No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, May 5 2024 4:20 AM

No Headline

టీడీపీ నేత చౌదరి బాబ్జీ ఆక్రమించిన కృష్ణబంద చెరువు (ఫైల్‌)

● కింజరాపు అచ్చెన్నాయుడు అనుచరుడు మదన్‌గౌడ్‌ నందిగాం మండలం మాదిగా పురం పరిధిలో గురుబెల్లి చిన్నిమ్ములు, తలగాపు సత్యవతిల పేరున సుమారు 14 ఎకరాలను, సొంఠినూరు పరధిలో గురుబెల్లి చిన్నమ్మలు పేరున 15 ఎకరాలు, తలగాన సత్యవతి పేరున 15 ఎకరాలు, కల్లేపల్లి త్రినాథరావు పేరున 15 ఎకరాలకు రెవెన్యూ రికార్డులను తయారు చేయించి వారి పేరున 1బీలు, అడంగల్‌ కాపీలు తయారు చేశారు. వీటిని హైదరాబాద్‌కు చెందిన నల్లబొంతుల కరుణాకర్‌కు అమ్మకం పెట్టేశారు. అదంతా తప్పుడు డాక్యుమెంట్లు అని తెలుసుకుని కరుణాకర్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి మదన్‌గౌడ్‌ను అరెస్టు చేశారు. ఇప్పుడిది కోర్టులో ఉంది.

● అచ్చెన్నాయుడు మరో అనుచరుడు, మెళియాపు ట్టి మండలానికి చెందిన టీడీపీ నేత హనుమంతు చంద్రశేఖర్‌ కరజాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 373–41, 373–42, 373–43లో ఉన్న 3.62 ఎకరాల ప్రభుత్వ భూ మిని తన భార్య హనుమంతు హేమలత పేరు తో పట్టా చేయించుకున్నారు. అంచెలంచెలుగా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు చేయించుకు ని కంప్యూటర్‌ అడంగల్‌ పొందాడు. వాస్తవానికి ప్రభుత్వ భూమి పొందితే డీ పట్టా అని రాయించాలి. కానీ అనువంశికం అని రికార్డుల్లో నోట్‌ చేయించి బ్యాంకు రుణాలు పొందాడు.

Advertisement
Advertisement