మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. చంద్రబాబుకు తానతందాన అనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అమ్ముడుపోయిన టీవీ చానళ్లన్నిటితోనూ.. వీళ్లంతా కలిసి ఎన్నికల దాకా ప్రజలకు రోజుకొక సినిమా చూపిస్తారు. ధర్మానికి అధర్మానికి జరగుతున్న ఎన్నికలివి. గుండెలపై చేయివేసుకొని ఆలోచించమని కోరుతున్నా. కొండెపి నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ మాదాసి వెంకయ్య, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డిలకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.