ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఎడ్‌సెట్-2015 శనివారం ప్రశాంతంగా ముగిసిందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 64,231 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 57,884 (92 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. కాగా ఈ నెల 11వ తేదీన కీ విడుదల చేయనున్నట్లు వివరించారు. అలాగే 18వ తేదీ వరకు అభ్యంతరాలను తెలపవచ్చునని, 25వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నామని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా.. నిముషం ఆలస్యం నిబంధన కారణంగా వందలాది మంది ఎడ్‌సెట్‌కు హాజరు కాలేకపోయారని సమాచారం.