శంషాబాద్ విమానాశ్రయంలో 21 కిలోల ఎర్ర చందనం పొడిని కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో 21 కిలోల ఎర్ర చందనం పొడిని కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. సుడాన్కు చెందిన ఓ నైజీరియన్ జంట ఎర్రచందనం పొడిని హైదరాబాద్ నుంచి దోహాకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం వీరిద్దర్నీ విమానాశ్రయంలోని పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా ఈ నెల 8వ తేదీన సూడాన్ దేశస్థుడు ఎర్రచందనం తరలిస్తు పట్టుబడిన విషయం తెలిసిందే.