రాహుల్ అడుగుపెడితే అంతేనా! | no use ful with rahul gandhi election campaign | Sakshi

రాహుల్ అడుగుపెడితే అంతేనా!

Published Sat, May 17 2014 12:54 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రాహుల్ అడుగుపెడితే అంతేనా! - Sakshi

రాహుల్ అడుగుపెడితే అంతేనా!

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం చేసిన ప్రాంతంలో పార్టీ అభ్యర్థులు ఓడిపోతారనే సెంటిమెంట్ మరోసారి రుజువైంది.

 సోనియా, రాహుల్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో అభ్యర్థుల ఓటమి

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం చేసిన ప్రాంతంలో పార్టీ అభ్యర్థులు ఓడిపోతారనే సెంటిమెంట్ మరోసారి రుజువైంది. ప్రస్తుత ఎన్నికల్లో సోనియా, రాహుల్‌గాంధీలు ప్రచారం చేసిన ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. కరీంనగర్, చేవెళ్ల, మెదక్‌లోని ఆందోల్ నియోజకవర్గ పరిధిలో సోనియా ప్రచారం చేశారు. అయితే కరీంనగర్‌లో పార్లమెంట్‌తోపాటు అసెంబ్లీ స్థానంలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ జిల్లాలో ఒక్క జగిత్యాల లోనే పార్టీ అభ్యర్థి గెలిచారు. అలాగే చేవేళ్లలో కూడా పార్లమెంట్ సభ్యుడు ఓడిపోయారు. ఆందోల్ అభ్యర్థి దామోదర సైతం పరాజయం పాలయ్యారు. ఇక రాహుల్ ప్రచారం చేసిన మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్‌లలో కూడా పార్టీ ఓడిపోయింది. కాగా, ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రచారం చేసిన భువనగిరి స్థానంలో కూడా పార్టీ అభ్యర్థి రాజగోపాలరెడ్డి పరాజయం పాలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement