జమిలి ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కనిపించడంతో ప్రధాని నరేంద్రమోదీ ఒక్కసారిగా ఆగి.. ఆయనను పలుకరించారు. ‘విజయ్ గారూ..’ అంటూ సంబోధించి ఆయనతో మోదీ కరచాలనం చేశారు.