జీహెచ్‌ఎంసీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ | SC Dismisses GHMC Petition Over Permission To House Construction | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Published Thu, Jan 28 2021 9:17 AM | Last Updated on Thu, Jan 28 2021 11:38 AM

SC Dismisses GHMC Petition Over Permission To House Construction - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌లో ఓ ఇల్లు నిర్మాణానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కూకట్‌పల్లికి చెందిన శాలివాహనరెడ్డి హఫీజ్‌పేట సర్వే నంబరు 78లోని 461 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆ స్థలం ప్రభుత్వ భూమి అంటూ జీహెచ్‌ఎంసీ అనుమతి ఇవ్వలేదు. శాలివాహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించి, సదరు సర్వే నంబరులో అనేక భవంతులు వెలిశాయని, తనకు మాత్రం ప్రభుత్వ భూమి అంటూ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు.

ఈ క్రమంలో ఇల్లు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని, శాలివాహనరెడ్డికి రూ.10వేలు చెల్లించాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ జీహెచ్‌ఎంసీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి, జస్టిస్‌ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. జీహెచ్‌ఎంసీ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.(చదవండి: బాంబే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement