
వైద్యం చేయాల్సిన ఓ వైద్యుడు దారి తప్పాడు. తన వద్దకు వచ్చిన జిమ్నాస్టిక్ మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధించాడు. మెడికల్ ట్రీట్‌మెంట్ పేరుతో మహిళలను లైంగికంగా వేధిస్తున్న డాక్టర్‌కు ఏకంగా 175 ఏళ్ల శిక్ష పడింది.
అమెరికాకు చెందిన డాక్టర్ లారీ నసార్ జిమ్నాస్టిక్ మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. ఈ కేసులో మిచిగాన్ కోర్టు డాక్టర్‌కి 40 నుంచి 175 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఇలాంటి నీచునికి జైలు బయట బతికే అర్హత లేదు అంటూ కోర్టు తీర్పులో పేర్కొంది. కోర్టు విచారణకు 160 మంది మహిళలు హాజరై డాక్టర్ తమను లైంగికంగా వేధించాడని కోర్టులో విన్నవించుకున్నారు. బాధితుల్లో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత జిమ్నాస్ట్ సైమోన్ బైల్స్, అలీ రైజ్‌మాన్, గ్యాబీ డగ్లస్, మెక్ కాలే మరోనే లాంటి అథ్లెట్లు ఉన్నారు.