Top Stories
ప్రధాన వార్తలు

బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అరాచకాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ‘‘చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీవాళ్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. మరి మీకు మేయర్ పదవి ఏరకంగా వస్తుంది?..బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్‌పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీకాలం పూర్తవుతుందని తెలిసీ, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా, ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబూ.. మీకులేదు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారు.ఇన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గక పార్టీవైపు, ప్రజలవైపు నీతి, నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైయస్సార్సీపీ కార్పొరేటర్లను, అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నాను.రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం, కండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబుగారి కుటిల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని నిలబడుతున్న మా పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్సాప్ చెప్తున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. .@ncbn గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.ప్రజలు ఇచ్చిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2025

గెలుపు వాకిట బోర్లా పడిన రాయల్స్.. ఉత్కంఠ పోరులో లక్నోను గెలిపించిన ఆవేశ్ ఖాన్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో రాయల్స్ గెలుపుకు 9 పరుగులు అవసరం కాగా.. ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చాడు. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో యశస్వి జైస్వాల్ (74), వైభవ్ సూర్యవంశీ (34), రియాన్ పరాగ్ (39) అద్భుతంగా ఆడినప్పటికీ.. రాయల్స్ ఒత్తిడికి చిత్తై గెలుపు వాకిట బోర్లా పడింది. రాయల్స్ ఈ సీజన్లో ఇలా ఓడటం ఇది రెండో సారి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ రాయల్స్ గెలుస్తుందనుకుంటే సూపర్ వరకు వెళ్లి ఓటమిపాలైంది. ఆవేశ్ ఖాన్ (4-0-37-3) ఒంటిచేత్తో రాయల్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.

విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి
సాక్షి, అమరావతి: విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. న్యాయపరమైన రక్షణ తర్వాత విచారణకు హాజరవుతా. సాక్షిగా పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని లాయర్లు చెప్పారు. అందుకోసమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’’ అని రాజ్ కసిరెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే

‘సుప్రీంకోర్టు నిర్దేశిస్తుందా?.. ఇక మేము పార్లమెంట్‌ను మూసేస్తాం’
రాంచీ: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడు ఆ జాబితాలో జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ ఎంపీ నిక్షికాంత్ దుబే చేరిపోయారు. సుప్రీం తీర్పు ‘అరాచకం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ.. ఇక తాము పార్లమెంట్ ను, అసెంబ్లీలను కూడా మూసేస్తాం అంటూ సెటైర్లు వేశారు. ప్రధానంగా రాష్ట్రపతికి మూడు నెలల టైమ్ లైన్ విధించడాన్ని ఆక్షేపించారు సదరు ఎంపీ.నియామక అధికారికి మీరు ఎలా దిశానిర్దేశం చేస్తారు?, రాష్ట్రపతి అనేవారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను నియమిస్తారు. పార్లమెంట్ అనేది ఈ దేశంలో చట్టాలు తయారు చేస్తుంది. అప్పుడు మీరు పార్లమెంట్ ను ఎలా డిక్టేట్ చేస్తారు. మీరు కొత్త చట్టాన్ని ఎలా రూపొందించారు. ఏ చట్టంలో రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఉంది? అంటే మీరు ఈ దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలనుకుంటున్నారా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరగాల్సిందేనని దూబే పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థ పరిమితులపై ప్రశ్నలను లెవనెత్తింది’ అంటూ వ్యాఖ్యానించారు.ఇటీవల ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదన్నారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు.ఇవీ చదవండి:వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులురాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’

కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
14 ఏళ్ల 23 రోజుల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి లీగ్‌లో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ కెరీర్లో తానెదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి మరో రికార్డు నెలకొల్పాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో తొలి బంతికే (కెరీర్లో) సిక్సర్ బాదిన 10వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.ఐపీఎల్ కెరీర్లో తొలి బంతికే సిక్సర్ బాదిన ఆటగాళ్లు..రాబ్ క్వినీ (RR)కెవోన్ కూపర్ (RR)ఆండ్రీ రస్సెల్ (KKR)కార్లోస్ బ్రాత్‌వైట్ (DD)అనికేత్ చౌదరి (RCB)జావోన్ సియర్ల్స్ (KKR)సిద్దేష్ లాడ్ (MI)మహేష్ తీక్షణ (CSK)సమీర్ రిజ్వీ (CSK)వైభవ్ సూర్యవంశీ (RR)A VIDEO TO REMEMBER IN IPL HISTORY 👑- ITS VAIBHAV SURYAVANSHI..!!!! pic.twitter.com/ZuKskRWyI7— Johns. (@CricCrazyJohns) April 19, 2025ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కులైన ఆటగాళ్లు..14y 23d - వైభవ్ సూర్యవంశీ (RR) vs LSG, 2025*16y 157d - ప్రయాస్ రే బర్మన్ (RCB) vs SRH, 201917y 11d - ముజీబ్ ఉర్ రెహ్మాన్ (PBKS) vs DC, 201817y 152d - రియాన్ పరాగ్ (RR) vs CSK, 201917y 179d - ప్రదీప్ సాంగ్వాన్ (DC) vs CSK, 2008మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. ఆఖర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఛేదనకు దిగిన రాయల్స్ ఆది నుంచే దూకుడుగా ఆడుతుంది. తొలి బంతికే సిక్సర్ కొట్టిన సూర్యవంశీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రాణా (8) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 94/2గా ఉంది. యశస్వి జైస్వాల్ (52), రియాన్ పరాగ్ క్రీజ్‌లో ఉన్నారు.

నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు
భార్యాభర్తల సంబంధం అనేది చాలా సున్నితమైనది. ఇది ప్రేమ అనే బంధంతో ముడిపడి ఉంటుంది. చిన్నపాటి దారంతో మెలివేసి ఉంటుంది. ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి చిన్న పొరపాటు సరిపోతుంది. ప్రేమ దారంతో ముడిపడాల్సిన బంధం.. అనుమానం అనే ఆయుధంతో దాడి చేస్తే కాపురాలు నాశనం అవుతాయి. ఆ బంధాలు శాశ్వతంగా నిలబడువు. ఈ ఘటనలో అదే జరిగింది.వారిది పెద్దగా అన్యోన్యమైన దాంపత్యం కాదు. పెళ్లై ఐదేళ్లే అవుతుంది. అప్పట్నుంచీ ఇంట్లో రోజూ చికాకులు. భార్యాభర్తల మధ్య గొడవలు. ఒకరి కంఫర్ట్ జోన్ లోకి ఇంకొకరు రాలేకపోయారు. దాంతో భర్త ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తాను చేయని తప్పుకు భార్య నిందించడంతోపాటు కేసును కూడా పెట్టడంతో భర్త ప్రాణాలు వదిలేశాడు. సమాజం, కుటుంబం తానేమిటీ అన్న విషయాన్ని నమ్మాలంటే అది తన ఆత్మహత్య ద్వారానే సాధ్యమవుతుందని భావించి విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు.34 ఏళ్ల మోహిత్ త్యాగి అనే వ్యక్తికి పెళ్లైన దగ్గర్నుంచీ భార్య నుంచి ఏవో వేధింపులకు గురవుతూనే ఉన్నాడట. 2020, డిసెంబర్లో ప్రియాంక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మోహిత్.. ఆపై నరకం చూసాడట.తనకు రెండో పెళ్లి కావడంతో భార్య తన ఆస్తి కోసం, తన సంపాదన కోసమే చేసుకుని ప్రతీరోజూ నరకం చూపించేదని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ భార్య ప్రియాంకను, ఆమె తరఫు బంధువులు పేర్లు పేర్కొంటూ సూసైడ్ నోట్ రాశాడు. తాను చనిపోవడానికి నిర్ణయించుకున్న కొన్ని సెకన్ల ముందే ఆ నోట్ తన ఫ్రెండ్స్ అందరికీ పంపించాడు. ఆ వెంటనే విషం తాగాడు. రెండు రోజుల మృత్యువుతో పోరాడి చనిపోయాడు.2024లో మోహిత్ తల్లి చనిపోయిన క్రమంలో భార్య ప్రియాంక బాగా గొడవపడిందట. ఆ సమయంలోనే భార్య కొంతమందిని ఇంటికి తీసుకొచ్చి రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల విలువైన బంగారాన్ని మొత్తం అపహరించిందట. ఈ విషయాన్ని మోహిత్ సోదరుడు తాజాగా వెల్లడించాడు.సూసైడ్ నోట్ లో ఏముందంటే..నాపై అనుమానంతో ఒక తప్పుడు కేసును భార్య పెట్టించింది. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక ప్లాన్ ప్రకారమే నన్ను పెళ్లి చేసుకుంది. అనేక సార్లు గర్భం వస్తే దాన్ని తీయించుకుంది. నన్ను చాలా హింసించింది. నేను ఇక తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నాపై పోలీస్ కేసు పెట్టడంతో నా జీవితం ఇక అనవసరం. నేనూ ఏ తప్పూ చేయలేదు. నేను చనిపోతున్నందుకు నాకు బాధేమీ లేదు. కాకపోతే నాకు పుట్టిన కొడుకు పరిస్థితి ఏమౌంతుందో అని ఆలోచిస్తున్నా. నాకు అదొక్కటే విచారంగా ఉంది. వీరంతా నా కొడుకును చంపేసే అవకాశం కూడా ఉంది. మీరు నిజాన్ని నమ్మాలంటే నాకు చావు ఒక్కటే శరణ్యం’ అని పేర్కొన్నాడు. భార్య ప్రియాంక, ఆమె తరుఫు బంధువులే తన చావుకు కారణమని తెలిపాడు. తన చావు తర్వాత భార్య ప్రియాంక కచ్చితంగా చింతిస్తుందని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఏప్రిల్ 15వ తేదీన సూసైడ్ చేసుకోగా, రెండు రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మార్కెట్ మరింత పడుతుంది.. బంగారం, వెండి కొనడమే మేలు
రాబోయే ఆర్థిక మాంద్యం గురించి చాలామంది తీవ్ర ఆందోళనలు చెందుతున్న వేళ.. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఓ సుదీర్ఘ ట్వీట్ చేసారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి.. కీలకమైన పెట్టుబడి సలహాలను సైతం పంచుకున్నారు.2025లో క్రెడిట్ కార్డ్ అప్పులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది.. దీనివల్ల నాలుగు లక్షల కంటే ఎక్కువమంది నష్టపోయె అవకాశం ఉంది. అమెరికా తీవ్రమైన ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తోందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. అంతే కాకుండా.. అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం రాబోతుందని గతంలోనే నేను వెల్లడించారు. అది ఇప్పుడు నిజమైందని అన్నారు.నిజానికి.. ఫేక్, హూ స్టోల్ మై పెన్షన్, రిచ్ డాడ్ పూర్ డాడ్ వంటి నేను రాసిన చాలా పుస్తకాలలో రాబోయే ఆర్థిక విపత్తు గురించి హెచ్చరించారు. నా హెచ్చరికలను పాటించిన వ్యక్తులు నేడు బాగానే ఉన్నారు. అలా చేయని వారి గురించి నేను ఆందోళన చెందుతున్నానని కియోసాకి అన్నారు.శుభవార్త ఏమిటంటే మీరు ఇప్పుడు కూడా బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిని కొనుగోలు చేస్తే ధనవంతులు అవుతారు. ఆలస్యం చేస్తే.. స్టాక్ మార్కెట్ మరింత పతనం కావొచ్చు, బంగారం ధరలు ఇంకా పెరగవచ్చు. కాబట్టి కేవలం ఒక బిట్‌కాయిన్ లేదా కొంత బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టే వారు ఈ సంక్షోభం నుంచి బయటపడవచ్చు, ధనవంతులుగా మారవచ్చు.పేదలు పేదలుగానే ఉండటానికి కారణం ఏమిటంటే.. నేను దానిని భరించలేను, నేను ప్రయత్నిస్తాను, నేను వేచి ఉంటాను అనే ఆలోచనలే. ఒక పేదవాడు కొన్ని ఔన్సుల బంగారం లేదా వెండి లేదా ఒక బిట్‌కాయిన్‌లో 1/2 వంతు కొనుగోలు చేస్తే.. ఈ ఆర్థిక మాంద్యం ముగిసిన తర్వాత వారు కొత్త ధనవంతులు అవుతారని నేను అంచనా వేస్తున్నానని రాబర్ట్ కియోసాకి అన్నారు.2035 నాటికి.. ఒక బిట్‌కాయిన్ ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. బంగారం, వెండి ధరలు కూడా ఊహకందని రీతిలో ఉంటాయని అన్నారు. భయంతో వేచి ఉన్నవారే.. నష్టాలను చూస్తారు. రాబోయే మాంద్యం లక్షలాది మందిని పేదలుగా చేస్తుంది.నేను ఊహించిన భారీ పతనం.. ఇప్పుడు జరుగుతున్న క్రాష్. ఇది మీ జీవిత కాలంలో గొప్ప సంపదను సాధించడానికి, మరింత ముఖ్యంగా ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి అవకాశం కావచ్చు. దయచేసి ఈ భారీ క్రాష్‌ను వృధా చేయకండి. జాగ్రత్తగా ఉండండి, బెస్ట్ ఆఫ్ లక్ అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ ముగించారు.MAKES ME SAD: In 2025 credit card debt is at all time highs. US debt is at all time highs. Unemployment is rising. 401 k’s are losing. Pensions are being stolen. USA may be heading for a GREATER DEPRESSION.I get sad because as I stated in an earlier X….Tweet….I warned…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 18, 2025 Note: బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం అనేది మీ సొంత ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా.. పెట్టుబడుల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి. నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

వెస్టిండీస్‌కు గుండె కోత.. 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినా..!
మహిళల వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్‌కు గుండె కోత మిగిలింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచినా కరీబియన్ జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయింది. థాయ్‌లాండ్‌తో ఇవాళ (ఏప్రిల్ 19) జరిగిన డు ఆర్ డై మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ 46.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్టిండీస్ కేవలం 10.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయినా 0.013 రన్‌రేట్ తేడాతో వరల్డ్‌కప్ బెర్త్‌ను కోల్పోయింది. పాయింట్ల పరంగా విండీస్‌తో సమానంగా ఉన్నప్పటికీ.. రన్‌రేట్ కాస్త ఎక్కువగా ఉండటంతో బంగ్లాదేశ్ ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ టోర్నీలో పాక్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో గెలిచి తొలి ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్ కోసం వెస్టిండీస్, బంగ్లాదేశ్ పోటీపడ్డాయి. ఇరు జట్లు చెరో 5 మ్యాచ్‌ల్లో తలో మూడు గెలువగా, రన్‌రేట్ కాస్త ఎక్కువగా ఉండటం చేత బంగ్లాదేశ్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది.కాగా, పాక్ వేదికగా జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025లో మొత్తం ఆరు జట్లు (పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్‌లాండ్) పాల్గొన్నాయి. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పాక్, బంగ్లాదేశ్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించగా.. పాక్, బంగ్లాదేశ్ క్వాలిఫయర్స్ ద్వారా క్వాలిఫై అయ్యాయి.

బంజారాహిల్స్‌లో కలకలం.. ఆసుపత్రి బిల్డింగ్‌పైకి ఎక్కి దూకేస్తానంటూ మహిళ హల్చల్
సాక్షి, హైదరాబాద్: ఏఐజీ ఆసుపత్రి మాజీ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసింది. బంజారాహిల్స్‌లోని నిర్మాణంలో ఉన్న ఏఐజీ ఆసుపత్రి పైకి ఎక్కిన ఓ యువతి.. బిల్డింగ్‌పై నుంచి దూకేందుకు యత్నించింది.యాజమాన్యం తనకు భరోసా కల్పిస్తేనే కిందకు దిగుతానని బెదిరింపులకు దిగుతోంది. ప్రస్తుతం ఆ మహిళను కిందకు దింపేదుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఆ మహిళను ఆసుపత్రి మాజీ ఉద్యోగి శివలీలగా గుర్తించారు. ఇటీవల ఆమెను ఉద్యోగం నుంచి ఆసుపత్రి యాజమాన్యం తొలగించింది. తన ఉద్యోగం తనకు ఇవ్వాలంటూ శివలీల డిమాండ్ చేస్తోంది.

రెండు దశాబ్దాల తర్వాత ‘బంధం’ కలుస్తోంది..!
ఎన్నో ఏళ్లుగా ‘రాజకీయ కత్తులు’ దూసుకుంటూనే ఉన్నారు.. ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. వీరి వైరం సుమారు రెండు దశాబ్దాల నాటిది. ఒకప్పుడు కలుసున్న బంధం.. చాలా ఏళ్ల పాటు దూరంగానే ఉంటూ వచ్చింది. అది రాజకీయ వైరం కావడంతో ప్రజల్నే నమ్ముకుని పోరాటం సాగించారు. వారిలో ఒకరు ఉద్ధవ్ ఠాక్రే అయితే.. ఇంకొకరు రాజ్ ఠాక్రే. వరుసకు సోదర బంధం వారిది. కానీ శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే జీవించి ఉన్న కాలంలోనే రాజ్ ఠాక్రే బయటకు వచ్చేశారు. శివసేనలో విభేదాల కారణంగా రాజ్ ఠాక్రే అక్కడ ఇమడలేక బయటకు వచ్చేశారు. ఎమ్మెన్నెస్ అంటూ పార్టీ స్థాపించి తన ఉనికిని మహారాష్ట్రలో చాటుకునే యత్నం చేశారు. కానీ ఆయన ఆశించిన ఫలితాలు ఏమీ చూడలేకపోయారు. చివరకు ఉద్ధవ్ ఠాక్రేతో కలిసేందుకు సిద్ధమయ్యారు రాజ్ ఠాక్రే.శివసేనతో కలుస్తా..ప్రస్తుతం మహారాష్ట్రలో సైతం హిందీ భాషా యుద్ధం నడుస్తోంది. తమకు థర్ద్ లాంగ్వేజ్ గా హిందీని తప్పనిసరి చేయాలని కేంద్రం చూస్తోంది. కేంద్ర ప్రభుత్వపు త్రి భాషా విధానంలో భాగంగా హిందీ థర్డ్ లాంగ్వేజ్ అంశాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)తో పాటు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అందుకే తాము ఒక్కటిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు రాజ్ ఠాక్రే తెలిపారు.ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న విభేదాల్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం ఒక్కటవ్వాలని ఉందని పేర్కొన్నారు. శివసేనతో కలిసి పోరాటం చేయటానికి నిశ్చయించుకున్నానని, అది కూడా వారికి ఇష్టమైతేనే అంటూ రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇక్కడ మరాఠీల కమ్యూనిటీని రక్షించడంతో పాటు మరాఠీ భాషను కాపాడుకోవడం ముఖ్యమన్నారాయన.మరి ఉద్ధవ్ ఏమన్నారంటే..తనతో రాజ్ ఠాక్రే కలుస్తానంటే ఏమీ ఇబ్బంది లేదన్నారు. తమ మధ్య భేదాభిప్రాయల కారణంగా ఎవరికి వారు అన్నట్లు ఉంటున్నామని, రాజ్ వస్తానంటే తనకు అభ్యంతరం ఏమీ లేదన్నారు. కాకపోతే మరాఠీ కమ్యూనిటీని వ్యతిరేకించే శక్తులను వెంటబెట్టుకు రావద్దని తన కండిషన్ అంటూ ఉద్ధవ్ పేర్కొన్నారు. ‘ మన శత్రువర్గాన్ని ఇంటికి ఆహ్వానించి.. వారికి భోజన తాంబూలం ఇచ్చే సాంప్రదాయాన్ని రాజ్ ఠాక్రే వదిలేతేనే తనతో కలవచ్చన్నారు. ఇక్కడ ఇద్దరికీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో ఎమ్మెన్నెస్.. ఎన్డీఏకు దగ్గరై వారికి మద్దతిచ్చింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిపై అసహనంతో ఉన్న రాజ్ ఠాక్రే.. శివసేన(యూబీటీ) తో కలవడానికి సిద్ధం కావడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.20 ఏళ్ల కిందటే.. బయటకుదాదాపు 19 ఏళ్ల కిందట బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి బయటకువచ్చిన రాజ్ ఠాక్రే 2006 మార్చి తొమ్మిదో తేదీన ఎమ్మెన్నెస్ పార్టీని స్ధాపించారు. ఆ తరువాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి తమ పార్టీ తరఫున అభ్యర్ధులను బరిలోకి దింపారు. వీరిలో ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెన్నెస్‌కు 5.71 శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ తరచూ పరాయిప్రాంతం వారిని ముఖ్యంగా ఉత్తరభారతీయులను లక్ష్యంగా చేసుకుని పదేపదే విమర్శించడంతో పార్టీ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది.2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరే గెలవగా మొత్తంమీద 3.15 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్ధితి పునరావృతమైంది. కేవలం 2.25 శాతం ఓట్లు పోలైనప్పటికీ కల్యాణ్ నియోజక వర్గం నుంచి రాజు పాటిల్ ఒక్కరే గెలిచారు. అక్కడ నుంచి ఎమ్మెన్నెస్ గ్రాఫ్ క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం తన పార్టీ ఉనికే ప్రమాదంలో పడిన సమయంలో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే.. ఉద్ధవ్ ను కలవడానికి సిద్ధమైనట్లు పలువురు విశ్లేషిస్తున్నారు.
కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
మురికివాడ ప్రజలు వర్సెస్ పోలీసులు
వెస్టిండీస్‌కు గుండె కోత.. 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినా..!
‘సుప్రీంకోర్టు నిర్దేశిస్తుందా?.. ఇక మేము పార్లమెంట్‌ను మూసేస్తాం’
భారత్‌లో జర్మన్ కంపెనీ అరుదైన రికార్డ్
'మ్యాడ్ స్క్వేర్' ఓటీటీ డేట్ ఫిక్సయిందా?
ఈస్టర్ సంధి: ఉక్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా
భూకంపం వస్తే ఏం చేయాలి?: చాట్‌జీపీటీ సమాధానం
ఢిల్లీపై గుజరాత్ విజయం.. అవకాశం ఉన్నా సెంచరీ పూర్తి చేయలేకపోయిన బట్లర్
'యానిమల్', 'జాట్'లో నా సీన్స్ కట్ చేశారు: పృథ్వీ
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
చల్లటి కబురు!
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు
‘సుప్రీంకోర్టు నిర్దేశిస్తుందా?.. ఇక మేము పార్లమెంట్‌ను మూసేస్తాం’
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
ఆ మర్మం ఏందో?.. స్మితా సబర్వాల్‌కు సీఎం సీపీఆర్వో కౌంటర్ ట్వీట్
బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్ జగన్
తెలంగాణ మంత్రి దగ్గర రూ.55 లక్షల అప్పు: రాజ్‌తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య
మూతపడిన జిందాల్ స్టీల్స్
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి
మార్కెట్ మరింత పడుతుంది.. బంగారం, వెండి కొనడమే మేలు
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
వెస్టిండీస్‌కు గుండె కోత.. 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినా..!
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
అమెరికా పౌరుడినని చెప్పినా వదలని ఐసీఈ
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
అమ్మా..ఊపిరాడలేదు!
హమ్మయ్య.. బంగారం ఆగింది!
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
'గుడ్ బ్యాడ్ అగ్లీ' కలెక్షన్స్.. అజిత్ కెరీర్లో ఇదే టాప్
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.
అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
బంజారాహిల్స్‌లో కలకలం.. ఆసుపత్రి బిల్డింగ్‌పైకి ఎక్కి దూకేస్తానంటూ మహిళ హల్చల్
కంగారు పడకు! నేనే ఈ సారి ఎండలు కాస్త ఎక్కవగా ఉన్నాయ్!
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
విశ్వమూ భ్రమిస్తోంది
రెండు దశాబ్దాల తర్వాత ‘బంధం’ కలుస్తోంది..!
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
పెరుగుతున్న మత సమ్మతి
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్
ఉపాధి హామీ పనులు.. 17జిల్లాలు అప్.. 15జిల్లాలు డౌన్..
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం
అయ్యో! ఆగండయ్యా! అది అప్పుడు ఇప్పుడు మనం వాళ్ల కూటమిలో ఉన్నాం!
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
రెండు పెళ్లిళ్లు.. ఎందుకంటే నేను శ్రీరాముడిని ఫాలో కాను: కమల్ హాసన్
భూకంపం వస్తే ఏం చేయాలి?: చాట్‌జీపీటీ సమాధానం
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్
'మ్యాడ్ స్క్వేర్' ఓటీటీ డేట్ ఫిక్సయిందా?
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
ఢిల్లీపై గుజరాత్ విజయం.. అవకాశం ఉన్నా సెంచరీ పూర్తి చేయలేకపోయిన బట్లర్
దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
నేపాల్ పరిణామాలకు బాధ్యులెవరు?
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
ఎవడ్రా కూసేది.. 2028 వరకు ఖాళీ లేదిక్కడ.. ఇచ్చిపడేసిన అనురాగ్ కశ్యప్
మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా..
బైరెడ్డి శబరి.. చెల్లని ఎంపీ!
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
ఇంకెంత కాలం జాబ్ చేస్తారు.. ఇకనైనా మారండి
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవో
శంకర్‌దాదా ఎంబీబీఎస్.. ఆమె జీవితాన్నే మార్చేసింది!
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
భారత్‌లో జర్మన్ కంపెనీ అరుదైన రికార్డ్
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
కట్టు కథలు.. తప్పుడు ప్రచారాలు.. కూటమి సర్కార్‌పై మిథున్‌రెడ్డి ఫైర్
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్‌గా..
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్ల కోత..
విద్యార్థుల వీసాలపై పిడుగు
ఇన్ఫోసిస్ డివిడెండ్.. 17 నెలల బుడ్డోడికి రూ. 3.3 కోట్లు
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి సర్వే
నాన్న కల నెరవేర్చిన తెలుగు డైరెక్టర్.. కొత్త ఇల్లు
కేఎల్ రాహుల్ కామెంట్స్.. షాకైన పీటర్సన్!.. నా దోస్తులంతా ఇంతే..
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
డెత్ సర్టిఫికెట్‌కు రూ.90 వేల లంచం
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
రొయ్యకు లోకల్ మార్కెట్
'యానిమల్', 'జాట్'లో నా సీన్స్ కట్ చేశారు: పృథ్వీ
కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
మురికివాడ ప్రజలు వర్సెస్ పోలీసులు
వెస్టిండీస్‌కు గుండె కోత.. 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినా..!
‘సుప్రీంకోర్టు నిర్దేశిస్తుందా?.. ఇక మేము పార్లమెంట్‌ను మూసేస్తాం’
భారత్‌లో జర్మన్ కంపెనీ అరుదైన రికార్డ్
'మ్యాడ్ స్క్వేర్' ఓటీటీ డేట్ ఫిక్సయిందా?
ఈస్టర్ సంధి: ఉక్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా
భూకంపం వస్తే ఏం చేయాలి?: చాట్‌జీపీటీ సమాధానం
ఢిల్లీపై గుజరాత్ విజయం.. అవకాశం ఉన్నా సెంచరీ పూర్తి చేయలేకపోయిన బట్లర్
'యానిమల్', 'జాట్'లో నా సీన్స్ కట్ చేశారు: పృథ్వీ
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
చల్లటి కబురు!
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు
‘సుప్రీంకోర్టు నిర్దేశిస్తుందా?.. ఇక మేము పార్లమెంట్‌ను మూసేస్తాం’
ఏపీలో మరో ట్విస్ట్.. కొత్త రకం పన్ను వేసిన మాధవి రెడ్డి
ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
ఆ మర్మం ఏందో?.. స్మితా సబర్వాల్‌కు సీఎం సీపీఆర్వో కౌంటర్ ట్వీట్
బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్ జగన్
తెలంగాణ మంత్రి దగ్గర రూ.55 లక్షల అప్పు: రాజ్‌తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య
మూతపడిన జిందాల్ స్టీల్స్
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి
మార్కెట్ మరింత పడుతుంది.. బంగారం, వెండి కొనడమే మేలు
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
వెస్టిండీస్‌కు గుండె కోత.. 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినా..!
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
అమెరికా పౌరుడినని చెప్పినా వదలని ఐసీఈ
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
మీరు కొత్త చట్టం కనిపెట్టారు.. హైకోర్టుపై సుప్రీంకోర్టు సీరియస్
అమ్మా..ఊపిరాడలేదు!
హమ్మయ్య.. బంగారం ఆగింది!
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
'గుడ్ బ్యాడ్ అగ్లీ' కలెక్షన్స్.. అజిత్ కెరీర్లో ఇదే టాప్
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.
అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
బంజారాహిల్స్‌లో కలకలం.. ఆసుపత్రి బిల్డింగ్‌పైకి ఎక్కి దూకేస్తానంటూ మహిళ హల్చల్
కంగారు పడకు! నేనే ఈ సారి ఎండలు కాస్త ఎక్కవగా ఉన్నాయ్!
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
కెరీర్లో తొలి బంతికే సిక్సర్.. చరిత్రపుటల్లోకెక్కిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
విశ్వమూ భ్రమిస్తోంది
రెండు దశాబ్దాల తర్వాత ‘బంధం’ కలుస్తోంది..!
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
పెరుగుతున్న మత సమ్మతి
సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్ ద్రవిడ్
తన కూతురిపై కన్నేశాడనే కడతేర్చింది
అందుకే ఓడిపోయాం.. అదే అతిపెద్ద గుణపాఠం: పాటిదార్
ఉపాధి హామీ పనులు.. 17జిల్లాలు అప్.. 15జిల్లాలు డౌన్..
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం
అయ్యో! ఆగండయ్యా! అది అప్పుడు ఇప్పుడు మనం వాళ్ల కూటమిలో ఉన్నాం!
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
రెండు పెళ్లిళ్లు.. ఎందుకంటే నేను శ్రీరాముడిని ఫాలో కాను: కమల్ హాసన్
భూకంపం వస్తే ఏం చేయాలి?: చాట్‌జీపీటీ సమాధానం
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్
'మ్యాడ్ స్క్వేర్' ఓటీటీ డేట్ ఫిక్సయిందా?
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
ఢిల్లీపై గుజరాత్ విజయం.. అవకాశం ఉన్నా సెంచరీ పూర్తి చేయలేకపోయిన బట్లర్
దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
నేపాల్ పరిణామాలకు బాధ్యులెవరు?
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
ఎవడ్రా కూసేది.. 2028 వరకు ఖాళీ లేదిక్కడ.. ఇచ్చిపడేసిన అనురాగ్ కశ్యప్
మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా..
బైరెడ్డి శబరి.. చెల్లని ఎంపీ!
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
ఇంకెంత కాలం జాబ్ చేస్తారు.. ఇకనైనా మారండి
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవో
శంకర్‌దాదా ఎంబీబీఎస్.. ఆమె జీవితాన్నే మార్చేసింది!
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
భారత్‌లో జర్మన్ కంపెనీ అరుదైన రికార్డ్
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
కట్టు కథలు.. తప్పుడు ప్రచారాలు.. కూటమి సర్కార్‌పై మిథున్‌రెడ్డి ఫైర్
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్‌గా..
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్ల కోత..
విద్యార్థుల వీసాలపై పిడుగు
ఇన్ఫోసిస్ డివిడెండ్.. 17 నెలల బుడ్డోడికి రూ. 3.3 కోట్లు
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి సర్వే
నాన్న కల నెరవేర్చిన తెలుగు డైరెక్టర్.. కొత్త ఇల్లు
కేఎల్ రాహుల్ కామెంట్స్.. షాకైన పీటర్సన్!.. నా దోస్తులంతా ఇంతే..
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
డెత్ సర్టిఫికెట్‌కు రూ.90 వేల లంచం
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
రొయ్యకు లోకల్ మార్కెట్
'యానిమల్', 'జాట్'లో నా సీన్స్ కట్ చేశారు: పృథ్వీ
సినిమా

'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
తెలుగు చిత్రసీమలో తెలుగమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. హీరోయిన్గా మెరిసేందుకు చాలా కష్టపడుతుంటారు. అలాంటిది సుమయ రెడ్డి అయితే తన తొలి ప్రయత్నంలోనే హీరోయిన్గా, రచయితగా, నిర్మాతగా భిన్న పాత్రల్ని పోషించింది. 'డియర్ ఉమ' అంటూ ఏప్రిల్ 18న వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. పృథ్వీ అంబర్, సుమయ రెడ్డి( Sumaya Reddy) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సాయిరాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించాడు. మరి ఈ సుమయ రెడ్డి తొలి ప్రయత్నం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..?గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఉమ (సుమయ రెడ్డి) వైద్య విద్యను పూర్తి చేసి సొంతంగా ఓ హాస్పిటల్ నిర్మించి తండ్రి కలను నెరవేర్చాలని అనుకుంటుంది. మరోవైపు దేవ్‌కు(పృథ్వీ అంబర్) మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. భవిష్యత్‌లో రాక్‌స్టార్ కావాలని ఎన్నో కలలు కంటాడు. కానీ, చదువులో చాలా వెనుకపడిపోతాడు. తన కాలేజీ సమయంలో దేవ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే, మ్యూజిక్ కారణంగానే దేవ్‌కు ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ప్రేమలో విఫలమైన దేవ్ రాక్ స్టార్ అవ్వాలనే ప్రయత్నంలో అంతగా సక్సెస్ కాలేకపోతాడు. చిన్నా చితకా అవకాశల కోసం గడపగడపకూ తిరుగుతుంటాడు. అలాంటి దేవ్‌కి ఓ సారి ఉమ డైరీ దొరుకుతుంది. తనకు గాయమై హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తన జీవితం మారిందని.. అప్పటి నుంచే ఉమ జీవితం ఆగిపోయిందని తెలుసుకుంటాడు. అసలు ఉమకి ఏం జరిగింది..? ఉమ నేపథ్యం ఏంటి? ఉమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తుండేది? అనే ప్రశ్నలతో సతమతం అవుతుంటాడు దేవ్. ఇక ఉమ కోసం దేవ్ చేసిన పోరాటం ఏంటి? ఉమతో దేవ్ ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఈ కథలో దేవ్ అన్న సూర్య (కమల్ కామరాజ్) పాత్ర ఏంటి..? అన్నది కథ.వైద్యం పేరుతో కార్పొరేట్ హాస్పిటల్స్ చేసే మోసాలకు లవ్‌స్టోరీని జోడించి డియర్ ఉమ కథను సుమయ రెడ్డి రాసుకుంది. ఈ కథను సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. వైద్య రంగంలోని లోపాలను ఎత్తిచూపుతూ తెరకెక్కించాడు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గుర్తుచేస్తూ, సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా కథను నడిపించారు. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.ఎలా ఉందంటే..?రధన్ సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది, అయితే, కొన్ని చోట్ల మరింత మెరుగ్గా ఉండాల్సింది. రాజ్ తోట కెమెరా వర్క్ సహజంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన షాట్స్ మిస్ అయినట్టు అనిపించవచ్చు. స్క్రీన్ ప్లే సినిమాకు ఒక బలంగా నిలిచింది, ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అయితే, క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సన్నివేశాలు కొందరికి అతిగా అనిపించవచ్చు. పతాక సన్నివేశంలోని పాట సినిమా సందేశాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ, కథలో మరింత సహజంగా కలిసిపోయి ఉంటే బాగుండేది. మొత్తానికి, "డియర్ ఉమర్" ఒక మంచి ప్రయత్నం, కానీ కొన్ని అంశాలలో మరింత శ్రద్ధ పెడితే ఇది ఒక గొప్ప చిత్రంగా నిలిచేది. తొలి చిత్రమే అయినా సుమ చిత్ర ఆర్ట్స్, నిర్మాత సుమయ రెడ్డి గొప్ప కథను అందించడంలో సక్సెస్ అయ్యారు.డియర్ ఉమ చిత్రానికి సుమయ రెడ్డి ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. మంచి కథను ఇవ్వడమే కాకుండా.. ఈ కథను అనుకున్నట్టుగా తీయడంలో ఖర్చు పెట్టిన నిర్మాతగానూ సుమయ రెడ్డి సక్సెస్ అయింది. సుమయ రెడ్డిలోని రచయిత, నిర్మాతకు వంద మార్కులు వేసుకోవచ్చు. ఇక నటిగా ఇంకాస్త మెరుగు పర్చుకోవాల్సి ఉంటుందేమో. తెరపై సుమయ రెడ్డి అందంగా కనిపించారు. హీరోగా పృథ్వీ అంబర్ యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. కమల్ కామరాజ్ పాత్ర సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. అజయ్ ఘోష్ పాత్ర రొటీన్ అనిపిస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పోషించిన పాత్రలు అక్కడక్కడా నవ్విస్తాయి. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా డియర్ ఉమను చూస్తే తప్పకుండా మెప్పిస్తుంది.

శంకర్‌దాదా ఎంబీబీఎస్.. ఆమె జీవితాన్నే మార్చేసింది!
చిరంజీవి (Chiranjeevi) బ్లాక్‌బస్టర్ సినిమాల్లో శంకర్‌దాదా ఎంబీబీఎస్ (Shankar Dada M.B.B.S. Movie) ఒకటి. ఈ సినిమా చూశాకే తనకున్న వ్యాధి బయటపడిందంటోంది వైష్ణవి వర్మ అనే అమ్మాయి. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ చేసింది. నాకు టైప్ 1 డయాబెటిస్ ఉందన్న విషయం డాక్టర్ చెప్తేనో, క్లినిక్‌కు వెళ్తేనో తెలియలేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ చూశాక ఆ వ్యాధి ఉందని తెలిసొచ్చింది. నేను సరదాగా అనడం లేదు, నిజమే చెప్తున్నాను.ఏళ్లతరబడి బాధ.. ఒక్క సినిమాతోఆ పెద్ద స్టోరీని మీకు క్లుప్తంగా చెప్తాను. నాకెప్పుడూ దాహం వేస్తుండేది.. ఆకలిగా ఉండేది. ఎక్కువసార్లు టాయిలెట్‌కు వెళ్లేదాన్ని. ఉన్నపళంగా బరువు తగ్గేదాన్ని. ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా ఎవరూ ఏం చెప్పలేకపోయారు. ఓరోజు నేను శంకర్‌దాదా ఎంబీబీఎస్ చూస్తున్నాను. అందులో చిరంజీవి చెప్తున్న ఓ వ్యాధి లక్షణాలన్నీ కరెక్ట్‌గా నాకు సరిపోయాయి. సినిమా మధ్యలో ఆపేసి నాకు మధుమేహం ఉన్నట్లుంది అని పేరెంట్స్‌కు చెప్పాను. వాళ్లు బిగ్గరగా నవ్వి.. నెగెటివ్‌గా ఆలోచించకు అన్నారు.మధుమేహం ఉందని తెలిసిందిఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించుకుంటే రక్తంలో చక్కెర.. డెసిలీటర్కు 555 మిల్లీగ్రాములు ఉంది. అలా నాకు టైప్ 1 డయాబెటిస్ ఉందని నిర్ధారణ అయ్యాక చికిత్స తీసుకున్నాను. నిజానికి నాకు మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది.. కానీ ఎవరం గెస్ చేయలేకపోయాం. ఒక సినిమా మాత్రం నా జీవితాన్నే మార్చేసింది అని చెప్పుకొచ్చింది. ఈ మేరకు శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో చిరంజీవి మాట్లాడిన ఓ క్లిప్పును కూడా జత చేసింది. ప్రస్తుతం ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Vaishnavi Varma (@pancreaspaused) చదవండి: రెండు పెళ్లిళ్లు.. ఎందుకంటే నేను శ్రీరాముడిని ఫాలో కాను: కమల్

తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?
ఈ వారం థియేటర్లలో తెలుగులో పలు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో తమన్నా 'ఓదెల 2'(Odela 2 Movie) ఒకటి. హారర్ ఫాంటసీగా తీసిన ఈ మూవీని విడుదలకు ముందు బాగానే ప్రమోట్ చేశారు. తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేశారు. కానీ కలెక్షన్సే(Odela 2 Collection) మాత్రం ఏ మాత్రం ఆశాజనకంగా రావట్లేదు. పరిస్థితి ఘోరంగా ఉంది.రెగ్యులర్ గా రిలీజయ్యే శుక్రవారం కాకుండా గురువారం (ఏప్రిల్ 17న) ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. కానీ తొలిరోజు చాలాచోట్ల థియేటర్లు సరిగా ఫుల్ కాలేదు. దీంతో రూ.85 లక్షలే వచ్చాయని, రెండో రోజుకి ఇది మరింత తగ్గి రూ.59 లక్షలే వచ్చాయని సమాచారం. మొత్తంగా రూ.1.44 కోట్లు మాత్రమే ఇప్పటివరకు వసూలైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్)దాదాపు రూ.24 కోట్ల మేర బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు ఇంత తక్కువ వసూళ్లు రావడం చూస్తుంటే వీకెండ్ తర్వాత థియేటర్లలో నిలబడుతుందా అనే సందేహం వస్తోంది. మరి లాంగ్ రన్ లో 'ఓదెల 2'కి ఎన్ని కోట్ల వస్తాయనేది చూడాలి?కథ పరంగా యావరేజ్ టాక్ వచ్చింది. మిక్స్ డ్ రివ్యూలు వచ్చినప్పటికీ ఈ తరహా వసూళ్లు ఎందుకొస్తున్నాయనేది నిర్మాతలకు అర్థం కావట్లేదు. 'అరుంధతి' సినిమాతో పోలిక రావడం ఏమైనా మైనస్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. తమన్నా(Tamannaah Bhatia) శివశక్తిగా డిఫరెంట్ గెటప్ వేసినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బీభత్సం సృష్టించిన తెలుగు నటుడి కారు)

నాన్న కల నెరవేర్చిన తెలుగు డైరెక్టర్.. కొత్త ఇల్లు
తెలుగులోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి. అలా పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ప్రస్తుతం ఇతడు దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువ బిజీగా ఉన్నాడు. సినిమాల గురించి పక్కనబెడితే ఇప్పుడు నాన్న కల నెరవేర్చాడు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) తరుణ్ భాస్కర్ తల్లి గీత గురించి ప్రస్తుతం నటిగా కొనసాగుతోంది. ఫిదా, ఈ నగరానికి ఏమైంది, హిట్ 2 తదితర చిత్రాల్లో ఈమె నటించింది. తరుణ్ భాస్కర్ తండ్రి ఉదయ్ భాస్కర్ చాన్నాళ్ల క్రితమే చనిపోయారు. సొంతిల్లు కట్టుకోవాలనేది ఆయన కల. ఇప్పుడు దాన్ని నెరవేర్చానని చెబుతూ.. గృహ ప్రవేశం చేసిన ఫొటోలని తరుణ్ పోస్ట్ చేశాడు.'కల నెరవేర్చాను నాన్న, నువ్వు చూస్తున్నావనే అనుకుంటున్నా' అని తరుణ్ భాస్కర్ రాసుకొచ్చాడు. ఇది చూసిన పలువురు నెటిజన్స్.. తరుణ్ భాస్కర్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈషా రెబ్బాతో కలిసి ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?)
న్యూస్ పాడ్‌కాస్ట్

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
క్రీడలు

RR VS LSG: ఐపీఎల్లో సంచలనం
ఐపీఎల్లో సంచలనం నమోదైంది. ఓ కుర్రాడు కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే అరంగేట్రం చేయనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ ఆడుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. సూర్యవంశీకి ముందు ఈ రికార్డు ప్రయాస్ రే బర్మన్ పేరిట ఉండేది. బర్మన్ 2019 సీజన్లో ఆర్సీబీ తరఫున 16 ఏళ్ల 157 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. బర్మన్ తర్వాత ఐపీఎల్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడి రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ పేరిట ఉంది. ముజీబ్ 2018 సీజన్లో 17 ఏళ్ల 11 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.అత్యంత పిన్న వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆటగాళ్లు..14y 23d - వైభవ్ సూర్యవంశీ, 2025*16y 157d - ప్రయాస్ రే బర్మన్, 2019 17వ 11వ తేదీ - ముజీబ్ ఉర్ రెహమాన్, 2018 17y 152d - రియాన్ పరాగ్, 2019 17y 179d - ప్రదీప్ సాంగ్వాన్, 2008లక్నో, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ విషయానికొస్తే.. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా రాయల్స్ కెప్టెన్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలో రియాన్ పరాగ్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ మ్యాచ్‌లో లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆకాశ్‌దీప్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. రాయల్స్ తరఫున సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతున్నాడు.తుది జట్లు..రాజస్థాన్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, రియాన్ పరాగ్(కెప్టెన్), నితీష్ రాణా, ధృవ్ జురెల్(వికెట్‌కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండేఇంపాక్ట్ సబ్స్: వైభవ్ సూర్యవంశీ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్/కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్ఇంపాక్ట్ సబ్స్: ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్

IPL 2025: రాయల్స్‌పై లక్నో విజయం
రాయల్స్‌పై లక్నో విజయంఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగా.. రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో రాయల్స్ గెలుపుకు 9 పరుగులు అవసరం కాగా.. ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చాడు. నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్స్17.6వ ఓవర్- ఆవేశ్ ఖాన్ ఒకే ఓవర్లో జైస్వాల్, రియాన్ పరాగ్‌ను (39) ఔట్ చేశాడు. రాయల్స్ గెలవాలంటే 12 బంతుల్లో మరో 20 పరుగులు చేయాలి.మూడో వికెట్ కోల్పోయిన రాయల్స్17.1వ ఓవర్- 52 బంతుల్లో 74 పరుగులు చేసిన జైస్వాల్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్9.6వ ఓవర్- 94 పరుగుల వద్ద రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రాణా (8) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 94/2గా ఉంది. యశస్వి జైస్వాల్ (52), రియాన్ పరాగ్ క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్8.4వ ఓవర్- మార్క్రమ్ బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) స్టంపౌటయ్యాడు.ధాటిగా ఆడుతున్న రాయల్స్ ఓపెనర్లు181 పరుగుల ఛేదనలో రాయల్స్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. యశస్వి జైస్వాల్ 24 బంతుల్లో 40.. వైభవ్ సూర్యవంశీ 12 బంతుల్లో 21 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 6 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 61/0గా ఉంది. తొలి మ్యాచ్‌లోనే దంచికొడుతున్న వైభవ్ సూర్యవంశీరాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే దంచి కొడుతున్నాడు. 7 బంతుల్లోనే ఫోర్, 2 సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేశాడు. సూర్యవంశీకి జతగా వచ్చిన యశస్వి జైస్వాల్ (11 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) కూడా ధాటిగా ఆడుతున్నాడు. ఫలితంగా రాయల్స్ 3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో సమద్ విధ్వంసం.. గౌరవప్రదమైన స్కోర్ చేసిన లక్నోసందీప్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో అబ్దుల్ సమద్ పేట్రేగిపోయాడు. నాలుగు సిక్సర్లు సహా 27 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ 66, ఆయుశ్ బదోని 50 పరుగులు చేయగా.. సమద్ 10 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (4), పంత్ (3) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ దక్కించుకున్నారు. హాఫ్ సెంచరీ పూర్తి అయిన వెంటనే ఔటైన బదోని17.3వ ఓవర్- తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆయుశ్ బదోని ఆతర్వాతి బంతికే ఔటయ్యాడు. బదోని 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 18 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 146/5గా ఉంది. మిల్లర్ (4), సమద్ (1) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో15.5వ ఓవర్- 130 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. హసరంగ బౌలింగ్‌లో రియన్ పరాగ్ సూపర్ క్యాచ్ పట్టడంతో మార్క్రమ్ (66) ఔటయ్యాడు. బదోనికి (46) జతగా మిల్లర్ (3) క్రీజ్‌లోకి వచ్చాడు. 17 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 139/4గా ఉంది.మార్క్రమ్ ఫిఫ్టి.. 100 దాటిన లక్నో స్కోర్10.3వ ఓవర్- సందీప్ శర్మ బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి మార్క్రమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 12 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 105/3గా ఉంది. మార్క్రమ్ 60, బదోని 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. పంత్ మరోసారి..!7.4వ ఓవర్- ప్రస్తుత సీజన్లో పంత్ (9 బంతుల్లో 3) మరోసారి విఫలమయ్యాడు. హసరంగ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం లక్నో స్కోర్ 54/3గా ఉంది. మార్క్రమ్ (34), బదోని క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో.. డేంజరస్ పూరన్ ఔట్5.2వ ఓవర్- 46 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. సందీప్ శర్మ బౌలింగ్‌లో ఇన్ ఫామ్ బ్యాటర్ నికోలస్ పూరన్ (11) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. మార్ష్ ఔట్2.2వ ఓవర్- టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (4) ఔటయ్యాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా రాయల్స్ కెప్టెన్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలో రియాన్ పరాగ్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆకాశ్‌దీప్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. రాయల్స్ తరఫున సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ ఆడుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అతడి వయసు 14 ఏళ్ల 23 రోజులు.తుది జట్లు..రాజస్థాన్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, రియాన్ పరాగ్(కెప్టెన్), నితీష్ రాణా, ధృవ్ జురెల్(వికెట్‌కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండేఇంపాక్ట్ సబ్స్: వైభవ్ సూర్యవంశీ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్/కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్ఇంపాక్ట్ సబ్స్: ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్

IPL 2025: కేకేఆర్‌తో జతకట్టిన అభిషేక్ నాయర్
టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో జతకట్టాడు. నాయర్ టీమిండియా అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక కాకముందు (గత సీజన్లో) కేకేఆర్ సపోర్టింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా పదవి ఊడటం ఖాయమని తెలిసాక నాయర్ మళ్లీ కేకేఆర్‌లో చేరిపోయాడు. నాయర్‌ను తిరిగి తమ సహాయక బృందంలోకి ఆహ్వానిస్తున్నామని కేకేఆర్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.నాయర్ గతేడాది జులైలో టీమిండియా అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అతని పదవీకాలం ఈ ఏడాది జులైతో ముగుస్తుంది. బీసీసీఐ నాయర్ కాంట్రాక్ట్ పునరుద్ధరించకూడదని నిర్ణయించింది. దీంతో నాయర్ తన పదవీకాలం మరో మూడు నెలలు ఉండగానే టీమిండియా పదవికి గుడ్‌బై చెప్పి తన పాత జట్టు కేకేఆర్‌లో చేరిపోయాడు. నాయర్‌తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ కాంట్రాక్ట్‌లను కూడా పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.కాగా, గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో అభిషేక్ నాయర్ కీలకపాత్ర పోషించాడు. అయితే కేకేఆర్ పరిస్థితి ఈ సీజన్లో భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. నాయర్ చేరికతో కేకేఆర్ ఆటతీరులో మార్పు వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్ టేబుల్ టాపర్లుగా కొనసాగుతున్నాయి.

అజారుద్దీన్‌కు బిగ్ షాక్
టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్‌కు భారీ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో (ఉప్పల్ స్టేడియం) నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరును తొలగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతూ ఈ మేరకు తీర్పునిచ్చారు. అజారుద్దీన్ హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్న కాలంలో నార్త్ స్టాండ్‌కు తన పేరును పెట్టుకున్నాడు. ఈ నిర్ణయం చెల్లదని జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ఈ నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలున్నాయని తెలిపారు. వెంటనే నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించాలని హెచ్‌సీఏను ఆదేశించారు. టికెట్లపై ఇక నుంచి అజారుద్దీన్ పేరును ముద్రించరాదని తేల్చి చెప్పారు.కాగా, 2019లో అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉండగా.. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్‌కు తన పేరును పెట్టుకున్నాడు. ఆ ఏడాది డిసెంబర్ 7న భారత దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ స్టాండ్‌ను ప్రారంభించారు. అజారుద్దీన్ భారత్ తరఫున 99 టెస్ట్‌లు, 334 వన్డేలు ఆడి మొత్తంగా 29 సెంచరీలు చేశాడు.
బిజినెస్

సన్‌రైజర్స్ టీమ్ ఓనర్ వద్ద ప్రీమియం కార్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) యజమానిగా, సన్ టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కావ్య మారన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బిజినెస్‌తోపాటు ఆమెకు కార్లంటే మక్కువ ఎక్కువే. ఆమె గ్యారేజీని ప్రీమియం కార్లతో నింపేయడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం తన వద్ద ఉన్న హై-ఎండ్ కార్ల వివరాలు కింద తెలుసుకుందాం.రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8 ఈడబ్ల్యూబీదీని ధర భారతదేశంలో సుమారు రూ.12.2 కోట్లు.బెంట్లీ బెంటాయ్గా ఈడబ్ల్యూబీఈ బ్రాండ్ తయారు చేసిన మొదటి ఎస్యూవీ ఇది. దీని ధర సుమారు రూ.6 కోట్లు. ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్‌తో వస్తుంది.బీఎమ్‌డబ్ల్యూ ఐ7ఆమె వద్ద బ్లాక్ సఫైర్ మెటాలిక్ పెయింట్‌తో కూడిన బీఎమ్‌డబ్ల్యూ ఐ7 కారు ఉంది. దీని ధర రూ.2.5 కోట్లుగా ఉంది.ఫెరారీ రోమాఇటాలియన్ ఫెరారీ గ్రాండ్ టూరింగ్ కారు ధర సుమారు రూ.3.76 కోట్లు.కావ్య మారన్ 1999 నవంబర్ 3న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో బీకామ్ పూర్తి చేసిన ఆమె న్యూయార్క్ యూనివర్సిటీలోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ చేశారు. ఎస్ఆర్హెచ్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సహా సన్ గ్రూప్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీల నిర్వహణలో కావ్య మారన్ కీలక పాత్ర పోషిస్తోంది.ఇదీ చదవండి: ఇంకెంత కాలం జాబ్ చేస్తారు.. ఇకనైనా మారండిఆమె సారథ్యంలో 2016లో ఐపీఎల్ ఛాంపియన్షిప్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 2018, 2024లో రన్నరప్‌గా నిలిచింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 2023, 2024లో ఎస్ఏ20 లీగ్ టైటిల్ గెలుచుకుంది. 2024లో దేవి అవార్డ్స్‌లో ‘ఫేస్ అండ్ ఫోర్స్ బిహైండ్ సన్‌రైజర్స్ హైదరాబాద్’ అవార్డు అందుకున్నారు. ఆమె నికర ఆస్తుల విలువ సుమారు 50 మిలియన్ డాలర్లు (రూ.409 కోట్లు) ఉంటుందని అంచనా.

ఇంకెంత కాలం జాబ్ చేస్తారు.. ఇకనైనా మారండి
రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోత కొనసాగుతుందని ప్రముఖ రచయిత, ఆర్థిక నిపుణులు రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. సాంప్రదాయంగా ఉద్యోగంపై ఆధారపడటాన్ని పున:పరిశీలించాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కొన్ని వివరాలు పంచుకున్నారు. ఇటీవలి కాలంలో ఇప్పటికే చెలరేగుతున్న ఆర్థిక అస్థిరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, లక్షల మందిని ఇది ప్రభావితం చేస్తుందని అంచనా వేశారు.‘గత రెండేళ్లుగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. రాబోయే కొన్నేళ్లలో మరిన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారు. కొలువు పోతుందని భావిస్తే అందుకు అనుగుణంగా మరింత ఉత్తమంగా సిద్ధం అవ్వాలి. ఉద్యోగ భద్రత కోసం ముందుకు సాగాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆంత్రప్రెన్యూర్‌షిప్ ద్వారా ఆర్థిక స్వేచ్ఛ దిశగా అడుగులు వేయాలి. దాంతో ఆర్థికంగా ఎదురయ్యే ఎదురుదెబ్బలను అవకాశాలుగా మలుచుకోవాలి’ అని సూచించారు.BEFORE YOU LOSE YOUR JOBIn the last two years…. Millions have lost their jobs.In the next few years…. Millions more will lose their jobs.If you are feeling you may lose your job….best prepare now.Turn a bad event to a great opportunity to stop being an employee,…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 16, 2025ఇదీ చదవండి: జాబ్ ఆఫర్ లేకుండానే యూఎస్‌లో పని‘ఉపాధి కంటే ఆంత్రప్రెన్యూర్‌షిప్ మరింత స్థిరమైంది. వ్యక్తులు యజమానులపై ఆధారపడటం అనే ధోరణి నుంచి బయటకు రావాలి. ఇంకెతకాలం ఉద్యోగులుగా ఉంటారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగండి. ఉద్యోగ భద్రత అనే భావం నుంచి బయటకు రండి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ఆచరణాత్మక మార్గం. ఇటువంటి వేదికలు ప్రజలు స్వతంత్రంగా విజయం సాధించడంలో సహాయపడటానికి అవసరమైన శిక్షణ ఇస్తాయి. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీతో పార్ట్‌టైమ్ వ్యాపారాన్ని ప్రారంభించాలని అధ్యక్షుడు ట్రంప్, నేను సిఫార్సు చేస్తున్నాం. ప్రస్తుతం అనేక గొప్ప నెట్వర్క్ మార్కెటింగ్ సంస్థలు ఉన్నాయి’ అని కియోసాకి చెప్పారు.

కోటి రూపాయల ఇళ్లే కొంటున్నారు..!
సొంతింటి కల సాకారం చేసుకునేందుకు నగరవాసులు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జేబుకు భారం కాకుండా బడ్జెట్ ఇళ్లను కొని, తర్వాత బాధపడే బదులు.. భవిష్యత్తు అవసరాలను ముందుగానే ఊహించి అధిక విస్తీర్ణం కలిగిన ఖరీదైన గృహాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రేటర్లో రూ.50 లక్షలలోపు ధర ఉండే అందుబాటు ఇళ్ల విక్రయాలు క్రమంగా తగ్గుతూ.. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం యూనిట్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్ నగరంలో ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో అఫర్డబుల్ హౌసింగ్ వాటా 55 శాతంగా ఉంది. కానీ, గతేడాది ఇదే నెలలోని 60 శాతంతో పోలిస్తే మాత్రం ఈ విభాగం వాటా 14 శాతం మేర తగ్గింది. అదే రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్ల వాటా ఏడాది కాలంలో 17 శాతం మేర పెరిగింది. మార్చిలో రిజిస్ట్రేషన్స్ అయిన మొత్తం ప్రాపర్టీలలో ఖరీదైన ఇళ్ల వాటా 19 శాతంగా ఉంది. గతేడాది ఇదే నెలలో ఈ విభాగం వాటా 15 శాతమే. దీని అర్థం.. గృహ కొనుగోలుదారులు అందుబాటు గృహాల నుంచి క్రమంగా ఖరీదైన ఇళ్ల వైపు మొగ్గు చూపిస్తున్నారని నైట్‌ఫ్రాంక్ ఇండియా నెలవారీ నివేదిక వెల్లడించింది.👉ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..రూ.4,471 కోట్ల విలువైన ప్రాపర్టీలు.. గ్రేటర్లో గత నెలలో 6,327 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. వీటి విలువ రూ.4,471 కోట్లు.. అయితే అంతకు క్రితం నెలతో పోలిస్తే ప్రాపర్టీల విలువ రూ.14 శాతం మేర, రిజిస్ట్రేషన్లు 6 శాతం వృద్ధి చెందాయి. ఫిబ్రవరిలో రూ.3,925 కోట్ల విలువైన 5,988 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం రిజిస్ట్రేషన్లు 8 శాతం తగ్గగా.. విలువ 4 శాతం మేర పెరిగింది. 2024 మార్చిలో రూ.4,275 కోట్ల విలువైన 6,870 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైనవి.. గత నెలలో రూ.2,480 కోట్ల విలువైన 3,509 అఫర్డబుల్ యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే గతేడాది ఇదే నెలతో పోలిస్తే మాత్రం ఇది 14 శాతం తక్కువ. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న 1,605 యూనిట్లు మార్చిలో రిజిస్ట్రేషన్ కాగా.. వీటి విలువ రూ.1,134 కోట్లు. 2024 మార్చితో పోలిస్తే ఈ విభాగంలోనూ రిజిస్ట్రేషన్లు 7 శాతం మేర తగ్గాయి. ఇక, రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్లు గత నెలలో 1,213 రిజిస్ట్రేషన్ కాగా.. వీటి విలువ రూ.857 కోట్లు. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం ప్రీమియం ఇళ్ల విభాగంలో రిజిస్ట్రేషన్లు 17 శాతం, విలువలు 33 శాతం మేర వృద్ధి చెందాయి. గతేడాది మార్చిలో 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 13 శాతంగా ఉండగా.. గత నెలకొచ్చే సరికి 16 శాతానికి పెరిగింది. 1,000 నుంచి 2,000 చ.అ. యూనిట్ల వాటా 71 శాతం నుంచి 68 శాతానికి తగ్గింది.

ఫోన్ రీచార్జ్‌లకు జేబులు ఖాళీ!
ఫోన్ రీచార్జ్‌లకు వినియోగదారుల జేబులు ఖాళీ అయ్యే పరిస్థితులు త్వరలో రాబోతున్నాయి. దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లు అయిన భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా (విఐ) రానున్న డిసెంబర్ నాటికి తమ టారిఫ్‌లను 10-20% పెంచే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది.ఇది ఆరు సంవత్సరాలలో నాలుగో అతిపెద్ద టారిఫ్ పెంపు కానుంది. టెలికాం కంపెనీలు చివరిసారిగా 2024 జులైలో టారిఫ్‌లను పెంచాయి. 4G, 5G మౌలిక సదుపాయాలపై పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు 25 శాతం వరకూ టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచాయి.గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ విశ్లేషకుల ప్రకారం.. భారత్‌లో టెలికాం టారిఫ్‌లలో సుమారు 15% పెంపు ఉండే అవకాశం ఉంది. టెలికాం కంపెనీలు 10% టారిఫ్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాధించడానికి టారిఫ్‌ల పెంపు దోహదపడనున్నది. ఇండియన్ టెలికాం మార్కెట్లో పోటీ తీవ్రత కారణంగా టారిఫ్‌లు గత కొన్ని సంవత్సరాలుగా తక్కువగా ఉన్నాయని, దీనిని సరిదిద్దేందుకు ఈ చర్య తీసుకోవాలని ఆపరేటర్లు భావిస్తున్నారు. అయితే టారఫ్‌ల పెంపు కారణంగా వినియోగదారులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని, దీని ప్రభావం వినియోగ శక్తి, మార్కెట్ డైనమిక్స్‌పైనా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.టెలికాం రంగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, భవిష్యత్ సాంకేతిక అవసరాల కోసం పెట్టుబడులను సమర్థించేందుకు టారిఫ్‌ల పెంపు అవసరమని టెలికాం ఆపరేటర్లు పేర్కొంటున్నారు. అయితే, ఈ నిర్ణయం ఖరారు కాకపోయినా, ఇది వినియోగదారుల మధ్య చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం రానున్న నెలల్లో టెలికాం ఆపరేటర్ల నుండి వెల్లడవుతుందని భావిస్తున్నారు.
ఫ్యామిలీ

ఒకే కాలనీ...56 పార్కులు ఎక్కడో తెలుసా?
సనత్‌నగర్: నగరంలో రోజురోజుకు కాలుష్య ప్రమాణాలు పెరుగుతున్న దృష్ట్యా పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండగా ఆ కాలనీవాసులు మాత్రం కాలుష్యానికి దూరంగా ఉండేలా ఏడు దశాబ్దాల క్రితమే పచ్చదనానికి పచ్చజెండా ఊపారు. ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా 56 ఉద్యానవనాలు ఆ కాలనీ సొంతం. ఏ రోడ్డు కెళ్ళినా పార్కులు దర్శనమిస్తాయి. గజం జాగ కనిపిస్తే కాంక్రీట్‌మయంగా మార్చే ప్రస్తుత తరుణంలో 56 పార్కు స్థలాలను కేటాయించడం ఒక వంతైతే...వాటిని కబ్జా కాకుండా కాలనీవాసులంతా సమష్టిగా కాపాడుకోవడం మరో వంతు. కార్మికగడ్డగా పేరొందిన సనత్‌నగర్ ఎస్ఆర్టీ కాలనీకి వెళితే ఆయా పార్కుల అందాలను ఆస్వాదించవచ్చు. ఎస్ఆర్టీ కాలనీవాసులే కాకుండా పక్క కాలనీలైనా జెక్కాలనీ, రాజరాజేశ్వరీనగర్, తులసీనగర్, సౌభాగ్యనగర్, నాగరాజేశ్వరీనగర్, అల్లావుద్దీన్కోఠి, సుభాష్ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు సైతం ఆయా పార్కులకు వచ్చి వాకింగ్ చేస్తుంటారు. ఆరోగ్యానికి వెన్నుదన్నుగా నిలుస్తోన్న ఇక్కడి పార్కుల అభివృద్ధి కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. సగం వరకు ఇప్పటికే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులోకి రాగా...మరికొన్ని క్రీడామైదానాలుగా వినియోగిస్తున్నారు. వాటికి నలువైపులా సైతం పచ్చదనాన్ని పెంపొందింపజేస్తున్నారు. ఇంకొన్ని అభివద్ధి దశలో ఉన్నాయి. సనత్‌నగర్ పారిశ్రామికవాడ సాక్షిగా... స్వాతంత్ర్యానంతరం తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు దేశాన్ని పాలిస్తున్న సమయంలో అప్పటి నిజామ్ పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని 1948లో విలీనం చేసిన విషయం తెలిసిందే. విలీనం అనంతరం సనత్‌నగర్ ప్రాంతంలో అల్లావుద్దీన్ కేంద్ర ప్రభుత్వం నుంచి 408 ఎకరాల భూమిని అప్పటి ప్రప్రథమ రాష్ట్రపతి ద్వారా తన పేరిట రిజి్రస్టేషన్ చేయించుకున్నారు. తదనంతరం కేంద్ర కార్మిక సంస్థ ఇక్కడి దాదాపు 150 ఎకరాల్లో చిన్నతరహా పరిశ్రమలు నిరి్మంచుకోవడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అల్లావుద్దీన్న్ నుంచి భూమిని సేకరించింది. అలా సేకరించినదే సనత్‌నగర్ పారిశ్రామికవాడగా నామకరణం జరిగింది. ‘సనత్’ అంటే పరిశ్రమగా పేర్కొంటారు. అందుకే మొట్టమొదటి పారిశ్రామికవాడ కావడంతో సనత్‌నగర్‌గా ఈ ప్రాంతం పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి చేతుల మీదుగా సనత్‌నగర్ పారిశ్రామికవాడ ప్రారంభమైంది. అదే పారిశ్రామికవాడ ఎదురుగా దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఆనాటి కార్మికుల ఆవాసం కోసం ఏర్పాటు చేసినదే నేటి సనత్‌నగర్ ఎస్ఆర్టీ కాలనీ. ఎస్ఆర్టీ (సింగిల్ రూమ్ టెనెంట్స్) పేరిట 1500 క్వార్టర్స్ ఇళ్ళ నిర్మాణం జరిపారు. ఆరు వేల జనాభా ఉన్న ఆ కాలనీలో పార్కుల కోసం 56 ఖాళీ ప్రదేశాలను విడిచిపెట్టారు. కాలక్రమంలో వాటిని కాపాడుకుంటూ అభివద్ధిపరుచుకుంటూ వస్తున్నారు. ఒక్కో పార్కు 1500 గజాల నుంచి మొదలుకొని ఎకరాల వరకు విస్తరించి ఉన్నాయి. చెట్లు,పూలమొక్కలతో ఆహ్లాదంగా... ఆయా పార్కుల్లో అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో చెట్లు, పూలమొక్కలతో కాలనీవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరితవనం పార్కు, మార్కెట్ ఉద్యానవనం, భగత్‌సింగ్ గ్రౌండ్, వినాయక గ్రౌండ్, బాస్కెట్‌బాల్ మైదానం, నవ వనాల పార్కు, ఇండస్ట్రీయల్ పార్కు, నెహ్రు పార్కు, ఎస్ఆర్టీ–80, ఎస్ఆర్టీ–87, ఎస్ఆర్టీ–495 తదితర పార్కులు ప్రధానమైనవిగా నిలుస్తున్నాయి. క్రీడా స్థలాలను మినహాయిస్తే సుమారు 30 వరకు ఉద్యానవనాలు చెట్లు, పూల మొఇక్కలు, పచ్చికతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఒక్కో ఉద్యానవనంలో 300 పైచిలుకు వృక్షాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ స్థానిక కమిటీలను ఏర్పాటుచేసి వాటి పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యానవన సంక్షేమ సంఘం, వినాయక సంక్షేమ సంఘం, భగత్‌సింగ్ ఉత్సవ కమిటీ, సనత్నగర్యువజన సంక్షేమ సంఘం వంటి వాటిని ఏర్పాటుచేసుకున్న కాలనీవాసులు ఈ ఉద్యానవనాలను ఆక్రమణదారుల పాలుకాకుండా కాపాడుకుంటున్నారు.

Kesari Chapter 2 : అనన్య పాండే పర్పుల్ కలర్ చీరలో అమేజింగ్ లుక్స్
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే చీరలో అందంగా మెరిసింది. తన కొత్త సినిమా వెంచర్ కేసరి చాప్టర్ 2 ప్రీమియర్‌కు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. 26 ఏళ్ల వయసులో తొమ్మిదిగజాల డిజైనర్ చీరను ధరించి స్పెషల్ లుక్‌లో అలరించింది.ప్రీమియర్ రెడీ లుక్‌తో గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది. డిజైనర్ పునీత్ బలనా డిజైన్ చేసిన తొమ్మిది గజాల చీర-టోరియల్‌గా పర్ఫెక్ట్గా కనిపించింది. రిచ్ పర్పుల్ సిల్క్ చీరకు గోల్డెన్ అండ్ మిర్రర్‌వర్క్ అలంకరణలతో నిండిన చీరలో ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది. బ్యాక్‌లెస్ అండ్ హాల్టర్ నెక్ బ్లౌజ్‌ను జతచేసింది.దీనికి తగ్గట్టుగా పూల డిజైన్ తో గోల్డ్ అండ్ డైమండ్స్ పొదిగిన వాటర్ ఫాల్ స్టైల్ చెవిపోగులు ఆమె అందానికి మరింత సొబగులద్దాయి. ఆ రోజు అనన్య ధరించిన యాక్సెసరీలలో సెలబ్రిటీ స్టైలిస్ట్ ప్రియాంక కపాడియా బదానీ సౌజన్యంతో, ఏస్ హెయిర్ స్టైలిస్ట్ ఆంచల్ ఎ మోర్వానీ స్టైల్ చేయగా, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ రిద్ధిమా శర్మ, దోషరహిత బేస్ అనన్య లుక్ కి గ్లామర్‌కి పర్ఫెక్ట్ స్ట్రోక్స్ ని జోడించారు. View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)కేసరి చాప్టర్ 2బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అనన్య పాండే , మాధవన్ నటించిన లేటెస్ట్ మూవీ 'కేసరి చాప్టర్ 2'. విషాదకరమైన జలియన్ వాలాబాగ్ ఊచకోత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. సి శంకరన్ నాయర్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అనన్య తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. అలాగే శంకరన్ నాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించాడంటున్నారు విమర్శకులు.కాగా 2019లో రొమాంటిక్ కామెడీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మరియు పతి పత్నీ ఔర్ వో పాత్రలతో తన నటనా జీవితాన్ని బాలీవుడ్ నటుడు చుండీ పాండే కుమార్తె అనన్య పాండే. 1998లో అక్టోబర్‌లో పుట్టిన అనన్య చక్కని పొడుగు, అందంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 2019లో రొమాంటిక్ కామెడీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ,పతి పత్నీ ఔర్ వో పాత్రలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తెలుగులో విజయ్ దేవరకొండ జోడిగా లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనన్య. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ అనన్యకు పెద్దగా కలిసి రాలేదు.

స్పేస్ ఫుడ్ టేస్ట్‌ని ఇలా పరీక్షిస్తారా..? వీడియో వైరల్
అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు భోజనం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలనే కుతుహలం అందరికి ఉంటుంది. అయితే ఇటీవల సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల పుణ్యమా అని అంతరిక్షంలో వ్యోమగాముల కష్టాలు, భోజనం ఎలా ఉంటుదనేది తెలిసింది. ఎందుకంటే ఎనిమిది రోజుల యాత్రకని బయలుదేరి ఏకంగా తొమ్మిదినెలలు అంతరిక్షంలోనే చిక్కుకుపోవడంతో వాళ్ల ఆర్యోగపరిస్థితి..వాళ్ల భోజనం ఎలా.. అనే వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటించడంతో ప్రజలకు తెలిసింది. అదీగాక భారరహిత స్థితిలో ఉండే వాళ్లకు ఎలాంటి ఫుడ్ బెటర్ అనేది ప్రముఖ నిపుణులు పలు దఫాలుగా కేర్ తీసుకుని మరీ ప్యాక్ చేస్తారని విన్నాం. మరీ వాటి టేస్ట్ ఎలా ఉంటయనేది మనం వినలేదు కదా..అదెలా ఉంటుంది, ఎవరు దాన్ని పరీక్ష ఇస్తారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.వ్యోమగాములకు అందించే భోజనాలను ఎలా టెస్ట్ చేస్తారో Axiom స్పేస్ షేర్ చేసింది. వచ్చే నెల మేలో ప్రారంభం కానున్న ఆక్సియం మిషన్ 4 (Ax-4) కోసం సన్నాహాలు వేగవంతం కావడంతో వ్యోమగాములకు అందించే ఆహారం టేస్ట్ సెషన్ ఎలా ఉంటుందో వివరించింది. ఈ రుచి సెషన్ ట్రయల్‌లో భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా పాల్గొన్నారు. ఈ ఏడాది మేలో ఈ ఆక్సియం మిషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఆక్స్-4 సిబ్బందికి ఇచ్చే స్పేస్ ఫుడ్ టెస్ట టెస్ట్ ఎలా ఉంటుందో కళ్లకటినట్లుగా చూపించింది Axiom స్పేస్. ఈ ట్రయల్ సెషన్ మైసూరులో డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (DFRL)లో నిర్వహించారు. ముందుగా వ్యోమగాములకు అందించే ఫుడ్ నమునాలను ఆ సెషన్లో పాల్గొన్న వాళ్లు రుచి చూసి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఫుడ్‌ని వ్యోమగాములు 14 రోజుల మిషన్ సమయంలో తినేందుకు పంపడం జరుగుతుంది. ఇక్కడ తాము టేస్ట్ చేసి..నచ్చినా నచ్చకపోయినా వాటికి స్కోర్లు ఇవ్వక తప్పదని అన్నారు శుక్లా. ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఐఎస్ఎస్కి పంపుతారని అన్నారు.ట్రయల్‌లో ఏం వంటకాలు ఉంటాయంటే..ట్రయల్ సమయంలో వడ్డించే ఆహారంలో దాల్ చావల్, రాజ్మా, కిచ్డి మరియు వెజిటబుల్ బిర్యానీ వంటి ప్రసిద్ధ కంఫర్ట్ వంటకాలు సుమారు 50 ఉన్నాయి. శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా ప్రాసెస్ చేస్తూనే భారతీయ వంటకాల ప్రామాణిక రుచిని పోకుండా కేర్ తీసుకుంటారట.ఇదిలా ఉండగా..ఈ మిషన్ కారణంగా శుభాన్షు శుక్లా ISSకి ప్రయాణించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏఎక్స్4 మిషన్‌లో పోలాండ్‌కు చెందిన సావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు తదితరులు ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉండాల్సినా ఆ సమయంలో తమకు ఆహారం చాలా ముఖ్యమని, అది తమకు ఓదార్పునిస్తుందన్నారు శుక్లా.కాగా, భారత వైమానిక దళ పైలట్, గగన్‌యాన్ మిషన్‌కు వ్యోమగామి అయిన శుభాన్షు శుక్లా స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో పైలట్‌గా వ్యవహరించనున్నారు. అలాగే ఈ మిషన్ ఆక్స్-4లో శాస్త్రీయ ప్రయోగాలు, ఔట్రీచ్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయట. We're counting down to the #Ax4 crew launch, expected no earlier than May this year. In our new astronaut training video series, you'll learn what it takes to prepare for a mission, from the crew's arrival in Houston all the way to launch day.Ever wondered what it takes to… pic.twitter.com/wqzcspiMuV— Axiom Space (@Axiom_Space) April 15, 2025 (చదవండి: ఆవేశం అదే క్షణం.. ఆవేదన జీవితాంతం..)

బట్టల మిషనా? బంగాళదుంపల మిషనా? వైరల్ వీడియో
వంట చేయడం కంటే.. ప్రిపరేషన్‌కే ఎక్కువ టైం పడుతుంది. కూర వండాలంటే..చిక్కుడు కాయలు, బీన్స్ గిల్లడం, దొండకాయలు, బెండకాయలు కట్ చేయడం అబ్బో పెద్దపనే కదా. అలాగే బంగాళాదుంపలను తొక్క తీసి శుభ్రం చేయడం అంటే అదో పెద్ద పని. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన మహిళ కేవలం రెండు నిమిషాల్లో వాషింగ్ మెషిన్ సహాయంతో బంగాళాదుంపలు తోలు తీయడం అందర్నీ ఆకర్షించింది.‘ఆమె వాషింగ్ మెషిన్ దగ్గరకు వెళ్లింది. ఆ తరువాత ఏం చేస్తుంది?’ అనే ప్రశ్నకు ఎవరైనా ఇచ్చే జవాబు....‘బట్టలను వాషింగ్ మెషిన్లో వేస్తుంది’ అయితే సదరు మహిళ మాత్రం బట్టలను కాదు బంగాళదుంపలను వేసింది. మన ఆశ్చర్యాన్ని మరింత పెంచేలా మెషిన్ ఆన్ చేసింది. ఆ తరువాత ఏమిటి అనే విషయానికి వస్తే..... తొక్క రహిత బంగాళదుంపలు కనిపించాయి! వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ‘భేష్’ అని కొందరు కితాబు ఇవ్వగా చాలామంది మాత్రం ‘ఇది సరికాదు’ అని విమర్శించారు. మరికొందరు ‘ఇది ఫేక్ వీడియో’ అన్నారు. बढ़ती हुई तकनीक ने बहुत कामों को बहुत सरल बना दिया है।ये देखो आलू को छीलने वाली मशीन।एक मिनट में कितने सारे आलू छील दिए हैं। pic.twitter.com/gpwu6Y5KG0— kuldeep kumar (@kdgothwal1) April 6, 2025ఎండలను చల్లపుచ్చండి వేసవిలో ఎదురయ్యే సమస్యలలో డీ హైడ్రేషన్ ఒకటి. డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా పుచ్చకాయ తింటే మంచిది. పుచ్చకాయతో లాభాలునీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ ఒంట్లోని టాక్సిన్స్‌ను తొలగిస్తుందినీరసం, నిస్సత్తువ లేకుండా చేస్తుంది. చెమట రూపంలో కోల్పోయిన నీరు భర్తీ అవుతుంది. పుచ్చలో అమైనో ఆమ్లం ‘సిట్రులిన్’ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.ఎండలో కమిలిన చర్మానికి పుచ్చపండు గుజ్జు రాస్తే మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం లేకుండా చేస్తుంది.కండరాల నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది.పుచ్చకాయలో ఎక్కువగా ఉండే ఎ విటమిన్ కంటిచూపును మెరుగుపరుస్తుంది.
ఫొటోలు


కేజీఎఫ్ బ్యూటీ చేతిలో చంటిపాప.. మనసు నిండిపోయిందంటూ..


తిరుమలలో సమంత సహా పలువురు సెలబ్రిటీలు (ఫోటోలు)


దిల్‌రాజు బ్యానర్ 'ఆకాశం దాటి వస్తావా' సెట్స్‌లో ధనశ్రీ వర్మ (ఫోటోలు)


రెడ్ రోజ్ డ్రెస్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బ్యూటీ మీనాక్షి చౌదరి


రెట్రో లుక్‌లో వింటేజ్ గర్ల్ 'పూజా హెగ్డే' లుక్స్ (ఫోటోలు)


తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దంపతులు (ఫొటోలు)


విడాకులు తీసుకుంటాంలే.. హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ (ఫొటోలు)


బ్యాంకాక్ ఫెస్టివల్లో జగ్గు భాయ్ సందడి.. మన సంక్రాంతిలాగే ఎంజాయ్ చేశా (ఫోటోలు)


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రీతి జింటా (ఫోటోలు)


శబరిమల అయ్యప్పకు ఇరుముడి సమర్పించిన హీరో కార్తీ (ఫోటోలు)
అంతర్జాతీయం

విద్యార్థుల వీసాలపై పిడుగు
విదేశీ విద్యార్థులపై అమెరికా కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తోంది. గత నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 1,024 మంది విదేశీ విద్యార్థుల వీసాలనో, వారి లీగల్ రెసిడెన్సీ స్టేటస్నో రద్దు చేసింది. వారంతా అమెరికాలోని 160 కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకుంటున్నవారే. వారంతా ఆందోళనకు లోనవుతున్నారు. ఇలా ఉన్నపళంగా వెళ్లగొట్టడం ఏమిటంటూ మండిపడుతున్నారు. ‘‘చట్టప్రకారం అన్ని అనుమతులూ ఇచ్చిన ప్రభుత్వమే ఆ చట్టాలను ఉల్లంఘిస్తోంది. ఈ చర్యలను ఎలా సమర్థించుకుంటుంది?’’ అని ప్రశి్నస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వ చర్యపై పలువురు కోర్టుకెక్కారు. కొందరు అరెస్టు భయంతో చదువులు మధ్యలోనే వదిలేసి స్వదేశాలకు వెళ్లిపోయారు. పునరాలోచించాలి లీగల్ స్టేటస్ రద్దుతో వందలాది మంది విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అమెరికా వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే ప్రభుత్వమే నిర్బంధించి బలవంతంగా వెళ్లగొట్టే పరిస్థితి నెలకొంది. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్, ఒహాయో స్టేట్ వర్సిటీల్లోని పలువురు విద్యార్థుల లీగల్ స్టేటస్లు రద్దయ్యాయి. పలు కాలేజీల్లోని విద్యార్థులు వీసాలు కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీపై కోర్టుల్లో కేసులు దాఖలవుతున్నాయి. విదేశీ విద్యార్థులు ఇలా వెళ్లిపోతే అమెరికా వర్సిటీలు, కాలేజీల మనుగడ కష్టమవుతుందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. దీనిపై పునరాలోచించాలని ట్రంప్ సర్కారుకు సూచిస్తున్నారు. కాలేజీలు, వర్సిటీల నుంచి కూడా ఈ మేరకు విజ్ఞాపనలు వెళ్తున్నాయి. రద్దయితే ఇంటికేనా? ఎఫ్–1 విద్యార్థి వీసాలను అమెరికా విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుంది. అమెరికాలోకి అడుగుపెట్టాక వారి లీగల్ రెసిడెన్సీ స్టేటస్‌ను పర్యవేక్షించే బాధ్యత డీఓహెచ్దే. విద్యార్థుల డేటాబేస్ దానివద్ద ఉంటుంది. విద్యాభ్యాసం పూర్తయ్యి వారు స్వదేశాలకు వెళ్లాక వర్సిటీ సూచనతో లీగల్ స్టేటస్‌ను తొలగించేవారు. ఇప్పుడు వర్సిటీలతో సంబంధమే లేకుండా విదేశీ విద్యార్థుల లీగల్ రెసిడెన్సీ స్టేటస్ ఉన్నపళంగా రద్దయిపోతోంది. పైగా ఆ మేరకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. డేటాబేస్‌ను వర్సిటీ వర్గాలు తనిఖీ చేసినప్పుడు మాత్రమే ఆ విషయం తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో వీసా రద్దయినా లీగల్ రెసిడెన్సీ స్టేటస్ అలాగే ఉంటుంది. అలాంటప్పుడు విద్యాభ్యాసం కొనసాగించవచ్చు. స్వదేశాలకు వెళ్లి మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేటస్ రద్దయితే మాత్రం అమెరికాలో ఉండడానికి అనుమతించరు. స్వదేశాలకు వెళ్లిపోవాలని సూచిస్తారు. లేదంటే బలవంతంగా పంపిస్తారు.ఎందుకీ వీసాల రద్దు? → విద్యార్థుల వీసాల రద్దుకు నిబంధనల ఉల్లంఘన ముఖ్య కారణమని వర్సిటీలు చెబుతున్నాయి. → ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా వీసా రద్దవుతోంది. గత ఉల్లంఘనలకు కూడా ఇప్పుడు వీసా రద్దు చేస్తున్నారు. → చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడినా వీసా రద్దు తప్పదు. → పాలస్తీనా సానుభూతిపరుడంటూ కొలంబియా వర్సిటీ విద్యార్థి మహమ్మద్ ఖలీల్ వీసా రద్దు చేశారు. కానీ వీసాలు, లీగల్ స్టేటస్లు రద్దవుతున్న పలువురు విద్యార్థులకు ఉద్యమాలతో, తీవ్రవాద/ఉగ్రవాద సంస్థలతో ఏ సంబంధమూ లేదని ఆయా వర్సిటీలే చెబుతున్నాయి. కారణాలేమిటో ప్రభుత్వాన్నే అడగాలంటున్నాయి. → ‘‘విదేశీ విద్యార్థులను బయటకు వెళ్లగొట్టడమే డీఓహెచ్కు పనిగా మారింది. ఈ మేరకు అనధికారింగా జాతీయ పాలసీ తెచ్చినట్టు కనిపిస్తోంది’’ అని వేన్ స్టేట్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ప్రతినిధులు విద్యార్థుల తరఫున కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బలవంతపు డిపోర్టేషన్లు ఆపాలని కోరారు. → డార్ట్మౌత్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న చైనాకు చెందిన షియాంటియాన్ లియూ తన లీగల్ స్టేటస్ రద్దుపై కోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ విద్యారి్థకి అనుకూలంగా న్యూ హ్యాంప్‌షైర్ ఫెడరల్ జడ్జి తీర్పు ఇచ్చారు. → ‘‘అమెరికాలోకి వచ్చిపడుతున్న విదేశీయుల పట్ల ట్రంప్ గుర్రుగా ఉన్నారు. వారందరినీ వెనక్కు పంపేయాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే విదేశీ విద్యార్థులను లక్ష్యం చేసుకుంటున్నారు’’ అని మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్లో పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ మిషెల్ మిటెల్స్టాడ్ అన్నారు.తీవ్ర పరిణామాలేఅమెరికాలో చట్టాల అమలు కఠినంగా ఉంటుంది. వాటిని పాటించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘‘విద్యార్థులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. చట్టాలను ధిక్కరిస్తామంటే ప్రభుత్వం సహించదు. ఇష్టానుసారం వ్యవహరిస్తే వీసాలు రద్దు చేసి వెనక్కు పంపుతారు. నిజాయితీగా ఉండేవారికి అమెరికాలో అద్భుత అవకాశాలున్నాయి’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్గరెట్ మెక్లియోడ్ అన్నారు. ఈ విషయంలో కేంద్రం ఇకనైనా మొద్దునిద్ర వీడి అమెరికాలోని మన విద్యార్థుల భవితవ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది.– సాక్షి, నేషనల్ డెస్క్

ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై ఆసక్తి పోయిందా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆపడం సాధ్యం కాకపోతే తమ ప్రయత్నాలు విరమించుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో(Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు.ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ముగించడం సాధ్యంకాని పక్షంలో.. చర్చల ప్రయత్నాలు ఆపేసి అమెరికా తన దారి తాను చూసుకుంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చి చెప్పారు. ఈ యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు. ఇన్నాళ్లూ కేవలం ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నాం. ఇది మా యుద్ధం కాదు కాబట్టి ముగించాలనుకుంటున్నాం అని మార్కో రూబియో అన్నారు.ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ యుద్ధాన్ని ఓ ముగింపునకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగని నెలలు, సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండబోరు. ఆయనకు ప్రపంచంలో ఇతర ప్రాధాన్యాలు కూడా ఉన్నాయి. చర్చల్లో గనుక పురోగతి కనిపించకపోతే ఆయన దీనిని వదిలేస్తానన్నారు అని రుబియో వెల్లడించారు.తాజాగా ఐరోపా నేతలతో భేటీ సందర్భంగా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తొందరలోనే ఇది సాకారం కావచ్చని పేర్కొన్నారు. అమెరికా ఓ శాంతిఒప్పందం ముసాయిదా తయారుచేసి ఐరోపా నేతలకు వెల్లడించింది. వారినుంచి సానుకూల స్పందనలు వచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక దీనినే మార్కో రూబియో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌కు వెల్లడించారు.

విమానం హైజాక్‌కు యత్నం.. నిందితుడ్ని కాల్చి చంపిన తోటి ప్రయాణికుడు
బెల్మోపాన్: అమెరికా ఈశాన్య తీర దేశమైన బెలిజ్‌లో విమానం హైజాక్ (Hijack Plane) కలకలం రేపింది. గురువారం (స్థానిక సమయం) బెలిజ్‌లో ఓ అమెరికన్ పౌరుడు గాల్లో ఉండగా ఓ చిన్న ట్రాఫిక్ ఎయిర్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో నిందితుడు తోటి ప్రయాణికులపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత నిందితుణ్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. బెలిజ్ పోలీస్ కమిషనర్ చెస్టర్ విలియమ్స్ ప్రకారం..49ఏళ్ల అమెరికా పౌరుడు అకిన్యేలా సావా టేలర్ (Akinyela Sawa Taylor) గాలిలో ఉండగా శాన్ పెడ్రోకు వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించిన తోటి ప్రయాణికుడు గన్నుతో నిందితుణ్ని కాల్చి చంపారు. ఈ సందర్భంగా టేలర్‌ను కాల్చి చంపిన ప్రయాణీకుడిని హీరో అంటూ కమిషనర్ విలియమ్స్ ప్రశంసించారు.కాగా,టేలర్ విమానంలోకి కత్తిని ఎలా తీసుకురాగలిగాడో అస్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు.ఈ సంఘటనపై జరుగుతున్న దర్యాప్తులో సహాయం కోసం బెలిజియన్ అధికారులు అమెరికా రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.

మెలోనీతో భేటీ.. సుంకాలపై మెత్తబడ్డ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో కాస్త మెత్తబడ్డారు. సుంకాలపై పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అమెరికా అధినేతతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆయన సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈయూ దేశాలపై అమెరికా 20 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దాని అమలును 90 రోజులపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాల నడుమ.. ట్రంప్‌ను కలిసిన తొలి యూరప్ దేశపు నేత మెలోనీనే కావడం గమనార్హం. ఐరోపా సమాఖ్య(European Union)తో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందం అంశంపై వీరు చర్చలు జరిపారు. అయితే ఈయూతో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని ట్రంప్ భరోసా ఇచ్చారు. ఈ డీల్ విషయంలో మాత్రం తాను తొందర పడటం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతీ ఒక్కరూ అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఒకవేళ అలా వాళ్లు అనుకోకుంటే గనుక మేమే వాళ్లతో ఒప్పందానికి దిగి వస్తాం అంటూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇక.. మరోవైపు ఈ భేటీలో మెలోనీని ట్రంప్ ఆకాశానికెత్తారు. ఆమె ఓ అద్భుతమైన నేత అంటూ పొగడ్తలు గుప్పించారు. మరోవైపు.. పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కలిసికట్టుగా ఆ పని చేయగలమని అనుకుంటున్నా’ అని ఓవల్ ఆఫీసులో రిపోర్టర్లతో మెలోనీ మాట్లాడారు. ట్రంప్‌ను రోమ్ను ఆహ్వానించిన మెలోనీ.. అక్కడ ఈయూ దేశాల ప్రతినిధులతో సుంకాల అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. Rendiamo l’Occidente di nuovo grande - Make the West Great Again pic.twitter.com/Z499ZRGx85— Giorgia Meloni (@GiorgiaMeloni) April 17, 2025
జాతీయం

అల్లర్ల బాధితులను కలిసిన బెంగాల్ గవర్నర్
మాల్డా/కోల్‌కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్తోపాటు, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ బృందాల సభ్యులు శుక్రవారం మాల్దా జిల్లాలో ఆశ్రయం పొందుతున్న అల్లర్ల బాధితులను కలుసుకున్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్ జిల్లాలోని ముస్లిం మెజారిటీ ఉన్న షంషేర్‌గంజ్, సుటి, ధులియన్, జంగీపూర్ ప్రాంతాల్లో ఈ నెల 11,12వ తేదీన చోటుచేసుకున్న అల్లర్లలో ముగ్గురు చనిపోవడం తెల్సిందే. హింసాత్మక ఘటనల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. భీతిల్లిన సామాన్యులు వందలాదిగా పొరుగునే ఉన్న మాల్దా జిల్లాకు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారు. వీరి కోసం మాల్దాలోని పర్ లాల్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రశాంతత కొనసాగేందుకు పర్యటనను వాయిదా వేసుకోవాలని సీఎం మమతా బెనర్జీ చేసిన సూచనను గవర్నర్ సీవీ ఆనంద బోస్ పట్టించుకోలేదు. అక్కడికెళ్లి స్వయంగా పరిస్థితులను స్వయంగా పరిశీలించి, కేంద్రానికి నివేదిక అందజేస్తానంటూ ఆయన శుక్రవారం రైలులో పర్ లాల్పూర్ చేరుకుని బాధితులతో సమావేశమయ్యారు. వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. కొందరు దుండగులు తమ ఇళ్లపై దాడులు చేసి, సర్వస్వం దోచుకుని, బయటకు గెంటేశారని బాధిత మహిళలు చెప్పారని అనంతరం గవర్నర్ ఆనందబోస్ మీడియాకు తెలిపారు. సహాయక శిబిరాల్లో వసతుల లేమిపై యంత్రాంగం నుంచి సవివర నివేదిక కోరానన్నారు. ఆయన వెంట ఉన్న రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదులను నోట్ చేసుకున్నారు. పార్ లాల్పూర్లో ఉద్రిక్తతలు ప్రాణభయంతో పారిపోయి వచ్చిన తమను జిల్లా అధికారులు తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని బలవంతం చేస్తున్నట్లు పార్ లాల్పూర్లో ఆశ్రయం పొందుతున్న ముర్షిదాబాద్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తమ వద్దకు వచ్చిన జిల్లా అధికారులను వారు చుట్టుముట్టారు. ఎండిన రొట్టెలు, అరటి పండ్లు, ముక్కిపోయిన బియ్యం ఇస్తున్నారన్నారు. శిబిరాల్లో పరిస్థితులు జైలు కంటే దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. తమ సొంతూళ్లో పరిస్థితులు ఏమంత సురక్షితంగా లేవన్నారు. తమ నివాసప్రాంతాల్లో బీఎస్ఎఫ్ జవాన్లు క్యాంపులను ఏర్పాటు చేసేదాకా తిరిగి వెళ్లేది లేదన్నారు. పోలీసులు తమను మీడియాతోను, చివరికి బంధువులతో సైతం మాట్లాడవద్దని ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ) శుక్రవారం మాల్దాలోని పర్ లాల్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాల సహాయ శిబిరాన్ని సందర్శించింది. కమిషన్ సభ్యులు బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వీరు మూడు వారాల్లోగా ఎన్‌హెచ్చార్సీకి నివేదికను సమరి్పంచాల్సి ఉంది. ముర్షిదాబాద్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు ఎన్‌హెచ్చార్సీ ప్రకటించింది. అదేవిధంగా, జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ విజయా రాహత్కర్ తన బృందంతో శుక్రవారం మాల్డాలోని తాత్కాలిక సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న అల్లర్ల బాధితుల కుటుంబాలతో మాట్లాడారు. శిబిరాల్లో మహిళలు, చిన్నారులకు కల్పించిన సౌకర్యాలను చూసి షాక్‌కు గురైనట్లు ఆమె తెలిపారు. మహిళలను ఇళ్ల నుంచి వెళ్లగొట్టి, అనూహ్యమైన ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌ను మరో బంగ్లాదేశ్ మాదిరిగా మార్చాలని టీఎంసీ ప్రభుత్వం అనుకుంటోందా? అని ప్రశ్నించారు. శనివారం ఈ బృందం ముర్షిదాబాద్‌కు వెళ్లనుంది. అనంతరం కోల్‌కతాలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు డీజీపీతో భేటీ అవుతారు. కాగా, గవర్నర్ ఆనంద బోస్, ఎన్‌హెచ్చార్సీ, ఎన్సీడబ్ల్యూ బృందాల పర్యటనలు రాజకీయ ప్రేరేపితమని, పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చేందుకు ప్రయతి్నస్తున్నారని టీఎంసీ ఆరోపించింది.

రాణా ప్రతాప్, శివాజీ మన హీరోలు.. ఔరంగజేబ్ కాదు: రాజ్‌నాథ్
ఛత్రపతి శంభాజీ నగర్: రాణా ప్రతాప్ సింగ్, ఛత్రపతి శివాజీ మహారాజ్‌లు మన జాతి హీరోలని, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మేవాడ్ పాలకుడు మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని శుక్రవారం ఛత్రపతి శంభాజీ నగర్లో ఆయన ఆవిష్కరించారు. జౌరంగజేబ్, బాబర్లను శ్లాఘించడం దేశంలోని ముస్లింలను అగౌరవపర్చడమే అవుతుందని చెప్పారు. ‘ధైర్యసాహసాలు, దేశ భక్తికి ప్రతిరూపం మహారాణా ప్రతాప్..ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు ముఖ్యంగా గెరిల్లా యుద్దతంత్రంలో ఆయనే స్ఫూర్తి’అని రాజ్‌నాథ్ తెలిపారు. ఔరంగజేబ్‌ను పొడిగేవారు అతడి గురించి పండిట్ నెహ్రూ ఏం రాశారో తెలుసుకోవాలని సూచించారు. స్వాతంత్య్రానంతరం వామపక్ష అనుకూల భావాలు కలిగిన కొందరు చరిత్రకారులు రాణా ప్రతాప్, శివాజీలకు తగు ప్రాధాన్యం ఇవ్వలేదు సరికదా, ఔరంగజేబ్‌ను కీర్తించారని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని మతాలను గౌరవిస్తూ ఉపనిషత్తులను అనువదించిన దారా షికోను ఔరంగజేబ్ చంపించాడన్నారు. మొఘలులతో జరిగిన మల్దిఘాటి యుద్దంలో రాణా ప్రతాప్ సైన్యాధికారి హకీంఖాన్ సూరి ప్రాణత్యాగం చేశాడని చరిత్రను మంత్రి గుర్తు చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో 33 మంది మావోలు లొంగుబాటు
సుక్మా: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 33 మంది మావోయిస్టులు భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు. వీరిలో 17 మందిపై మొత్తం రూ.49 లక్షల రివార్డు ఉందని ఎస్పీ కిరణ్ చవాన్ చెప్పారు. వీరిలో 9 మంది మహిళలు సహా 22 మంది సీఆర్పీఎఫ్ ఎదుట, మరో ఇద్దరు మహిళలు సహా 11 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారని వివరించారు. సైద్ధాంతిక బలం లేని మావోయిస్ట్ పార్టీ స్థానిక గిరిజనులపై అమానవీయ చర్యలకు పాల్పడుతున్నందునే తీవ్రవాదాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు వీరు చెప్పారన్నారు. లొంగిపోయిన వారిలో సుమారు 22 మంది ఛత్తీస్‌గఢ్‌లోని మా, ఒడిశాలోని నౌపడలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కిరణ్ చవాన్ వివరించారు. లొంగుబాట పట్టిన వారిలో ప్రముఖంగా పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్ ముచాకి జోగా(33), అతడి భార్య, అదే స్క్వాడ్‌కు చెందిన జోగి(28) ఉన్నారని వీరిపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉందని ఎస్పీ చెప్పారు. ఇంకా కమిటీ సభ్యులైన కికిడ్ దెవె(30), మనోజ్‌లపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉందన్నారు.

ఎలాన్ మస్క్ కు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి త్వరలో టెస్లా అడుగుపెట్టబోతున్న నేపథ్యంతో వారిద్దరూ మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మస్క్, మోదీ పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో భారత్, అమెరికా మధ్య పరస్పర సహకార మరింత బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు. సాంకేతికత, నవీన ఆవిష్కరణల విషయంలో ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకొనేలా పటిష్ట వ్యూహంతో ముందుకెళ్లాలని ఉద్ఘాటించారు. మస్క్ తో సంభాషణ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మస్క్ తో చక్కటి సంభాషణ జరిగిందన్నారు. వేర్వేరు అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తాము కలిసినప్పుడు చర్చించుకున్న అంశాలు మరోసారి ప్రస్తావనకు వచ్చాయన్నారు. ప్రధానంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ పైనే తమ మాట్లాడుకున్నామని వివరించారు. ఈ రెండు అంశాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత దృఢతరం చేసుకొనేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ స్పష్టంచేశారు. మరోవైపు ఇండియన్ మార్కెట్లో ప్రవేశించానికి టెస్లా ఏర్పాట్లు చేసుకుంటోంది. తొలుత ముంబై, ఢిల్లీ, బెంగళూరులో టెస్లా కార్లు విక్రయించబోతున్నారు. వేలాది టెస్లా కార్లు ఇండియాను ముంచెత్తబోతున్నాయి.
ఎన్ఆర్ఐ

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్‌లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్‌లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.

డల్లాస్‌లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్‌లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్‌లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్‌ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-
క్రైమ్

బంగ్లాదేశ్ యువతులతో హైదరాబాద్‌లో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: రాజధానితో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అనేక ముఠాలు పట్టుబడ్డాయి. ఈ బాధితుల్లో అత్యధికం బంగ్లాదేశీ యువతులే ఉంటున్నారు. దీంతో వీరు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న విధానంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి కొన్ని కీలక విషయాలు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్ కీలకంగా ఉన్నట్లు తేలింది. అక్కడి కొందరు సూత్రధారులు బంగ్లాదేశ్‌లోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా ఒకరిని అక్రమంగా బోర్డర్ దాటించడానికి రూ.4 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కీలకంగా వ్యవహరిస్తున్న రాహుల్... బంగ్లాదేశీయులతో పాటు మయన్మారీల అక్రమ రవాణా దందాకు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాలు కీలకంగా మారాయి. ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటీవలి కాలంలో అక్రమ రవాణా పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొత్తగా ముఠాలు పుట్టుకువచ్చాయి. వీటికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తులకు ఇటు పశ్చిమ బెంగాల్ తో పాటు అటు బంగ్లాదేశ్‌లోని సరిహద్దు గ్రామాల్లో అనుచరులు ఉంటున్నారు. ఇలాంటి సూత్రధారుల్లో పశ్చిమ బెంగాల్ లోని బసిర్హత్ జిల్లా సోలదాన గ్రామానికి చెందిన రాహుల్ అమన్ దాలి కీలకమని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అక్రమంగా సరిహద్దులు దాటాలని భావించిన బంగ్లాదేశీయులు ఆ దేశంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చేరుతున్నారు. వీరిని సంప్రదిస్తున్న రాహుల్ అనుచరులు రూ.4 వేలకు.. డిమాండ్ ఎక్కువగా ఉంటే రూ.5 వేలకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇక్కడి నుంచే కథ నడిపించే రాహుల్... ఈ మొత్తాన్ని ఆ యువతులతోనే బంగ్లాదేశ్‌లోని సరిహద్దు గ్రామాల్లో ఉండే దుకాణదారుల వద్ద భారత కరెన్సీలోకి మార్పిస్తున్నాడు. మరికొందరు దళారుల ద్వారా ఈ నగదు బ్యాంకు ఖాతా లేదా యూపీఐ ద్వారా తనకు చేరేలా చేస్తున్నాడు. ఈ మొత్తం నుంచి రూ.1000 కమీషన్‌గా సరిహద్దుకు అటు–ఇటు ఉన్న గ్రామాలకు చెందిన తన అనుచరులకు ఇస్తుంటాడు. అక్కడ ఉన్న వారు అనువైన ప్రాంతం, సమయంలో యువతుల్ని పంపిస్తుండగా... ఇక్కడ ఉన్న వాళ్లు రిసీవ్ చేసుకుని సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంటారు. రాహుల్ ఎక్కడా తెరపైకి రాకుండా ఈ వ్యవహారం నడిపిస్తుంటాడని అధికారులు చెబుతున్నారు. 2017 నుంచి ఈ దందా చేస్తున్న రాహుల్‌కు కోల్‌కతాకు చెందిన కొన్ని ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. వారి సహకారంతోనే డిమాండ్ చేసిన మొత్తం చెల్లించిన వారికి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేయించి ఇస్తున్నాడు. ఇలా ఇక్కడి ఆధార్, ఓటర్ ఐడీలు పొందుతున్న బంగ్లాదేశీ యువతులు పశ్చిమ బెంగాల్ వాసులుగా చెలామణి అవుతున్నారు. హైదరాబాద్ సహా మరికొన్ని చోట్లకు... కొందరు దళారులు సదరు యువతులను హైదరాబాద్ సహా మరికొన్ని నగరాలకు తరలిస్తున్నారు. ఉద్యోగం పేరుతో తీసుకువచ్చి వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నారు. అతి తక్కువ మంది మాత్రం మసాజ్ పార్లర్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో పని చేస్తున్నారు. ఇదే పంథాలో కొందరు బంగ్లాదేశ్ యువకులు కూడా అక్రమంగా సరిహద్దులు దాటి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మనుషుల అక్రమ రవాణా నెట్వర్క్ పూర్వాపరాలతో ఓ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఎవరెవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడ నుంచి సరిహద్దులు దాటిస్తున్నారు? తదితర అంశాలను నిఘా వర్గాలతో పాటు సరిహద్దు భద్రతా దళం దృష్టికి తీసుకెవెళ్లాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో నమోదైన మనుషుల అక్రమ రవాణా కేసుల్లో కొన్ని దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) చేరాయి. దీంతో ఆ విభాగంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని, సమాచార మార్పిడి చేసుకోనున్నట్లు తెలిసింది.

ఈ సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి దేవుడా?
ఖమ్మం: వేసవి సెలవులు వచ్చేశాయి.. ఒకటి, రెండు రోజుల్లో వెళ్లి మనవళ్లను తీసుకురావాలి.. నెలపాటు వారితో ఇంట్లో సందడిగా ఉంటుంది.. అని భావించిన ఆ తాత హతాశుడయ్యే సమాచారం అందింది. మనవళ్లు ఇద్దరిని కుమార్తె హత్య చేసి ఆమె సైతం బలవన్మరణానికి పాల్పడిందని తెలియడంతో కన్నీరమున్నీరయ్యాడు. మనవళ్లు గత ఏడాది వచ్చినప్పుడు అడిగినట్లుగా కొన్న సైకిళ్లు ఎవరికి ఇవ్వాలి అంటూ ఆయన రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పెనుబల్లి మండలం తాళ్లపెంటకు చెందిన గువ్వల వెంకటరెడ్డి సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం సత్తుపల్లిలోని బైపాస్‌రోడ్ టీచర్స్ కాలనీలో ఇల్లు కట్టుకుని నివస్తుండగా ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె తేజస్వినిరెడ్డి(35) వివాహం 13ఏళ్ల క్రితం సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన గండ్ర వెంకటేశ్వరరెడ్డితో జరగగా వారికి కుమారులు హర్షిత్‌రెడ్డి(11), అశిష్‌రెడ్డి(7) ఉన్నారు. కుటుంబమంతా హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తుండగా గురువారం వెంకటేశ్వరరెడ్డి విధులకు వెళ్లొచ్చేలోగా కుమారులిద్దరిని చంపిన తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, వెంకటరెడ్డి కుమారుడు, తేజస్విని తమ్ముడు సైతం 14ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కుమారుడు, ఇప్పుడు కుమార్తె, మనవళ్ల మృతితో వెంకటరెడ్డి కుటుంబీకుల రోదనలను ఆపడం ఎవరి వల్లా కాలేదు. ఘటనా సమాచారం తెలియగానే కుటుంబమంతా హైదరాబాద్ వెళ్లగా ముగ్గురి మృతదేహాలకు హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు.

అనుమానంతో బ్లేడుతో భార్య గొంతు కోసిన భర్త
క్రోసూరు(పల్నాడు): స్థానిక బోయ కాలనీలో భార్యపై అనుమానం పెంచుకుని భర్త బ్లేడుతో గొంతుకోసిన సంఘటన శుక్రవారం జరిగింది. స్టేషన్ రైటర్ దాసు వివరాల ప్రకారం.. బోయ కాలనీకి చెందిన చార్ల శ్రీను భార్య మల్లమ్మ. ఆమె ఎవరితోనో ఫోనులో మాట్లాడుతుండటంతో అనుమానపడి శ్రీను బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. చుట్టపక్కల వారు ఆమెను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు 25 కుట్లు వేశారు. ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. శ్రీను, మల్లమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా అయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైటర్ దాసు తెలిపారు.

ఏసీబీ వలలో నస్పూర్ ఎస్సై
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/నస్పూర్: క్షుద్ర పూజల కేసులో జప్తు చేసిన నగదును బాధితుడికి ఇవ్వక సొంతానికి వాడుకున్న ఎస్సై అవినీతి నిరోధక శాఖకు చిక్కి జైలు పాలయ్యాడు. ఆదిలాబాద్ రేంజీ డీఎస్పీ పి.విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నస్పూర్ ఎస్సై నెల్కి సుగుణాకర్ గత జనవరి 26న క్షుద్రపూజలతో రెట్టింపు డబ్బులు చేస్తానని మహారాష్ట్రకు చెందిన ఓ పూజరి మోసం కేసులో రూ.2లక్షలు జప్తు చేశాడు. కేసు ఫిర్యాదుదారుడు ప్రభంజన్ కోర్టు నుంచి నగదు విడుదల కోసం ఈ నెల 4న ఉత్తర్వులు తీసుకు రాగా, ఇచ్చేందుకు ఎస్సై దాట వేశాడు. రూ.1.50లక్షలు బాధితుడి చేతిలో పెడుతూ ఫొటో దిగి, వెంటనే డ్రాలో వేసుకున్నాడు. రూ.2లక్షలు తీసుకున్నట్లు సంతకం చేయమని ఒత్తిడి చేయగా బాధితుడు ఒప్పుకోలేదు. ఈ నెల 8న మళ్లీ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైని అడిగితే, డబ్బులు ఖర్చయ్యాయని, రూ.50వేలు ఉన్నాయని, నీ మీద కూడా కేసు అయ్యేది ఇచ్చింది తీసుకో అంటూ బెదిరించి పంపేశాడు. ఈ నెల 10న రూ.70వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాక ఇవ్వలేదు. చివరకు రూ.50వేలకు మరో పది వేలు కలిపి ఓ వైన్స్ వద్ద తీసుకోవాలని చెప్పాడు. ఇదే కేసులో బాధితుడి పేరు లేకుండా ఉండేందుకు ఎస్సై బినామీ డి.దీపక్‌కు ఫోన్ పేలో రూ.30వేలు చెల్లించాడు. విసిగెత్తిన బాధితుడు ఏసీబీ టోల్ ఫ్రీ 1064ను సంప్రదించగా, ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఎస్సై ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డులు, ఫోన్ పే చెల్లింపు, జప్తు చేసిన నగదు లేకపోవడం ఆధారాలు సేకరించారు. ఎఫ్ఐఆర్ చేసి ఎస్సైని కరీంనగర్ ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. 2020బ్యాచ్‌కు చెందిన ఎస్సై గతేడు జూలై నుంచి నస్పూర్ ఎస్సైగా పని చేస్తున్నారు.
వీడియోలు


పెద్దిలో మగధీర కాంబినేషన్?


పార్టీ మారిన కార్పొరేటర్ల పై వరుదు కళ్యాణి సీరియస్ కామెంట్స్


విద్యార్థిని మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు


విశాఖలో మెడికో శ్రీరామ్ ఆత్మహత్య


భారత్ కు ఇలాన్ మస్క్


విజయసాయి రెడ్డిపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు


అల్లు అర్జున్, అట్లీ మూవీకి పుష్ప సెంటిమెంట్!


కుట్రలు, కుతంత్రాలతో కూటమి మ్యాజిక్ ఫిగర్


మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు హైడ్రా షాక్


గచ్చిబౌలి పీఎస్ లో విచారణకు హాజరైన స్మితా సబర్వాల్