Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pakistan Government Mocked By Own Citizens As Tensions Rise With India1
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంట‌లో తిరిగిచ్చేస్తారు'

పెహ‌ల్‌గావ్‌లో మూష్క‌ర‌మూక‌ల మార‌ణ‌హోమం త‌ర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌పై ముప్పేట దాడి జ‌రుగుతోంది. ఉగ్ర‌వాదులతో రాక్ష‌స‌ కాండ‌కు అండ‌గా నిలిచింద‌న్న అనుమానంతో పొరుగుదేశంతో అన్ని సంబంధాల‌ను భార‌త్ తెంచుకుంది. సింధూ న‌ది ఒప్పందం నిలిపివేత‌, పాకిస్థానీయుల‌కు వీసాల ర‌ద్దుతో ప‌లు క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టింది. అమాయ‌క ప‌ర్యాట‌కులను అకార‌ణంగా పొట్ట‌న పెట్టుకున్న ఉగ్ర‌వాదుల‌ను ఊహించ‌ని రీతిలో శిక్షిస్తామ‌ని భార‌త్ గ‌ట్టి హెచ్చ‌రిక జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో సొంత దేశంపైనే పాకిస్తానీయులు వ్యంగ్య‌స్త్రాలు సంధిస్తున్నారని ఎన్డీటీవీ తెలిపింది.పెహ‌ల్‌గావ్ (pahalgam) దాడితో భార‌త దేశంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో పాకిస్తాన్‌కు త‌న పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇండియాకు దీటుగా బ‌దులిచ్చేందుకు తంటాలు ప‌డుతున్న పొరుగు దేశానికి సొంత పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదుర‌వ‌డం త‌ల‌నొప్పిగా మారుతోంది. ష‌హ‌బాజ్ ష‌రీఫ్ ప్ర‌భుత్వంపై సోష‌ల్ మీడియాలో స్వ‌యంగా పాకిస్తానీయులే సెటైర్లు పేలుస్తున్నారు. ఇంటా బ‌య‌టా స‌వాళ్లు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ నాయ‌క‌త్వంపై త‌మ వ్య‌తిరేక‌త‌ను మీమ్స్, వ్యంగ్య చిత్రాల ద్వారా బయటపెడుతున్నారు. త‌మ ప్ర‌భుత్వం ఎలా విఫ‌ల‌మైందో సోష‌ల్ మీడియా (Social Media) వేదిక‌గా వెల్ల‌డిస్తున్నారు.రాత్రి 9 త‌ర్వాత వార్ వ‌ద్దుభార‌త్ తీసుకున్న చ‌ర్య‌ల‌కు ప్ర‌తిస్పంద‌న‌గా పాకిస్తానీయులు త‌మ ప్ర‌భుత్వంపైనే వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. త‌మ క‌నీస అవ‌స‌రాలు తీర్చ‌డంలో పాల‌కులు ఎలా విఫ‌ల‌మ‌య్యారో ఎత్తిచూపారు. అస‌లే అంతంత మాత్రంగా ఉన్న త‌మ దేశ‌ ఆర్థిక వ్య‌వ‌స్థ.. ఇండియాతో యుద్ధం వ‌స్తే త‌ట్టుకోగ‌ల‌దా అని త‌మ‌ను తామే ప్ర‌శ్నించుకున్నారు. ఒకవేళ త‌మ‌తో యుద్ధం చేయాల్సివ‌స్తే రాత్రి 9 గంట‌ల‌కు ముగించాల‌ని ఓ పాకిస్తానీయుడు వేడుకున్నాడు. ఎందుకంటే రాత్రి తొమ్మిది త‌ర్వాత గ్యాస్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతుంద‌ని చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పాడు. "వారు ఒక పేద దేశంతో పోరాడుతున్నారని వారికి తెలియాలి" అంటూ మ‌రో యూజ‌ర్ తమ దేశార్థిక దారుణావ‌స్థ‌ను బ‌య‌ట‌పెట్టారు.ఈ కష్టాలు ఎప్ప‌టికి తీర‌తాయో?పాకిస్తాన్‌పై భారతదేశం బాంబు దాడి చేయబోతోందా అని ఒక‌రు ప్ర‌శ్నించ‌గా, "భారతీయులు తెలివి తక్కువవారు కాదు" అని మ‌రొక‌రు సమాధానం ఇచ్చారు. మ‌న బాధ‌ల కంటే బాంబు దాడే బెట‌ర్ బ్రో అంటూ ఇంకొక‌రు స్పందించ‌గా.. ఈ కష్టాలు ఎప్ప‌టికి తీర‌తాయో అంటూ మ‌రో యూజ‌ర్ నిట్టూర్చారు. త‌మ‌ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తూ పాకిస్తానీ యూజర్ షేర్ చేసిన మీమ్ ఫ‌న్నీగా ఉంది. పేపర్‌బోర్డ్‌తో తయారు చేసిన ఫైటర్ జెట్ లాంటి నిర్మాణంతో మోటార్‌సైకిల్‌ను నడుపుతున్న వ్యక్తిని చూపించే మీమ్‌ను (Meme) అతను షేర్ చేశాడు.చ‌ద‌వండి: దేనికైనా రెడీ.. పాకిస్తాన్‌ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లుమా ప్రభుత్వమే చంపుతోంది..సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్‌కు నదీ జలాల ప్రవాహాన్ని నిలిపివేస్తామని ఇండియా ఇచ్చిన వార్నింగ్‌పై పాక్ యూజ‌ర్లు స్పందిస్తూ.. ఇప్ప‌టికే త‌మ దేశంలో తీవ్ర నీటి కొర‌త ఉంద‌ని చెప్పుకొచ్చారు. "నీటిని ఆపాలనుకుంటున్నారా? మీకు ఆ అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే నీళ్లులేక అల్లాడుతున్నాం. మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? మా ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని చంపుతోంది. మీరు లాహోర్‌ను తీసుకుంటారా? మీరు అరగంటలోపు దాన్ని మాకే తిరిగి ఇస్తారు'' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Chandrababu Plans To Convert Talliki Vandanam An Installment Scheme2
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలిక

సాక్షి,శ్రీకాకుళం జిల్లా: తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మరో మెలిక పెట్టారు. తల్లికి వందనాన్ని ఇన్‌స్టాల్‌మెంట్‌ స్కీంగా మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు. 15 వేలు ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాం. ఒకే ఇన్‌స్టాల్‌మెంటా? లేక ఇంకెలా ఇవ్వాల్లో ఆలోచిస్తున్నామంటూ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తల్లికి వందనంపై సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటికే 2024-25 విద్యా సంవత్సరం ‘తల్లికి వందనం’ ఇవ్వలేదు...విద్యా సంవత్సరం ముగిసినా తల్లికి వందనం ఇవ్వకుండా పిల్లలు, తల్లులను చంద్రబాబు మోసం చేశారు. ఈ ఏడాది స్కూల్, ఇంటర్ ఫీజుల కోసం పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. ఇన్నాళ్లు మే లో 15 వేలు ఒకేసారి ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు.. తాజాగా ఇన్‌స్టాల్‌మెంట్‌ మెలిక పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 Union Minister Hardeep Singh  No Water Response To Bilawal3
రక్తం పారిస్తావా.. సింధు జలాల్లో ఒక్కసారి దూకి చూడు!

న్యూఢిల్లీ: సింధు జలాలను ఆపితే అందులో పారిదే రక్తమే అంటూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చీఫ్ బిలావాల్ భుట్టో జర్దారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ భుట్టో స్టేట్ మెంట్ విన్నాను. ఒకసారి సింధు జలాల్లో దూకి చూడు. నీళ్లు ఉన్నాయో లేవో తెలుస్తుంది’’ అంటూ హర్ దీప్ సింగ్ బదులిచ్చారు. ఒక విషయం పబ్లిక్ లో మాట్లాడేముందు ముందు వెనుక చూసుకుని మాట్లాడితే మంచిదని చురకలంటించారు. భుట్టో వ్యాఖ్యల్లో ఎటువంటి గౌరవం లేదని ఆయన మండిపడ్డారు.‘పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి కచ్చితంగా పాకిస్తాన్ వైపు నుంచే జరిగింది. మన పొరుగు దేశంగా ఉన్న పాకిస్తాన్ సహకారంతో అది జరిగింది. దానికి ఆ దేశం పూర్తి బాధ్యత వహించాలి. అంతేగానీ దీన్ని ఇంకా పెద్దది చేసుకుని ఏవో ప్రయోజనం వస్తుందని భావించకండి. పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పాలనే చర్యల్లో భాగంగానే ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అంతకుముందు పాకిస్తాన్ కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే ఉగ్రదాడులతో మానవ హక్కుల్ని కాల రాస్తారా?, దీనికి యావత్ ప్రపంచం ఎంతమాత్రం ఒప్పుకోదు. ;పాకిస్తాన్ అనేది ఒక చెత్త దేశమే కాదు.. క్షీణదశకు వచ్చేసిన దేశం’ అంటూ కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ తెలిపారు.సుక్కర్ సింధ్ ప్రొవిన్స్ లో భుట్టో జర్దారీ బహిరంగం ర్యాలీలో మాట్లాడుతూ.. ‘ సింధు జలాలు మావి. అవి ఎప్పటికైనా మావే. ఒకవేళ అందులో నీళ్లు పారకపోతే.. వారి రక్తం పారుతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Shubman Gill sets the record straight, denies ridiculous link-up rumours4
మూడేళ్లుగా సింగిల్‌గానే..: రిలేషన్‌షిప్‌పై నోరు విప్పిన శుబ్‌మన్‌ గిల్‌

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ శుబ్‌మ‌న్ గిల్ వ్య‌క్తిగ‌త జీవితం గురుంచి గ‌త కొంత‌కాలంగా పుకార్లు షికారు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలుత భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌తో గిల్ ప్రేమాయ‌ణం సాగించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. మ‌ళ్లీ కొంత‌కాలం త‌ర్వాత వీళ్లిద్దరికి బ్రేకప్ అయిందని వార్త‌లు వినిపించాయి.అయితే ఈ వార్త‌ల‌పై గిల్ కానీ సారా కానీ ఎప్పుడు స్పందించలేదు. ఆ త‌ర్వాత బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్‌తో గిల్ డేటింగ్‌లో ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగింది. కానీ గిల్‌తో తాను డేటింగ్ చేయ‌డం లేద‌ని సారా అలీ ఖాన్ స్పష్టం చేసింది. వీరిద్ద‌రి త‌ర్వాత మ‌రో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేతో గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌ను అన‌న్య మాత్రం ఖండించింది. అవ‌న్నీ వ‌ట్టి రూమ‌ర్సే అని కొట్టిపారేసింది. తాజాగా త‌న రిలేష‌న్‌షిప్‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై గిల్‌ స్పందించాడు. గ‌త మూడేళ్ల నుంచి తాను ఒంట‌రిగా ఉన్నాన‌ని గిల్ చెప్పుకొచ్చాడు."నేను ప్ర‌స్తుతం ఎవ‌రితోనూ ప్రేమ‌లో లేను. గ‌త మూడేళ్ల నుంచి నేను ఒంట‌రిగా ఉన్నాను. ఇటీవ‌ల కాలంలో చాలా మందితో న‌న్ను ముడిపెట్టారు. నా వ్య‌క్తిగ‌త జీవితంపై చాలా ఊహాగానాలు, పుకార్లు ప్ర‌చారం చేశారు. నేను ఎప్పుడూ చూడని, కలవని వ్యక్తితో కూడా లింకులు పెడుతున్నారు. నిజంగా ఇది చాలా హాస్యాస్పదం. ప్రస్తుతం నేను నా ప్రొఫెషనల్ కెరీర్‌పై దృష్టి పెట్టాను. ప్ర‌స్తుతం ఒక‌రితో ప్రేమాయ‌ణం న‌డిపే అంత స‌మ‌యం నా ద‌గ్గ‌ర లేదు. మేము ఎక్కడ‌క్క‌డికో ప్రయాణిస్తుంటాము. ప్రొఫెషనల్ కెరీర్‌తో బీజీగా ఉన్నాను" అని ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గిల్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2025లో గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.చ‌ద‌వండి: బీసీసీఐ పొమ్మంది.. క‌ట్ చేస్తే! అభిషేక్ నాయ‌ర్‌కు మ‌రో ఆఫ‌ర్‌?

US Court Given Relief To 1200 Students Over Deportation5
ట్రంప్‌ యూటర్న్‌.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్‌ వెనక్కి తగ్గారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో, విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ట్రంప్‌ యూటర్న్‌ తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఊరట లభించింది. అయితే, అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా (Student Visa) లేదా వారి చట్టబద్ధ హోదాలను ట్రంప్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమ వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.అనంతరం.. కాలిఫోర్నియా, బోస్టన్‌ కోర్టుల్లో విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు.. విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రంప్‌ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు.ఇదిలా ఉండగా.. విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు కారణంగా డిపోర్టేషన్‌, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడగా.. కొందరు రహస్య ప్రదేశాల్లో తల దాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్‌ (Donald Trump) సర్కారు వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Over 1000 illegal Bangladeshi immigrants detained6
జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు!

అహ్మదాబాద్: పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ జాతీయుల వీసాల రద్దు, వారిని తిరిగి వెనక్కి పంపించే చర్యలు కొనసాగుతున్న వేళ.. అక్రమంగా భారత్ లో నివసిస్తున్న విదేశీయులు వేల సంఖ్యలో బయటపడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో పోలీసులు నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో అక్రమంగా భారత్ కు వచ్చి ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి నివసిస్తున్న బంగ్లాదేశ్ కు చెందిన వారు వెయ్యి మందికి పైగా ఉన్నట్లు గుర్తించారు. కూంబింగ్ ఆపరేషన్ లో భాగంగా అక్రమ వలస దారుల వేరివేతకు శ్రీకారం చుడితే అహ్మదాబాద్, సూరత్ లలో కలిపి వెయ్యి మందికి పైగా అక్రమ బంగ్లా దేశీయులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ శనివారం తెలిపారు. అహ్మదాబాద్ లో నివసిస్తున్న బంగ్లాదేశీయులు 890 మంది కాగా, సూరత్ లో నివసిస్తున్న బంగ్లా జాతీయులు 134 ఉన్నట్లు గుర్తించినట్లు హోంమంత్రి తెలిపారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద పోలీస్ ఆపరేషన్ అని ఆయన పేర్కొన్నారు.స్వచ్ఛందంగా బయటకు రండి.. లేకపోతేఅక్రమ వలసదారులకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే కఠినమైన చర్యలు ఉంటాయని సంఘ్వీ హెచ్చరించారు. ఎవరైనా ఇంకా ఉంటే స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఆపై తీసుకునే కఠిన చర్యలు దారుణంగా ఉంటాయన్నారు. Surat, Gujarat | The people caught last night are Bangladeshis. We will check their documents. After this, we plan to send them to Bangladesh: Surat JCP Crime Raghavendra Vats. https://t.co/jqgyPEJmzm— ANI (@ANI) April 26, 2025 Over 550 Illegal Bangladeshi immigrants detained in Gujarat operationsRead @ANI Story | https://t.co/NuuktkcjCp#IllegalImmigrant #Gujarat pic.twitter.com/6Cwc8g3Ci9— ANI Digital (@ani_digital) April 26, 2025 Massive numbers incoming - More than 1000 illegal Bangladeshis and Pakistanis detained in pre-dawn Ops by Gujarat PoliceMale - 436+88Female - 240+44Kids - 214Total - 1022 pic.twitter.com/rvAB5HdLPQ— Megh Updates 🚨™ (@MeghUpdates) April 26, 2025

Seema Haider To Pakistan Rakhi Sawant Requests Indian Govt To Not Send ​her7
సీమా హైదర్‌ పాక్‌ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్‌ సంచలన వీడియో

జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని పహెల్గామ్‌ (Pehalgam) ఉగ్ర దాడి తర్వాత భారత్‌ పాకిస్తాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 48 గంటల్లో పాకిస్థానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తానీలకు వీసాలను రద్దు చేసింది ఈ నేపథ్యంలో 2023లో నేపాల్ ద్వారా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశానికి చెందిన ప్రేమికుడు సచిన్ మీనాను యువకుడ్ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సీమా హైదర్‌ మరోసారి చర్చల్లో నిలిచింది. సీమా హైదర్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. సీమా హైదర్ కూడా పాకిస్తాన్ కు తిరిగి వెళ్తారా ఎక్స్‌లో చర్చకు దారి తీసింది. అయితే అనూహ్యంగా ఆమెకు మద్దతుగా వివాదాస్పద నటి రాఖీ సావంత్ స్పందించడం మరింత సంచలనంగా మారింది.పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సీమా హైదర్‌ (Seema Haider)ను పాకిస్తాన్‌కు పంపొద్దు అంటూ రాఖీ సావంత్ (Rakhi Sawant) భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ దాడిలో సీమకు ఏమీ సంబంధంలేదనీ, ఆమె నిర్దోషి అని వ్యాఖ్యానించింది. ఆమె'హిందూస్తాన్ కీ బహు హై' సచిన్‌కీ బీవీ, అంతేకాదు యూపీకి బహు అంటూ ఇలా వాపోయింది. ‘‘ఇప్పటికే నలుగురు పిల్లలను కన్న సీమాకు సచిన్‌తో ఒక అమ్మాయి కూడా ఉంది, ఆమెకు వారు భారతి మీనా అని పేరు పెట్టుకున్నారు. సీమా ఒక తల్లి, సచిన్ భార్య, అతని బిడ్డకు తల్లి అని రాఖీ చెప్పింది. సీమా భారతదేశానికి కోడలు కాబట్టి ఆమెకు అన్యాయం జరగ కూడదని,ఆమెను గౌరవించాలి అంటూ వాదించింది. సార్క్ వీసా మినహాయింపు సర్వీస్ కింద ఇచ్చిన వీసాలను రద్దు చేయాలని భారతదేశం నిర్ణయం, పాకిస్తానీ ప్రజలు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కఠినమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాఖీ ఆమెకు సపోర్ట్‌గా ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లు పలు రకాలు వ్యాఖ్యానించారు.చదవండి: సింహాల వయసుని ఎలా లెక్కిస్తారు? మీకు తెలుసా? View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511)మరోవైపు తాజా నివేదికల ప్రకారం, సీమాకు భారతదేశంలో నివసించడానికి అనుమతి లభిస్తుందని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ భావిన్నారు, ఎందుకంటే, అతని వాదనల ప్రకారం, సీమ పాకిస్తాన్ పౌరురాలు కాదు.,గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాను వివాహం చేసుకుంది , ఇటీవల ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది, అలాగే ఆమె పౌరసత్వం భారతీయ భర్తతో ముడిపడి ఉంది కాబట్టి, కేంద్రం ఆదేశాలు ఆమెకు వర్తించే అవకాశాలు లేవని ఆయన వాదిస్తున్నారు.ప్రస్తుతం, సీమా హైదర్ పౌరసత్వం మరియు అక్రమ వలస కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.కాగా 2023లో నలుగురు బిడ్డల తల్లి అయిన 32 ఏళ్ల సీమా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో నివసించే 24 ఏళ్ల సచిన్ మీనాను వివాహం చేసుకుంది. తన మొదటి భర్త గులాం హైదర్ వేధింపుల కారణంగానే పాకిస్తాన్‌ను విడిచిపెట్టానని పేర్కొన్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీ

Digital Content Creator ends life Two Days Before Her 25th Birthday8
బర్త్‌డే రెండు రోజులనగా ఇన్‌ఫ్లూయెన్సర్‌,హెయిర్‌ బ్రాండ్‌ సీఈవో ఆత్మహత్య

ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌, హెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్ వ్యవస్థాపక సీఈవో ఆత్మహత్య కలకలం రేపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మూడులక్షలకుపైగా అభిమానులను సొంతం చేసుకున్న మిషా సరిగ్గా తన 25వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవడం ఆమె అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది.కామెడీ స్కిట్‌లు, వీకెండ్‌ కామెడీ అంటూ కామెడీ కంటెంట్‌తో పాపులర్‌అయిన మిషా అగర్వాల్ ఆకస్మిక మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది.మిషా సోదరి ముక్తా అగర్వాల్తోపాటు ఈ హృదయ విదారక వార్తను ఆమె కుటుంబ సభ్యులు మిషా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లోని పోస్ట్ ద్వారా ధృవీకరించారు. మానసిక ఒత్తిడికారణంగానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మిషా మానసిక ఆరోగ్యం బాగాలేదని సూచిస్తుందని కూడా ఆమె ఎత్తి చూపారు. లా చదువుకుని, ది మిషా అగర్వాల్ షో అనే కామిక్ షోను స్థాపించి తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకుంది.అసలేం జరుగుతుందో అర్థం కావడంలేదు.. ఆన్‌లైన్‌లో ఎపుడు యాక్టివ్‌గా ఉండే,ఏప్రిల్ 4 నుండి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు, అసలు ఈ విషయాన్ని తాము గమనించనే లేదు, మిషా ఇక లేదంటే నమ్మశక్యంగా లేదు అంటూ మిషా ఫ్రెండ్‌ మీనాక్షి భెర్వానీ విచారం వ్యక్తం చేసింది.ఎవరీ మిషా అగర్వాల్2000 ఏప్రిల్ 26, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగర్జ్‌లో జన్మించింది మిషా. బిషప్ జాన్సన్ స్కూల్ , కాలేజీ, ప్రయాగర్జ్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. తరువాత లా డిగ్రీ పూర్తి చేసింది. 2017 నుంచి ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియో కంటెంట్ సృష్టికర్తగా, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పనిచేయడం ప్రారంభించింది. అదే సంవత్సరంలో, ఆమె ది మిషా అగర్వాల్ షో అనే కామెడీ షో మొదలు పెట్టి స్టాండ్-అప్ కామెడియన్‌గా ఎదిగింది. షోలోని హాస్యభరితమైన కంటెంట్ ప్రధానంగా కామెడీతోపాటు, జీవనశైలి , ట్రెండింగ్ అంశాలపై దృష్టి పెట్టి కంటెంట్‌ ఇచ్చిఏది. ప్రతిసారీ, వీడియోలను ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీహెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్ ఫౌండర్‌ కూడా డిజిటల్ కంటెంట్ సృష్టికర్త మాత్రమే కాదు, 2024లో తన హెయిర్ కేర్ బ్రాండ్, మిష్ కాస్మెటిక్స్‌ను కూడా లాంచ్‌ చేసింది. ఈ బ్రాండ్‌ సీఈవోగా తన కస్టమర్లకు వారి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అధిక-నాణ్యత గల హెయిర్ కేర్ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో మిషా ఈ బ్రాండ్‌ను, టీంను అభివృద్ధి చేసింది. ఐస్లే, గోయిబిబో, ఇన్ఫినిక్స్, సఫోలా, మై ఫిట్‌నెస్ మరియు మరిన్ని వంటి అనేక ప్రముఖ బ్రాండ్‌లకు సోషల్ మీడియా మార్కెటర్‌గా కూడా పనిచేసింది. చదవండి: సీమా హైదర్‌ పాక్‌ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్‌ సంచలన వీడియో

Mohanlal Thudarum Movie Review And Rating In Telugu9
మోహన్‌ లాల్‌ ‘తుడరుమ్‌’ మూవీ రివ్యూ

మోహన్‌ లాల్‌ సినిమాలకు టాలీవుడ్‌లోనూ మంచి ఆదరణ ఉంది. ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ మధ్య ఎల్‌2: ఎంపురాన్‌తో మంచి హిట్‌ అందుకున్న మోహన్‌ లాల్‌..ఇప్పుడు ‘తుడరుమ్‌’(Thudarum Movie Review) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 15 ఏళ్ల తర్వాత నటి శోభన మరోసారి మోహన్‌లాల్‌కు జోడీగా నటించింది. నిన్న(ఏప్రిల్‌ 25) మలయాళంలో విడుదలై మంచి టాక్‌ సంపాదించుకున్న ఈ చిత్రం నేడు(ఏప్రిల్‌ 26) అదే పేరుతో తెలుగులో రిలీజైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. షణ్ముగం అలియాస్‌ బెంజ్‌(మోహన్‌ లాల్‌) ఒకప్పుడు తమిళ సినిమాలకు యాక్షన్‌ డూప్‌గా నటించేవాడు. ఓ యాక్సిడెంట్‌ కారణంగా సినిమాలను వదిలిపెట్టి తన మాస్టర్‌ (భారతీ రాజా) కొనిచ్చిన కారుతో కేరళలో సెటిల్‌ అవుతాడు. భార్య లలిత(శోభన), పిల్లలు(కొడుకు, కూతురు)..వీళ్లే అతని ప్రపంచం. టాక్సీ నడుపుతూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఓ సారి అనుకోకుండా తను ఎంతో అపురూపంగా చూసుకునే అంబాసిడర్‌ కారును పోలీసులు తీసుకెళ్తారు. ఆ కారును తిరిగి ఇంటికి తెచ్చుకునేందుకు బెంజ్‌ చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో ఇంజనీరింగ్‌ చదివే తన కొడుకు పవన్‌ కనిపించకుండాపోతాడు. పవన్‌కి ఏమైంది? బెంజ్‌ కారును పోలీసులు ఎందుకు జప్తు చేశారు? పోలీసులు సీజ్‌ చేసిన కారును తిరిగి తెచ్చుకునే ‍క్రమంలో బెంజ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? ఎలాంటి తప్ప చేయని బెంజ్‌ని సీఐ జార్జ్‌(ప్రకాశ్‌ వర్మ) హత్య కేసులో ఎందుకు ఇరికించాడు? అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? అతన్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? తన ఫ్యామిలి అన్యాయం చేసినవారిపై బెంజ్‌ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే మిగతా కథ(Thudarum Movie Review). ఎలా ఉందంటే.. పరువు హత్యల నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. తుడరుమ్‌ కూడా అలాంటి కథే. కోర్‌ పాయింట్‌ అదే అయినా.. దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు, ఈ కథకు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ కొత్తగా ఉంటుంది. దర్శకుడు తరుణ్‌ మూర్తి ఈ కథను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రారంభించి.. రివేంజ్‌ డ్రామాగా ఎండ్‌ చేశారు. మాస్‌ ఇమేజ్‌ ఉన్న మోహన్‌లాల్‌ని సింపుల్‌గా పరిచయం చేయడమే కాదు.. ఫస్టాఫ్‌ మొత్తం అంతే సింపుల్‌గా చూపించారు. హీరోకి భార్య, పిల్లలే ప్రపంచం అని తెలియజేయడం కోసం ప్రతి విషయాన్ని డీటేయిల్డ్‌గా చెప్పడంతో ఫస్టాఫ్‌ సాగినట్లుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ ముందు వరకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగిన ఈ చిత్రం ఇంటర్వెల్‌ సీన్‌తో క్రైమ్‌ జానర్‌లోకి వెళ్తుంది. హిరో అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం.. అక్కడ ఓ ట్విస్ట్‌ రివీల్‌ అవ్వడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండాఫ్‌ మొత్తం రివేంజ్‌ యాక్షన్‌ డ్రామాగా సాగుతుంది. ఇక్కడే కథనం కాస్త గాడి తప్పినట్లు అనిపిస్తుంది. తన ఫ్యామిలీని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే హీరో.. పోలీసులు తన కుటుంబం వేసిన నిందను పోగొట్టడానికి ప్రయత్నించకుండా..పగను తీర్చుకోవడానికి వెళ్లడం ఎందుకో పొసగలేదు అనిపిస్తుంది. ‘దృశ్యం’ ఛాయలు కపించకూడదనే దర్శకుడు కథను ఇలా మలిచాడేమో కానీ.. సినిమా చూస్తున్నంత సేపు ఆ చిత్రం గుర్తొస్తూనే ఉంటుంది. అలాగే ట్విస్ట్‌ రివీల్‌ అయిన తర్వాత కథనం మళ్లీ సాగినట్లుగానే అనిపిస్తుంది. ఎమోషనల్‌ సన్నివేశాలు ఉన్నప్పటికీ దర్శకుడు ఎలివేషన్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టాడు. దీంతో ప్రేక్షకుడు ఎమోషనల్‌ సీన్లకు పూర్తిగా కనెక్ట్‌ కాలేకపోయాడు. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని ప్రకటించలేదు కానీ.. ముగింపు చూస్తే ఆ విషయం ఈజీగా అర్థమైపోతుంది. ఎవరెలా చేశారంటే..మోహన్‌ లాల్‌ ఎప్పటిలాగే మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన టాక్సీడ్రైవర్‌ బెంజ్‌ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్లను ఇరగదీశాడు. బాత్రూంలో కూర్చొని ఏడిచే సీన్‌ హైలెట్‌. ఇక మోహన్‌ లాల్‌ తర్వాత బాగా పండిన పాత్ర ప్రకాశ్‌ వర్మది . మంచితనం ముసుగు వేసుకొని క్రూరంగా ప్రవర్తించే సిఐ జార్జ్ అనే పాత్రలో ఆయన జీవించేశాడు. చాలా ఏళ్ల తర్వాత మోహన్‌లాల్‌తో తెర పంచుకున్న శోభనకు మంచి పాత్రే లభించింది. నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో చక్కడా నటించింది. బిను పప్పు, థామస్‌ మాథ్యూతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జేక్స్‌బిజోయ్‌ తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. షాజీ కుమార్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలం. నైట్‌ షాట్స్‌ని అద్భుతంగా చిత్రీకరించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Special Story About the Daughters in Law of Mukesh Ambani and Gautam Adani10
మామకు తగ్గ కోడళ్లు.. బిజినెస్‌లో చక్రం తిప్పుతున్నారు

భారతదేశంలో అత్యంత సంపన్నులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల గురించి.. వారి పిల్లల గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే వారి కోడళ్ళు కూడా వ్యాపార సామ్రాజ్యంలో తమదైన గుర్తింపు తెచుకున్నవారే.. అని బహుశా కొంతమందికి మాత్రమే తెలుసుంటుంది. ఈ కథనంలో రిలయన్స్ గ్రూప్, అదానీ గ్రూప్ అధినేతల కోడళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.శ్లోకా మెహతాముఖేష్ & నీతా అంబానీల పెద్ద కోడలు, ఆకాశ్ అంబానీ భార్య శ్లోకా మెహతా ప్రఖ్యాత వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె. 2014 నుంచి తన కుటుంబ వ్యాపారమైన రోజీ బ్లూ డైమండ్స్ కంపెనీలో కీలక బాధ్యతలు చేపట్టారు. శ్లోకా రోజీ బ్లూ ఫౌండేషన్ డైరెక్టర్ కూడా. ఈమె నికర విలువ రూ.130 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది.రాధిక మర్చంట్ముఖేష్, నీతా అంబానీల చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య 'రాధిక మర్చంట్' ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అంతే కాకుండా ఈమె ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌కు సీఈఓ & వైస్-చైర్మన్ కూడా. ఈమె నికర విలువ రూ. 10 కోట్ల కంటే ఎక్కువ.ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..పరిధి ష్రాఫ్గౌతమ్ అదానీ కోడలు, కరణ్ అదానీ భార్య 'పరిధి ష్రాఫ్'.. వృత్తిరీత్యా న్యాయవాది. ఈమె న్యాయ దిగ్గజం సిరిల్ ష్రాఫ్ కుమార్తె. పరిధి ష్రాఫ్ భారతదేశంలోని అత్యంత చురుకైన చట్టపరమైన మనస్తత్వం కలిగిన వారిలో ఒకరు. సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్‌లో భాగస్వామిగా ఉన్న ఈమె ఎస్సార్-రోస్‌నెఫ్ట్ వంటి బిలియన్ డాలర్ల ఒప్పందాలపై పనిచేశారు.దివా జైమిన్ షాఈ ఏడాది ఫిబ్రవరిలో గౌతమ్ అదానీ చిన్న కొడుకును వివాహం చేసుకున్న 'దివా జైమిన్ షా'.. ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఈమె చార్టర్డ్ ఫైనాన్స్ అనలిస్ట్.. గతంలో డెలాయిట్ ఇండియాలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా పనిచేశారని సమాచారం. ఈమె వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె మరియు ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ సి. దినేష్ అండ్ కో. ప్రైవేట్ లిమిటెడ్ సహ యజమాని.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement