తండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రత్యూష కేసు విచారణ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.
హైదరాబాద్ : తండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రత్యూష కేసు విచారణ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రత్యూష ఆరోగ్యంపై న్యాయస్థానం ఆరా తీసింది. అయితే ఆమెకు మరో రెండు రోజులు చికిత్స అవసరం ఉందని పోలీసులు కోర్టుకు విన్నించారు. బుధవారం మధ్యాహ్నం ప్రత్యూషను తమ ఛాంబర్లో ప్రవేశపెట్టాల్సిందిగా కోర్టు ...పోలీసులకు ఆదేశించింది. అలాగే ఇటువంటి కేసులు తమ దృష్టికి తీసుకు రావాలని పోలీసులకు సూచించింది. అనంతరం కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.