శ్రీకాంత్ (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడిని హత్య చేసి చెట్ల పొదల్లో పారవేశారు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నర్సింగ్‌రావు కథనం మేరకు .. కూకట్‌పల్లి కైత్లాపూర్‌లో ఉంటున్న శ్రీకాంత్ (25), శ్రీశైలం సమీప బంధువులు. వీరు ఇరువురు పాల వ్యాపారం చేసేవారు. శ్రీకాంత్ అదృశ్యం కావటంతో అతని కుటుంబ సభ్యులు ఈ నెల 2న కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 1వ తేదిన శ్రీశైలం, శ్రీకాంత్ ఇద్దరూ కైత్లాపూర్‌లో టీ తాగిన అనంతరం నడుచుకుంటూ వైన్ షాపు సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లారు.
చదవండి: బంజారాహిల్స్: పిన్ని ఇంటికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం
ఆ సమయంలో శ్రీశైలం.. శ్రీకాంత్‌ని రాడ్‌తో తలపై మోదాడు. అప్పటికి శ్రీకాంత్ ప్రాణాలతో కొట్టుమిట్లాడుతుండటంతో మరోసారి దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెట్ల పొదల్లోని ఓ గుంతలో పడేవేసి వెళ్లిపోయాడు. శ్రీశైలం భార్యతో వివాహేతర సంబంధం ఉండటంతో ఎలాగైనా శ్రీకాంత్‌ని మట్టుపెట్టాలన్న ఉద్దేశంతో అతడిని చెట్లపొదల్లోకి తీసుకెళ్లి హత్య చేశాడు. అయితే శ్రీకాంత్ కనిపించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో కుటుంబసభ్యులు శ్రీశైలంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
చదవండి: తియ్యటి మాటలు.. అందమైన ప్రొఫైల్ ఫోటోతో కోట్లు కొట్టేసింది
దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఉద్దేశంతో శ్రీకాంత్‌ను హత్య చేసినట్లు పోలీసులు విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
చదవండి: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
Comments
Please login to add a commentAdd a comment