అడ్డగుట్ట విషాదం.. నిబంధనలకు విరుద్ధంగా పనులు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి అడ్డగుట్టలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ కూలి.. ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అయితే యజమాని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్లే కార్మికుల ప్రాణాలు పోయినట్లు తెలుస్తోంది ఇప్పుడు. కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలో గోడతో పాటు సెంట్రింగ్ కర్రలు విరిగిపడ్డాయి. దీంతో.. భవనం 6వ అంతస్థు నుంచి కిందపడిపోయారు కార్మికులు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పిట్టగోడ పనులు చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పిట్టగోడతో పాటు గోవా కరలు(పిరంగి ) విరిగి కిందపడ్డారు. మృతుల్ని ఒడిశాకు చెందిన సంతోష్, సోనియాచరణ్గా గుర్తించారు. గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అయితే భవన నిర్మాణానికి అనుమతులు ఐదు అంతస్థుల వరకే ఉందని.. నిబంధనలకు విరుద్ధంగా ఆరో అంతస్థు నిర్మించి పనులు జరుపుతున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. -
మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు?
సాక్షి, మేడ్చల్ జిల్లా: బరిలో నిలిచేదెవరు? గులాబీ పార్టీ అభ్యర్థులను ఢీకొట్టేదెవరు? అనే చర్చ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఊపందుకుంది. అనూహ్యంగా అధికార బీఆర్ఎస్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీలో నిలిపే వారి పేర్లను ఖరారు చేయటంతో అభివృద్ధి కార్యక్రమాలతో పేరుతో ప్రచార హోరుతో ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని కొత్త వారికి ఇవ్వగా.. మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్ ఇచ్చినప్పటికీ, తనయుడికి మెదక్ టికెట్ కేటాయించలేదని అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఇద్దరు సిట్టింగ్‌లు బీఆర్ఎస్లో ఇమడలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిలో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో పక్క అధికార పక్షం అభ్యర్థులకు దీటుగా.. విపక్షాలు ఎవరిని రంగంలోకి దింపుతాయనే ఉత్కంఠ అందరిలో ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలేంటి అన్న చర్చ కూడా జోరుగా సాగుతుండగా.. ఆ పారీ్టలకు చెందిన ఆశావహులు మాత్రం పలు రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ తమకే లభిస్తుందనే ధీమాతో వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకోగా, అధిష్టానం వడపోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అధిష్టానం ప్రకటించినా.. తనయుడు రోహిత్‌కు మెదక్ టికెట్ కేటాయించలేదన్న అసంతృప్తితో మంత్రి హరీష్‌రావుపై నిప్పులు చెరిగారు. ఈ విషయంలో మైనంపల్లి తీరుపై సీఎం కేసీఆర్ సహా వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రుగా ఉండగా, అధిష్టానం కూడా ఆయనపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు బీఆర్ఎస్లో చర్చ సాగుతోంది. బీఆర్ఎస్లో ఉండలేక.. బయటకు వెళ్లలేని సంకట పరిస్థితిని మైనంపల్లి ఎదుర్కొంటుండగా, అధిష్టానం కూడా మైనంపల్లిపై చర్యలకు సిద్ధపడకుండా మెత్తపడినట్లు ప్రచారం. ఒకవేళ అధిష్టానం మైనంపల్లి హన్మంతరావుపై సీరియస్‌గా వ్యవహరిస్తే.. మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి లేదా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును బరిలో దింపవచ్చనే చర్చ సాగుతోంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు నాయకులు దరఖాస్తు చేసుకున్నా పార్టీ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌కే దక్కుతుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో ఇద్దరు అన్నె వెంకట సత్యనారాయణ, బోనగిరి సురేష్‌యాదవ్ ఉన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కొత్తగా పార్టీలో చేరిన ఆకుల రాజేందర్, యువమోర్చా నాయకుడు భానుప్రకాష్ పోటీ పడుతున్నారు. మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డికి మళ్లీ మేడ్చల్ టికెట్ దక్కడంతో బలమైన పోటీదారుడుగా ప్రచార పర్వంలో ముందువరుసలో ఉన్నారు. గడపగడపకూ కాంగ్రెస్ అనే నినాదంతో పీసీసీ ఉపాధ్యాక్షుడు తోటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం వీరితోపాటు రోయ్యపల్లి మల్లేష్‌గౌడ్, పిసరి మహిపాల్‌రెడ్డి, పి.బాలేష్, గువ్వ రవి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే తొటకూరి వజ్రేష్(జంగయ్య)యాదవ్, రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే హరివర్ధన్‌రెడ్డికి దక్కవచ్చనే ప్రచారం ఆ పారీ్టలో సాగుతోంది. బీజేపీ నుంచి పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్‌రెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రంరెడ్డితో సహా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉప్పల్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కాదని, బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్కు అధిష్టానం టికెట్ కేటాయించడంతో కార్యకర్తల సమావేశాల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తానేని తప్పు చేశానో చెప్పకుండా.. టికెట్ నిరాకరించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి పది రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్న తీరుపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాత్రం ప్రజల మద్దతు పొందేందుకు అనుచరులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఉప్పల్ టికెట్ కోసం ఆరుగురు నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎం.పరమేశ్వర్‌రెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మేకల శివారెడ్డి, పసుల ప్రభాకర్‌రెడ్డి, అమరిశెట్టి నరేందర్ ఉన్నారు. టికెట్ విషయంలో ముగ్గురి మధ్యే పోటీ ఉండగలదని పారీ్టలో ప్రచారం సాగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటు మరో నాయకుడు పద్మారెడ్డి పోటీ పడుతున్నారు. అధిష్టానం మాత్రం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ వైపు మొగ్గు చూపవచ్చనే ప్రచారం పారీ్టలో సాగుతోంది. కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి కూకట్‌పల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా, కాంగ్రెస్ నుంచి కూకట్పల్లి టికెట్ కోసం 16 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో గొట్టిముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం, గాలివీర రామచంద్రబాలాజీ, పటోళ్ల నాగిరెడ్డి, వెలగపూడి వీవీస్ చౌదరి, మన్నె సతీష్‌కుమార్, ఆశపల్లి విజయచంద్ర, జాఫర్ అలీ, కొండకింది పుప్పారెడ్డి, దండుగుల యాదగిరి, మెడికొండ వెంకటమురళీ కృష్ణ, భక్త వత్సలం, జూలూరి ధనలక్ష్మీగౌడ్, పోట్లూరి శ్రీనివాస్‌రావు, దెరాటి మధుసాగర్, గొట్టిముక్కల పద్మరావు ఉన్నారు. కూకట్‌పల్లిలో బీజేపీ నుంచి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పి.హరీష్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు, కొత్తగా పార్టీలో చేరిన ప్రేమ్‌కుమార్ పోటీ పడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకాందగౌడ్‌కు బీఆర్ఎస్ మళ్లీ టికెట్ కేటాయించడంతో.. అభివృద్ధి పనుల పేరుతో ప్రజల వద్దకు వెళ్తుండగా, కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. నర్సారెడ్డి భూపతిరెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, కందాడి జ్యోత్సదేవి, సొంటిరెడ్డి పున్నారెడ్డి, ఉసిరిక అప్పిరెడ్డి, మహ్మద్ నిజాముద్దీన్, గుంజ శ్రీనివాస్, బండి సత్యంగౌడ్, దూళిపాక సాంబశివరావు, పోలీసు సుమిత్రారెడ్డి, అహ్మద్ నిజామొద్దీన్, బోనగిరి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. -
కాంగ్రెస్‌లోకి తుమ్మల.. తెరపైకి కూకట్పల్లి!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చల అనంతరం కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ముహూర్తం కూడా ఆయన ఖరారు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలోనే ఊహించని ప్రతిపాదన ఒకటి తెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 6వ తేదీన తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో.. కుదరకుంటే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు పెడుతున్న తుమ్మల.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో తుమ్మల పోటీ చేసే నియోజకవర్గంపైనా ఆసక్తికర ప్రచారం ఒకటి వినిపిస్తోంది. ఖమ్మం, పాలేరు ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాల నడుమ.. అనూహ్యాంగా కూకట్ పల్లి(హైదరాబాద్) పేరు తెర మీదకు వచ్చింది. కమ్మ ఓటర్లకు గాలం వేసేందుకు తుమ్మలను కూకట్పల్లి నుంచి పోటీ చేయించే యోచన చేస్తోంది కాంగ్రెస్. అయితే ఆ ప్రతిపాదనకు తుమ్మల అంత సుముఖంగా లేనట్లు స్పష్టమవుతోంది. తాను పాలేరు(ఖమ్మం) నుంచే పోటీ చేస్తానని చెప్తున్నారట. దీంతో ఆయన పోటీచేయబోయే నియోజకవర్గ విషయంలో కాంగ్రెస్ ఇంకా మంతనాలు కొనసాగిస్తున్నట్లు భోగట్టా. బీఆర్ఎస్ తరపున పాలేరు టికెట్ దక్కకపోవడంతో.. తీవ్ర అసంతృప్తికి లోనైన తుమ్మల నాగేశ్వరరావు భారీ అనుచరుగణంతో బలప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రజల కోసమైనా పోటీ చేస్తానని.. తలవంచేది లేదంటూ ప్రకటన సైతం చేశారు. అయితే ఆయన పార్టీ మారతారా?.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే విషయాలపై మాత్రం ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. పాలేరు నుంచే తుమ్మల పోటీ చేయనున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో, కూకట్పల్లి నుంచి తుమ్మల పోటీ నిలిచే అవకాశం లేనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్కు ఇంకా తుమ్మల రాజీనామా చేయని సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరికలపై తుమ్మలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు,రేఖానాయక్‌లు సైతం పీసీసీతో మంతనాలు చేస్తున్నారు. ఇది చదవండి: సాగర్‌లో కారు లొల్లి -
వీడియో: కూకట్‌పల్లిలో విషాదం.. కరెంట్ షాక్‌తో మహిళ మృతి
-
HYD: స్విచ్ ఆన్ చేస్తూ కరెంట్ షాక్‌తో మహిళ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బోర్ స్విచ్ ఆన్ చేస్తూ కరెంట్ షాక్‌తో వివాహిత గంగా భవాని(33) అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. అల్విన్ కాలనీ పైప్ లైన్ రోడ్డులో ఉన్న ప్రేమ్ సరోవర్ అపార్ట్ మెంట్లో గంగాభవాని(33) పని మనిషిగా పనిచేస్తోంది. అయితే, గంగా భవాని అపార్ట్మెంట్లో బోర్వెల్ ఆన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్‌తో మృతిచెందింది. కరెంట్ షాక్ తగిలిన వెంటనే ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. కొద్ది నిమిషాల తర్వాత ఆమె నేలపై పడి ఉండటాన్ని గమనించిన అపార్ట్మెంట్ వాసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. కాగా, ప్రేమ్ సరోవర్ అపార్ట్మెంట్లోనే ఆమె భర్త వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమారు 11 సంవత్సరాల వయస్సు గల ఒక అమ్మాయి మరియు 9 సంవత్సరాల వయస్సు గల అబ్బాయి ఉన్నారు. వీరు ఏపీవాసులుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: ఎన్టీపీసీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి -
బిర్యానీపై హైదరాబాదీలకు తరగని మోజు.. కోటిన్నర బిర్యానీల ఆర్డర్!
గత ఆరు నెలల్లో హైదరాబాదీలు 72 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లను గత 12 నెలల్లో 150 లక్షల బిర్యానీ ఆర్డర్లను అందుకున్నారు. బిర్యానీపై తరగని మోజుకు, నగరానికి బిర్యానీకి మధ్య ఉన్న అనుబంధానికి అద్దం పడుతుంది. ధమ్ బిర్యానీ చాంపియన్... గత ఐదున్నర నెలల్లో, 2022 ఇదే కాలంతో పోలిస్తే నగరంలో బిర్యానీ ఆర్డర్లలో 8.39% వృద్ధి నమోదైంది. దమ్ బిర్యానీ 9 లక్షలకు పైగా ఆర్డర్లతో తిరుగులేని చాంపియన్‌గా నిలిచింది. 7.9 లక్షల ఆర్డర్లతో సువాసనగల ఫ్లేవర్డ్ బిర్యానీ తన సత్తా చాట గా, బ్యాచిలర్స్, సింగిల్స్‌కి అలవాటైన మినీ బిర్యానీ 5.2 లక్షల ఆర్డర్లను అందుకుంది. బిర్యానీ ప్రియత్వం ఓ రేంజ్లో ఉండటంతో నగరంలో దాదాపు 15,000 పైగా రెస్టారెంట్లు తమ మెనూలో బిర్యానీని తప్పనిసరి డిష్‌గా అందజేస్తున్నాయి. బిర్యానీలు అందించే రెస్టారెంట్స్ అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కూకట్పల్లి, మాదాపూర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, కొత్తపేట్ – దిల్సుఖ్నగర్ ఉన్నాయి, కూకట్పల్లి టాప్... హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆర్డర్ పరిమాణం పరంగా అత్యధిక బిర్యానీ వినియోగం జరిగింది. వీటిలో. కూకట్పల్లి నెంబర్ వన్ కిరీటం అందుకుంటోంది. ఆ తర్వా తి స్థానాల్లో వరుసగా మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి కొండాపూర్ ఉన్నాయి. నగరవాసులు వేలూ లక్షల బిర్యానీలు హాంఫట్ మనిపిస్తున్నారు. ఏ యేటికాయేడు బిర్యానీ పై తమ ఇష్టాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. ఆదివారం ప్రపంచ బిర్యానీ దినోత్సవం సందర్భంగా, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గి నిర్వహించిన ఓ అధ్యయనం ఒక్క ఏడాదిలో.. కోటిన్నర బిర్యానీలు నగరం ఆరగించేసిందని తేల్చింది. – సాక్షి, సిటీబ్యూరో బిర్యానీ ఓ అనుభవం... నగరంలో బిర్యానీ ప్రియులతో మా ప్రయా ణం చాలా సుదీర్ఘమైనది. నగరవాసులకు బిర్యానీ అనేది కేవలం ఒక తినే వంటకం మాత్రమే కాదు అంతకు మించిన ఒక సంతోషకరమైన అనుభవం. ఈ ప్రపంచ బిర్యానీ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని రూ.199 నుంచే ప్రారంభం అవుతున్న మా బిర్యానీ వైరెటీలను నగరవాసులకు ఆస్వాదించవచ్చు. – కుశాగ్ర గుప్తా, వైస్‌ప్రెసిడెంట్, ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ -
హైదరాబాద్ కూకట్ పల్లి లో కుంగిన భూమి
-
HYD: కూకట్‌పల్లిలో ఒక్కసారిగా కుంగిన భూమి..
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలోని గౌతమ్ నగర్ కాలనీలో ఓ నిర్మాణ సంస్థ పనులు చేస్తుండగా ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. దీనితో స్థానికంగా ఉండే కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సరైన అనుమతులు భారీ ఎత్తున నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సంబంధించి సెల్లార్ కోసం తవ్వడంతో పక్కనే ఉన్న రోడ్డు సైతం కుంగిపోయింది. కనీసం కాలనీ వాసులు బయటికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో అక్రమంగా బ్లాస్టింగ్‌కి పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులకు కార్పొరేటర్ కి సైతం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్ కట్టేటప్పుడు అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మాణం చేస్తే కూలగొట్టే జీహెచ్ఎంసీ అధికారులకు ఇంత పెద్ద నిర్మాణ సంస్థ అక్రమాలకు పాల్పడుతుంటే కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపైన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదంలో కీలక పరిణామం -
హైదరాబాద్ కూకట్ పల్లిలో ప్రేమ జంట ఆత్మహత్య
-
కూకట్ పల్లి అగ్నిప్రమాదం లో జయకృష్ణ సజీవ దహనం
-
HYD: డబుల్ ఓట్ ఇక ఔట్!.. ఎన్నికల సంఘం స్పెషల్ డ్రైవ్..
సొంతూరిలో ఒక ఓటు.. చదువుకున్న చోట మరో ఓటు.. ఉద్యోగం కోసం వలస వెళ్లిన చోట మరో ఓటు.. కొందరికైతే ఒకే నియోజకవర్గంలో వేర్వేరు చోట్ల ఓట్లు.. ఇలా చాలా మందికి ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. దీనితో ఎన్నికల సమయంలో గందరగోళం, కొన్నిసార్లు అక్రమాలకు ఆస్కారం కలుగుతోంది. ఈ క్రమంలో మల్టిపుల్ ఓట్లను ఏరివేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 14 లక్షలకుపైగా మల్టిపుల్ ఓట్లను గుర్తించి తొలగించింది. తాజాగా మరోదఫా పరిశీలనకు సిద్ధమైంది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 మేరకు దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుంది. అయితే దేశంలో ఎక్కడో ఒక్కచోట మాత్రమే ఆ ఓటు నమోదై ఉండాలి. మరోచోటికి మారితే.. మొదట ఉన్నచోట రద్దు చేసుకుని, కొత్త ప్రాంతంలో నమోదు చేసుకోవాలి. కానీ రాష్ట్రంలో కొందరికి ఐదు నుండి పది ఓట్లు ఉండటం, ఒకే ఇంటి నంబర్‌పై నాలుగైదు వందల ఓట్లు నమోదుకావడం వంటివి వెలుగుచూశాయి. హైదరాబాద్‌లో కేవలం 85 ఇంటి నంబర్లపై ఏకంగా 14,037 ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. మేడ్చల్–మల్కాజిగిరిలో 28 ఇంటి నంబర్లలో 5,501 ఓట్లు, రంగారెడ్డి జిల్లాలో 33 ఇంటి నంబర్లలో 5,430 ఓట్లు, నల్లగొండలో 74 ఇంటి నంబర్లలో 11,126 ఓట్లు, ఖమ్మంలో 11 ఇంటి నంబర్లలో 2,678 ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటివి ఉన్నట్టు తేల్చారు. రాష్ట్రంలోని మొత్తం ముప్పైమూడు జిల్లాల్లో కేవలం 289 ఇంటి నంబర్లలో ఏకంగా 47,325 మంది ఓటర్లుగా నమోదై ఉన్నట్టు తాజా లెక్కలు చెప్తున్నాయి. అంటే ఒక్కో ఇంట్లో సగటున 160 మందికిపైనే ఓటర్లు ఉన్నట్టు అన్నమాట. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పరిశీలన జరిపి.. ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా.. ఒకే పేరు, ఫోటోతో వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారిని గుర్తించింది. ఇలా ఇప్పటివరకు 14,09,294 ఓట్లను రద్దు చేసింది. ఇంకా ఇలాంటి ఓట్లు భారీగా ఉన్నట్టు రాజకీయ పక్షాలు ఫిర్యాదులు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఒక ఇంటి నంబర్‌పై ఆరు కంటే ఎక్కువ ఓట్లు ఉన్నచోట ప్రత్యేక పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. తాజాగా రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో సాధారణ సగటుకు మించి ఓటర్లున్న ప్రాంతాలపై ప్రత్యేక పరిశీలన మొదలుపెట్టింది. నోటీసులు ఇచ్చి.. డిక్లరేషన్ తీసుకుని.. ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో గుర్తిస్తున్నారు. అలాంటి వారికి ఎక్కడో ఒకేచోట ఓటును ఎంచుకోవాలంటూ నోటీసులు ఇస్తున్నారు. వారికి కావాల్సిన చోట ఓటుకు సంబంధించి డిక్లరేషన్ తీసుకుంటున్నారు. మిగతా చోట్ల ఉన్న ఓట్లను తొలగిస్తున్నారు. ఇలా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షలకుపైగా ఓట్లను రద్దు చేశారు. అయితే.. ఇప్పటికీ 289 ఇంటి నంబర్లలో ఒక్కో ఇంట్లో వందకు పైగా.. మరో 23,247 ఇంటి నంబర్లలో ఒక్కో ఇంట్లో 20కిపైగా ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. శనివారం నాటికి మొత్తంగా 2,99,77,659 మంది ఓటర్లు ఉన్నట్టు నిర్ధారించారు. ఎక్కువ నివాసాలు ఉంటే ప్రత్యేక నంబర్లు.. హైదరాబాద్ నగరంలో ఒకే ఇంటి నంబర్‌పై చాలా వ్యక్తిగత నివాసాలున్న ప్రాంతాలను గుర్తించి... ఆయా నివాసాలకు ప్రత్యేక నంబర్లు కేటాయించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఎన్నికల సంఘం తాజాగా సూచించింది. ఒకే ఇంటి నంబర్‌తో అపార్ట్మెంట్లు ఉంటే.. అందులోని ఫ్లాట్లకు వేర్వేరు నంబర్లు కేటాయించే పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరింది. ఇది కూడా చదవండి: తెలంగాణకు మరోసారి ప్రధాని మోదీ.. -
కూకట్‌పల్లిలో రీతూ వర్మ సందడి (ఫొటోలు)
-
కూకట్ పల్లిలోని ప్రశాంత్ నగర్ లో అగ్నిప్రమాదం
-
Kukatpally: స్పా, మసాజ్ సెంటర్ల మాటున అక్రమాలు..
సాక్షి, కూకట్పల్లి: నగరంలోని కూకట్‌పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం దందా నడుపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పా సెంటర్లపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. కాగా, పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు కూకట్‌పల్లిలోని పలు స్పా సెంటర్లపై శుక్రవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో స్పా ముసుగులో వ్యభిచారం నడుపుతున్న ముఠాలను గుర్తించారు. ఈ సందర్భంగా దాదాపు 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఐదు స్పా సెంటర్లను మూసివేశారు. స్పా, మసాజ్ సెంటర్లు ఇవే.. - స్ప్రింగ్ వెల్ స్పా, మసాజ్ సెంటర్ - అవంతి స్పా, మసాజ్ సెంటర్ - సారా వెల్నెస్ స్పా, మసాజ్ సెంటర్ - స్నో యూనిసెక్స్ స్పా, మసాజ్‌సెంటర్ ఇక, ఈ విషయంలో సంబంధిత యజమానులు, నిర్వాహకులు, థెరపిస్టులను అవసరమైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత పోలీసు స్టేషన్లలకు అప్పగించారు. -
కూకట్పల్లి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫైర్ కేసును ఛేదించిన పోలీసులు
-
కూకట్పల్లి: ట్రావెల్స్ బస్సుల్లో మంటలు.. సూత్రధారి అతడే..
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో ప్రైవేటు ట్రావెల్స్‌లో మూడు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం మిస్టరీ వీడింది. పోలీసులు కేసును ఛేదించారు. అయితే, ఈ కేసులో డ్రైవర్ వీరబాబే మూడు బస్సులను తగులబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలో ఈనెల 12వ తేదీన అర్ధరాత్రి అగ్ని ప్రమాదంలో మూడు ప్రైవేటు టావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా డ్రైవర్ వీరబాబే మూడు బస్సులను తగులబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ట్రావెల్స్ యజమానిపై కక్షతోనే బస్సులకు నిప్పంటించినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ట్రావెల్స్ యజమాని కృష్ణారెడ్డి కొట్టడం వల్లే డ్రైవర్ వీరబాబు ఇలా చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో నిందితుడు వీరబాబుతోపాటు అతనిపై దాడి చేసిన ట్రావెల్స్ యజమాని కృష్ణారెడ్డి, అతని బంధువుపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. -
కూకట్పల్లి: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం..
సాక్షి, హైదరాబాద్: క్రిప్టో కరెన్సీ పేరుతో నగరంలో కూకట్‌పల్లిలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. XCSPL కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసానికి పాల్పడింది. దీంతో బాధితులు కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. కూకట్పల్లిలోకని XCSPL కంపెనీ క్రిప్టో కరెన్సీ పేరుతో కోట్ల రూపాయలు దండుకుంది. రూ. లక్షకు నాలుగు లక్షలు రూపాయలు ఇస్తామని బాధితులకు ఆశ చూపించి వారిని మోసం చేసింది. ఏకంగా 90 రోజుల్లోనే వారు పెట్టిన పెట్టుబడికి నాలుగు రేట్లు ఎక్కువగా ఇస్తామని డబ్బులు వసూలు చేసింది. దీంతో, బాధితులు.. అప్పుచేసి, లోన్ తీసుకుని, క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. తీరా.. కంపెనీ వారికి డబ్బు చెల్లించకపోవడంతో అసలు మోసం బయట పడింది. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం, మంజీరా మాల్లోని ఆఫీసు ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
Kukatpally: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వెంకట నరసింహారాజు (31) సూరారంలోని చిత్తారమ్మ దేవాలయం సమీపంలో నివాసం ఉటున్నాడు. కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలోని లావిష్ బ్యూటీ పార్లర్, వెల్నెస్ స్పా నిర్వహిస్తున్నాడు. స్పా సెంటర్ ముసుగులో విటులను రప్పించి వాట్సప్‌లో యువతుల ఫొటోలు పంపుతూ విటులకు ఎరవేసి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ, కూకట్పల్లి పోలీసులు ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడితో పాటు నలుగురు విటులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. బస్సుల్లో చెలరేగిన మంటలు
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్‌లో ఉన్న మూడు బస్సుల్లో మంటలు చెలరేగాయి. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన 3 బస్సులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: షాకింగ్ ఘటన.. భార్య శీలాన్ని శంకించి.. -
Hyderabad: వరుసబెట్టి దోచేశారు.. అర్ధరాత్రి 13 ఇళ్లలో దొంగతనాలు
సాక్షి, కూకట్పల్లి: తాళం వేసిన ఇళ్లపై రెక్కీ నిర్వహించిన దొంగలు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఏకంగా 13 ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం వెలుగులోకి వచి్చంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి ఓ దొంగల ముఠా విడిపోయి కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని దయార్‌గూడ, కేరళబస్తీ, దేవీనగర్ ప్రాంతాల్లో తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారు. ఇళ్లలోని వస్తువులను చిందరవందర చేసి అందినకాడికి దోచుకెళ్లారు. ఓ ఇంట్లో గల్లాపెట్టెలో ఉన్న రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లగా మరో ఇంటిలో వెండి పట్టా గొలుసులు, ఒక ఇంట్లో ల్యాప్‌టాప్ ఇలా దొరికిన వస్తువును ఎత్తుకెళ్లారు. చోరీలు జరిగిన ఇళ్ల యజమానులు అందుబాటులో లేకపోవటంతో ఎవరింట్లో ఎంత సొత్తు అపహరణకు గురైందో వివరాలు తెలియలేదు. యజమానులు ఊళ్ల నుంచి తిరిగి వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం 9 ఇళ్లల్లో తాళాలు పగలగొట్టినట్లు తమకు సమాచారం అందినట్లు తెలిపారు. పోలీసులు, క్లూస్ టీం సిబ్బంది దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించి ఆధారాలు సేకరించారు. సీసీ పుటేజీల ఆధారంగా అర్ధరాత్రి 2 నుంచి 4 గంటల సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడిన ట్లు నిర్ధారణకు వచ్చారు. ముందుగానే రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేటర్ పరిశీలన దయార్‌గూడ, కేరళబస్తీ, దేవీనగర్లలో దొంగతనా లు జరిగిన ఇళ్లను సోమవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ పరిశీలించారు. పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, సీఐ నర్సింగ్‌రావు, నాయకులు బొట్టు విష్ణు, సంతోష్, రాము, వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: Hyderabad: బాలీవుడ్లో నటన.. కూతురికి మోడలింగ్‌లో అవకాశాలు ఇప్పిస్తానంటూ.. -
ఏమైందో ఏమో..! పుట్టిన రోజే యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: పుట్టిన రోజే ఓ విద్యార్థిని మృత్యు ఒడికి చేరుకుంది... ఏమైందో ఏమో కానీ జన్మదినం రోజే బలవన్మరణం పొంది కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. అప్పటి వరకు తోటి విద్యార్థినులతో ఆనందంగా గడిపిన ఆ యువతి పుట్టిన రోజే తిరిగిరాని లోకాలకు వెళ్లటం అందరినీ కలిచివేసింది. సీఏ చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి చామపాడు గ్రామానికి చెందిన కేసాని కిరణ్‌కుమార్ బాలాజీనగర్‌లో నివాసముంటూ ఓ ప్లాస్టిక్ కంపెనీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు హర్షిత (20) అలియాస్ హనీ. ఆన్లైన్లో సీఏ, బీకాం చదువుతోంది. సాయికిరణ్ బంధువులు చనిపోవటంతో సాయికిరణ్, భార్య నర్మదాలు బుధవారం సాయంత్రం నెల్లూరుకు వెళ్లారు. తిరిగి శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. గడియ కొట్టడంతో ఎంతకీ తలుపు తీయకపోవటంతో అనుమానం వచ్చి ఇంటి యజమాని మూర్తి సహాయంతో గడియ పగలగొట్టి బెడ్రూంలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే చున్నీ కట్ చేసి కూతురుని కిందకు దించాడు. తనకు ఒక్కగానొక్క కూతురు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించటంతో ఆ తల్లిదండ్రుల కన్నీరుమున్నీరయ్యారు. అంతకు ముందు రోజు గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో తండ్రికి ఫోన్ చేసి వస్తున్నారా? అని అడిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి సినిమా చూడడానికి కూడా వెళ్లినట్లు తలిదండ్రులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు తెలుసుకొని క్లూస్ టీమ్ ఆధారంగా వివరాలు సేకరించారు. తన కూతురు చదువులో ఒత్తిడికి లోనయ్యేదని.. ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తండ్రి సాయికిరణ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కూకట్‌పల్లిలో దారుణం: మహిళా ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. కారణం ఇదే
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో భర్త కారణంగా తన బిడ్డను చంపుకోలేక ఐటీ ఉద్యోగి స్వాతి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు భరించలేక భవనం 23వ అంతస్తు నుంచి దూకి మృతిచెందింది. వివరాల ప్రకారం.. శ్రీధర్, స్వాతి ఇద్దరు దంపతులు. వీరికి అంగవైకల్యంతో ఓ కుమారుడు జన్మించాడు. దీంతో, అంగకవైకల్యంతో ఉన్న కుమారుడిని చూస్తూ తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో మెర్సీ కిల్లింగ్ కోసం తండ్రి శ్రీధర్.. భార్య స్వాతిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ విషయమై తరచూ భార్యను వేధింపులకు గురిచేశాడు. భర్త ఎంత ఒత్తిడి తెచ్చిన కన్న కొడుకును చంపుకోలేక మెర్సీ కిల్లింగ్ ప్రతిపాదనను స్వాతి ఒప్పుకోలేదు. కాగా, కుమారుడి విషయంలో భర్త.. ఇలా వేధించడం భరించలేక స్వాతి మనోవేదనకు గురైంది. దీంతో, వారు నివాసం ఉంటున్న మంజీర ట్రినిటి హోమ్స్ 23వ అంతస్తు నుంచి దూకి స్వాతి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఇదిలా ఉండగా.. స్వాతి మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా శ్రీధర్ అందుబాటులోకి రాలేదు. కనీసం శ్రీధర్, అతడి కుటుంబ సభ్యులు కూడా మృతదేహాన్ని తీసుకువెళ్లలేదు. ఈ నేపథ్యంలో శ్రీధర్‌ను కఠినంగా శిక్షించాలని స్వాతి బంధువులు కోరుతున్నారు. -
హైదరాబాద్ కూకట్ పల్లిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం
-
కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. భవనం శ్లాబ్ కూలీ పలువురికి గాయాలు
హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. బీజేపీ కార్యాలయం సమీపంలోని పాపారాయుడు విగ్రహం వద్ద నిర్మాణంలో భవనం నాలుగో అంతస్తు శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఇద్దరు కూలీలు చిక్కున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. చదవండి: రేవంత్ మాపై పిర్యాదు చేయడం హాస్యాస్పదం: సుధీర్ రెడ్డి -
వాడు నీ కొడుకే.. కిడ్నాప్ కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి విశాఖ ఏజెన్సీకి పెట్రోలియం ఈథర్... అక్కడ నుంచి ఇక్కడకు హష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులకు చిక్కిన ఎన్.ప్రవీణ్ కుమార్‌పై గతంలో కిడ్నాప్ కేసు ఉంది. 2015లో కూకట్పల్లి పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు కోర్టులో వీగిపోయింది. ఇప్పటి వరకు అంతా ఆ కిడ్నాప్ కేవలం డబ్బు కోసమే జరిగిందని అంతా భావించారు.. భావిస్తున్నారు. అయితే దాని వెనుక ఉన్న ఆసక్తికర కోణాన్ని ప్రవీణ్ ఇప్పుడు పోలీసుల ఎదుట బయటపెట్టాడు. నిజామాబాద్ మహిళ.. దుబాయ్‌లో సహజీవనం... నిజామాబాద్ ప్రాంతానికి చెందిన మహిళ కొన్నేళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడే ఉద్యోగం చేస్తున్న మంచిర్యాలకు చెందిన వ్యక్తితో ఈమెకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దాదాపు రెండేళ్ల పాటు అతడితో సహజీవనం చేసిన ఆమె ఆపై నిజామాబాద్ తిరిగి వచ్చేసింది. అయితే ఇక్కడ బతకడం కష్టసాధ్యంగా మారడంతో పాటు అనివార్య కారణాల నేపథ్యంలో మళ్లీ విదేశాలకు వెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో దుబాయ్‌లో ఉన్న మంచిర్యాల వాసి నుంచి వీలున్నంత డబ్బు గుంజాలని పథకం వేసింది. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా అతడిని పదేపదే ఫోన్లు చేసి ‘నిజామాబాద్ వచ్చాక తాను గర్భం దాల్చిన విషయం తెలిసిందని, తనకు మగ బిడ్డ పుట్టాడని, వాడికి తండ్రివి నువ్వే’ అంటూ చెప్పింది. ఆరేళ్లకు అతడు వస్తాననడంతో... తామిద్దరం బతకడానికి ప్రతి నెలా డబ్బు పంపాలని డిమాండ్ చేసింది. అప్పటికే వివాహితుడైన అతడు తన కుటుంబాన్ని మంచిర్యాలలోనే ఉంచాడు. తాను దుబాయ్‌లో మరో మహిళతో సహజీవనం చేసిన విషయం భార్యకు తెలియనీయలేదు. నిజామాబాద్ మహిళను నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన అతగాడు ఆమెకు డబ్బు పంపుతూ వచ్చాడు. ఇది జరిగిన ఆరేళ్లకు తాను నిజామాబాద్ వస్తున్నట్లు దుబాయ్ నుంచి సమాచారం ఇచ్చాడు. అలా అతడు వచ్చి తనను కలిస్తే తన బండారం బయటపడటంతో పాటు అసలు విషయం తెలుస్తుందని ఆమె భావించింది. అదే జరిగితే తనకు ప్రతి నెలా వచ్చే డబ్బు రాకపోవడంతో పాటు ఇప్పటి వరకు పంపిందీ తిరిగి ఇమ్మంటాడని భయపడింది. దీంతో అతడు వచ్చేలోపు ఓ ఆరేళ్ల బాలుడు తన వద్ద ఉండాలని భావించింది. అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో అతడు, ప్రవీణ్ కుమార్‌తో సహా మొత్తం ఐదుగురు రంగంలోకి దిగారు. ఈ ఐదుగురిలో కూకట్‌పల్లికి చెందిన వాళ్లూ ఉన్నారు. దీంతో వీళ్లు ఆ ప్రాంతంలో కనిపించిన ఓ ఆరేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి నిజామాబాద్‌లో ఆమెకు అప్పగించారు. ఫ్రీగా అప్పగించడం ఇష్టంలేక... దుబాయ్ నుంచి వచ్చిన ‘బాలుడి తండ్రి’ నిజామాబాద్‌లో ఆ మహిళ వద్ద కొన్ని రోజుల పాటు ఉన్నాడు. ఆ చిన్నారి తమకు పుట్టిన బిడ్డగానే భావించాడు. అయితే ఓ రోజు.. ఆ బాలుడు తన కుమారుడు కాదని తెలుసుకొని ఆమెను నిలదీశాడు. ఆ తరువాత వారిని వదిలి మంచిర్యాల వెళ్లిపోయాడు. దీంతో ఆమె బాలుడిని తిరిగి తీసుకువెళ్లాల్సిందిగా ప్రవీణ్ సహా ఐదుగురికీ చెప్పింది. నిజామాబాద్ వెళ్లి బాలుడిని తీసుకువచి్చన వీళ్లు తల్లిదండ్రులకు అప్పగించడానికి వెనుకాడారు. ఊరికే ఇవ్వడం ఎందుకని భావించి ఎంతో కొంత వసూలు చేసే ప్రయత్నం చేశారు. బాలుడి తండ్రికి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. అప్పటికే బాలుడు తప్పిపోయినట్లు కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులకు ఈ విషయం తెలిసింది. డబ్బు డిమాండ్ విషయం తెలుసుకున్న పోలీసులు వలపన్ని ఐదుగురినీ అరెస్టు చేశారు. అప్పట్లో విచారణలో మాత్రం తాము కేవలం డబ్బు కోసమే ఈ పని చేశామని నిందితులు చెప్పడంతో అలానే రికార్డుల్లోకి ఎక్కింది. -
Hyderabad: హౌసింగ్‌బోర్డు భూములు అన్యాక్రాంతం!
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి ప్రాంతంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన విలువైన భూములపై కబ్జాదారులు కన్నేశారు. తెలంగాణ విభజన తరువాత హౌసింగ్‌బోర్డు విభజన జరుగకపోవడంతో అందులో పని చేస్తున్న అధికారులు నామమాత్రపు విధులకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో ఎక్కడికక్కడ విలువైన భూములను కబ్జా చేసేందుకు కబ్జాదారులు గుట్టుచప్పుడు కాకుండా కబ్జాకు తెరతీస్తున్నారు. ఇటీవల కాలంలోనే సుమారు ఎకరంన్నర భూమిని కబ్జాచేసేందుకు కొందరు తెరవెనుక జరిపిన కుట్రలను ఏకంగా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెలుగులోకి తీసుకురావడం విదితమే. సుమారు వందకోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారులు సర్వేనంబర్ల మార్పు పేరుతో సులభంగా చేజిక్కించుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం. ►కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ నుంచి హఫీజ్‌పేట వైపు వెళ్లేదారిలో రైల్వేట్రాక్ పక్కనే ఉన్న ఎకరంన్నర ఖాళీ స్థలంలో హౌసింగ్‌బోర్డు అధికారులు గతంలో ఈ స్థలం తమదేనంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు కబ్జాదారులు సదరు భూమి కూకట్పల్లి మండలం పరిదిలోకి రాదని, శేరిలింగంపల్లి పరిధిలోకి వచ్చే హఫీజ్‌పేట గ్రామానికి చెందిన 78 సర్వే నంబర్ అంటూ అధికారికంగా సర్వే కూడా చేపించడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఏకంగా హౌసింగ్‌బోర్డు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించడం, ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలం అంటూ భూమిని కబ్జాలోకి తీసుకునేందుకు ఇనుప రేకులతో కూడిన షెడ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు చూసీచూడనట్లుగా వదిలేయడంలో అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కబ్జాకు గురవుతున్న స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అధికారులు, తదితరులు (ఫైల్‌ఫొటో) ►కాముని చెరువు ప్రాంతంలోను హౌసింగ్‌బోర్డుకు చెందిన విలువైన భూములు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి చెరువును ఆనుకొని అనేక సర్వేనంబర్లలో హౌసింగ్‌బోర్డుకు చెందిన భూములును ఉన్నాయి. వాటన్నింటిపై అధికారుల నిఘా లేకపోవడంతో స్థానికులు విలువైన భూముల్లో పాగా వేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఎలాంటి పత్రాలు లేకుండా విలువైన హౌసింగ్‌బోర్డు భూముల్లో పాగా వేస్తున్నవారి పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉండటం గమనార్హం. ►కూకట్పల్లి ప్రాంతంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా అధికారులు మాత్రం పరిరక్షించడంలో విఫలం అవుతున్నారు. ఎక్కడ చూసినా కనీసం చదరపు గజం ధర లక్షల రూపాయలకు తక్కువ లేకపోవడంతో స్థానికంగా కొందరు హౌసింగ్‌బోర్డు భూములపై కన్నేసి కబ్జా చేసేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల హౌసింగ్‌బోర్డుకు చెందిన విలువైన భూములు కబ్జాకు గురికాగా మరికొందరు సైతం ప్రార్థన స్థలాల ముసుగులో ఖాళీస్థలాలను కబ్జాచేసేందుకు యత్నిస్తుండటం ఇక్కడికి పరిస్థితికి అద్దం పడుతోంది. ఉన్నతాధికారుల దృష్టికి.. హౌసింగ్‌బోర్డుకు చెందిన భూములు తమవేనంటూ కొందరు చాలా కాలంగా కోర్టుల్లో కేసులు వేశారు. ఇటీవల కాలంలో కబ్జాకు యత్నించారు. అట్టివారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. వెంటనే ఆక్రమణలు తొలగించి భూములను పరిరక్షణకు చర్యలు చేపట్టాం. ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చాం. వారి ఆదేశానుసారంగా తదుపరి చర్యలు ఉంటాయి. –కిరణ్‌బాబు, హౌసింగ్‌బోర్డు వెస్ట్రన్ డివిజన్ ఈఈ -
Hyderabad: నిప్పంటించుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, జగద్గిరిగుట్ట: ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ «ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన శిరీష (22) గుంటూరులో బీటెక్ పూర్తి చేసింది. ఇటీవల కూకట్పల్లి జేఎన్టీయూలో జావా లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఆల్వీన్ కాలనీలోని తన బంధువుల (పెద్దమ్మ కూతురు) ఇంట్లో ఉంటోంది. నాలుగు అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో శిరీష బంధువులు ఉంటుండగా మిగతా ఫ్లోర్లు అద్దెకు ఇచ్చారు. పెంట్‌హౌజ్ ఖాళీగా ఉంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష తను తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌తో నేరుగా భవనం టాప్ ఫ్లోర్‌కు వెళ్లింది. అక్కడ బాటిల్లోని పెట్రోల్‌ను పోసుకుని నిప్పంటించుకుంది. మంటల వేడిమి భరించలేక అరవడంతో యువతి బంధువులు, స్థానికులు టెర్రస్‌పైకి వెళ్లి మంటలు ఆరి్పవేశారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.. శిరీష మృతికి కారణాలు తెలియరాలేదు. తల్లిదండ్రుల ఆర్థికక పరిస్థితి బాగానే ఉందని, కుటుంబ సభ్యులు, బంధువులతో ఎంతో ఆప్యాయంగా ఉంటుందని తెలిసింది. దీంతో జగద్గిరిగుట్ట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువు కనిపించడం లేదంటూ కేటీఆర్‌కు ట్వీట్.. తీరా చూస్తే
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీలోని లోధా అపార్టుమెంట్ వద్ద ఆరు నెలల క్రితం వరకు కనిపించిన చెరువు ప్రస్తుతం కనిపించడం లేదంటూ ఫ్యూచర్ ఫౌండేషన్స్ సొసైటీ ప్రతినిధులు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో చేసిన ఫిర్యాదు కలకలం రేపింది. ఇందుకు స్పందించిన మంత్రి కేటీఆర్ చెరువు కనిపించకపోవడం నిజమే కాబట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. If this👇is true, I assure you that stringent action will be taken on those who are responsible @CollectorRRD and @zckukatpally please inspect and submit a report to the Govt at the earliest@KTRoffice please follow up https://t.co/2LPyfdBgun — KTR (@KTRTRS) December 4, 2022 వెంటనే సంబంధిత చెరువును సందర్శించి త్వరగా ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని జిల్లా కలెక్టర్, కూకట్పల్లి జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ ఆదేశాలతో ఉరుకులు, పరుగులు పెట్టిన మున్సిపల్ అధికారులు అసలు లోధా అపార్టుమెంట్ ప్రాంతంలో చెరువు ఎక్కడుందబ్బా అంటూ లేని చెరువు కోసం వెతుకులాడారు. ట్విట్టర్లో చెరువు కనిపించడం లేదంటూ పోస్ట్ చేసిన ఫోటోలను పరీక్షించి చూస్తే ఆర్టీఓ కార్యాలయం సమీపంలో ఉన్న సెల్లార్ గుంతలా అనిపించడంతో మూసాపేట సర్కిల్ ఉపకమిషనర్ రవికుమార్ ఇతర అధికారులు అక్కడికి వెళ్లి చూసి అవాక్కయ్యారు. sir, above said land pertains to Telangana state housing board & the water body shown in the image is not a lake. It was dug for a construction project but due to cancellation of project it was levelled to prevent accidents & water stagnation . Present situation is as below. pic.twitter.com/5dyufrurn5— zc_kukatpally (@zckukatpally) December 4, 2022 గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గృహ నిర్మాణ మండలి ఆధ్వర్యంలో బహుళ అంతస్థుల భవనం నిర్మించి విక్రయించేందుకు చేపట్టిన నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వి పూడ్చిన సెల్లార్ గుంత కావడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే దాదాపు పదేళ్ల క్రితం తవ్విన సెల్లార్ గుంతలో వర్షం కారణంగా నీళ్లు నిండిపోయి చెరువులా మారింది. సెల్లార్ గుంతలో పలుమార్లు చిన్నారులు పడి మృతి చెందారు. గత సంవత్సరం ముగ్గురు బాలికలు ఆడుకుంటూ వెళ్లి సెల్లార్ గుంతలో పడి మృతి చెందారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో మాట్లాడి సెల్లార్ గుంతను పూడ్చి వేయించారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వ పరంగా రూ.5లక్షలు, ఎమ్మెల్యే సొంతంగా రూ.3లక్షలు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఎవరో ఎక్కడో అపార్టుమెంట్లో ఉంటూ గతంలో ఇక్కడ చెరువు ఉండేదని అక్కడ పక్షులను చూసేందుకు వెళ్లే వారమని ఇప్పుడు అది కనిపించడంలేదని ట్విట్టర్లో తప్పుడు ఫిర్యాదు చేయడం అధికారులతో పాటు స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హాస్టల్లో ఉంటున్న కూతుర్ని చూసేందుకు వెళ్లి...అంతలోనే -
Hyderabad: ఇద్దరు యువతుల అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: కిరాణాషాపునకు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లోనుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. గురువారం సీఐ భాస్కర్ తెలిపిన మేరకు.. మహమ్మద్ కాజా పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని చిన్న కుమార్తె సైదియా బేగం (20) ఈ నెల 15 సాయంత్రం 4 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు,స్నేహితుల ఇళ్లల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మూసాపేట సఫ్దార్‌నగర్‌లో అన్నీ బేగం తన కుమార్తెలతో కలిసి నివాసముంటోంది. పెద్ద కుమార్తె ముస్కాన్ ఇంటివద్దే ఉంటుంది. బుధవారం తెల్లవారుజామున అన్నీ బేగం నిద్ర లేచేసరికి తన పెద్ద కుమార్తె ముష్కాన్ కనిపించలేదు. దీంతో కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
Bathukamma 2022: తగ్గేదెలే! భారీ బతుకమ్మల కోసం విదేశాల నుంచి పూలు
హైదరాబాద్: బతుకమ్మ అంటేనే పూల పండుగ. బతుకమ్మ పాటే ‘తీరొక్క పువ్వేసి చందమామో.. ’అంటూ మొదలవుతుంది. తంగేడు, గునుగు పూలతోపాటు రకరకాల పూలనూ బతుకమ్మను రూపొందించేందుకు వాడుతుంటారు. అయితే మారిన వాతావరణ పరిస్థితులు, పట్టణాల విస్తరణ, వ్యవసాయ విస్తీర్ణం పెరగడంతో కొన్నాళ్లుగా బతుకమ్మకు వినియోగించే పూలు తగ్గిపోయాయి. మరోవైపు తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి బతుకమ్మ పండుగ మరింత విస్తృతమైంది. పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి పూజించేవారు పెరిగారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో బతుకమ్మ పూల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలు కూడా దాటుతున్నారు. కొందరైతే విదేశాల నుంచీ రకరకాల పూలను తెప్పించి బతుకమ్మలను రూపొందిస్తున్నారు. కూకట్పల్లి, ఇతర ప్రాంతాల నుంచి.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లితోపాటు పలు ప్రాంతాల్లో ప్రజలు భారీ బతుకమ్మలను పేర్చి పండుగ జరుపుతుంటారు. కొందరు ఏకంగా పది, ఇరవై అడుగుల మేర బతుకమ్మలనూ రూపొందిస్తుంటారు. ఇందుకోసం వివిధ రకాల పూలను భారీగా తెప్పిస్తుంటారు. మొదట్లో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల నుంచి పూలు తీసుకువచ్చేవారు. ఆ జిల్లాల్లోనూ కొరత ఏర్పడటంతో మహారాష్ట్రలోని బీదర్, నాందేడ్ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ముందుగా పూలు తెప్పించుకుంటున్నారు. గత ఏడాది కూకట్‌పల్లిలో 15 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన లోటస్ బతుకమ్మ కోసం జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌తోపాటు సింగపూర్, స్విట్జర్లాండ్ నుంచి కూడా కొత్త రకాల పూలను తెప్పించారు. కూకట్‌పల్లిలో ప్రత్యేకంగా.. కూకట్పల్లి ప్రాంతంలో సుమారు 50 కుటుంబాలకుపైగా 10 అడుగుల కన్నా ఎత్తున బతుకమ్మలను పేర్చి పూజిస్తుంటాయి. కూకట్‌పల్లికి చెందిన గుండాల నర్సింగరావుకు ఐదుగురూ కుమారులే. ఆ కుమారులకూ తొలుత కొడుకులే పుట్టారు. ఈ క్రమంలో మొదటిసారిగా ఓ కుమారుడికి బిడ్డ పుట్టడంతో వేడుక చేసుకు న్నారు. మనవరాలిపై ప్రేమతో ఆమె వయసుకు అనుగుణంగా బతుకమ్మ ఎత్తును పెంచుకుంటూ వెళ్లారు. అలా 20 అడుగుల వరకు చేరాక ఏటా అంతపెద్ద బతుకమ్మను పేర్చడం, నిమజ్జనానికి తీసుకెళ్లడం కష్టమైంది. దీనితో ఏటా అదే ఎత్తుతో బతుకమ్మను పేర్చి పూజిస్తున్నారు. ఆయన ఐదుగురు కుమారులు అదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. భారీ బతుక మ్మలను పేర్చుతున్నారు. కూకట్‌పల్లికే చెందిన అబ్బినేని వజ్రమ్మ కుటుంబం 40 ఏళ్లుగా భారీ బతుకమ్మలను పేరుస్తోంది. తమ ఇంట్లో కష్టాలు తీర్చిన బతుకమ్మను పెద్దగా త యారు చేయాలన్న సెంటిమెంట్‌ను ఆమె వారసులు కొనసాగిస్తున్నారు. వీరితోపాటు మరికొంద రూ పెద్ద బతుకమ్మలను పేర్చుతుంటారు. పెద్ద బతుకమ్మను పేర్చి పూజిస్తాం కూకట్‌పల్లిలో అచ్చమైన పూలతో బతుకమ్మ ను పేర్చడం మా అత్త గుండాల చంద్రమ్మ నుంచి మాకు సంప్రదాయంగా వచి్చంది. అత్తగారు మా ప్రాంతంలో రెండు దశాబ్దాల పాటు అతిపెద్ద బతుకమ్మను పేర్చి ప్రత్యేక స్థానాన్ని చాటారు. ఇప్పుడు మేం తోటి కోడ ళ్లం ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ పెద్ద బతుకమ్మలను పేరుస్తున్నాం. గత సంవత్సరం ఇక్కడ పూలు లభించక ఇతర రాష్ట్రాల నుంచి పూలు తెప్పించుకున్నాం. ఈసారి కూడా పెద్ద బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నాం. – గుండాల అర్చన, కూకట్పల్లి చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ -
కేజిన్నర వెండి, బంగారంతో కూకట్‌పల్లిలో బతుకమ్మ.. వైరల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్: బంతి, చామంతి పువ్వుల్లో బతుకమ్మ పసిడి కాంతులీనడం తెలిసిందే. కానీ.. బంగారంతోనే బతుకమ్మను తయారు చేశారు కూకట్‌పల్లికి చెందిన నాయినేని శ్రీవైష్ణవి, శ్రీనైన. శుక్రవారం ఆటకోసం బంగారు బతుకమ్మను అందంగా ముస్తాబు చేసి తీసుకురావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బతుకమ్మ పండుగ సందర్భంగా వారి తాత సీహెచ్.జనార్దన్‌రావు ఆ అరుదైన బతుకమ్మను కానుకగా ఇచ్చినట్లు వారు తెలిపారు. సుమారు కేజీన్నర వెండికి బంగారాన్ని జోడించి పూల ఆకృతిలో బతుకమ్మను తయారు చేయించినట్లు వెల్లడించారు. బంగారంతో తయారు చేసిన మొట్టమొదటి బతుకమ్మ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. చదవండి: దేవీ శరన్నవరాత్రులు: అమ్మవారికి రూ.5,55,55,555తో అలంకారం -
Hyderabad: మహిళ కిడ్నాప్.. సామూహిక అత్యాచారం?
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లి ప్రాంతానికి చెందిన మహిళ(27)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళకు మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్–దిడిగి గ్రామ శివారులోని ఓ వెంచర్లో శనివారం ఓ మహిళ మద్యం మత్తులో పడి ఉండగా దారిన వెళ్లే వారు చూసి ఆమెను జహీరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకొచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను సంగారెడ్డిలోని సఖి కేంద్రానికి తరలించారు. ఈ విషయమై డీఎస్పీ రఘును వివరణ కోరగా మహిళ మద్యం మత్తులో ఉండడంతో వివరాలు వెల్లడించడం లేదన్నారు. ఇందుకు సంబంధించి కిడ్నాప్, అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. బాధితురాలు పూర్తి వివరాలు సరిగ్గా చెప్పడం లేదన్నారు. తన స్వస్థలం ఒకసారి కూకట్పల్లి అని, మరోసారి బాలానగర్ అని చెబుతోందన్నారు. జహీరాబాద్‌కు ఎలా వచ్చింది.. ఎవరితో వచ్చిందనే వివరాలను కూడా చెప్పడం లేదన్నారు. మద్యం మత్తులో ఉండడం వల్ల ఏమీ చెప్పలేకపోతుందన్నారు. విచారణలో పొంతన లేని సమాధానం ఇస్తోందన్నారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని చెబుతోందన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని, ఇందుకు సంబంధించి రిపోర్టు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం విచారణ చేపట్టామని, విచారణ అనంతరమే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇదిలా ఉంటే మహిళ పరిస్థితి బట్టి చూస్తే గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకొచ్చి సామూహిక అత్యాచారం జరిపి ఉంటారనే ప్రచారం సాగుతోంది. చదవండి: అసదుద్దీన్ ఫోన్ నంబర్ కోసం ముంబైలో ఆరా.. బాంబ్ బ్లాస్ట్ వార్నింగ్ -
కూకట్పల్లి లో బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
ఒక్కసారిగా మారిన వాతావరణం..హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం విపరీతమైన ఎండ ఉండగా.. అంతలోనే పూర్తి బిన్నంగా వాతావరణం చల్లబడింది. నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎల్బీనగర్, కూకట్పల్లి, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, మల్కాజ్గిరి, మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. Heavy Downpour In Hafeezpet ~Kondapur Road⛈️#HyderabadRains pic.twitter.com/cGDmwSrbyL — Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2022 హైదరాబాద్ లో భారీ వర్షం #HyderabadRains pic.twitter.com/K5RT6oTJm3 — Latha (@LathaReddy704) September 6, 2022 -
వాహనదారుడిపై చేయిచేసుకున్న ట్రాఫిక్ సీఐ
-
ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్, వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వాహనదారులపట్ల పలువురి ట్రాఫిక్ ఇన్‌స్పెకర్ట్‌ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా ద్విచక్ర వాహనదారుడిపై ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చేయిచేసుకున్న ఘటన కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓం ప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తిని కైత్లాపూర్ వద్ద కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు ఆపారు. వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని, వెంటనే డబ్బులు చెల్లించాలని తెలిపారు. అయితే ప్రస్తుతం తనవద్ద డబ్బులు లేవని, అత్యవసర పని మీద వెళ్తున్నానని, మరుసటి రోజు చెల్లిస్తానని కోరాడు. దీంతో ఆగ్రహించిన ట్రాఫిక్ సీఐ బోస్ కిరణ్ .. సదరు వాహనదారుడిని దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: ‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’ మరో ఘటనలో మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ ఓ వాహనదారుడిపై దురుసుగా ప్రవర్తించాడు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తిపై మియాపూర్ ఇన్స్పెక్టర్ సుమన్ చేయి చేసుకున్నాడు. ఎందుకు కొడుతున్నారని అడిగితే.. విధులకు ఆటకం కలిగిస్తున్నావంటూ మళ్లీ మళ్లీ చెంప చెళ్లుమనిపించారు. -
HYD: మందుబాబుల హల్చల్.. హోటల్లో రచ్చ రచ్చ
సాక్షి, కూకట్పల్లి: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఓ హోటల్లో తాగిన మత్తులో ఐదుగురు మందుబాబులు రెచ్చిపోయారు. హోటల్లో ఫర్నీచర్ ధ్వంసం చేసి.. కూర్చీలతో దాడులు చేసుకున్నారు. వివరాల ప్రకారం.. పాపారాయుడు నగర్‌లోని కేవీ టిఫిన్ సెంటర్ ఎదుట మందుబాబులు.. సతీష్ అనే వ్యక్తితో గొడవకు దిగారు. ఈ క్రమంలో టిఫిన్ సెంటర్లోకి ప్రవేశించి గొడవపడ్డారు. దీంతో, వారిని బయటకు వెళ్లాలని హోటల్ యజమాని, సిబ్బంది కోరగా.. వారితో కూడా మందుబాబులు గొడవకు దిగి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడికి చేసుకున్నారు. కాగా, మందుబాబుల వీరంగం.. హోటల్లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇది కూడా చదవండి: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఘోర ప్రమాదం.. -
హైదరాబాద్ కూకట్ పల్లిలో తాగుబోతుల వీరంగం
-
Kukatpally: తొలగించిన రేషన్ కార్డులకు.. తిరిగి ధృవీకరణ!
సాక్షి, హైదరాబాద్: పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డు ఉందంటే వారిలో కొండంత ధీమా కలుగుతుంది. అలాంటిది ఇటీవల రద్దయిన రేషన్ కార్డులకు కొత్తగా సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో రీ వెరిఫికేషన్ నిర్వహిస్తుండటంతో వారిలో ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో రేషన్ కార్డులు రద్దయిన వారిలో అర్హులుంటే గుర్తించేందుకు సర్వే చేపట్టారు. తొలగించిన కార్డుల్లో చిరునామా ఆధారంగా కాలనీలో అధికారులు సర్వే చేపట్టి ఆయా కుటుంబాల స్థితిగతులను పరిశీలిస్తున్నారు. ప్రజల్లో ఆశలు.. ► కోర్టు ఆదేశాల మేరకు అధికారులు రేషన్ కార్డులు రీ వెరిఫికేషన్ చేస్తూ ఉండటంతో రద్దయిన తమ రేషన్ కార్డు మళ్లీ వస్తోందని, దీంతో బియ్యం, గోధుమలు ఇతర సరుకులు తెచ్చుకోవచ్చునని అసలైన లబ్ధిదారులు ఆశ పడుతున్నారు. ► 2016 సంవత్సరంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశీలన జరిపి కార్డులు తొలగించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నేడు కోర్టు ఆదేశాలతో రద్దయిన కార్డులు మళ్లీ జారీ చేసేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులు మళ్లీ తిరుగుతున్నారు. ► నాటి ఫోన్ నంబర్ ఆధారంగా ఫోన్ చేస్తే పేర్లు కలవడం లేదు. మరి కొందరు తెలిపిన చిరునామాలో ఉండటం లేదు. రీ వెరిఫికేషన్‌లో పేర్లు ఉన్నవారిలో కొందరికి కార్డులు ఉన్నాయి. మరి కొందరు చనిపోయారు. ► బాలానగర్ కేంద్రంగా సివిల్ సప్లై కార్యాలయం పరిధిలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్ మండలాలు ఉన్నాయి. ► ఈ మూడు మండలాల్లో 35,200 కార్డులు రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కార్డుల వెరిఫికేషన్ జరుగుతోంది. సర్వే ఇలా... ► రద్దయిన రేషన్ లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి వారి కోసం డేటాను రేషన్ షాపుల నుంచి సేకరించాలి. ► జాబితాలను రేషన్ డీలర్ల వద్ద ప్రదర్శించాలి. ► రద్దయిన కార్డుదారులకు సంబంధించి వారి చిరునామాను గుర్తించాలి. లేదా ఫోన్ ద్వారా సంప్రదించాలి. రీ వెరిఫికేషన్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. ► ఎవరైనా తిరిగి రేషన్ కార్డు పొందేందుకు అర్హులని తేలితే వెంటనే వారి వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి. అంతేకాకుండా గతంలో ఎందుకు కార్డును రద్దు చేశారో ఆ కారణాలను సైతం నమోదు చేయాలి. కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా సర్వే... ► రద్దయిన రేషన్ కార్డుదారులకు మళ్లీ కార్డులను జారీ చేసేందుకు అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు రీ వెరిఫికేషన్ చేపట్టగా కొందరు అధికారులు మాత్రం ఈ సర్వేను అక్కడక్కడ మాత్రమే చేపడుతూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ► కొందరు అయితే రేషన్ డీలర్ల దగ్గర కూర్చొని ఎన్‌క్వైరీ చేసి వెళ్లి పోతున్నారే తప్ప తమ దగ్గరకు అసలు కార్డు రీ వెరిఫికేషన్ అధికారులు రాలేదని ప్రజలు వాపోతున్నారు. ► అధికారులు క్షేత్ర స్థాయిలో తిరిగి అర్హులైన పేద ప్రజలందరికీ రద్దయిన కార్డులు మళ్లీ వచ్చే విధంగా చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రతి లబ్ధిదారుకి రేషన్ కార్డు అందేలా చర్యలు మా అధికారులు కార్డుల రీ వెరిఫికేషన్‌ను ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ సర్వే ద్వారా ప్రతి ఒక్కరికీ న్యా యం జరుగుతుంది. అర్హులై న వారందరికీ కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలకు అ నుగుణంగా పనిచేస్తున్నాం. రీ వెరిఫికేషన్‌లో కార్డులు ఇచ్చి వారికి రేషన్ అందజేస్తాం. – డి.నందిని, ఏఎస్ఓ, బాలానగర్ -
కూకట్ పల్లి వివేకానంద్ నగర్ లోని ఓ ఫ్లాట్ లో దొంగతనం
-
హైదరాబాద్: కూకట్‌పల్లిలో భారీ చోరీ
-
ఫోటోలు: కూకట్‌పల్లిలో కొత్తగా ప్రారంభమైన ఫ్లైఓవర్ ఎలా ఉందో చూశారా..
-
ఇక కూకట్పల్లి ట్రాఫిక్ ఫ్రీ.. బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే తొక్కని గడప లేదు
Kaithalapur Flyover: నిత్యం రణగొణధ్వనులతో పారిశ్రామిక ప్రాంతం అట్టుడికేది. అదేస్థాయిలో అరగంటలోనే ఆరు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ రద్దీతో నిండి వాహనాల ధ్వనులతో రెండు దశాబ్ధాలుగా కూకట్పల్లి ప్రజలు పడ్డ వేదన ఇంతా అంతా కాదు. ఎన్నికల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పనిచేస్తామని గతంలో అందరూ ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చినప్పటికీ ఎవరూ ఆచరణలో పెట్టకపోవడం గమనార్హం. కానీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభివృద్ధినే ఎజెండాగా మార్చుకోవడంతో పాటు ట్రాఫిక్ ఫ్రీ కూకట్‌పల్లిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఆయన సర్వ ప్రయత్నాలు చేశారు. ఆఖరికి అధిష్టానంతో ఎదురొడ్డి పోరాడి ప్రజల సమస్యలను తీర్చేందుకు నిలబడటం విశేషం. బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే తొక్కని గడప లేదు.. ► గత ఏడేళ్లలో సుమారు 1000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టగా అంతకు మించి నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. ► ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఆయన తొక్కని గడప లేదు. అన్ని శాఖల అధికారులు, మంత్రులను కలిసి తన విన్నపాన్ని తెలిపారు. దీంతో ప్రభుత్వం బాలానగర్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్పటి నుంచి అదే పనిగా నిర్మాణం పూర్తయ్యేంత వరకు రాత్రింబవళ్లు అక్కడే ఉండి బాలానగర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ► బ్రిడ్జి నిర్మాణంతో నగరంలోని బోయిన్పల్లి, జీడిమెట్ల, బాలానగర్, ఫతేనగర్, కూకట్పల్లి, మూసాపేట, చందానగర్, మియాపూర్, బొల్లారం ప్రాంతాల్లో నివాసం ఉండే లక్షలాది మంది ప్రజలకు ఉపశమనం కలిగింది. ► అదే విధంగా ప్రతి రోజూ లక్షల సంఖ్యలో నిజాంపేట, ప్రగతినగర్ల నుంచి జేఎన్టీయూ మీదుగా విధులకు వెళ్లే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం హైటెక్ సిటీ స్పైనల్ రోడ్డులో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణంతో ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఊపిరి తీసుకున్నారు. ► ఇదిలా ఉండగా కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ చిత్తడిగా మారి గంటల పాటు ట్రాఫిక్ నిలిచి సిలికాన్ వ్యాలీ సిటీగా పేరొందిన మాదాపూర్‌కు ప్రధాన రహదారి అయిన హైటెక్ సిటీ బ్రిడ్జి వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయడం విశేషం. ► ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఆ ప్రాంతం ఎంతో అందాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా ఊరట కలిగించింది. నాలుగో బ్రిడ్జి నిర్మాణంతో బంగారు బాటలు.. ► బాలానగర్, మూసాపేట ప్రాంతాలకు కొంగుబంగారంగా నిలిచే నాలుగో బ్రిడ్జి నిర్మాణ కై త్లాపూర్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణం మంగళవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ► ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాన్ని తలపించే మూసాపేట కైత్లాపూర్ ప్రాంతంలో ఈ బ్రిడ్జి నిర్మాణంతో బంగారు బాటలు వేసినట్లైంది. ► గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలను హైటెక్ సిటీ కి నేరుగా వెళ్లే రహదారి ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలో భూములకు రెక్కలు వచ్చాయి. ► కూకట్‌పల్లిలో ట్రాఫిక్ నియంత్రణకు ఎమ్మెల్యే కృష్ణారావు అంశాల వారీగా సమస్యలను పరిశీలించి వాటిపై అధ్యయనం చేసి తన హయాంలోనే నాలుగు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడం విశేషం. ► కైత్లాపూర్ బ్రిడ్జి నిర్మాణంతో కూకట్పల్లి ట్రాఫిక్ ఫ్రీ సిటీగా రూపుదిద్దుకోనుంది. -
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్‌లో పలు చోట్ల సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వేడి, ఎండ తీవ్రత నుంచి నగర వాసులు కాస్త ఉపశమనం పొందారు. నగరంలోని కూకట్పల్లి,బాచుపల్లి,నిజాంపేట, జీడిమెట్ల, షాపూర్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాహదారులు జలమయవడంతో.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చదవండి: రాష్ట్రానికి నైరుతి.. -
బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అశ్లీల కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని మంజీరా మెజిస్టిక్‌లో నిర్వహిస్తున్న క్లబ్ మస్తీ రెస్టో బార్ అండ్ పబ్‌పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న తొమ్మిది మంది యువతులతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణ అనుమతుల ను తీసుకున్న క్లబ్ మస్తీ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా తెల్లవారుజాము వరకు పబ్‌ను నిర్వహిస్తూ యువతీ యువకులను ఆకర్షిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా బార్ అండ్ రెస్టారెంట్‌పై దాడి చేశారు. అప్పటికే హోరెత్తించే డీజే శబ్దాల నడుము యువత మద్యం సేవించి నృత్యాలు చేస్తూ కనిపించా రు. మప్టీలో ఉన్న పోలీసులు వారి ఫొటోలు, వీడియోలను తీయడంతో అనుమానం వచ్చిన పలువురు యువకులు పరుగులు తీశారు. దీంతో అందరినీ ఒకచోటకు చేర్చి వారి వివరాలను సేకరించారు. అనంతరం పబ్‌లో సేవిస్తున్న మద్యం వివరాలు, హుక్కా వివరాలు సేకరించి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు సేవించారా? అనే విషయమై ఆరా తీశారు. డ్రగ్స్ విషయంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో హుక్కా సేవించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా పబ్ మస్తీ యాజమానులైన శివప్రసాద్‌రెడ్డి, మేనేజర్ విష్ణు, నిర్వాహకుడు కృష్ణ పరారీలో ఉండగా, డ్యాన్స్‌లు చేస్తూ పట్టుబడిన తొమ్మిది మంది యువతులతో పాటు మేనేజర్ ప్రదీప్‌కుమార్, డ్యాన్సర్ ప్రవీణ్, డీజే ఆపరేటర్ ధన్‌రాజ్, సాయిసంతోష్లను అదుపులోకి తీసుకున్నారు. ప బ్లోని డీజే మిక్సర్, కంట్రోలర్, క్రాస్ ఓవర్ పరికరాలను సీజ్ చేశారు. అనంతరం వీరిని కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. కేపీహెచ్‌బీ సీఐ కిషన్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా గతంలోనూ ఇక్కడి బార్ అండ్ రెస్టారెంట్‌పై పలువురు ఫిర్యాదు చేయగా కొద్ది రోజుల పాటు పబ్ కార్యకలాపాలను నిలిపివేసిన యజమానులు తిరిగి ఇటీవల కాలంలో మళ్లీ మొదలుపెట్టినట్లు తెలిసింది. ప్రధానంగా యువతులను ఎరవేసి యువకులను పబ్‌కు రప్పిస్తున్నారన్న ఆరోపణలు పబ్ నిర్వాహకులపై ఉన్నాయి. -
కూకట్ పల్లి పబ్ లో చీకటి గుట్టు రట్టు
-
సీఎస్సార్ నిధులతో ఖైథలాపూర్‌లో ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: వ్యర్థం నుంచి అర్థం సృష్టించే చర్యల్లో మరో ముందడుగు పడనుంది. ఇప్పటికే చెత్త నుంచి విద్యుత్‌తో పాటు వాహనాల ఇంధనంగా వినియోగించే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ఉత్పత్తి చేస్తున్న హైదరాబాద్ మహానగరంలో సీఎన్జీ ఉత్పత్తికి మరో ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఇందుకు అవసరమైన నిధుల్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద బాలానగర్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) అందజేయనుంది. బయోవేస్ట్ నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత చేసిన విజ్ఞప్తికి హెచ్ఏఎల్ సానుకూలంగా స్పందించింది. ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన రూ. 3 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో, పనుల పురోగతిని బట్టి మరో కోటి రూపాయలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో అందజేసేందుకు కంపెనీ మేనేజ్మెంట్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి జీహెచ్ఎంసీకి పంపిన ముసాయిదా ఎంఓయూలో ప్లాంట్ ద్వారా ఉత్పత్తయ్యే సీఎన్జీని నగరంలో ఇంటింటి నుంచి చెత్తను సమీపంలోని చెత్త రవాణా కేంద్రాలకు రవాణా చేస్తున్న స్వచ్ఛ ఆటోలకు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించింది. సీఎన్జీ ఉత్పత్తి ప్రక్రియలో చివరకు మిగిలే ఎరువును జీచ్ఎంసీ నర్సరీల్లో వినియోగించడంతో పాటు కోరుకునే ప్రజలకు, రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలని కోరింది. బల్దియాకు తగ్గనున్న నిర్వహణ భారం కూకట్పల్లి జోన్‌లోని ఖైథలాపూర్ చెత్త రవాణా కేంద్రంలో బయోగ్యాస్ నుంచి సీఎన్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. 20 టన్నుల బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. రవాణా కేంద్రానికి వచ్చే చెత్త నుంచి వేరు చేసే 200– 300 మెట్రిక్ టన్నుల మేర బయోవేస్ట్‌ను సీఎన్జీ ఉత్పత్తికి వినియోగించనున్నారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్కమిటీ ఆమోదం లభించగానే ప్లాంట్ ఏర్పాటుకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే.. జవహర్‌నగర్‌లోని సైంటిఫిక్ ల్యాండ్‌ఫిల్ నుంచి విద్యుత్ ఉత్పత్తితోపాటు, సీఎన్జీ ఉత్పత్తి కూడా ప్రారంభించడం తెలిసిందే. సిలిండర్లలో నింపిన సీఎన్జీని వాహన ఇంధనంగా వినియోగిస్తున్నారు. (క్లిక్: పెట్రోల్, డీజిల్ ‘కట్’కట) -
Hyderabad: కూకట్‌పల్లిలో విషాదం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహం కావడంలేదని మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్లో విజయ లక్ష్మి(26) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. అయితే, తనకు పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా.. వివాహం మాత్రం కావడంలేదని జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందతూ విజయ లక్ష్మి గురువారం మృతి చెందింది. ఇది కూడా చదవండి: ప్రియుడితో భార్య రాసలీలలు.. భర్త ఏం చేశాడంటే..? -
కూకట్‌పల్లిలో... దేవాలయం శిఖర ప్రతిష్ట చేసిన చినజీయర్ స్వామి
కూకట్పల్లి: నగరంలోని కూకట్‌పల్లిలో ఉన్న 436 ఏళ్ల నాటి శ్రీ సీతా రామ చంద్రస్వామి దేవాలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమం సోమ వారం త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆలయానికి విచ్చేసిన చినజీయర్ స్వామికి స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు, ఆలయ అధికారులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. గర్భగుడిలో యంత్ర ప్రతిష్టాపన తరువాత వెండి ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. యాగశాలలో పూర్ణాహుతి, మూల విరాట్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. -
కూకట్‌పల్లిలో 5 ఎకరాలు ఆక్రమణ
సాక్షి, హైదరాబాద్: రూ.100 కోట్లకు పైగా విలువ చేసే భూమిని ఆక్రమించేశారు. రాజకీయ, అధికారుల అండదండలు మెండుగా ఉండటంతో అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్లూ జరిగిపోయాయి. రాత్రికి రాత్రే గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయినా స్థానిక మున్సిపల్ అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవటం విశేషం. ఈ మేరకు కబ్జా రాయుళ్లపై విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసింది. ఆ వివరాలివే.. ► సనత్‌నగర్‌లోని హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆస్బెస్టాస్) తన కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు గృహ వసతి కోసం కూకట్పల్లి గ్రామ పరిధిలో 45 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఇందులో 40 ఎకరాలలో ఓపెన్ ప్లాట్లకు కేటాయించగా.. 5 ఎకరాలు ఆటస్థలాలు, పార్కులు, స్కూళ్ల వంటి 12 రకాల అభివృద్ధి పనుల కోసం కేటాయించింది. హుడా అనుమతితో ఈ లే–అవుట్లో 1,035 ప్లాట్ల చేసి కార్మికుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేశారు. ► కొంతకాలం తర్వాత కొందరు కార్మికులు హైదరాబాద్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ సొసైటీ పేరుతో 45 ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకొని అభివృద్ధి పనుల కోసం కేటాయించిన ఐదెకరాల స్థలంపై కన్నేశారు. స్థానిక రాజకీయ నాయకులు, రిజిస్ట్రేషన్, మున్సిపల్ అధికారులతో కుమ్మకై.. 12 ఖాళీ స్థలాల భూమిని 100 ప్లాట్లుగా విభజించి, ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించారు. వీటి విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుంది. (క్లిక్: రీజినల్’ రెండో గెజిట్ విడుదల..) ► ఆయా అక్రమ రిజిస్ట్రేషన్ స్థలాలలో గృహాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు జరుగుతున్నా.. మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభ రెడ్డి ఆరోపించారు. (క్లిక్: మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల బ్లాకింగ్.. దందాలో పెద్దలు?) -
SR Nagar: తప్పుడు అడ్రస్‌తో ఇంట్లోకెళ్లి హంగామా
సాక్షి, అమీర్‌పేట: అకారణంగా ఇంట్లోకి చొరబడి హంగామా సృష్టించిన ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన 18 ఏళ్ల బాలుడు, 20 ఏళ్ల నవీన్ ఇద్దరూ శుక్రవారం ఎస్ఆర్నగర్లోని నర్మదా అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 202లో చొరబడ్డారు. ఎందుకు వచ్చారని ఆ ఇంట్లో వారు అడుగుతున్నా వినిపించుకోకుండా దుర్భాషలాడుతూ నానా హంగామా సృష్టించారు. అడ్డుకోబోయిన యజమాని సత్యనారాయణపై దాడి చేసి చేతిలోని సెల్‌ఫోన్ తీసుకుని ధ్వంసం చేశారు. శబ్దాలు విన్న పొరుగువారు వచ్చి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కాగా.. ఆ ఇద్దరు యువకులకు ఓ యువతి వాట్సాప్ కాల్ చేసి తిట్టింది. ఆ యువతి చిరునామా చెప్పాలని మరో యువతిని అడుగగా రూ.3 వేలు ఇస్తే చెబుతాననడంతో డబ్బులు పంపించారు. ఆ యువతి చెప్పిన తప్పుడు చిరునామాకు వచ్చి హంగామా సృష్టించినట్లు తెలిపారు. -
యువతి పట్ల అసభ్యకర ప్రవర్తన.. బస్ దిగే లోపు పోలీసుల ఎంట్రీ
సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ఓ యువతి పట్ల అసభ్యంగా వ్యవహరించిన వ్యక్తిపై కేసు నమోదైన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేసన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ నుంచి ఆర్టీసీ బస్సులో ఓ యువతి(22) ప్రయాణిస్తున్న ఈ క్రమంలో బస్సులో ఎక్కిన ఓ యువకుడు ఆమె వైపు చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో వెంటనే ఆమె 100కు ఫోన్ చేయగా మియాపూర్ పోలీసులు అప్పటికే బస్సు కూకట్పల్లి వరకు రావడంతో అక్కడ పోలీసులను అప్రమత్తం శారు. దీంతో ఆమె బస్ దిగే వరకు.. అక్కడికి చేరుకున్న పోలీసులు తనపై అసభ్యకరంగా వ్యవహరించిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తనను క్షేమంగా కాపాడినందుకు పోలీసులకు, మంత్రి కేటీఆర్‌కు సదరు యువతి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. -
బయట పోలీస్.. లోపల దొంగ.. అమెరికాలోని ఇంటి యాజమాని గుర్తించి
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: అతనో కరుడుగట్టిన దొంగ.. దాదాపు 30 కేసుల్లో నిందితుడు.. అలవాటు ప్రకారం తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చోరీకి వెళ్లాడు..అక్కడ సీసీ కెమెరాలున్నాయన్న విషయం అతనికి తెలియదు..అయితే అమెరికాలో ఉన్న ఓనర్.. తన ఇంట్లో దొంగ ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించాడు..స్పందించిన పోలీసులు వచ్చి ఇంటి బయట గడియపెట్టి.. ఆ తరువాత అరెస్టుచేశారు. అచ్చం సినీఫక్కీలా ఉన్న ఈ సంఘటన దొంగను అరెస్టు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే...కేపీహెచ్‌బీకాలనీ రోడ్ నెంబర్ రెండులోని ఎల్ఐజి 237లో బి. వెంకటరత్నం నివాసముంటున్నాడు. అతని ఇద్దరు కూతుళ్లు అమెరికాలో ఉంటున్నారు. మొదటి ఫ్లోర్ మినహా మిగతా ఇంటిని అద్దెకు ఇచ్చి ఆరు నెలల క్రితం అమెరికాకు వెళ్లాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు మూడు గంటల సమయంలో తయ్యపరాజు రామక్రిష్ణ అనే కరుడుగట్టిన దొంగ వెంకటరత్నం ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. గ్రౌండ్ ప్లోర్లో నివాసమున్న రాజశేఖర్‌రెడ్డి దొంగతనం జరుగుతోందని అనుమానం వచ్చి అమెరికాలోని ఇంటి యజమానికి సమాచారం అందించాడు. సీసీ కెమెరాల్లో ఇంట్లోకి దొంగ వచ్చిన విషయాన్ని గుర్తించిన వెంకటరత్నం కేపీహెచ్‌బీ పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. చదవండి: చెయ్యి విరిగి ఇంటి వద్ద ఉంటున్నాడు.. కోడి గుడ్డు కూర వండలేదని.. విధుల్లో ఉన్న డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యాంబాబు వచ్చి ఇంటి బయటి నుంచి గడియ పెట్టారు. ఆ తరువాత పోలీసులు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి కూడా గడియ పెట్టి ఉంది. దీంతో తలుపులు బద్దలు కొట్టి వెళ్లిన పోలీసులు దొంగ రామక్రిష్ణను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అతను దొంగిలించిన వెండి వస్తువులు, నగదును ఇంటి యజమాని సూచన మేరకు అక్కడ ఉన్నవారికి అప్పగించి దొంగను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
కూకట్‌పల్లిలో కీర్తి సురేష్ సందడి
-
కూకట్ పల్లి హోలిస్టిక్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట పరిధిలోని హోలిస్టిక్ ఆస్పత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఆస్పత్రిలో దట్టమైన పోగలు వ్యాపించాయి. వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన సిబ్బంది.. రోగులను హుటాహుటిన వేరే ఆస్పత్రులకు తరలించారు. ఫైర్ సిబ్బంది 5 ఫైరింజన్లతో మంటలను అదుపులోనికి తెస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు 20 అంబులెన్స్‌లను ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేశారు. స్థానికుల సహయంతో అధికారులు సహయక చర్యలను ముమ్మరం చేశారు. అర్ధరాత్రి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. చదవండిః ఐదేళ్ల క్రితం యూపీలో రౌడీ రాజ్యం! -
కూకట్ పల్లిలో భోగి సంబరాలు
-
Hyderabad: కూకట్పల్లి శివపార్వతి థియేటర్లో భారీ అగ్నిప్రమాదం
కూకట్పల్లి: సుమారు రెండున్నర దశాబ్దాల పాటు బిగ్ స్క్రీన్‌పై సినీ వినోదాన్ని అందించిన కూకట్పల్లి శివపార్వతి థియేటర్ అగ్నికి ఆహుతైంది. నామరూపాల్లేకుండా థియేటర్ సర్వం బుగ్గిపాలుకావడం సినీ ప్రేక్షకులను కలచివేసింది. ఆదివారం రాత్రి సెకండ్ షో ముగిసిన తరువాత రోజుమాదిరిగా థియేటర్‌ను మూసివేయగా, తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అకస్మాత్తుగా థియేటర్లో మంటలు వ్యాప్తి చెంది క్షణాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. థియేటర్ రూఫ్ సైతం మంటలకు కాలి కుప్పకూలింది. సినిమా ప్రదర్శన ముగిశాక ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఏరియాలో మొదటిది.. కేపీహెచ్‌బీకాలనీ ఎదురుగా భాగ్యనగ్కాలనీలో కూకట్పల్లి ప్రాంతంలోనే మొదటిసారిగా దాదాపు 25 ఏళ్లుగా శ్రీనివాస్‌బాబు అనే వ్యక్తి శివపార్వతి థియేటర్‌ను ప్రారంభించారు. ఆ పక్కనే అర్జున్, వెనుక విశ్వనాథ్ థియేటర్లు కూడా ఉన్నాయి. థియేటర్లు మూడు పక్కపక్కనే ఉండడంతో ఎప్పుడూ సినీ ప్రియులతో ఆ ప్రాంతం సందడిగా ఉంటుంది. ఆదివారం రాత్రి శ్యామ్‌సింగరాయ్ సినిమా సెకండ్ షో ముగియగానే ఒంటి గంట సమయంలో సిబ్బంది థియేటర్లోని అన్ని లైట్లను, డోర్లను మూసివేసి తాళాలు వేశారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో థియేటర్ లోపల మంటలు వ్యాపించాయి. మంటలు కొద్దికొద్దిగా వ్యాపిస్తూ రూఫ్ వరకు వచ్చేవరకు వాచ్మెన్ గమనించలేకపోయారు. గంట తరువాత 4.35 గంటలకు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. అంటే ఈ గంటలోనే థియేటర్‌ను పూర్తిస్థాయిలో మంటలు చుట్టుముట్టాయి. నిమిషాల వ్యవధిలోనే కూకట్పల్లి, సనత్‌నగర్, మాదాపూర్ ఫైర్స్టేషన్ల నుంచి ఫైరింజన్లు అక్కడికి చేరుకుని 5.30 గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో బిగ్ స్క్రీన్, ప్రొజెక్టర్, సీట్లు, స్క్రీన్ సౌండ్ సిస్టమ్, థియేటర్ రూఫ్ పూర్తిగా కాలిపోయాయి. దాదాపు రెండు కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమికంగా తేల్చారు. కేపీహెచ్‌బీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం
సాక్షి, హైదరాబాద్: అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. వివాహం అయిన ఏడు నెలలకే ఆ అభాగ్యురాలు భర్త కర్కశత్వానికి బలైంది. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సిఐ నర్సింగ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా హిర మండలం, గొట్ట గ్రామానికి చెందిన సంతోష్, ఉమ అలియాస్ శిరీష దంపతులు మూసాపేట గూడ్స్‌షెడ్ రోడ్డులో లచ్చయ్య నగర్లో నివాసముంటున్నారు. సంతోష్ స్థానికంగా ఇదే కాలనీలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. వీరికి ఈ ఏడాది మే 30వ తేదీన వివాహమైంది. సంతోష్, ఉమ కుటుంబ సభ్యులు సైతం మూసాపేటలో స్ధిరపడ్డారు. అయితే సంతోష్ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఉమను అనుమానిస్తూ మానసిక వేదనకు గురి చేసేవాడు. ఉమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు. ఇంటికి ఎవరినీ రానిచ్చే వాడు కాదు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఇరువురి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం కూడా వీరిద్దరు ఘర్షణ పడగా..పెద్ద మనుషులు జోక్యం చేసుకొని సర్ధిచెప్పారు. అనంతరం కొద్దిసేపటికి ఉమని గొంతు నులిమి హత్య చేసి..శవాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి పరారయ్యాడు. రెండు రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో పక్కింటి వారు ఉమ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు సంతోష్‌కు ఫోన్ చేయగా ఫోన్ ఎత్తకపోవటంతో అనుమానం వచ్చి తాళం పగలగొట్టి చూడగా ఉమ హత్యకు గురైన విషయం తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా గొంతునులిమి హత్యచేసినట్లుగా గుర్తించారు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) -
Akhanda Movie: జై బాలయ్య నినాదాలతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ..
Balakrishna Akhanda, Fans Celebrations At Bramaramba Theatre: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత వచ్చిన హ్యాట్రిక్ మూవీ కావడంతో అఖండ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు(డిసెంబర్2)న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో అర్థరాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్టు పడిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కూకట్పల్లి భ్రమరాంబ థియేటర్లో తెల్లవారుజామున బెనిఫిట్ షో వేయగా.. అర్థరాత్రి నుంచే అభిమానులు అక్కడికి చేరుకున్నారు. థియేటర్ ప్రాంగణమంతా జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు. బాలయ్య విశ్వరూపం చూపించారని, మాస్ జాతర అంటూ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. సెలబ్రేషన్స్‌తో హంగామా సృష్టిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. -
కూకట్పల్లి కానిస్టేబుల్ నిర్వాకం.. మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నం
సాక్షి, హైదరాబాద్: ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన ఓ కానిస్టేబుల్ మైనర్ బాలికపై లైంగికదాడికి యత్నించాడు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. అయ్యప్పరెడ్డిగూడ కాలనీకి చెందిన శేఖర్ కూకట్‌పల్లిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతని ఇంట్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మేస్త్రీ కుటుంబం ఆరేళ్లుగా అద్దెకు ఉంటోంది. వీళ్లకు 14 ఏళ్ల అమ్మాయి ఉంది. బుధవారం ఉదయం 7–8 గంటల ప్రాంతంలో బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడ్డాడు. తల్లిదండ్రులు తిరిగి ఇంటికి చేరుకునే సరికి అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. దీంతో స్థానికులు పోలీస్ కానిస్టేబుల్ శేఖర్‌ను చితకబాది 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. నిందితుడు శేఖర్‌పై శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పోక్సో, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం చేవెళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. బాలిక ఇంట్లో.. కోడి గుడ్లు పెడుతుందని, చూసేందుకు వెళ్లానని శేఖర్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. చదవండి: ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని.. -
కూకట్‌పల్లిలో రేవ్ పార్టీ.. సడన్‌గా పోలీసుల ఎంట్రీ, ఇద్దరు హిజ్రాలు కూడా..
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లిలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. వివరాల ప్రకారం.. వివేక్ నగర్‌లోని ఓ ఇంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారని ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటిపై పోలీసులు దాడి చేసి.. 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంట్లో పెద్ద మొత్తంలో మద్యం బాటిల్, కండోమ్ ప్యాకెట్లను అధికారులు స్వాధీన పరుచుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారణ నిమిత్తం కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఆ యువకులంతా కలిసి ప్రతి వీకెండ్లో ఈ తరహా పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారంతా కూడా హోమో సెక్స్ వల్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: దొంగ స్వామి: నీ కొడుకుకు ప్రాణగండం.. తప్పిస్తా, అందుకు నువ్వు.. -
'నూటొక్క జిల్లాల అందగాడు': విగ్గుతో అమ్మాయిలకు వలేస్తాడు.. ఆ తర్వాత..
సాక్షి, హైదరాబాద్: బట్టతలను కవర్‌చేస్తూ విగ్గు పెట్టుకుని ఏకంగా అనేక మంది అమ్మాయిలని మోసం చేశాడో యువకుడు. వివరాల్లోకెళ్తే.. కార్తీక్ వర్మ అనే యువకుడు సోషల్ మీడియాలో తానొక ఎన్ఆర్ఐ అని చెప్పుకుంటూ అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. తనకు వివాహం కాలేదంటూ సోషల్ మీడియాలో కార్తీక్ వర్మ విగ్గుతో ఉన్న ఫొటోలు పెట్టేవాడు. ఆ ఫొటోలను చూసి చాలా మంది అమ్మాయిలు అతని వల్లో పడ్డారు. వీరితో కొద్దికాలం సన్నిహితంగా ఉండేవాడు. చదవండి: (కాంట్రాక్ట్ ఉద్యోగిపై లైంగిక వేధింపులు.. భరించలేక చివరికి..) అనంతరం యువతుల ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బయపెడుతూ వారి వద్ద నుంచి డబ్బులు లాగేవాడు. అలా ఇప్పటి వరకు ఆంధ్ర, తెలంగాణల్లో ఇప్పటి వరకు దాదాపు 20 మంది అమ్మాయిలనుమోసం చేశాడు. తాజాగా కూకట్‌పల్లిలో కూడా ఓ అమ్మాయితో చనువుగా ఉంటూ ఇలానే డబ్బులు లాగేసుకున్నాడు. ఈ ఘటనపై బాధిత యువతి నుంచి ఫిర్యాదు అందుకున్న నార్త్‌జోన్ పోలీసులు కార్తీక్ వర్మను అరెస్ట్ చేశారు. అతడిపై పీడి యాక్ట్ నమోదు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Mukesh Ambani House: ‘అంటిలియా’ అడ్రస్ అడిగిన ముగ్గురి అరెస్టు!) -
కూకట్పల్లి: రెండు వ్యభిచార గృహాలపై దాడులు, ఇద్దరు అరెస్టు
సాక్షి, కూకట్పల్లి: రెండు వేర్వేరు చోట్ల వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించిన కేపీహెచ్‌బీ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాలు.. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని బాస్కెట్ బాల్ గ్రౌండ్ వద్ద ఎల్ఐజీ గృహంలో వ్యభిచారం నిర్హహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆకస్మికంగా దాడులు నిర్వహించి పల్లికల శ్రీనివాసరావును మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరు మహిళలను రెడ్‌హ్యండెడ్‌గా అనంతరం యువతిని రెస్క్యూ హోంకు తరలించగా.. శ్రీనివాసరావును రిమాండ్‌కు తరలించారు.. అదే విధంగా కేపీహెచ్‌బీ కాలనీలో రోడ్డు నెంబర్3లో ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సాయంత్రం 6..30 గంటలకు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుంగులూరి నాగ వెంకటేశ్వరరావుతో పాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరిపి వారిపై కేసు నమోదు చేసి నిందితులిద్దరిని రిమాండ్‌కు తరలించారు. -
Kukatpally: భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య
-
Kukatpally:వివాహేతర సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: వివాహం చేసుకున్న భార్యను వదిలి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను బుధవారం భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితక బాదిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్గేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా పెద్దపరిమికి చెందిన ప్రకాష్‌కు 2019లో అదే జిల్లాకు చెందిన త్రివేణితో వివాహం జరిగింది. వివాహం సమయంలో వరకట్నంగా రూ.20 లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు, 3 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రకాష్ బంజారాహిల్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంటుగా పని చేస్తున్నాడు. చదవండి: హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతు కోసిన యువకుడు ప్రకాష్ పెళ్ళైన నెలకే భార్యను దూరం పెట్టడం మొదలు పెట్టాడు. హైదరాబాదులో కాపురం పెట్టాక భార్యను అకారణంగా హింసించే వాడు. రాత్రుళ్లు ఇంటికి రాకుండా ఉండేవాడని బాధితురాలు త్రివేణి తెలిపింది. తనతో అంతరంగికంగా ఉన్న ఫొటోలను తన స్నేహితులకు చూపించేవాడని.. భర్త పెట్టే బాధలను భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినా పట్టించుకోలేదని బాధితురాలు పేర్కొంది. కాగా తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుసుకుంది. బుధవారం రాత్రి త్రివేణి తన కుటుంబ సభ్యులతో కేపీహెచ్‌బీ తులసీనగర్‌లో ప్రకాష్, మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రకాష్‌ను, మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషనుకు తరలించారు. చదవండి: విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక.. ∙ -
కూకట్పల్లి ప్రాంతానికి ఈ నెల 29న నీళ్లు బంద్..
సాక్షి, హైదరాబాద్: మంజీరా ఫేజ్– 2 పైపులైన్లకు మరమ్మతుల కారణంగా ఈ నెల 29న(శుక్రవారం) పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. కలగ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మతులు చేపడుతున్నామని.. కంది గ్రామం వద్ద పైప్‌లైన్ జంక్షన్ పనులు చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు నీటిసరఫరా నిలిచిపోనుంది. చదవండి: ఆంత్రాక్స్ వ్యాధి కలకలం: మటన్ కొంటున్నారా..? జర జాగ్రత్త! అంతరాయం ఏర్పడే ప్రాంతాలివీ డివిజన్ నం.9: హైదర్‌నగర్, రాంనరేష్‌నగర్, కేపీహెచ్‌బీ, భాగ్యనగర్, వసంత్ నగర్, ఎస్పీనగర్ తదితర ప్రాంతాలు. డివిజన్ నం.15: మియాపూర్, దీప్తి శ్రీనగర్, మాతృశ్రీనగర్, లక్ష్మీనగర్, జేపీ నగర్, చందానగర్ తదితర ప్రాంతాలు. డివిజన్ నం. 23: నిజాంపేట్, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతినగర్. డివిజన్ నం. 32: బొల్లారం తదితర ప్రాంతాలున్నాయి. చదవండి: లీటర్ పెట్రోల్ రూ.112... భారీగా చార్జీలు పెంచేసిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్! -
కూకట్పల్లి కోర్టులో సమంతకు ఊరట
Samantha Defamation Case Judgment: కూకట్పల్లి కోర్టులో సమంతకు భారీ ఊరట లభించింది. సమంత వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీళ్లేదని, యూట్యూబ్ ఛానెల్స్ వెంటనే అలాంటి కంటెంట్‌ని తొలగించాలని ఆదేశించింది. ఆమె వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్స్‌ని కూడా తొలగించాలని హితవు పలికింది. సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కూకట్పల్లి కోర్టు విచారించింది. సమంత ప్రతిష్టకు నష్టం కలిగించేలా వ్యవహరించిన రెండు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు, డాక్టర్ సీఎల్ వెంకట్ రావు ప్రసారాలు చేసిన యూట్యూబ్ లింకులను వెంటనే తొలగించాలని కూకట్ పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత కూకట్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ సమంత పిటిషన్లో పేర్కొంది. -
సమంత పిటిషన్ తీర్పును రేపటికి వాయిదా వేసిన కోర్టు
మూడు యూట్యూబ్ ఛానళ్లపై స్టార్ హీరోయిన్ సమంత వేసిన పరువునష్టం దావా కేసు విచారణ కూకట్పల్లి కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా తన పరువుకు నష్టం కలిగేవిధంగా వ్యక్తిగత విషయాలపై సదరు యూట్యూబ్ ఛానళ్లు అభ్యంతరకర వార్తలు రాశాయని గత బుధవారం సమంత పటిషన్ దాఖలు చేశారు. దీతో తన క్లయింట్ పరువుకు నష్టం కలిగించేలా, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వ్యవహరించాయని సమంత తరపు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించారు. భావప్రకటనా స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితుటుంటాయని, సమంతకు తన భర్త నాగచైతన్యతో విడాకులు మంజూరు కాకముందే సదరు యూట్యూబ్ ఛానళ్లు ఆమె వ్యక్తిగత, వృత్తిపర జీవితానికి ఇబ్బంది కలిగించాయని, తక్షణమే ఈ కేసును విచారించాలని కోరారు. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత దీంతో ఏకీభవించిన న్యాయస్థానం కేసును విచారణకు స్వీకరించి సోమవారం(అక్టోబర్ 25’వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సమంత పిటిషన్‌ను పూర్తిగా విచారించిన కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. సమంత తరపు న్యాయవాది వాదనలను పూర్తిగా విన్న న్యాయమూర్తి, తీర్పును రేపు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. కాగా సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత కూకట్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ సమంత పిటిషన్లో పేర్కొంది. చదవండి: యూట్యూబ్ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక, అలా చేస్తే చర్యలు.. -
యూట్యూబ్ ఛానల్స్‌పై సమంత కేసు.. తీర్పు వాయిదా
Samantha Defamation Petition : మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై నటి సమంత వేసిన పరువు నష్టం దావా కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. మరోసారి వాదనలు విన్న తర్వాత తీర్పు ప్రకటిస్తామని కూకట్పల్లి కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత కూకట్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ సమంత పిటిషన్లో పేర్కొంది. చదవండి: 'పరువునష్టం దావా వేసే బదులు ఆ పని చేయొచ్చు కదా'.. బెస్ట్‌ఫ్రెండ్‌తో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సమంత -
సమంత డబ్బుల కోసం కేసులు వేయలేదు : లాయర్
Samantha Defamation Petition: సోషల్‌మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత వేసిన పిటిషన్‌పై కూకట్పల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. పరువు నష్టం దావా వేసే బదులు..వారి నుంచి క్షమాపణ అడగొచ్చు కదా అని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. 'సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టేది వారే.. పరువుకు నష్టం కలిగింది అనేది వారే' కదా అని కోర్టు పేర్కొంది. తీర్పును రేపటికి వాయిదా వేసింది. చదవండి : బెస్ట్‌ఫ్రెండ్‌తో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సమంత అయితే విడాకులు తీసుకోకుండానే సమంత జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆమె తరపు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. సమంత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆమెను టార్గెట్ చేసి వార్తలు రాశారని ఈ సందర్భంగా ఆయన కోర్టుకు వివరించారు. సమంత డబ్బు కోసం కేసులు వేయలేదని, రాజ్యాంగం తన హక్కులను కాలరాస్తున్నారని, వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.చదవండి సరిగ్గా తింటున్నావా? ఆర్యన్‌ను ప్రశ్నించిన షారుక్ యూట్యూబ్‌లో ఉన్న వీడియోలను డిలీట్ చేయడమే కాకుండా, అన్కండిషనల్గా క్షమాపణ చెప్పాల్సిందిగా ఆమె తరపు లాయర్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆమెపై కానీ ఆమె కుటుంబం పై కానీ ఎటువంటి దుష్ప్రచారం చేయకుండా ఆర్డర్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన కోర్టుకు వివరించారు. చదవండి : షారుక్ కుమార్తె సుహానా ఖాన్‌కు డ్రగ్ డీలర్లతో లింకులు? ఘనంగా వైవా హర్ష వివాహం..ఫోటోలు వైరల్ -
కోర్టును ఆశ్రయించిన సమంత
Samantha Files Defamation Case On 3 Youtube Channels: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై బుధవారం కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, మరో చానల్‌తో పాటు సీఎల్ వెంకట్రావు అనే అడ్వకేట్‌పై సమంత కోర్టులో పిల్ దాఖలు చేశారు. తన వ్యక్తి గత జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటి వల్ల తన గౌరవానికి భంగం వాటిల్లుతోందని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక సమంత పిటిషన్‌పై నేడు కూకట్పల్లి కోర్టులో విచారణ జరుగనుంది. సమంత తరుపున హైకోర్టు న్యాయవాది బాలాజీ మరికాసేపట్లో కోర్టులో వాదనలు వినిపించనున్నారు. చదవండి: వీకెండ్ ఇలా అద్భుతంగా గడిచింది: సమంత కాగా ఇటీవల సమంత, నాగ చైతన్యతో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సామ్, చై నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సమంత తన విడాకుల విషయం ప్రకటించినప్పటి నుంచి ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో తన పరువు ప్రతిష్టలను నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించిన మూడు యూట్యూబ్ చానల్స్‌పై సమంత కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. చదవండి: ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి! -
వివాహేతర సంబంధం.. సమీప బంధువుని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి..
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడిని హత్య చేసి చెట్ల పొదల్లో పారవేశారు. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నర్సింగ్‌రావు కథనం మేరకు .. కూకట్పల్లి కైత్లాపూర్‌లో ఉంటున్న శ్రీకాంత్ (25), శ్రీశైలం సమీప బంధువులు. వీరు ఇరువురు పాల వ్యాపారం చేసేవారు. శ్రీకాంత్ అదృశ్యం కావటంతో అతని కుటుంబ సభ్యులు ఈ నెల 2న కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 1వ తేదిన శ్రీశైలం, శ్రీకాంత్ ఇద్దరూ కైత్లాపూర్‌లో టీ తాగిన అనంతరం నడుచుకుంటూ వైన్ షాపు సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లారు. చదవండి: బంజారాహిల్స్: పిన్ని ఇంటికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం ఆ సమయంలో శ్రీశైలం.. శ్రీకాంత్‌ని రాడ్‌తో తలపై మోదాడు. అప్పటికి శ్రీకాంత్ ప్రాణాలతో కొట్టుమిట్లాడుతుండటంతో మరోసారి దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెట్ల పొదల్లోని ఓ గుంతలో పడేవేసి వెళ్లిపోయాడు. శ్రీశైలం భార్యతో వివాహేతర సంబంధం ఉండటంతో ఎలాగైనా శ్రీకాంత్‌ని మట్టుపెట్టాలన్న ఉద్దేశంతో అతడిని చెట్లపొదల్లోకి తీసుకెళ్లి హత్య చేశాడు. అయితే శ్రీకాంత్ కనిపించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో కుటుంబసభ్యులు శ్రీశైలంపై అనుమానాలు వ్యక్తం చేశారు. చదవండి: తియ్యటి మాటలు.. అందమైన ప్రొఫైల్ ఫోటోతో కోట్లు కొట్టేసింది దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఉద్దేశంతో శ్రీకాంత్‌ను హత్య చేసినట్లు పోలీసులు విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చదవండి: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం -
కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్ మృతి
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో పోలీసు హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి, మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో నివసించే ఈశ్వరయ్య(45) ప్రస్తుతం శంషాబాద్ పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి విధులు పూర్తి చేసుకొని తన వాగన్ఆర్ కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఈశ్వరయ్య వాహనం కూకట్పల్లి ఫోరం మాల్ వంతెనపై ఎదురుగా ఉన్న టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈశ్వరయ్యకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం ఈశ్వరయ్య మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు, కారు -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు
సాక్షి, కూకట్పల్లి(హైదరాబాద్): కూకట్పల్లి సర్కిల్ పరిధిలో గురువారం ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు ఉద్యోగులు పట్టు బడ్డారు. కూకట్పల్లి సర్కిల్ పరిధిలో రెవెన్యూ డిపార్టుమెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న చాంద్ పాషా ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన నాగరాజుకు సంబంధించిన మ్యుటేషన్ చేయకుండా గత రెండు నెలలుగా జాప్యం చేస్తున్నాడు. ఇటీవల డబ్బులు డిమాండ్ చేయగా గురువారం రూ.8 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చాంద్ పాషా పనిచేసే కార్యాలయంతో పాటు ఇంటి వద్ద కూడా దాడులు నిర్వహించిన అధికారులకు రూ. లక్షల్లో నగదు దొరికినట్లు తెలిపారు. మరో కేసులో.. ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన నాగరాజు ట్రేడ్ లైసెన్స్ పేరు మార్పిడి విషయంలోనూ శానిటేషన్ విభాగానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ షణ్ముఖ్ డబ్బులు డిమాండ్ చేయగా గురువారం రూ. 2,500 తీసుకుంటూ పట్టు బడ్డాడు. గత కొద్ది రోజులుగా నాగరాజు జీహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా షణ్ముఖ్ పేరు మార్పిడి విషయంలో నాగరాజును ఇబ్బంది పెట్టి డబ్బులు డిమాండ్ చేయటంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ దాడుల్లో డీఎస్పీలు ఫయాజ్, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు రేణుక, రాజు పాల్గొన్నారు. చదవండి: Bike Accident: అత్తాపూర్‌లో రోడ్డు ప్రమాదం -
ఊరికెళ్లే విషయంలో సాఫ్ట్వేర్ యువ దంపతుల గొడవ.. ఉదయం లేచేసరికి
సాక్షి, కూకట్పల్లి: ఊరికెళ్లే విషయంలో యువ దంపతులు గొడవ పడటంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన ప్రియాంక (28),తో వరంగల్, హన్మకొండకు చెందిన అన్వేష్‌కు గతేడాది నవంబర్‌లో వివాహం జరిగింది. ఇరువురు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ కూకట్‌పల్లిలోని స్వాన్లేక్ అపార్టుమెంట్లో నివాసముంటున్నారు. శుక్రవారం ఊరికి వెళ్లే విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవ పడి రాత్రి వేర్వేరు గదుల్లో పడుకున్నారు. ఉదయం లేచి చూడగానే ప్రియాంక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నారితో అసభ్య ప్రవర్తన: వృద్ధుడిపై కేసు కూకట్పల్లి: చిన్నారిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వృద్ధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైన ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మూసాపేటలో నివాసముండే ఓ చిన్నారి ఆడుకుంటూ పక్కింట్లో ఉంటున్న గౌస్ ఇంటికి వెళ్లింది. ఒంటరిగా వచ్చిన బాలికపై గౌస్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురైన చిన్నారి విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: ‘బతికున్న రోగి చనిపోయాడని చెప్పాడు.. తీరా చూస్తే! హైదరాబాద్‌లో మళ్లీ కుమ్మేసిన వాన.. ఎక్కడ ఏమైందంటే! -
కుమ్మేసిన కుండపోత: వైరలవుతోన్న ఫోటోలు, వీడియోలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో గురువారం రాత్రి పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. కూకట్పల్లి, బాలానగర్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి నగర్, షాపూర్‌నగర్, మూసాపేట, అమీర్‌పేట, మైత్రీవనం, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, సరూర్‌నగర్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, పంజాగుట్ట మెట్రో, ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, రాజ్‌భవన్ రోడ్ లేక్‌వ్యూ గెస్ట్ హౌస్, ఖైరతాబాద్, హబ్సిగూడ, టోలిచౌకి, సికింద్రాబాద్, కోఠి, దిల్సుఖ్నగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి. రాత్రి 7.50 నుంచి 9 గంటల వరకు కుంభవృష్టి కుమ్మేసింది. వరదనీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. వాహనాల రాకపోకలు స్తంభించాయి. రాత్రి 11 గంటల వరకూ రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రోడ్డు క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. నగరంలో సుమారు వంద ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 11 గంటల వరకు జూబ్లీహిల్స్‌లో 9.8, మూసాపేటలో 9.6, చందానగర్‌లో 8.8, సరూర్‌నగర్‌లో 8.3, మోతీనగర్‌లో 7.9, మాదాపూర్‌లో 7.7, యూసఫ్‌గూడలో 7.6, బాలానగర్‌లో 7.1, చాంద్రాయణగుట్టలో 6.9, శ్రీనగర్ కాలనీలో 6.8, ఫాతిమానగర్‌లో 6.5, ఎల్బీనగర్లో 6.3, రంగారెడ్డి నగర్లో 5.9, జీడిమెట్లలో 5.8, ఆసిఫ్‌నగర్, కేపీహెచ్‌బీలలో 5.7, గాజులరామారంలో 5.4, అత్తాపూర్‌లో 4.5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదయ్యింది. రంగంలోకి జీహెచ్ఎంసీ బృందాలు జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై నిలిచి నీటిని తోడివేశాయి. డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సహాయక చర్యల కోసం 040 21111111 నంబర్‌కు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఇళ్లలోంచి బయటికి రావద్దని ప్రజలను అప్రమత్తం చేసింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Watch 😱😱 #hyderabadrain #hyderabadflood #heavyrains @HiHyderabad @HiWarangal @balaji25_t @HYDmeterologist pic.twitter.com/8JMkPvlTBd — Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) September 2, 2021 It’s not #istanbul means Old City of #Hyderabad it’s #Dallas of #Telangana #YousufGuda #KrishnaNagar #HyderabadRains pic.twitter.com/lIjQRhCxZK — Mubashir.Khurram (@infomubashir) September 2, 2021 #hyderabadrain #hyderabadflood#hyderabad #StayHomeStaySafe@HiWarangal @HiHyderabad @DonitaJose pic.twitter.com/yFNrlek4VV — Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) September 2, 2021 -
పని చేసే చేతులు.. ప్రేమించే మనసు.. స్పందించే హృదయం
సాక్షి, హైదరాబాద్: పని చేసే చేతులు.. ప్రేమించే మనసు.. స్పందించే హృదయం ఉంటే ఎంతటి కఠోర పరిస్థితులనైనా ఎదుర్కొని ముందుకు సాగవచ్చని స్వామి వివేకానందుని వచనాలను గుర్తు చేస్తున్నాయి ఆ ప్రతిమలు. కోవిడ్ మహమ్మారి కోరలు చాచిన తరుణంలో వారు చేసిన సేవలు సమాజం ఎప్పటికీ మరిచిపోదు. కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీ ఎంట్రన్స్ వద్ద ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య కార్మికురాలు, డాక్టర్, పోలీసు ప్రతిమలు చూపరుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి ఫ్రంట్‌లైన్ వారియర్స్ సేవలకు గుర్తింపుగా వీటిని ఏర్పాటు చేశారు. చదవండి: మీకు అంత సీన్ లేదు.. దమ్ముంటే పట్టుకోండి! -
కూకట్‌పల్లిలో ఉచిత ఫిజియోథెరపీ సేవలు, టైమింగ్స్ ఇవే..
మోతీనగర్: ప్రస్తుత కాలంలో కాస్త అనారోగ్యానికి గురైనా రూ. వేలల్లో మొదలుకొని లక్షల్లో ఖర్చు అవుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తే వివిధ రకాల వైద్య పరీక్షలు, స్కానింగ్‌ల పేర్లతో ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తున్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తమకు వంతు సాయంగా ఫిజియోథెరపీ అందిస్తున్నారు ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ సభ్యులు. సుమారు దశాబ్దంన్నర క్రితం కూకట్పల్లి వివేకానందనగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు హరీష్, ప్రస్తుత అధ్యక్షుడు కొలసాని రాథా మోహన్‌రావు ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్‌ను స్థాపించారు. ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్, అమెరికా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మురికి వాడల్లో నివసిస్తున్న పేద బడుగు వర్గాల వారికి ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంగా నాటి నుంచి నేటి వరకూ ఫిజియోథెరపీ చేస్తున్నారు. ♦ సంచార ఫిజియోథెరపీ కేంద్రం ద్వారా, ఫిజియోకేర్, రీహాబిలేషన్ కేంద్రం ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. అంతేకాక అనాథ, వృద్ధాశ్రమాల్లో ఉండే వారికి సైతం ఫిజియోథెరపీ చేస్తున్నారు. ♦ సహజంగానే ఎదుర్కొనే వ్యాధులలో ప్రధానంగా వెన్ను, అరికాళ్లు, పిక్కలు, మోకాళ్లు, భుజాలతో పాటు ఇతర నొప్పుల నివారణకు నిపుణులైన వైద్యులతో ఫిజియోథెరపీతో పాటు ప్రముఖ యోగా గురువుతో ఆసనాలు వేయిస్తున్నారు. ♦ రోగులు సూచించిన నొప్పిని బట్టి దాని నివారణకు వివిధ రకాల వ్యాయామాలతో పాటు పలువురు ప్రముఖ యోగా గురువులు ఆసనాలు చేయిస్తున్నారు. ♦ అంతేకాక వ్యాధి తగ్గిన తర్వాత కూడా వైద్యులు, ఫౌండేషన్ ప్రతినిధులు యోగక్షేమాలు తెలుసుకుని సలహాలు, సూచనలు చేస్తుంటారు. ♦ కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలోని మురికి వాడల్లో నివసించే వారితో పాటు నగరంలోని పలు వృద్ధాశ్రమాల్లోనూ ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ♦ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆదివారం మినహాయించి ఒక్కో ప్రాంతంలో రెండు వారాల పాటు శిబిరాలు నిర్వహిస్తున్నారు. కూకట్పల్లి సాయికృప ప్లాట్ నెంబర్ 332, శ్రీవివేకానందనగర్, డీఏవీ స్కూల్ రోడ్డులో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ♦ మూసాపేట డివిజన్ మోతీనగర్‌లోని కమ్యూనిటీ హాల్లో గత నాలుగేళ్ల నుంచి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారు. ♦ కోవిడ్ కారణంగా గత కొన్ని రోజుల నుంచి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే వైద్యులు అందుబాటు ఉంటున్నారు. అదే విధంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ఆవరణలోనూ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ♦ హ్యాండ్ గ్రిప్పర్, టెన్స్, ఐఎఫ్‌టీ, ఆల్ట్రాసౌండ్, స్విస్ బాల్, షోల్డర్ పుల్లీ, షోల్డర్ వీల్, డెలాయిడ్ మైల్ స్టోన్స్, సైక్లింగ్ వంటి సామగ్రితో వైద్యం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. చిన్నారికి ఫిజియో థెరపీ చేస్తున్న సిబ్బంది ఉచితంగా చేయడం సంతోషం.. : ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. వేలకు వేలు చెల్లించి వైద్యం చేయించుకున్న నయం కాలేదు. మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ఉచితంగా ఫిజియోథెరపీ కేంద్రం కొనసాగుతుందని నా మిత్రుల ద్వారా తెలుసుకొని వచ్చిన తర్వాత వివిధ రకాల నొప్పులు తగ్గుముఖం పట్టాయి. వైద్యం అందని ద్రాక్షగా ఉన్న ఈ రోజుల్లో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించటం సంతోషం -టి.నారాయణ చదవండి : రికార్డు కొట్టేసిన వంటలక్క, లక్కీ చాన్స్! అర్థమయ్యే రీతిలో కౌన్సెలింగ్.. చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి విసుగు చెంది మా వద్దకు వస్తుంటారు. అలాంటి వారికి ముందుగా అర్థమైన రీతిలో కౌన్సెలింగ్ ఇచ్చి వారికి ఏయే నొప్పులకు ఏ రకంగా వైద్యం చేయాలో పరిశీలిస్తాం. ఆ తర్వాత సుమారు వారం రోజుల నుంచి నెల పాటు నిత్యం క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేస్తాం. – డాక్టర్ కె. కామాక్షి, ఎంపీటీ న్యూరాలజీ ఆరోగ్యంగా ఇంటికెళ్లడమే మాకు ఆనందం.. చాలా మంది వివిధ నొప్పులతో బాధపడుతూ తమ కేంద్రానికి వస్తుంటారు. వయస్సు పై బడిన వారు నొప్పులతో బాధపడుతూ రావటం చూసి మాకే ఒక్కోసారి బాధ కలుగుతోంది. వారి సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి వైద్యం ప్రారంభిస్తాం. వారు వ్యాధి తగ్గిన తర్వాత సంతోషంగా వెళ్లటమే మాకు ఆనందం. మాకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అమోఘం. – డాక్టర్ బి. కృష్ణకుమారి, ఎంపీటీ స్పోర్ట్స్ -
కేఎఫ్‌సీ చికెన్ తింటున్నారా.. అయితే జాగ్రత్త!
కేఎఫ్‌సీ చికెన్ తెలియని వారు ఎవరూ ఉండరు. చిన్న నుంచి పెద్దవారి వరకు లొట్టలేసుకుంటూ తినేవారు చాలామంది ఉంటారు. లాక్డౌన్ అనంతరం కేఎఫ్‌సీ సెంటర్లు తిరిగి తెరుచుకోవడంతో భోజన ప్రియులు మళ్లీ క్యూ కడుతున్నారు. అయితే తాజాగా ఓ కస్టమర్‌కు కేఎఫ్‌సీ నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఇది ఎక్కడో వేరే రాష్ట్రంలో అనుకుంటే పొరబడ్డట్లే. హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకున్న ఆ వివరాలు ఇలా ఉన్నాయి. చికెన్ తినేందుకు సాయితేజ అనే వ్యక్తి కూకట్‌పల్లిలోని కేఎఫ్‌సీ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ చికెన్ ఆర్డర్ ఇవ్వగా.. కేఎఫ్‌సీ సిబ్బంది సరిగా ఉడకని చికెన్ పీస్‌లను సర్వ్ చేశారు. అది చూసిన కస్టమర్ షాక్ అయ్యి ఇలా ఉందేంటీ అని సిబ్బందికి ఫిర్యాదు చేయగా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ విషయాన్ని అతను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు. హైదరాబాద్‌లోని జెఎన్టీయూ మెట్రో కేఎఫ్‌సీ స్టోర్ నుంచి నుంచి తీసుకున్న చికెన్‌లో నాణ్యత లేదని.. పీస్ అస్సలు ఉడకలేదంటూ సాయి తేజ వాపోయాడు. ఇలాంటి ఆహారాన్ని తింటే కస్టమర్లకు కడుపు నొప్పి సమస్యలు వస్తాయని, ఈ పరిశీలించాలంటూ కూకట్పల్లి జోనల్ కమిషనర్‌ను ట్యాగ్ చేశాడు. దీనిపై జీహెచ్ఎంసీ జోనల్ కమీషనర్ స్పందించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. @KFC_India Very Disappointed with the Quality of Food which was Taken today from JNTU Metro #kfcStore in #Hyderabad. The Piece was Not at all cooked & if you serve such kind of Food, Customers will get Stomach Problems. Req @zckukatpally Garu to Send @AMOH_KUKATPALLY for Checking pic.twitter.com/EysElyYLTc — SAITEZAA (@ActivistTeja) August 8, 2021 -
జూబ్లీహిల్స్: యువతులను ట్రాప్‌లోకి దించి..
సాక్షి, బంజారాహిల్స్: తాను దైవదూతనని నమ్మిస్తూ కష్టాల్లో ఉన్న యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకొని లక్షలాది రూపాయలు దండుకుంటూ మోసాలకు పాల్పడుతున్న నిందితురాలిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... కూకట్పల్లి వెంకటరమణ కాలనీ, గోకుల్‌ప్లాట్స్‌లో నివసించే సంజన(50) కొంత కాలంగా అమాయక యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకుంటూ వారిని కష్టాల నుంచి దూరం చేసేందుకు తాను దేవుడితో మాట్లాడతానని, ప్రార్థనలు చేస్తానని చెప్పేది. ఇటీవల ఓ పెళ్లి సంబంధం వచ్చి తప్పిపోయిన సందర్భంగా జూబ్లీహిల్స్‌కు చెందిన యువతి ఆమె ట్రాప్‌లో పడింది. ఈ జీవితాన్ని గాడిలో పెడతానంటూ పలు దఫాలుగా ఆమె దగ్గరి నుంచి రూ.70 లక్షల దాకా వసూలు చేసింది. ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలి తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సంజన గుట్టురట్టైంది. అమాయకులను బుట్టలో వేసుకుంటూ తన అకౌంట్లోకి డబ్బులు రాబట్టుకుందని తేలింది. దీంతో నిందితురాలిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 406, 420, 508 కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాజాగా నిందితురాలిపై ఓ బాధితురాలు హుమాయన్‌నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయగా అక్కడ మరో కేసు నమోదైంది. -
ఫ్లై ఓవర్ల కింద స్మార్ట్ పార్కింగ్.. ప్రస్తుతానికి వీరికే అవకాశం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో పార్కింగ్ అవస్థల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా వివిధ పేర్లతో ఆయా ప్రాంతాల్లో కొత్త పార్కింగ్ సిస్టమ్స్ అందుబాటులోకి తెస్తామని నేతలు ప్రకటిస్తున్నా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఓవైపు ప్రజలకు సదుపాయంతో పాటు మరోవైపు ఉన్న స్థలాన్నే సద్వినియోగం చేసుకొని జీహెచ్ఎంసీకి ఆదాయం కూడా సమకూరేలా స్మార్ట్‌పార్కింగ్ త్వరలో అందుబాటులోకి రానుంది. గ్లోబల్‌సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్‌తో గందరగోళం ఉండదు. వేచి ఉండాల్సిన పరిస్థితులుండవు. వృద్ధులు, మహిళలు, వికలాంగులకు సౌకర్య వంతంగా ఉంటుంది. వీరి కోసం కొన్ని స్లాట్స్ రిజర్వుగా ఉంటాయి. యాప్‌లోనే ముందస్తుగా స్లాట్ బుకింగ్ అవకాశం ఉండటంతో దూరం నుంచి వచ్చేవారికి సదుపాయం. ఆన్లైన్ పేమెంట్ విధానంతో ‘చిల్లర’ గొడవలుండవు. జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్‌లోని సుజనా ఫోరం మాల్ ఎదుట ఫ్లైఓవర్ కింద వాహనాలు పార్కింగ్ చేస్తుండటాన్ని గుర్తించిన అధికారులు.. ఆ స్థలంలోనే స్మార్ట్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే స్మార్ట్ పార్కింగ్. పీపీపీ విధానంలో పనులు పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభోత్సవం జరగనుంది. ప్రత్యేకతలివీ.. పార్కింగ్ ప్రదేశంలోనే అయినా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా పార్కింగ్ చేయడం కుదరదు. పార్కింగ్ ప్రదేశానికి గేట్‌వేతో పాటు బొల్లార్డ్స్, సెన్సార్లు ఉండటంతో నిరీ్ణత ప్రదేశంలోనే పార్కింగ్ చేస్తారు. వాహనం వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు స్కానింగ్ జరుగుతుంది. వాహనం పోతుందనే.. దొంగల భయం ఉండదు. వాహనాల రాకపోకలకు సంబంధించిన వివరాలు ఏడాది వరకు క్లౌడ్ స్టోరేజిలో ఉంటాయి. జీహెచ్ఎంసీకి ఆదాయం లభిస్తుంది. సిస్టమేటిక్ పార్కింగ్తో రద్దీ సమయాల్లో రోడ్లపై ట్రాఫిక్‌జామ్ తగ్గుతుంది. గ్రీన్ ఎనర్జీ వినియోగంతో çపర్యావరణ పరంగా మేలు. పైలట్ ప్రాజెక్టుగా దీని అనుభవంతో మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో పాటు అన్నింటినీ అనుసంధానం చేసే వ్యవస్థ ఏర్పాటుకు ఆలోచనలున్నాయి. -
KPHB Colony: యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి..
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: యువతులను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించుతున్న ముఠాలోని ఇద్దరిని కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్‌బీ కాలనీ ధర్మారెడ్డి కాలనీఫేజ్ –1లోని ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ టీంతో కలిసి కేపీహెచ్‌బీ పోలీసులు దాడులు నిర్వహించారు. గాజుల రామారం ప్రాంతానికి చెందిన ఆనంద్ (22), కేపీహెచ్‌బీకాలనీ ధర్మారెడ్డి కాలనీకి చెందిన మేకల కృపాకర్(29)లను అరెస్టు చేశారు. బాధితురాలిని రీహాబిలేషన్ సెంటర్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరికి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. చదవండి: నేరేడ్మెట్: చదువు కోసం వచ్చి.. వ్యభిచారం -
PUBG గేమ్ కి బానిసై బాలుడు ఆత్మహత్య
-
కూకట్పల్లి: ఆట మధ్యలో ఫోన్ లాక్కున్నారని బాలుడు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఫోన్లో ఓ ఆన్లైన్ గేమ్‌కు బానిసై 12 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ క్లాసుల కోసం బాలుడికి తల్లిదండ్రులు ఫోన్ కొనిచ్చారు. అయితే, క్లాసులు వినకుండా ఫోన్లో గేమ్‌లు ఆడేందుకు బాలుడు బానిసయ్యాడు. దీంతో అతను మరోసారి ఫోన్లో గేమ్ ఆడుతుండగా, ఆట మధ్యలో తల్లిదండ్రులు ఫోన్ లాక్కున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలుడు శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు నన్ను చంపుతున్నారు.. రక్షించండంటూ ఆర్తనాదాలు -
కూకట్ పల్లి లో నకిలీ నోట్ల కలకలం
-
Hyderabad: సాబ్.. ఛోడ్‌దో సాబ్..
ఆదివారం ఉదయం 11.30.. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని గోవింద్ హోటల్ చౌరస్తా.. పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ యువకుడిని ఆపారు. అడిగినదానికి తడబడుతున్నాడు.. అనవసరంగా రోడ్డు మీదకు వచ్చాడని గ్రహించిన పోలీసులు.. వాహనాన్ని సీజ్ చేశారు. దీంతో ఆ యువకుడు భయపడి.. వాళ్లమ్మకు ఫోన్ చేశాడు.. వెంటనే పరుగులు పెడుతూ వచ్చిన వాళ్లమ్మ.. ‘సాబ్ ఛోడ్‌దో’ అంటూ ప్రాధేయపడింది. అప్పటికే బండిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పడంతో చేసేది ఏమీలేక వారిలా దిగాలుగా ఇంటిబాట పట్టారు.. చదవండి: ‘లైట్’ తీస్కోలేదు.. కూకట్‌పల్లిలో ఓ బైక్ కహానీ -
‘లైట్’ తీస్కోలేదు.. కూకట్‌పల్లిలో ఓ బైక్ కహానీ
ఉదయం 11.15.. కూకట్‌పల్లిలోని గోవింద్ హోటల్ చౌరస్తా.. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు.. ఇంతలో సార్సార్ అంటూ కొందరు పోలీసులు వచ్చారు.. ఒక అతితెలివి వాహనదారుడిని ఆయన ముందు నిల్చోబెట్టారు. తను తన బైకు ముందు, వెనకాల ఎల్ఈడీ ఫోకస్ లైట్లను అమర్చాడు. ఈ లైట్ల వల్ల కెమెరాలో ఫొటో తీసినప్పుడు రిఫ్లెక్షన్ వచ్చి.. బండి నంబర్ ఫొటోలో సరిగా కనపడదు. కొన్నిసార్లు ఎదురుగా వచ్చే వాహనాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది.. దీన్ని స్వయంగా పరిశీలించిన కమిషనర్ ఆ లైట్లను తీసేయించి.. ఆ బండిని సీజ్ చేయమని ఆదేశించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పోలీసులు కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చిన వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఉల్లంఘనుల వాహనాలను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధిస్తున్నారు. Lockdown: సజ్జనార్ వస్తున్నారు.. వెంటనే ఖాళీ చేయండి -
కూకట్పల్లి వద్ద రోడ్డు ప్రమాదం
-
కూకట్ పల్లి వై జంక్షన్ లో ఘోర ప్రమాదం
-
కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని.. చివరికి జైలు పాలయ్యారు
హైదరాబాద్: ఇటీవల నగరంలో కూకట్ పల్లి ఏటీఏం సెంటర్ వద్ద కాల్పులు జరిపిన ఏ1, ఏ2 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సైబరాబాద్ సీపీ వారిని మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ‘‘ పొట్టకూటి కోసం బీహార్‌కు చెందిన ఏ1 నిందితుడు అజిత్ కుమార్, ఏ2 నిందితుడు ముఖేష్ కుమార్‌లు 2011లో నగరానికి వచ్చారు. నగరంలోని దుండిగల్ ప్రాంతంలో ప్యాకేజీ అండ్ ఇండస్ట్రీలో కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలు పని చేసిన వీళ్లిద్దరు జల్సాలకు అలవాటు పడ్డారు. తొలిసారి ఏ1 నిందితుడు అజిత్ కుమార్ దుండిగల్‌లోని ఓ ఏటీఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తూ జైలు పాలయ్యాడు. విడుదల అనంతరం నేరాల్ని తన వృత్తిగా ఎంచుకున్నాడు. అడ్డదార్లలో డబ్బులు సంపాదించి జల్సాలు చేసేవాడు. దొంగతనాలు చేస్తూ పోలీసుల కన్నుగప్పి తప్పించుకునేవాడు. చిన్నాచితకా దొంగతనాలు చేయగా వచ్చే డబ్బులు సరిపోవడం లేదని ఈ సారి ఏకంగా ఏటీఎంలలో డబ్బులు నింపే వాహనాల్ని టార్గెట్ చేశాడు. అందుకు ముఖేష్ కుమార్ సపోర్ట్ తీసుకున్నాడు. బీహార్ నుంచి ముఖేష్‌తో నాటు తుపాకి తెప్పించుకుని ఏప్రిల్ 29న కూకట్ పల్లి ఏటీఎం చోరీకి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్ 29న కూకట్ పల్లి ఏటీఎం సెంటర్ చోరీకి పాల్పడ్డారు నిందితులు. ఏటీఎం నుంచి డబ్బుల్ని దొంగిలించేందుకు ఏటీఎం సెంటర్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ అలీ బేగ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ఏటీఎం డోర్లపై థంబ్ ప్రింట్స్ ఆధారంగా పాతనేరస్తులపై కన్నేశారు. అయితే కూకట్ పల్లి ఏటీఎం దొంగతనంలో పాల్గొన్న నిందితుల చేతిగుర్తులు.. గతంలో దొంగతనాలకు పాల్పడ్డ నిందితుల చేతి గుర్తులు ఒకేలా ఉండడంతో అజిత్ కుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో నిందితులు గుండపోచంపల్లి ప్రాంతానికి చెందిన ఓ గదిలో తలదాచుకున్నారన్న సమాచారంతో దాడులు చేసిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులు కలిసి సైబరాబాద్ లిమిట్స్‌లో ఐదు నేరాలు చేశారు. వారి వద్ద నుండి రూ. 6,31,000/- నగదు, ఒక పిస్తోల్, ఒక మ్యాగజైన్, పల్సర్ బైక్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఏటీఎం సెక్యూరిటీగా పెద్ద వయస్సు ఉన్నవారు విధులు నిర్వహించడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై ఆర్బీఐతో మాట్లాడుతున్నాం. సెక్యూరిటీల వద్ద యువకులు విధులు నిర్వహిస్తే ఇలాంటి దారుణాలు జరగవు’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
కూకట్పల్లి ఏటీఎం: కాల్పులకు తెగబడ్డది ఆ ముఠానే!
సాక్షి, హైదరాబాద్: బిహార్ నుంచి వలస కూలీలుగా వచ్చారు.. ఇక్కడ దోపిడీ దొంగల అవతారం ఎత్తారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని నేరబాట పట్టారు. ఏటీఎం వద్ద కాల్పులకు తెగబడి దోపిడీకి పాల్పడింది బిహార్ ముఠానేనని పోలీసులు గుర్తించారు. కూకట్పల్లి విజయ్‌నగర్ కాలనీలోని ఏటీ ఎం కేంద్రం వద్ద దుండగులు గురువారం ఓ సెక్యూరిటీ గార్డ్‌ను చంపి రూ.5 లక్షలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఇద్దరు నిందితుల్లో ఒకరిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు గురువారం అర్ధరాత్రి పట్టుకున్నారు. మరో నిందితుడు ఆయుధం, డబ్బు తో రైలులో పారిపోయినట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. బిహార్‌కు చెందిన ఇద్దరు యువకులు జీడిమెట్ల–చందానగర్ మధ్య ప్రాంతంలో నివసిస్తూ కొద్దిరోజులు దినసరి కూలీలుగా పనిచేశారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పూనుకున్నారు. గతంలోనూ నాటు తుపాకీతో బెదిరించి.. నిందితులు కొన్నాళ్ల క్రితం తమ స్వస్థలంలో ఓ నాటు పిస్టల్ ఖరీదు చేసుకుని వచ్చారు. జీడిమెట్ల అయోధ్యనగర్ చౌరస్తాలో ఉన్న లక్ష్మీ మనీ ట్రాన్స్ఫర్ సంస్థను టార్గెట్ చేశారు. గత నెల 16న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తన దుకాణం మూసేందుకు సిద్ధమైన యజమాని రవికుమార్ రూ.1.95 లక్షలను తన బ్యాగ్‌లో పెట్టుకున్నారు. అదే సమయంలో హెల్మెట్, మాస్క్ ధరించిన ఇద్దరు దుండ గులు ఆ దుకాణంలోకి ప్రవేశించి రవికుమార్‌కు తుపాకీ గురిపెట్టి, అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. ఆయన వద్ద నగదు ఉన్న బ్యాగ్‌తోపాటు సెల్‌ఫోన్ తీసుకుని ఉడాయించారు. ఈ నేరం చేసిన తర్వాత నిందితులు కొన్ని రోజులు మిన్నకుండిపోయారు. ఏటీఎం కేంద్రాలు ధ్వంసం చేయలేమనే.. ఆపై కూకట్పల్లి ప్రాంతంలోని ఏటీఎం కేంద్రాలపై గురిపెట్టారు. వాటిని ధ్వంసం చేసి డబ్బు దోచుకోవడం సాధ్యం కాదని భావించి, డబ్బు నింపడానికి వచ్చే వాహనాన్ని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ వాహనాలు వచ్చే సమయాలు, రూట్లతోపాటు నేరం చేసిన తర్వాత పారిపోయేందుకు వీలున్న ప్రాంతాలను రెక్కీ ద్వారా విజయ్‌నగర్ కాలనీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. జీడిమెట్లలో నేరం చేయడానికి తమకు పరిచయస్తుడైన వ్యక్తి నుంచి యాక్టివా వాహనం తీసుకున్నారు. కానీ, విజయ్‌నగర్‌కాలనీలో నేరం కోసం మాత్రం బైక్ ఉండాలని భావించారు. బాలానగర్ జోన్ పరిధి నుంచి ఓ పల్సర్ వాహనాన్ని చోరీ చేసి దాని నంబర్ ప్లేట్ తీసేసి వినియోగించారు. విజయ్‌నగర్ కాలనీలో చోరీ చేసి కేపీహెచ్‌బీ వైపు పారిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. గ్లాస్డోర్పై వేలిముద్రల సహాయంతో... ఇద్దరిలో ఓ నిందితుడు వాహనాన్ని తీసుకుని లిం గంపల్లి వరకు వెళ్లాడు. అక్కడే ద్విచక్ర వాహనాన్ని వదిలేసి డబ్బు, తుపాకీతో రైలులో మహారాష్ట్రకు పారిపోయాడు. ఏటీఎం కేంద్రంలోని గ్లాస్ డోర్‌పై నిందితుల వేలిముద్రలు దొరికాయి. ఇవి దుండిగల్‌లో సేకరించిన వేలిముద్రలతో సరిపోలాయి. అలా అనుమానితులను గుర్తించి సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన పోలీసులు బాలానగర్‌లోని ఒక నిందితుడిని గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ముఠాలో మరికొందరు ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన నేరంలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని, ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన కస్టోడియన్ శ్రీనివాస్‌ను చికిత్స అనంతరం వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. ఈ కేసు దర్యాప్తును నేరుగా కమిషనర్ వీసీ సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారు. చదవండి: ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..? హైదరాబాద్: ఆడపిల్ల పుట్టిందని ఆటోలో వదిలేశారా? -
Kukatpally: పట్టపగలే దోపిడి, ఒకరు మృతి
-
హైదరాబాద్: కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం
-
కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం..చంపేసి.. దోచేశారు
సాక్షి, హైదరాబాద్/భాగ్యనగర్‌కాలనీ: అది కూకట్ పల్లిలోని విజయ్‌నగర్ కాలనీ... గురువారం మిట్ట మధ్యాహ్నం... అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఏటీ ఎం మిషన్లలో నగదు నింపే రైటర్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగులు టార్గె ట్‌గా ఈ ఫైరింగ్ జరిగింది. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీగార్డు అక్కడికక్కడే చనిపోగా.. మరో కస్టోడియన్‌కు తీవ్ర గాయాల య్యాయి. రూ.11 లక్షలు దోచుకోవడానికి ప్రయత్నించిన దుండగుల చేతికి రూ.5 లక్షలు చిక్కాయి. నిందితులు రెక్కీ చేసిన తర్వాతే ద్విచక్ర వాహనంపై వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అను మానిస్తున్నారు. రైటర్ సేఫ్‌గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. హైదరా బాద్‌లో ఆయా ఏటీఎం కేంద్రాలు ఉన్న మార్గాలను రూట్లుగా విభజించి రోజూ కస్టోడియన్లతో డబ్బు పంపిస్తుంది. ప్రతి వ్యాన్‌కు ఇద్దరు కస్టోడియన్లు, ఓ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. వీటిలో ఓ బృందం రోజూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు చెందిన ఏటీఎం మిషన్లలో నగదు నింపుతూ ఉంటుంది. ఆ సంస్థకు చెందిన వ్యాన్(ఏపీ36వై9150)లో డ్రైవర్ కృష్ణ, పటాన్‌చెరుకు చెందిన కస్టోడి యన్లు చింతల శ్రీనివాస్(33), ఎ.నవీన్ లతోపాటు సెక్యూరిటీగా విధులు నిర్వర్తి స్తున్న బోరబండ వాసి అయిన సీఆర్ పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ మీర్జా సుభాన్ అలీ బేగ్ (74) నగదుతో బయలుదేరారు. ఆ సమయంలో సదరు వ్యాన్‌లో మొత్తం రూ.2.7 కోట్లు ఉన్నాయి. బేగంపేట నుంచి బయలుదేరిన ఈ టీమ్ కూకట్‌పల్లిలోని ఏటీఎం మిషన్లలో రూ.12 లక్షలు నింపింది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో కూకట్‌పల్లిలోని విజయ్‌నగర్‌కాలనీకి చేరుకుంది. అక్కడ ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో రూ.11 లక్షలు నింపేందుకు వచ్చారు. డ్రైవర్ కృష్ణ వాహనంలోనే ఉండగా, ఇద్దరు కస్టోడియన్లు, సెక్యూరిటీ గార్డు నగదు తీసుకుని ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లారు. మిగిలిన మొత్తం వ్యాన్లోనే ఉంది. సెక్యూరిటీ గార్డు అలీబేగ్ తన తుపాకీతో బయటే వేచి ఉండగా, మిగిలిన ఇద్దరూ లోపలకు వెళ్లి నగదు నింపడానికి ఉపక్రమించారు. ఆ సమయంలో ఇద్దరు యువకులు నల్ల రంగు పల్సర్ వాహనంపై జగద్గిరిగుట్ట వైపు నుంచి దూసుకువచ్చారు. వీరి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని, వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఏటీఎం కేంద్రం వద్ద ద్విచక్ర వాహనం ఆగడంతోనే వెనుక కూర్చున్న వ్యక్తి కిందికి దిగి మీర్జాపై నాటు పిస్టల్‌తో ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. తూటా ఎడమ వైపు గుండె కింది భాగంలో కడుపులోకి దూసుకుపోవడంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలి చనిపోయారు. లోపలకు వెళ్లిన దుండగులు మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. వీటిలో ఒక తూటా శ్రీనివాస్ మోకాలులోంచి దూసుకుపోగా, మరోటి అక్కడే ఉన్న అద్దానికి తగిలింది. అదే సమయంలో అక్కడ ఉన్న రూ.5 లక్షలను చేజిక్కించుకున్న ఇరువురూ క్షణాల్లో ఉడాయించారు. వీరిని పట్టుకునేందుకు నవీన్, కృష్ణ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్థానికులు అప్రమత్తమై దుండగులపై రాళ్లు విసిరినా తప్పించుకుని కేపీహెచ్‌బీ కాలనీ వైపు పారిపోయారు. వారి తుపాకీకి సంబంధించిన మ్యాగజీన్ అక్కడే పడిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెండు తూటాలకు సంబంధించిన ఖాళీ క్యాట్రిడ్జ్‌లు, నిందితులు వదిలి వెళ్లిన హెల్మెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మూడో తూటాకు సంబంధించినది అక్కడ లభించలేదు. పక్క ప్లాన్ ప్రకారమే... క్లూస్ టీమ్, డాగ్‌స్క్వాడ్‌లు ఘటనాస్థలానికి చేరుకొని, నిందితులకు చెందినవిగా అనుమానిస్తున్న వేలిముద్రలను సేకరించాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీని పరిశీలించి అనుమానితుల ఫొటోలు సేకరించారు. ఘటనాస్థలాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. ఈ నిందితులు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నామన్నారు. ఈ వాహనం కదలికలపై రెక్కీ చేసిన తర్వాతే, గురువారం దాన్ని వెంబడిస్తూ వచ్చి దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బేగంపేట నుంచి ఘటనాస్థలి వరకు ఉన్న సీసీ కెమెరాల్లో గత 15 రోజులుగా రికార్డు అయిన ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఫోన్ లొకేషన్స్‌ను సాంకేతికంగా ఆరా తీస్తున్నారు. బీహార్ లేదా రాజస్థాన్ ముఠాలపై అనుమానం... ఇది బీహార్ లేదా రాజస్థాన్‌కు చెందిన ముఠా పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. వీరిద్దరితోపాటు ఈ ముఠాకు చెందినవారు మరికొందరు ఉండి ఉంటారని, నేరం చేసిన తర్వాత వాళ్లు పరారై ఉంటారని భావిస్తున్నారు. కేపీహెచ్‌బీ కాలనీ వైపు వెళ్లిన దుండగులు మళ్లీ కూకట్పల్లి ప్రధాన రహదారి ఎక్కలేదని అధికారులు అనుమానిస్తున్నారు. వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించినా వారి కదలికలు కనిపించపోవడం గమనార్హం. అయితే దుండగులు తమ వాహనం వదిలేసిగానీ, దుస్తులు మార్చుకుని గానీ ఉంటారనే అంశాన్నీ కొట్టి పారేయలేమని చెప్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల నుంచి సేకరించిన అనుమానితుల ఫొటోలను బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ పోలీసులకు పంపారు. రంగంలోకి దిగిన పది ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు. చదవండి: ఆల్కహాల్ తీసుకుంటే కరోనా రాదా.. నిజమెంత? వాడిని చంపేయండి.. వదలొద్దు! -
టెకీ ఘనకార్యం; పెళ్లి పేరుతో ఇంటికి రప్పించుకొని..
సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: యువతిని ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా అనుభవించి ఆ యువతి వద్ద పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మోసం చేసిన ఘటనలో ఓ వ్యక్తిని కూకట్పల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీసిఐ నర్సింగ్‌రావు తెలిపిన వివరాలు.. మూసాపేటలోని ఆంజనేయనగర్‌లో నివాసముంటున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన జాయ్ (32) విప్రో సంస్థలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీకి ఆల్వాల్‌కు చెందిన ప్రీతి (28) ఉద్యోగం కోసం వెళ్లింది. జాయ్ ఇంటర్వ్యూ అనంతరం ఆమెకు ఉద్యోగం ఇచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య చనువు పెరిగింది. ఈ క్రమంలో వారిద్దరు ప్రేమించుకున్నారు. తాను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను మూసాపేటలోని తన ఇంటికి రప్పించుకున్నాడు. అనంతరం శారీరకంగా ఇద్దరూ కలిశారు. తాను బిజినెస్ చేస్తున్నానని, నీదగ్గర డబ్బు ఉంటే ఇయ్యాలని కోరగా ఆమె అతని మాటలు నమ్మిన దాచుకున్న 10 లక్షలు అతడికి అందజేసింది. ఇంకా డబ్బు అవసరముందని చెప్పడంతో మూడు బ్యాంకుల్లో రుణం తీసుకొని సుమారు రూ. 27 లక్షలు అందజేసింది. మొత్తం రూ. 37 లక్షలు అతడికి ఇచ్చింది. అయితే రుణం తీసుకున్న దగ్గర నుంచి బ్యాంకుల్లో వాయిదాలు చెల్లించాల్సి వచ్చంది. బ్యాంకు వారు వేధించటంతో ప్రీతి.. జాయ్‌ని నిలదీయగా అప్పటికే ఫోన్ స్విచాఫ్ చేసి ఆమెను దూరం పెట్టడమే కాకుండా పరారీలో ఉన్నాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు కూకట్పల్లి పోలీసులకు మార్చి 4న ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలించగా మహారాష్ట్ర నాసిక్‌లో ఉన్నట్లు తెలుసుకున్న అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇప్పటికే తాను వివాహం చేసుకున్నానని తన భార్య ఊరు వెళ్లిన సమయంలో ప్రీతిని తన ఇంటికి పిలిపించుకున్నానని అంగీకరించాడు. తాను ఆర్థికంగా నష్టపోవటంతో ఈ మోసానికి పాల్పడ్డానని తెలిపాడు. నిందితుడిని పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. అతని బ్యాంకులో ఉన్న రూ. 32 లక్షల నగదును సీజ్ చేయించినట్లు సీఐ నర్సింగరావు తెలిపారు. చదవండి: రూ.30 లక్షలు డిమాండ్.. తీన్మార్ మల్లన్నపై కేసు ! -
మరొకరితో చనువుగా ఉంటోందని బీటెక్ విద్యార్థినిపై దారుణం
సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: మరొకరితో చనువుగా ఉంటోందని అక్కసుతో ఓ బావ మరదలిని గొంతు నులిమి చంపేసిన ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం వివరాలు.. హబీబ్‌నగర్‌కు చెందిన సోమేశ్వరరావు, నీలవేణి దంపతుల కుమార్తె మంజుల (19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరి బంధువుల కుమారుడు వరుసకు బావ అయిన భూపతి (21) ఏవీబీపురంలో నివాసముంటున్నాడు. వీరిరువురూ స్నేహంగా ఉండేవారు. ఇటీవల మంజుల మరో వ్యక్తితో చనువుగా ఉంటూ ఫోన్లో మాట్లాడుతోందని భూపతి రెండు రోజుల క్రితం గొడవకు దిగాడు. ఈ నెల 10న తన ఇంటికి మంజులను రప్పించుకొని ఆమె గొంతు నులిమి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నీటిసంప్‌లో పడేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని భావించాడు. కానీ.. కాసేపటికి భూపతి తన నిర్ణయాన్ని మార్చుకొని అదేరోజు పోలీసులకు లొంగిపోయాడు. -
కూకట్పల్లి: యువతిని ఎరగా వేస్తారు, ఆశపడ్డావో అంతే!
కేపీహెచ్‌బీకాలనీ: యువతులను ఎరగా వేసి..యువకులను ఆకర్షించి దోపిడీలకు పాల్పడుతున్న 14 మంది ముఠా సభ్యుల్లో 8 మందిని కేపీహెచ్‌బీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద 13 సెల్ ఫోన్లు, ఒక కత్తి, ఆటోను స్వా«దీనం చేసుకున్నారు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ వారసిగూడ ప్రాంతానికి చెందిన గంధం విశాల్, రామంతాపూర్‌కు చెందిన భాజిని నవీన్, రాము, ఉప్పల్ గణేశ్‌నగర్‌కు చెందిన శైలజ, చెరుకూరి స్వాతి, వికాస్, సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన గుండె నవీన్, బీరం మధు, సాయి, డబ్బా నవీన్, ఇర్ఫాన్, సయ్యద్ మరియ, జమిలి శివకుమార్, దుర్గలు ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ముఠాలోని యువతులను యువకులపైకి ఎరవేసి ఆకర్షిస్తారు. అనంతరం అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 3వ తేదిన నవీన్ అనే వ్యక్తి..తనపై పలువురు దాడికి పాల్పడి గాయపర్చారంటూ కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించాడు. తమను ఫోటోలు తీశావంటూ నిందిస్తూ తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని నవీన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇది జరిగిన మరుసటి రోజు 4వ తేదీన నిజాంపేట గ్రామానికి చెందిన కాసర్ల వేణు కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ రెస్టారెంట్ వద్దకు వచ్చాడు. అక్కడ టిఫిన్ పార్శిల్ చేయించుకొని తిరిగి వస్తుండగా అతని బైక్‌ని ఓ యువతి ఆపింది. (చదవండి: హైదరాబాద్: వ్యాక్సిన్ వేసుకున్న కాసేపటికే కోమాలోకి) ఆమె మాటలకు ఆకర్షితుడైన వేణు తన గదికి తీసుకువెళ్లేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన బైక్‌పై ఇంటికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో హెచ్ఎంటీ శాతవాహన నగర్‌లోని ఓ ఏటీఎం సెంటర్ వద్ద డబ్బులు డ్రా చేసేందుకు ఆగాడు. ఏటీఎం సెంటర్లోకి వెళ్లి బయటకు వచ్చేసరికి గుర్తు తెలియని ఒక మహిళతో పాటు మరో నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చి ఒక్కసారిగా వేణుపై దాడికి దిగారు. అతడిని తీవ్రంగా గాయపర్చి రెండు తులాల బంగారు గొలుసు, 4.5 గ్రాముల బంగారు ఉంగరాన్ని దోచుకెళ్లారు. బాదితుడు వేణు వెంటనే కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమ దృష్టికి వచి్చన రెండు కేసులకు సంబంధించి ఒకటే ముఠా చేసి ఉంటుందని అనుమానించారు. బాధితుడు వేణు నుంచి దాడికి పాల్పడిన వారి ఆనవాళ్లను సేకరించారు. అలాగే వారు వచి్చన ఆటో నెంబర్‌పై ఆరా తీయగా చివరి మూడు నెంబర్లు 258గా వేణు తెలిపాడు. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్ అండర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద వెళుతున్న ఆటోను ఆపి విచారించారు. ఆటోకు సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి అడగ్గా చూపించలేదు. దీంతో అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. వారి విచారణలో దోపిడీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. మొత్తం 14 మంది ముఠాలో విశాల్, బి.నవీన్, శైలజ, స్వాతి, నవీన్, మధు, సయ్యద్ మరియా, శివకుమార్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రాము, వికాస్, సాయి, డబ్బా నవీన్, ఇర్ఫాన్, దుర్గల కోసం గాలిస్తున్నారు. (చదవండి: జర చూస్కో! మాస్కు లేకుంటే 1000 పడుద్ది) -
నిర్లక్ష్యం: స్విమ్మింగ్ పూల్‌లో ఈత నేర్చుకుంటూ..
భాగ్యనగర్‌కాలనీ: ఈత నేర్చుకునేందుకు వచ్చిన చిన్నారిని పర్యవేక్షించాల్సిన నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం జలసమాధి అయ్యింది. ఈత నేర్చుకోవడం మొదలుపెట్టిన నాలుగు రోజులకే బాలుడిని కొలనులో వదిలేయడమేంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ రంగారెడ్డినగర్ పంచశీలకాలనీకి చెందిన నర్సింగరావు కుమారుడు బిరదార్ ఓంకార్ (12), వివేకానందనగర్‌కాలనీలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. తండ్రి నర్సింగరావు టీ స్టాల్ నడిపిస్తున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం నర్సింగరావు టీస్టాల్ వద్దకు వెళ్లగా 8.30 గంటలకు తల్లికి తాను ఈతకు వెళ్తున్నానని చెప్పిన ఓంకార్.. పాపారాయుడునగర్‌లోని రాహుల్ స్విమ్ అకాడమీకి వెళ్లాడు. మధ్యాహ్నమైనా కుమారుడు ఇంటికి రాలేదు. లతాబాయి, చిన్నారి బాబాయి వివేక్ స్విమ్మింగ్‌పూల్ వద్దకు వెళ్లగా ఒడ్డున ఓంకార్ దుస్తులు కనిపించడంతో పరిసరాల్లో వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి కోచ్‌ల సహాయంతో స్విమ్మింగ్‌పూల్‌లో వెదికారు. కొలను అడుగు భాగంలో ఉన్న ఓంకార్‌ను ఒడ్డుకు చేర్చి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిర్లక్ష్యమేనా..? ఈత కొట్టాలంటే తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఏ విధంగా ఓంకార్‌ను స్విమ్మింగ్‌పూల్‌లోకి అనుమతించారని మృతుడి బంధువులు, తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈత కోసం బాలుడు వచ్చాడని ఎలాంటి సమాచారం కూడా తల్లిదండ్రులకు అందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్విమ్మింగ్‌పూల్‌లోకి అనుమతించినప్పుడు కోచ్‌ల పర్యవేక్షణ అయినా ఉండాలి. అది కూడా లేకపోవడంతో తమ కుమారుడు మృతి చెందారని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. నిర్వాహకుడు రాహుల్‌కు పోలీసులు ఫోన్ చేసినా స్విచ్ఛాప్ చేసి ఉన్నట్లు తెలిసింది. -
మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి
సాక్షి, కూకట్పల్లి: రోజురోజుకు కూకట్‌పల్లిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా విచ్చలవిడిగా తిరగడం, సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకుండా బయటకు రావడమే కేసుల పెరుగుదలకు కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత 15 రోజులుగా కూకట్పల్లి సర్కిల్ పరిధిలో ప్రతిరోజూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 కేసుల వరకు నమోదైనట్లు తెలుస్తోంది. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కేసుల వివరాలు తెలుస్తుండగా, ప్రైవేట్‌లో చేరే వారి సంఖ్య బయటకు రావటం లేదు. ముఖ్యంగా వారాంతపు సంతలు, షాపింగ్ మాళ్లు, సినిమా హాళ్లు, శుభకార్యాల్లో ప్రజలు భారీగా హాజరవటమే కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మార్చి 13 తేదీన మూసాపేట, కూకట్పల్లి యూపీహెచ్సీ సెంటర్లో 15 కేసులు నమోదు కాగా, 14న మూసాపేటలో 6 నమోదయ్యాయి. అదే విధంగా సోమవారం 15న కూకట్పల్లి, మూసాపేటలో కలిపి 15 కేసులు నమోదయ్యాయి. జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతి రోజూ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కూకట్పల్లి ప్రాంతంలో రెండోసారి కరోనా వచ్చిన వారి సంఖ్య కూడా పదుల సంఖ్యలోనే ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు వెచ్చించి చికిత్స పొందుతున్న సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుటికైనా కోవిడ్ –19 నిబంధనలు పాటించాలని వైద్యులు, అధికారులు కోరుతున్నారు. -
సరదా కోసం చేస్తాడంటా.. ఇదేం బుద్ధిరా నాయనా
కేపీహెచ్‌బీకాలనీ: బైక్‌లు నడపాలనే సరదా చోరీలు చేసేలా తయారు చేసింది. మూడు బైక్‌లను దొంగిలించి కేపీహెచ్‌బీ పోలీసులకు చిక్కాడు. వాహనాలను స్వాదీనం చేసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఆ యువకుడిని రిమాండ్‌కు తరలించారు. డీఐ నాగిరెడ్డి తెలిపిన మేరకు.. హైటెక్ సిటీ ప్రాంతంలోని చందానాయక్ తండాలో నివాసముండే ఇత్తడి అరుణ్(19) కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆఫీస్‌బాయ్. ఇతడి తల్లిదండ్రులు స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అరుణ్‌కు బైక్‌ల మీద దూసుకువెళ్లాలనే సరదా ఉండేది. దీంతో బైక్‌లను దొంగిలించి తన సరదా తీర్చుకునేవాడు. ఈ క్రమంలోనే రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక బైక్, మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో బైక్‌ను దొంగిలించాడు. ఈ రెండు బైక్‌లు నచ్చకపోవటంతో కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మరో బైక్‌ను దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం జేఎన్టీయూ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తున్న కేపీహెచ్‌బీ పోలీసులకు నంబర్ ప్లేట్ లేని బైక్‌పై తిరుగుతూ అటువైపుగా వచ్చిన అరుణ్ కనిపించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోగా బైక్‌కు సంబంధించిన పత్రాలు అతడి వద్ద లేవు. దీంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతడి వద్ద నుంచి మూడు బైక్‌లను స్వా«దీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. చదవండి: తల్లీ-కొడుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం -
కూకట్‌పల్లిలో ‘స్మార్ట్’ పార్కింగ్, గంటకు రూ.10 మాత్రమే!
కేపీహెచ్‌బీకాలనీ: విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్న భాగ్యనగరంలో పార్కింగ్ ఓ సవాల్‌గా మారింది. ముఖ్యంగా షాపింగ్ మాళ్లు కొలువుదీరిన ప్రాంతాల్లోనైతే పార్కింగ్ కోసం పరేషాన్ కావాల్సిందే. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య సైతం ఉత్పన్నమై అటు వాహన చోదకులతో పాటు ట్రాఫిక్ పోలీసులకూ తలనొప్పిగా మారుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల కారణంగా పార్కింగ్ సమస్య గుదిబండగా మారిన దృష్ట్యా ‘స్మార్ట్’ పార్కింగ్ దిశగా జీహెచ్ఎంసీ ముందడుగు వేసింది. ఒకప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణం అంటే ట్రాఫిక్ రద్దీ, ప్రయాణ దూరాన్ని తగ్గించడం కోసం నిరి్మంచేవారు. కానీ.. నేడు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆధునిక సాంకేతికతకు అద్దం పట్టడంతో పాటు ఆధునిక హంగులకు నిలయంగా మారింది. రద్దీకి చిరునామైనా కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు ఫోరం మాల్ ఎదురుగా ఫ్లైఓవర్ కింద నగరంలోనే మొదటిసారిగా చేపట్టిన సెన్సార్ బేస్డ్ స్మార్ట్ పార్కింగ్ కేంద్రమే ఇందుకు నిదర్శనం. ► దాదాపుగా రూ. 48 లక్షలతో ఏర్పాటు చేసిన సెన్సార్ బేస్డ్ స్మార్ట్ పార్కింగ్‌లో 200 ద్విచక్ర వాహనాల పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. ► అక్కడ పార్కింగ్ చేసుకోవాలంటే ముందుగా ప్రత్యేకంగా రూపొందించి యాప్ ద్వారా పార్కింగ్ వసతి కోసం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ► నేరుగా స్మార్ట్ పార్కింగ్ కేంద్రానికి వెళ్లినా స్లాట్ ఖాళీగా ఉంటేనే అనుమతి లభిస్తోంది. ► పార్కింగ్ కేంద్రం వద్దకు వెళ్లగానే ముందుగానే యాప్‌లో పొందుబర్చిన వివరాల ఆధారంగా వాహన నెంబర్‌ను సెన్సార్ స్కానర్లు ఆటోమేటిక్‌గా స్కాన్ చేస్తాయి. ► కేటాయించిన పార్కింగ్ గడిలో వాహనాన్ని పార్క్ చేసినప్పటి నుంచి మళ్లీ వాహనం తీసుకెళ్లే సమయాన్ని ఆటోమేటిక్‌గా సెన్సార్ స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్ గణించి గంటకు రూ.10ల చొప్పున చెల్లించాలని సూచిస్తుంది. ఆ మేరకు చెల్లింపు పూర్తి కాగానే వాహనంతో బయటకు వెళ్లేందుకు గేటు ఓపెన్ అవుతుంది. ► ఇందులో మహిళలతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక స్లాట్లను సైతం ఏర్పాటు చేశారు. ► ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా త్వరలోనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి నిర్వహణ బాధ్యతల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ► స్మార్ట్ పార్కింగ్ కేంద్రానికి ఎదురుగానే ఫోరం సుజనామాల్, పక్క వీధిలో డీ–మార్ట్ వంటి షాపింగ్ కేంద్రాలు అందుబాటులో ఉండగా గంటకు రూ.10 చొప్పున స్మార్ట్ పార్కింగ్ కేంద్రాన్ని వాహనదారులు ఏ మేరకు వినియోగించుకుంటారనేది సందేహంగానే ఉంది. ► షాపింగ్ మాల్స్‌లో మొదటి అరగంట ఉచిత పార్కింగ్ అవకాశం ఉండడంతో పాటు ఏదైనా షాపింగ్ చేసినా బిల్లు చూపిస్తే మిగతా సమయానికి పార్కింగ్ ఉచితంగానే లభిస్తుంది. ► ఈ నేపథ్యంలో స్మార్ట్ పార్కింగ్ కేంద్రంలో గంటకు రూ.10కి బదులు 2, 3 గంటలకు రూ.10 చొప్పున వసూలు చేస్తే ఉపయోగం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ► మరో వైపు ప్లైఓవర్ బ్రిడ్జి పిల్లర్లపై వేయించిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. -
కూకట్‌పల్లిలో వ్యభిచారం గుట్టురట్టు.. యువతులను రప్పించి..
సాక్షి, హైదరాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ అపార్టుమెంట్‌లోని ఇంటిపై పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితో పాటు విటులను అరెస్ట్ చేసిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీలోని ఒక అపార్ట్మెంట్లోని ప్లాట్‌ను చరణ్‌రాజు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈ ప్లాట్‌కు ఇద్దరు యువతులను రప్పించి కాల్స్, వాట్సప్‌ల ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడు చరణ్‌రాజుతో పాటు విటులు లక్ష్మారెడ్డి, భూష రమేశ్‌తో పాటు ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.3 వేల నగదు, సెల్పోన్లు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మహిళా కానిస్టేబుల్‌ను అసభ్యంగా తాకుతూ.. ఉప్పల్‌లో లారీ బీభత్సం.. ఒకరు మృతి -
ఫార్మా కారిడార్‌లో.. రియల్ పెట్టుబడులు
ఐడీఏ బొల్లారం, పాశమైలారంలోని ఫార్మా కంపెనీలతో మియాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్ వంటి ప్రాంతాల అభివృద్ధి రూపురేఖలు మారిపోయాయి. జీనోమ్‌వ్యాలీ ఏర్పాటుతో షామీర్పేట, తుర్కపల్లి, మేడ్చల్, పఠాన్‌చెరు, కీసర వంటి ప్రాంతాలలో నివాస, రిటైల్ అభివృద్ధి జరిగింది. తాజాగా ముచ్చెర్లలో 19 వేల ఎకరాల్లో రానున్న ఫార్మా సిటీ.. దాని చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి ఊహించలేనిదే. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐటీ రంగం తర్వాత అత్యధిక మందికి ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తుంది ఫార్మా రంగమే. ఏ ప్రాంతంలోనైనా సరే పారిశ్రామిక అభివృద్ధి జరిగితే దాని చుట్టూ 30 కి.మీ. వరకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ శరవేగంగా జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫార్మాసిటీ.. రీజినల్ రింగ్ రోడ్‌కు సమీప దూరంలోనే ఉండటం ఈ ప్రాజెక్ట్‌కు అదనపు అంశం. ఇప్పటికే మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్లతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు ఆర్ఆర్ఆర్, ఫార్మా సిటీలు మణిహారంగా మారనున్నాయి. కలిసొచ్చిన కరోనా.. కోవిడ్–19 తర్వాతి నుంచి కొనుగోలుదారుల ఆలోచనలలో మార్పులొచ్చాయి. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం తప్పనిసరైన నేపథ్యంలో ఇరుకు ఇళ్లకు బదులుగా విశాలమైన గృహాలను ఎంచుకుంటున్నారు. ఓఆర్ఆర్, మెట్రో రైల్లతో శివారు ప్రాంతాల నుంచి ప్రధాన నగరానికి ప్రయాణం చాలా సులువైంది. దీంతో సిటీకి దూరమైన సరే ప్రశాంతమైన వాతావరణం ఉండే ప్రాజెక్ట్‌లలో కొంటున్నారు. బెంగళూరు, ముంబై, పుణే వంటి ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌కు కలిసొచ్చే ప్రధానమైన అంశం.. భూముల ధరలు తక్కువగా ఉండటమే. అందుకే స్థానిక కొనుగోలుదారులతో పాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు, ప్రవాసులు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ సీఎండీ బీ శేషగిరి రావు తెలిపారు. నౌ ఆర్ నెవర్ ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారంలో కంటే రియల్టీ పెట్టుబడులే రెట్టింపు ఆదాయాన్ని అందిస్తాయి. చేతిలోని నగదుతో ప్రతీ ఒక్కరూ స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారు. సిటీకి దూరంగా ఉన్న వంద ఎకరాల భూమిని విక్రయించేసి.. అదే డబ్బుతో అందుబాటు ధరల్లో అభివృద్ధికి ఆస్కారం ఉండే రియల్టీ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. ‘‘కరోనా టైంలో కస్టమర్లు ముందుకురారు అనుకున్నాం. కానీ, కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు పెరిగాయి. ప్రతికూల సమయంలో ధరలు తగ్గే అవకాశం ఉంటుందని, డెవలపర్లు ఆఫర్లూ అందిస్తారని పెట్టుబడులు పెట్టేందుకు కస్టమర్లే ముందుకొచ్చారని పేర్కొన్నారు. నౌ ఆర్ నెవర్ అనే భావన కస్టమర్లలో పెరిగిపోయింది. చదవండి: 3,600 ఎకరాల్లో బటర్‌ఫ్లై సిటీ 2020లో అతిపెద్ద డీల్ హైదరాబాద్‌లోనే.. -
తస్మాత్ జాగ్రత్త: స్కూటీ ఇచ్చాడు ఏ-1 గా జైలుకెళ్లాడు
మూసాపేట: తెలిసిన వారే కదా అని డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనం ఇచ్చిన, ప్రమాదాలు జరిగినప్పుడు వాహనం యజమానే నిందితుడిగా అవుతారు. ఇతరుల వాహనం నడిపే క్రమంలో లైసెన్స్ లేని వ్యక్తి ప్రమాదం బారిన పడితే వాహనం యజమాని జైలుకు వెళ్లిన ఘటన తాజా కేసుతో ఈ విషయం వెల్లడైంది. స్నేహితురాలికి తన స్కూటీ ఇస్తే రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో స్కూటీ యజమాని అయిన స్నేహితుడిని ప్రధాన నిందితుడిగా చేస్తూ, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను రెండవ నిందితుడిగా పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో దంత విద్యార్థిని ఆది రేష్మా మరణించిన విషయం విదితమే. ఈ కేసులో స్కూటీ యజమాని అజయ్‌సింగ్ (23), హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. (చదవండి: రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి) -
బౌన్స్ స్కూటీల దొంగ అరెస్ట్
మూసాపేట: పార్కింగ్ చేసిన స్కూటీలను దొంగిలించి అమ్ముతున్న దొంగను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సురేందర్‌రావు వివరాలు వెల్లడించారు. ఔసలి నరేష్ (28), శంకర్‌పల్లిలోని మైతాబ్ ఖాన్‌గూడలో నివాసముంటున్నాడు. 2018 నుంచి 2020 వరకు బౌన్స్ ద్విచక్ర వాహనాల కంపెనీలో టెక్నికల్ వింగ్‌లో పని చేసి ఆ తర్వాత మైతాబ్‌ఖాన్‌గూడలో మెకానిక్ షెడ్ నిర్వహిస్తున్నారు. కూకట్పల్లి స్టేషన్ పరిధిలో 3, కేపీహెచ్‌బీ పరిధిలో 2 వాహనాలను దొంగిలించి తన షెడ్డుకు తరలించాడు. గతంలో కంపెనీలో పనిచేసిన అనుభవం ఉండటంతో పార్కింగ్ చేసిన వాహనాల జీపీఎస్ తొలగించి సులువుగా వాహనాన్ని దొంగిలించి తన షెడ్డుకు తరలించేవాడు. మూడు వాహనాలను బౌన్స్ స్టిక్కర్ తొలగించి, రంగు మార్చి అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల దొంగిలించిన మరో వాహనానికి జీపీఎస్ తొలగించకుండా షెడ్డులో ఉంచి ఊరికెళ్లాడు. డీఐ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ఎల్లస్వామి, పరమేశ్వర్‌రెడ్డిల నేతృత్వంలో జీపీఎస్ ద్వారా మైతాబ్‌ఖాన్‌గూడకు వెళ్లి వాహనాలను స్వాధీనం చేసుకుని నరేష్‌ని రిమాండ్‌కు తరలించారు. చదవండి: జూబ్లీహిల్స్: ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం -
పైసలిస్తారా.. ఫిర్యాదు చేయాలా..?
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: అక్రమ నిర్మాణాల పేరుతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. కొందరు చట్టాలకు అతీతులమన్నట్లు పెట్రేగిపోయి భవన నిర్మాణ దారుల నుంచి రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణం కూల్చివేయకుండా ఉండాలంటే తాము చెప్పిన ధరకే అపార్టుమెంట్ ఫ్లాట్‌ను ఇవ్వాలని బలవంతంగా తమ పేరిట రాయించుకుంటున్నట్లు పోలీసు యంత్రాంగం దృష్టికి వచ్చింది. ఇటీవల ఈ ఘటనలపై జీహెచ్ఎంసీ, పోలీసులకు ఫిర్యాదులు అందడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్ పరిధిలోని మూసాపేట, కూకట్పల్లి సర్కిళ్లలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలనే లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు దిగుతున్న 20 మందిపై పోలీసు ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఎవరెవరిని బెదిరింపులకు గురి చేశారో..? ఎంత మొత్తంలో దండుకున్నారో పక్కా ఆధారాలతో ఆటకట్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో రోజూ అక్రమ నిర్మాణాలు లక్ష్యంగా చేసుకొని రాత పూర్వకంగా, సోషల్ మీడియా ద్వారా సుమారు 40 కిపైగా ఫిర్యాదులు రావడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. రెండేళ్ల క్రితం అక్రమ నిర్మాణదారులను, ప్రభుత్వ భూముల్లో వెలసిన ఇళ్ల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ మహిళను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితురాలి ఇంట్లో దొరికిన ఫిర్యాదు పత్రాలు, సెల్పోన్లో నిక్షిప్తం చేసిన బహుళ అంతస్తుల భవనాల ఫొటోలను చూసిన పోలీసులు అవాక్కయ్యారు. తాజాగా హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని బసంత్‌రాజ్ ఉదంతంలోనూ ఇలాంటి ఫిర్యాదులే తలెత్తడంతో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. చదవండి: మీర్పేట్లో వ్యభిచార గృహం సీజ్ పిల్లలకు తిండి పెట్టలేని మాకు..ఆత్మహత్యే శరణ్యం! అక్రమ నిర్మాణాలపై చర్యల విషయంలో అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. అక్రమ నిర్మాణాలు కొన్నయితే.. ఎలాంటి నిబంధనలు లేకుండానే చేపట్టే నిర్మాణాలు మరికొన్ని. అయితే వీటిలో ఎక్కువశాతం నిర్మాణాలకు నోటీసులు జారీ చేయడమే తరువాయి అన్నట్లుగా పెద్దఎత్తున ఒత్తిళ్లను తీసుకువచ్చి చర్యలు తీసుకోకుండా అడ్డుకునేవారు కొందరైతే, మరికొందరు ఫిర్యాదులు మొదలుపెట్టి తమకు తాయిలం దక్కే వరకూ బెదిరింపులకు పాల్పడేవారు మరికొందరు. టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు అవినీతికి పాల్పడటం దేవుడెరుగు, ఫిర్యాదుదారులకు ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఇప్పించాల్సిన దుస్థితికి దిగజారిపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఫిర్యాదు చేయండి చర్యలు తీసుకుంటాం.. అక్రమ నిర్మాణాల పేరుతో బిల్డర్లను బెదిరింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేసే కొంతమందిపై ఫిర్యాదులు అందాయి. పూర్తి ఆధారాలు సేకరించి చర్యలు తీసుకుంటాం. ఇంకా ఎవరైనా కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలి. వారి వివరాలను గొప్యంగా ఉంచి నిందితులపై చర్యలు తీసుకుంటాం. -సురేందర్‌రావు, ఏసీపీ -
జోమాటో బాయ్‌పై దాడి.. కారుకు అడ్డుగా వచ్చాడని
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఓ జోమాటో డెలివరీ బాయ్ మీద ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం అతను విధులు నిర్వహించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో తమ కారుకు అడ్డుగా వచ్చాడని ఇద్దరు వ్యక్తులు కోపంతో దాడి చేశారు. దాడికి గురైన బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌లో లభించిన కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
జీహెచ్ఎంసీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లో ఓ ఇల్లు నిర్మాణానికి సంబంధించి జీహెచ్ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కూకట్‌పల్లికి చెందిన శాలివాహనరెడ్డి హఫీజ్‌పేట సర్వే నంబరు 78లోని 461 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆ స్థలం ప్రభుత్వ భూమి అంటూ జీహెచ్ఎంసీ అనుమతి ఇవ్వలేదు. శాలివాహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించి, సదరు సర్వే నంబరులో అనేక భవంతులు వెలిశాయని, తనకు మాత్రం ప్రభుత్వ భూమి అంటూ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. ఈ క్రమంలో ఇల్లు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని, శాలివాహనరెడ్డికి రూ.10వేలు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ జీహెచ్ఎంసీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. జీహెచ్ఎంసీ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.(చదవండి: బాంబే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే) -
కూకట్‌పల్లిలో దుండగుల దుశ్చర్య
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలోని దుర్గామాత ఆలయంలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అమ్మవారి విగ్రహాన్ని పెకిలించివేశారు. నాగదేవత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతేగాక ఘటనాస్థలంలో కుక్కను బలి ఇచ్చిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. (చదవండి: యాదాద్రి పునర్నిర్మాణం కేసీఆర్ కలల ప్రాజెక్టు) -
కూకట్‌పల్లిలో భూప్రకంపనలు...
హైదరాబాద్: కూకట్‌పల్లిలో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. బుధవారం ఉదయం 9.25 గంటల ప్రాంతంలో కూకట్‌పల్లిలోని అస్బెస్టాస్ కాలనీలో రెండుసార్లు స్వల్పంగా భూమి కంపించినట్లు తెలిసింది. నాలుగు సెకన్ల పాటు భారీ శబ్దంతో వైబ్రెషన్స్ వచ్చాయని స్థానికులు తెలిపారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చామని కాలనీవాసులు వెల్లడించారు. ఇక భూమి కంపించడానికి గత కారణాలు తెలుసుకోవాలిసిదిగా స్థానికులు అధికారులను కోరుతున్నారు. -
కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. భారీగా మంటలు
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలోని రామాలయం రోడ్డులోని టీవీ రిపేరింగ్ సెంటర్లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టీవీ షాపులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. షార్ట్ సర్కూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. మంటలు చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించకుడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు తీసిన కోతి
సాక్షి, హైదరాబాద్ : 2020 సంవత్సరం వెళుతూ వెళుతూ ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచేసింది. తన పని తాను చేసుకుంటూ.. కుటుంబానికి ఆసరాగా ఉన్న యువకుడు.. కుటుంబ సభ్యుల ముందే కన్నుమూశాడు. కోతులను అదిలించబోయి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషాద ఘటన నగరంలోని కూకట్‌పల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి జయనగర్‌లో కోతుల బెడత ఎక్కువైంది. కోతిని కొట్టబోయి విద్యుత్ షాక్‌తో సాప్ట్వేర్ ఉద్యోగి లోకేష్ మృతిచెందాడు. సాప్ట్వేర్ ఉద్యోగి కావడంతో వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంట్లో నుంచే విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం రెండో ఫ్లోర్లో ఉన్న తన ఇంట్లోకి కోతులు రావడంతో వాటిని బెదరగొట్టేందుకు ఇనుపరాడ్‌తో కొట్టబోయాడు. దీంతో ఇనుపరాడ్ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగలడంతో షాక్‌కు గురయ్యాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి చేరుకునేలోపే లోకేష్ ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబంలో, కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కళామందిర్‌కు కన్నమేశాడు
సాక్షి, హైదరాబాద్: తాను పని చేస్తున్న షాపింగ్మాల్కే కన్నమేశాడు ఓ సెక్యూరిటీ గార్డ్. ఆ సంస్థకు రక్షణ కల్పించాల్సింది పోయి సుమారు రూ. 9 లక్షలు దొంగిలించిన ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేసన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ నర్సింగరావు వివరాల ప్రకారం.. భాగ్యనగర్‌కాలనీలోని కళామందిర్ వస్త్ర దుకాణంలో నాలుగేళ్లుగా అస్సాంకు చెందిన మోనీదాస్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థ నిర్వాహకులు అతనిపై నమ్మకంతో షాపింగ్ మాల్ తెరవడం, మూసే బాధ్యతలు అప్పగించారు. ఇదే అదనుగా చేసుకున్న మోనీదాస్ లాకర్‌కు మారుతాళం చేయించాడు. శనివారం తాళాలు వేసిన మోనీదాస్ అసలైన తాళం తీసుకొని, మారు తాళాన్ని మేనేజర్‌కు అందజేశాడు. ఆదివారం లాకర్ తీస్తుండగా ఎంతకూ రాకపోవడంతో ఆరా తీయగా నకిలీతాళం అని తేలింది. అయితే.. అదేరోజు మోనీదాస్ సైతం విధులకు హాజరు కాకపోవటంతో అనుమానం తలెత్తింది. మరో తాళం తెప్పించి లాకర్లో చూడగా రూ. 9 లక్షలు పోయినట్లు గుర్తించారు. సమీపంలోని అతని ఇంటికెళ్లి చూడగా అప్పటికే భార్యా పిల్లలతో పరారైనట్లుగా గుర్తించారు. ఈ పని మోనీదాస్దేనని భావించి పోలీసులకు సమాచారం అందజేశారు. మేనేజర్ మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటితాళం పగలగొట్టి.. ఇంటి తాళం పగలగొట్టి నగదు అపహరించిన ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. బాలాజీనగర్ సాయిరాం ఎన్‌క్లేవ్‌లో నివాసముండే సురేష్ నెలక్రితం వైజాగ్‌కు వెళ్లాడు. ఆదివారం రాత్రి ఇంటి తాళం పగలగొట్టి బంగారం గొలుసు, ఓ ఉంగరం దొంగిలించారు. సమాచారం అందుకున్న సురేష్ వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదని..