పకడ్బందీగా ఓటరు స్లిప్పుల పంపిణీ | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఓటరు స్లిప్పుల పంపిణీ

Published Sun, May 5 2024 6:30 AM

పకడ్బందీగా ఓటరు స్లిప్పుల పంపిణీ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పకడ్బందీగా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని, సోమవారంలోపు మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షణ్మోహన్‌ ఆదేశించారు. శనివారం ఆయన క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్లందరికీ స్లిప్పులు చేరేలా ఆర్‌ఓలు చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 5,6 తేదీల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్‌బ్యాలెట్‌కు ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బంది పోస్టల్‌బ్యాలెట్‌ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోస్టల్‌బ్యాలెట్‌ రికార్డులు పక్కాగా నిర్వహించాలని కోరారు. పోలీస్‌శాఖతో సమన్వయం చేసుకుని క్యూలు, శాంతిభద్రతలను పర్యవేక్షించాలన్నారు. పోస్టల్‌బ్యాలెట్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే బాక్సులను పకడ్బందీ భద్రతతో స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరచాలని చెప్పారు. ఈ నెల 6,7 తేదీల్లో హోం ఓటింగ్‌ ప్రక్రియను జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఇక్కడ పనిచేస్తూ ఇతర జిల్లాల్లో పోస్టల్‌బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో పోస్టల్‌బ్యాలెట్‌ వేయాలని స్పష్టం చేశౠరు. పోస్టల్‌బ్యాలెట్‌ వేసేందుకు వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా ఎపిక్‌కార్డు, ఆధార్‌కార్డు, ప్రభుత్వం జారీచేసిన గుర్తింపుకార్డుల్లో ఏదైన ఒకటి, ఎన్నికల విధులకు కేటాయించిన ఉత్తర్వులను తీసుకుని రావాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్‌బ్యాలెట్‌ వినియోగించుకునేందుకు అవకాశముంటుందని వెల్లడించారు.

Advertisement
Advertisement