TS EDCET
-
31న ఎడ్‌సెట్, పీఈసెట్ అడ్మిషన్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశాల నోటిఫికేషన్ ఈనెల 31న విడుదల కానుంది.శనివారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి అధ్యక్షతన జరిగిన టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ అడ్మిషన్ కమిటీ సమావేశంలో అడ్మిషన్లకు సంబంధించి కౌన్సెలింగ్‌పై అధికారులు చర్చించారు.. వేర్వేరుగా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్లను 31న విడుదల చేయాలని నిర్ణయించారు. పూర్తిస్థాయి షెడ్యూల్, ఇతర సమాచారాన్ని వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు. -
టీఎస్ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్–2022 ఫలితాలను ఆగస్టు 26న విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు ఈ ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు. కాగా టీఎస్ ఎడ్‌సెట్ పరీక్ష జూలై 26న జరిగింది. ఈ పరీక్షకు 38,091 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగా, 31,578 మంది హాజరయ్యారు. ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ( www.sakshieducation.com )లో చూడండి. -
TS: డిసెంబర్ 1 నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ డిసెంబర్ 1 నుంచి మొదలవుతుందని తెలంగాణ ఎడ్‌సెట్ కన్వీనర్ రమేశ్‌బాబు తెలిపారు. 1 నుంచి 8వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 18–20 తేదీల మధ్య వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని సూచించారు. 24వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, సీటు వచ్చిన అభ్యర్థులు డిసెంబర్ 28లోగా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. 30వ తేదీ నుంచి క్లాసులు మొదలవుతాయని తెలిపారు. (‘వడ్లు దంచంగా రాడే.. వండంగ రాడే’.. ఈ పాట ఎక్కడైనా విన్నారా) 27 నుంచి లాసెట్ కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: లాసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 27 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలంగాణ లాసెట్ కన్వీనర్ రమేశ్‌బాబు తెలిపారు. 27 నుంచి డిసెంబర్ 6 వరకు ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, 11 నుంచి 13 వరకు కాలేజీల ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. డిసెంబర్ 17న సీట్ల కేటాయింపు ఉంటుందని, సీటు పొందిన అభ్యర్థులు వచ్చే నెల 23 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. మూడేళ్ల, ఐదేళ్ల న్యాయవాద కోర్సుల తరగతులు డిసెంబర్ 27 నుంచి మొదలవుతాయని తెలిపారు. (చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్) -
ఎడ్‌సెట్‌లో మహిళల హవా
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎడ్‌సెట్‌లో 98.53 శాతం మంది అర్హత సాధించారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఉస్మానియా వర్సిటీ గత నెలలో ఎడ్‌సెట్ నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. ఎడ్‌సెట్‌కు 42,399 మంది దరఖాస్తు చేసుకోగా, 34,185 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 33,683 మంది అర్హత సాధించారు. పురుషులు 7,737 మంది పరీక్ష రాస్తే, 7,700 మంది అర్హత సాధించారు. మహిళలు 26,448 మంది రాస్తే 25,983 మంది ఎడ్‌సెట్ అర్హత పొందారు. గతేడాదితో 70 శాతం అర్హత సాధిస్తే... ఈసారి 98.53 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఎడ్‌సెట్ కన్వీనర్ రామ కృష్ణ తెలిపారు. -
టీఎస్ ఎడ్‌సెట్-2021 ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్-2021 ఫలితాలను సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 4గంటలకు విడుదల చేశారు. ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. ప్రభుత్వం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్‌లో అర్హత సాధించాలి. నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలో పలు మార్పులు చేర్పులను విద్యాశాఖ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం టీఎస్ ఎడ్‌సెట్ ఫలితాలను education.sakshi.com లో చూడొచ్చు. టీఎస్ ఎడ్‌సెట్-2021 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
TS EDCET 2021: ఎడ్‌సెట్ విజయం ఇలా
ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలంటే.. బీఈడీ తప్పనిసరి. వృత్తిపరమైన నైపుణ్యాలను అందించే బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. ఎడ్‌సెట్ రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షకు ప్రకటన విడుదలైంది. నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలో పలు మార్పులు చేర్పులు చేశారు. ఈ నేపథ్యంలో.. టీఎస్ ఎడ్‌సెట్ 2021కు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ అంశాల గురించి తెలుసుకుందాం... తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తికి సంబం«ధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. డిగ్రీ స్థాయి కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు టీఎస్ ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందకు అర్హులు. అర్హతలు ► కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ(హోంసైన్స్), బీసీఏ, బీబీఎం, బీఏ(ఓరియంటల్ లాంగ్వేజ్), బీబీఏ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు/ఫైనల్ పరీక్షలకు హాజరైన వారు దరఖాస్తుకు అర్హులు. బీఈ/బీటెక్ కోర్సులను చదివిన వారు ఆయా కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులను సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ ఇతర ప్రభుత్వ రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు ఉత్తీర్ణత శాతంలో సడలింపు ఉంది. వీరు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ► వయసు జూలై1, 2021 నాటికి 19ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ► ఎంబీబీఎస్, బీఎస్సీ(అగ్రికల్చర్), బీవీఎస్సీ, బీహెచ్‌ఎంటీ, బీఫార్మసీ, ఎల్ఎల్బీ వంటి కోర్సులు చదివిన విద్యార్థులు టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షను రాసేందుకు, బీఈడీ కోర్సులో చేరేందుకు అనర్హులు. ► డిగ్రీ లేకుండా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాదు. పరీక్ష ఇలా ► ఎడ్‌సెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–సీబీటీ) విధానంలో ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్టు/కంటెంట్–60మార్కులకు(మ్యాథమెటిక్స్–20మార్కులు, సైన్స్–20మార్కులు, సోషల్ స్టడీస్–20 మార్కులు), టీచింగ్ అప్టిట్యూడ్–20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్–20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్–30మార్కులు, కంప్యూటర్ అవేర్నెస్–20 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఎడ్‌సెట్ పరీక్ష సమయం రెండు గంటలు. ► ఎడ్‌సెట్‌లో అర్హత పొందేందుకు కనీసం 25శాతం మార్కులు అంటే.. మొత్తం 150 మార్కులకు 38 మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. ► గతంలో ఎడ్‌సెట్‌కు సంబంధించిన సిలబస్ డిగ్రీ స్థాయి వరకు ఉండేది. కానీ ప్రస్తుతం 2021 నుంచి మార్పులు చేశారు. దీనిలో చేసిన మార్పుల ప్రకారం–పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తున్నారు. అదేవిధంగా కొత్తగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా కంప్యూటర్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/తెలుగు, ఇంగ్లిష్/ఉర్దూ మాధ్యమంలో ఉంటుంది. సిలబస్ అంశాలు ఇవే ► తెలంగాణ స్టేట్ కరిక్యులానికి సంబంధించి పదోతరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలు అన్నీ చదవాలి. ► మ్యాథమెటిక్స్:సంఖ్యావ్యవస్థ(నంబర్ సిస్టమ్), వాణిజ్య గణితం(కమర్షియల్ మ్యాథమెటిక్స్), బీజగణితం(ఆల్జీబ్రా), జ్యామితి(జామెట్రీ), కొలతలు(మెన్సురేషన్), త్రికోణమితి(ట్రిగ్నోమెట్రీ), సమాచార నిర్వహణ(డేటా హ్యాడ్లింగ్). ► ఫిజికల్ అండ్ బయోలాజికల్ సైన్స్: ఆహారం(ఫుడ్), జీవులు(లివింగ్ ఆర్గానిజమ్స్), జీవన ప్రక్రియలు(లైఫ్ ప్రాసెస్ ), జీవవైవి«ధ్యం(బయోడైవర్సిటీ), కాలుష్యం(పొల్యూషన్), పదార్థం(మెటీరియల్), కాంతి(లైట్), విద్యుత్ అండ్ అయస్కాంతత్వం(ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజమ్), వేడి(హీట్), ధ్వని(సౌండ్), కదలిక(మోషన్), మార్పులు(చేంజెస్),వాతావరణం(వెదర్ అండ్ క్లయిమెట్), బొగ్గు అండ్ పెట్రోల్(కోల్ అండ్ పెట్రోల్), కొన్ని సహజ సిద్దమైన దృగ్విషయం (సమ్ నేచురల్ ఫినామినా) నక్షత్రాలు, సౌరవ్యవస్థ(స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్), లోహశాస్త్రం(మెటాలజీ), రసాయన ప్రతిచర్యలు(కెమికల్ రియాక్షన్స్). ► సాంఘిక శాస్త్రం: భౌగోళికశాస్త్రం(జాగ్రఫీ), చరిత్ర(హిస్టరీ), రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్), అర్థశాస్త్రం(ఎకనామిక్స్). ► టీచింగ్ ఆప్టిట్యూడ్: ఆప్టిట్యూడ్ ప్రశ్నలు.. బోధన అభ్యసన ప్రక్రియ, క్లాస్ రూంలో పిల్లలతో వ్యవహరించే విధానం, విశ్లేషణాత్మక ఆలోచన, జనరల్ ఇంటెలిజెన్స్ వంటివి వాటిపై ఉంటాయి. ► జనరల్ ఇంగ్లిష్: రీడింగ్ కాంప్రహెన్షన్, స్పెల్లింగ్ ఎర్రర్, వొకాబ్యులరీ, ఫ్రేస్ రీప్లేస్మెంట్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ వర్డ్ అసోసియేషన్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ► జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూ: కరెంట్ అఫైర్స్, ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, సమకాలీన విద్యాసమస్యలు, జనరల్ పాలసీలు, సైంటిఫిక్ పరిశోధనలు, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అంశాలుంటాయి. ► కంప్యూటర్ అవేర్నెస్: కంప్యూటర్, ఇంటర్నెట్, మెమొరీ, నెట్వర్కింగ్, ఫండమెంటల్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రిపరేషన్ ఇలా ► ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించాలంటే.. పాఠశాల స్థాయిలోని పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులను చదవాలి. ఇందుకోసం తెలంగాణ స్టేట్ కరిక్యులం ప్రాథమిక స్థాయి నుంచి పదోతరగతి వరకూ పుస్తకాలను సమగ్రంగా చదవాలి. ► చక్కని ప్రిపరేషన్, సబ్జెక్ట్‌పై పట్టు సాధిస్తే ఎంట్రన్‌లో మంచి మార్కులు(ర్యాంక్) సాధించేందుకు అవకాశం ఉంటుంది. ► ఎడ్‌సెట్ పరీక్షకు ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉంది. కాబట్టి నిర్ణిష్టమైన టైమ్ టెబుల్ సిద్ధం చేసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. ► పాఠ్య పుస్తకాలను చదివే సమయంలో సులువుగా గుర్తుండేలా ముఖ్యమైన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. ఇది ఒక ఎడ్‌సెట్‌కే కాకుండా.. భవిష్యత్తులో టెట్, టీఆర్టీ వంటి పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ► కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ కోసం పత్రికలను చదవడం, న్యూస్ బుల్‌టెన్లను అనుసరించాలి. దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలను, పేపర్ కట్స్‌ను నోట్ రూపంలో సిద్ధం చేసుకొని ఎప్పటికప్పుడు చూస్తుండాలి. ► పరీక్ష సమయం వరకు ముఖ్యమైన అంశాలను సాధ్యమైనన్నిసార్లు రివిజన్ చేసుకోవాలి. ఇందుకోసం గతంలో రాసి,సిద్ధం చేసుకున్న నోట్‌బుక్ ఉపయోగించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి. ఇందుకోసం ఎడ్‌సెట్ అధికారిక వెబ్సైట్ https://edcet.tsche.ac.in/లాగిన్ అవ్వాలి. ► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులకు రూ.450, మిగతా వారికి రూ.650. ► దరఖాస్తు చివరి తేదీ: 15.06.2021(ఆలస్య రుసం లేకుండా) ► హాల్‌టికెట్ డౌన్లోడ్ ప్రారంభం: 10.08.2021 ► ఎడ్‌సెట్ పరీక్ష తేదీలు: 24.08.2021, 25.08.2021 ► వెబ్సైట్: https://edcet.tsche.ac.in/TSEDCET/EDCET_HomePage.aspx -
ఓరియంటల్ విద్యార్థులకు ఎడ్‌సెట్
సాక్షి, హైదరాబాద్ : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్‌సెట్–2020 నోటిఫికేషన్‌ను ఈనెల 20న జారీ చేయాలని, 24వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఎడ్‌సెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎడ్‌సెట్ రాసేందుకు ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ చేసిన వారికి కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఓరియంటల్ కాలేజీల్లో బీఏ (లాంగ్వే జెస్) చేసిన వారిని పండిట్ కోర్సులకే పరిమితం చేయగా, ఇకపై వారు బీఎడ్ చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎడ్‌సెట్ నిబంధనల్లో ఈ అంశాన్ని పొందుపరిచినట్లు పాపిరెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ఆన్లైన్లో (https: //edcet.tsche.ac.in) ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ టి.మృణాళిని తెలిపారు. రూ.650 పరీక్ష ఫీజు గా నిర్ణయించామని, ఎస్సీ, ఎస్టీలతోపాటు వికలాంగులకు మాత్రం రూ.450గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రూ.500 ఆలస్య రుసుముతో విద్యార్థులు ఏప్రిల్ 25వ తేదీ వరకు, రూ.100 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30వ తేదీ వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. ఎడ్‌సెట్ పరీక్షను మే 23వ తేదీన నిర్వహిస్తామన్నారు. రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయని, ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. ఫలితాలను జూన్ 11వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు. 14 రీజనల్ సెంటర్ల ఏర్పాటు.. ఇక ఎడ్‌సెట్ పరీక్షల నిర్వహణ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 14 రీజనల్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఎడ్‌సెట్ కన్వీనర్ టి.మృణాళిని తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నర్సంపేట్, నిజామాబాద్, ఖమ్మం, సత్తుపల్లి, కోదాడ, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సిద్దిపేట, విజయవాడ, కర్నూల్లో ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను, అర్హతలు, సిలబస్, మోడల్ పేపర్లను తమ వెబ్సైట్లో పొందవచ్చని వివరించారు. -
తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్ 2019 ఫలితాలను బుధవారం మధ్యాహ్నం ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సెట్ కన్వీనర్ ప్రొ.మృణాళిని, ప్రొ. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది మొత్తం 43,113 మంది పరీక్షకు హాజరు కాగా 41,195 క్వాలిపై అయినట్లు తెలిపారు. జూలై లాస్ట్ వారంలో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. -
ఈనెల 19న ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్–2019 ఫలితాలను ఈనెల 19వ తేదీన ఉదయం 11:30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని ఒక ప్రకటనలో తెలిపారు. మాసాబ్‌ట్యాంకులోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఈ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేస్తారని పేర్కొన్నారు. మే 31వ తేదీన జరిగిన ఈ పరీక్షకు 43,113 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. -
టీఎస్ఎడ్సెట్–2018 గడువు పొడిగింపు
హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న టీఎస్ఎడ్సెట్–2018 గడువును ఈనెల 25 వరకు పొడిగించినట్లు శుక్రవారం ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మధుమతి తెలిపారు. కాగా రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. -
నేటి నుంచి ‘బీఈడీ’సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణా కోర్సు బీఈడీ ప్రవేశాలలో 2015-16 విద్యా సంవత్సరానికి సోషల్ స్టడీస్ మెథడాలజీ విద్యార్థులకు సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని టీఎస్ఎడ్సెట్ కన్వీనర్ ప్రొ.పి.ప్రసాద్ ఓ ప్రకనటనలో తెలి పారు. దీనికోసం జంటనగరాలలో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పూర్తి వివరాల కోసం టీఎస్ఎడ్సెట్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. -
టీఎస్ ఎడ్‌సెట్ ప్రశాంతం : జూన్ 25న ఫలితాలు
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఎడ్‌సెట్-2015 శనివారం ప్రశాంతంగా ముగిసిందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 64,231 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 57,884 (92 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. కాగా ఈ నెల 11వ తేదీన కీ విడుదల చేయనున్నట్లు వివరించారు. అలాగే 18వ తేదీ వరకు అభ్యంతరాలను తెలపవచ్చునని, 25వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నామని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా.. నిముషం ఆలస్యం నిబంధన కారణంగా వందలాది మంది ఎడ్‌సెట్‌కు హాజరు కాలేకపోయారని సమాచారం.