
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలోని దుర్గామాత ఆలయంలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అమ్మవారి విగ్రహాన్ని పెకిలించివేశారు. నాగదేవత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంతేగాక ఘటనాస్థలంలో కుక్కను బలి ఇచ్చిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. (చదవండి: యాదాద్రి పునర్నిర్మాణం కేసీఆర్ కలల ప్రాజెక్టు)