చిత్తూరు జిల్లా పీలేరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పీలేరు శివార్లలోని ఓ గదిలో వీరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అమరావతి, శ్రీనివాసులుగా గుర్తించారు. వీరిద్దరూ వివాహితులే. వేర్వేరు పెళ్లిలు చేసుకున్న వీరు కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం గదిలోకి వెళ్లిన ఇద్దరు అన్ని తలుపులు వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరు ఎంతకూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆదివారం బలవంతంగా తలుపులు తెరిచి చూడగా.. గదిలో ఇద్దరూ విగతజీవులై ఉన్నారు. ఈ ఘటన మీద విచారణ జరుపుతున్నామని పీలేరు పోలీసులు తెలిపారు.