ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కూకట్‌పల్లి: ఊరికెళ్లే విషయంలో యువ దంపతులు గొడవ పడటంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన ప్రియాంక (28),తో వరంగల్, హన్మకొండకు చెందిన అన్వేష్‌కు గతేడాది నవంబర్‌లో వివాహం జరిగింది. ఇరువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటూ కూకట్‌పల్లిలోని స్వాన్‌లేక్ అపార్టుమెంట్‌లో నివాసముంటున్నారు. శుక్రవారం ఊరికి వెళ్లే విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవ పడి రాత్రి వేర్వేరు గదుల్లో పడుకున్నారు. ఉదయం లేచి చూడగానే ప్రియాంక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
చిన్నారితో అసభ్య ప్రవర్తన: వృద్ధుడిపై కేసు
కూకట్‌పల్లి: చిన్నారిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వృద్ధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మూసాపేటలో నివాసముండే ఓ చిన్నారి ఆడుకుంటూ పక్కింట్లో ఉంటున్న గౌస్ ఇంటికి వెళ్లింది. ఒంటరిగా వచ్చిన బాలికపై గౌస్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురైన చిన్నారి విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: ‘బతికున్న రోగి చనిపోయాడని చెప్పాడు.. తీరా చూస్తే!
హైదరాబాద్‌లో మళ్లీ కుమ్మేసిన వాన.. ఎక్కడ ఏమైందంటే!
Comments
Please login to add a commentAdd a comment