పేదల పక్షాన నిలిచింది జగనే | Sakshi
Sakshi News home page

పేదల పక్షాన నిలిచింది జగనే

Published Sun, May 5 2024 7:40 AM

పేదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయ చరిత్రలో పేదల పక్షాన నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిలిచారు. ప్రస్తుతం ఆయన తనయుడు జగనన్న ఉన్నారు. పేదలందరి పక్షాన.. జగన్‌ ఒక్కరే పోరాటం చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు పెద్దపీట వేసి సామాజిక సమన్యాయం తీసుకొచ్చారు. జనం మెచ్చిన నేత జగనన్న. మరోసారి జగన్‌ను సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పెద్దకొడుకులా.. అండగా నిలిచారు. వైఎస్‌ జగన్‌ కోసం ప్రతి ఒక్కరూ.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు ఫ్యాన్‌ గుర్తుపై బటన్‌ నొక్కాలని కోరుతున్నా.

– జె.శాంత, వైఎస్సార్‌ సీపీ

హిందూపురం పార్లమెంటు అభ్యర్థి

బాలయ్యను సాగనంపుదాం

హిందూపురం నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చే బాలకృష్ణను సాగనంపుదాం. స్థానికంగా ఉంటూ ప్రజా సమస్యల్లో ప్రతి ఒక్కరికీ తోడుంటా. నన్ను ఆశీర్వదించండి. జగనన్న గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలతో ప్రజల్లోకి వెళ్లి.. మరోసారి వైఎస్సార్‌ సీపీని గెలిపించుకుందాం. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉంటే సంక్షేమ పథకాలన్నీ ముంగిటకే వస్తాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సమన్యాయం చేసింది జగన్‌ ఒక్కరేనని గర్వంగా చెప్పుకోవచ్చు. మహిళా సాధికారతకు జగన్‌ పెద్దపీట వేశారు. మహిళల అభివృద్ధికి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. జనరల్‌ స్థానాల్లో కూడా బీసీ మహిళలకు సీట్లు ఇచ్చారు. టీడీపీకి బీజేపీ, జనసేన తోడుగా వస్తున్నాయి. కానీ జగన్‌ సింహంలా సింగిల్‌ గానే బరిలో దిగుతున్నారు.

– టీఎన్‌ దీపిక, వైఎస్సార్‌సీపీ

హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి

పేదల పక్షాన నిలిచింది జగనే
1/1

పేదల పక్షాన నిలిచింది జగనే

Advertisement
Advertisement