చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తూర్పు గోదావరి జిల్లాకు లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. వాటిలో ఒక్కటైనా అమలైందో లేదో ప్రజలే చెప్పాలి. కాకినాడ,రాజమండ్రిని స్మార్ట్‌సిటీగా మారుస్తానన్నారు. అది నెరవేరిందా? (లేదు లేదు అంటూ జనం కేకలు) పెట్రోలియం యూనివర్సిటీ అన్నారు, పెట్రోలియం కారిడార్ అన్నారు. కాకినాడలో ఎన్‌ఎంజీ టెర్మినల్, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం అన్నారు. కొత్తగా ఇంకొక పోర్టు అన్నారు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్కు అన్నారు.