కూకట్‌పల్లి: ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన షాపింగ్ మాల్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా కూకట్‌పల్లిలో ఏర్పాటు చేస్తున్నట్లు ‘లులు’ గ్రూప్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అ్రషఫ్ అలీ పేర్కొన్నారు. ఈ షాపింగ్ మాల్‌ను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ చొరవతో రూ.500 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ లులు మాల్‌ను మొదటి విడతలో రూ.300 కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలి పారు.
మరో రూ.200 కోట్లతో అత్యాధునిక హంగులతో లులు మాల్‌ను తీర్చిదిద్దుతామని అష్రఫ్ అలీ తెలిపారు. ఈ మాల్ తెలంగాణ ప్రజలకు అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని వివరించారు. భారతదేశంలో కొచ్చి, తిరువనంతపురం, బెంగళూరు, లక్నో కోయంబత్తూరులలో ఇప్పటికే లులు మార్కెట్ ను ప్రారంభించారు. ఈ మాల్‌లో అంతర్జాతీయ బ్రాండ్లతో కూడిన షాపింగ్ ఔట్‌లెట్లు, 1,400 మంది సీటింగ్ కెపాసిటీతో 5 స్క్రీన్స్‌తో సినిమా హాళ్లు, ఫుడ్ కోర్టు, పిల్లల వినోద కేంద్రం ఉంటాయని తెలిపారు. ఈ మాల్ ద్వారా 2 వేల మందికి పైగా సిబ్బందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు.
తాజా ఉత్పత్తులు, కిరాణా సామాగ్రి, ఫ్యాషన్, గృహోపకరణాలు, ఎల్రక్టానిక్స్, మొబైల్స్, సాంకేతిక, జీవనశైలి ఉత్పత్తుల కోసం లులు ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్ బ్రాండ్ పేర్లతో ప్రత్యేక విభాగాలను కలిగి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఆనంద్ ఏవీ. నిషద్ ఎంఎ, వి.నందకుమార్, షిబు ఫిలిప్స్, మేనేజర్ అబ్దుల్ ఖాదీర్, రెజిత్ రాధాకృష్ణన్, అబ్దుల్ సలీం, ఇ.అష్రన్, నౌషద్ కిజక్కుప్పరల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment