సాక్షి, హైదరాబాద్: మంజీరా ఫేజ్– 2 పైపులైన్లకు మరమ్మతుల కారణంగా ఈ నెల 29న(శుక్రవారం) పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. కలగ్గూర్ నుంచి పటాన్‌చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్‌సీ పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మతులు చేపడుతున్నామని.. కంది గ్రామం వద్ద పైప్‌లైన్ జంక్షన్ పనులు చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు నీటిసరఫరా నిలిచిపోనుంది.
చదవండి: ఆంత్రాక్స్ వ్యాధి కలకలం: మటన్ కొంటున్నారా..? జర జాగ్రత్త!
అంతరాయం ఏర్పడే ప్రాంతాలివీ
డివిజన్ నం.9: హైదర్‌నగర్, రాంనరేష్‌నగర్, కేపీహెచ్‌బీ, భాగ్యనగర్, వసంత్ నగర్, ఎస్‌పీనగర్ తదితర ప్రాంతాలు.
డివిజన్ నం.15: మియాపూర్, దీప్తి శ్రీనగర్, మాతృశ్రీనగర్, లక్ష్మీనగర్, జేపీ నగర్, చందానగర్ తదితర ప్రాంతాలు.
డివిజన్ నం. 23: నిజాంపేట్, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతినగర్.
డివిజన్ నం. 32: బొల్లారం తదితర ప్రాంతాలున్నాయి.
చదవండి: లీటర్ పెట్రోల్ రూ.112... భారీగా చార్జీలు పెంచేసిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్!
Comments
Please login to add a commentAdd a comment