
హైదరాబాద్: కూకట్‌పల్లిలో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. బుధవారం ఉదయం 9.25 గంటల ప్రాంతంలో కూకట్‌పల్లిలోని అస్బెస్టాస్ కాలనీలో రెండుసార్లు స్వల్పంగా భూమి కంపించినట్లు తెలిసింది. నాలుగు సెకన్ల పాటు భారీ శబ్దంతో వైబ్రెషన్స్ వచ్చాయని స్థానికులు తెలిపారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చామని కాలనీవాసులు వెల్లడించారు. ఇక భూమి కంపించడానికి గత కారణాలు తెలుసుకోవాలిసిదిగా స్థానికులు అధికారులను కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment