No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, May 5 2024 8:05 AM

No Headline

● కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధి పొందింది. ఏటా శ్రావణ, కార్తీక మాసాల్లో ప్రతి శని,మంగళవారాల్లో దేవాలయానికి ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివస్తారు.

● నియోజకర్గంలోని గుతి ్తకోట అత్యంత పురాతనమైన దుర్గాల్లో ఒకటి. 7వ శతాబ్దానికి చెందినదిగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. గుత్తి కోట సందర్శనకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

● గుత్తి మండలంలోని చెర్లోపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సేవాగఢ్‌ సంత్‌సేవాలాల్‌ మహరాజ్‌ బంజారాల ఆరాధ్యదైవంగా విరాజిల్లుతున్నాడు. ఏటా జరిగే జయంత్యుత్సవాలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో బంజారాలు తరలివస్తుంటారు.

● గుంతకల్లు పట్టణంలోని మస్తానయ్య దర్గా కులమతాలకు అతీతంగా ఖ్యాతిగాంచింది. ఏటా జరిగే మస్తానయ్య ఉరుసులో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శించుకుంటారు.

● పామిడి వస్త్ర రంగానికి ప్రసిద్ధి, ఈ గ్రారమంలోని సగం జనాభా వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. దీంతో పామిడిని రెండో ముంబాయిగా పిలుస్తుంటారు.

నియోజవర్గ ప్రత్యేకతలు..

Advertisement
Advertisement