Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YV Subba Reddy Strong Counter To Vijaysai Reddy Comments1
అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది

విజయవాడ, సాక్షి: లిక్కర్‌ కేసు విచారణ సందర్భంగా రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వైఎస్సార్‌సీపీ కోటరీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ పడింది. అసలు అలాంటి కోటరీ ఒకటి ఉందో లేదో ఆయనకే తెలియాలి అంటూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజయసాయికి చురకలు అంటించారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదోరకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయనే కదా ప్రధానంగా చక్రం తిప్పింది. అలాంటప్పుడు పార్టీలో కోటరీ ఉందో? లేదో?.. కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా?. ఇప్పుడేమో నెంబర్‌ 2 నుంచి 2 వేల స్థానానికి పడిపోయానని ఆయనే చెప్పుకుంటున్నాడు. .. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు. మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు.. రాబోయే రోజుల్లో కూడా ఉండదు. మా పార్టీలో నెంబర్‌ వన్‌ నుంచి 100 వరకూ అన్నీ జగన్ మోహన్ రెడ్డే’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘మా హయాంలో ఎలాంటి స్కాములు జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ అంటూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. భయపెట్టి కొంతమందిని లొంగదీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అన్నింటి పైనా న్యాయపోరాటం చేస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Medico Jumps From College Building In Visakhapatnam2
విశాఖలో మెడికో ఆత్మహత్య

సాక్షి, విశాఖపట్నం: నగరంలో మెడికో శ్రీరామ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్‌రెడ్డి వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న భీమిలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యమరో ఘటనలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని ఇవాళ తెల్లవారుజామున భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని కృష్ణవేణిగా గుర్తించారు. ఉగాది పండగకు ఇంటికి వెళ్లి నిన్న(శుక్రవారం) సాయంత్రం తల్లితో కలిసి కళాశాలకు విద్యార్థిని వచ్చింది.తల్లితో కలిసి రాత్రి హాస్టల్‌లో ఉన్న మృతురాలు కృష్ణవేణి.. తెల్లవారుజామున కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Will Visit India Later This Year Elon Musk Tweet3
ఇండియాకు ఎలాన్ మస్క్!.. ఎప్పుడో తెలుసా?

ప్రపంచకుబేరుడు 'ఎలాన్ మస్క్' ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శిస్తానని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. శుక్రవారం మోదీతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత మస్క్ ఈ ప్రకటన చేశారు.సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు భారత్‌ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌తో ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా మోదీ మస్క్‌ను కలిశారు. ఆ సమయంలో వీరిరువురు అంతరిక్ష అన్వేషణ, కృత్రిమ మేధస్సు.. స్థిరమైన అభివృద్ధిలో భారతీయ & అమెరికా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు. అయితే ఎలాన్ మస్క్ ఇప్పటికే.. పలుమార్లు ఇండియాలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. కానీ అవన్నీ వాయిదా పడ్డాయి. బహుశా ఈసారి పర్యటించే అవకాశం ఉందని, భారత్‌తో తమ బంధాన్ని బలపరచుకుంటారని తెలుస్తోంది.ఇండియాకు టెస్లాటెస్లా కంపెనీ ఇండియన్ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. భారత ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి సంస్థ ఇక్కడ కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. టెస్లా షోరూమ్ల కోసం ఇప్పటికే ముంబై, ఢిల్లీ నగరాలను ఎంపిక చేసినట్లు, ఉద్యోగుల నియామకాలను కూడా చేపడుతున్నట్లు వార్తలు వినిపించాయి.ఇదీ చదవండి: అల్లుడితో కలిసి ఏడెకరాలు కొన్న నటుడు.. భూమి విలువ ఎన్ని కోట్లంటే?ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలోనే టెస్లా ఎలక్ట్రిక్ కారు.. ముంబై - పూణే నేషనల్ హైవే మీద టెస్టింగ్ దశలో కనిపించింది. ఈ కారును మోడల్ వై కారు అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న మోడల్ వై కార్ల కంటే కూడా.. టెస్టింగ్ సమయంలో కనిపించిన కారులో ఎక్కువ ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.It was an honor to speak with PM Modi. I am looking forward to visiting India later this year! https://t.co/TYUp6w5Gys— Elon Musk (@elonmusk) April 19, 2025

Hydraa Shock to AP MLA Vasantha Krishna Prasad4
ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్‌

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు హైడ్రా షాక్‌ తగిలింది. కొండాపూర్‌ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఆయన చేపట్టిన అక్రమ కట్టడాలను శనివారం ఉదయం అధికారులు కూల్చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.కొండాపూర్‌ ఆర్టీఏ కార్యాలయ సమీపంలోని సర్వే నెంబర్‌ 79లో 39 ఎకరాల స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు అక్కడికి చేరుకున్న హైడ్రా.. వసంత కృష్ణ ప్రసాద్‌ కబ్జాల పర్వాన్ని గుర్తించింది. ఆ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తోపాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించింది. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. భారీ పోలీస్‌ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించింది. ఈ క్రమంలో వసంత హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన ఆఫీస్‌తో పాటు భారీ షెడ్లను తొలగించారు. హఫీజ్‌పేటలో రూ.2000 కోట్ల విలువగల వివాదాస్పద భూమిలో ఆయన కబ్జా పెట్టినట్లు తేలింది. అలాగే.. మాదాపూర్‌లోని 20 ఎకరాల భూమిని వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసినట్లు హైడ్రా గుర్తించింది. ఈ వ్యవహారంపై ఆయన అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Actor Ajith Kumar Suffer From Another Car Accident5
హీరో అజిత్‌కు మరోసారి కారు ప్రమాదం.. వీడియో వైరల్‌

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ (Ajith Kumar) కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. బెల్జియం కారు రేసింగ్‌లో అజిత్‌ నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవగా అజిత్‌ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.కారు రేసింగ్‌లో అజిత్‌ పలుమార్లు ప్రమాదానికి గురయ్యాడు. ఇటీవల మార్చిలో స్పెయిన్‌లో జరిగిన రేసింగ్‌లో కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ రేసింగ్‌లో.. మరో కారును తప్పించే క్రమంలో అజిత్‌ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆయన కారు ట్రాక్‌ తప్పి పల్టీలు కొట్టింది. అక్కడున్న సిబ్బంది వెంటనే అలర్ట్‌ అవడంతో అజిత్‌ సురక్షితంగా బయటకు వచ్చాడు.సినిమాఅజిత్‌ సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటించిన లేటెస్ట్‌ మూవీ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ (Good Bad Ugly Movie) బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. తొమ్మిది రోజుల్లోనే రూ.200 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి అజిత్‌ కెరీర్‌లోనే టాప్‌ మూవీగా రికార్డు సృష్టించింది. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ప్రియ ప్రకాశ్‌ వారియర్‌, సునీల్‌, అర్జున్‌ దాస్‌ కీలక పాత్రలు పోషించారు. தல அஜீத்குமார் அவர்கள் கார் பந்தயத்தில் விபத்தில் சிக்கி நலமுடன் மீண்டு வந்தார் 🔥#Ajithkumar𓃵 #AjithKumar #AjithKumarRacing #GoodBadUgly pic.twitter.com/3RR4g5p8Up— Aadhi Shiva (@aadhi_shiva1718) April 19, 2025 చదవండి: నెలసరి నొప్పులు.. అబ్బాయిలు అస్సలు భరించలేరు: జాన్వీ కపూర్‌

YSRCP Leaders Serious On CBN Govt Over Visaka Mayor Issue6
‘చంద్రబాబు మహిళా ద్రోహిగా మిగిలిపోతారు’

సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలతో కూటమి సర్కార్‌ మేయర్‌ పీఠం కైవసం చేసుకుందని ఆరోపించారు. కూటమి పాలనలో ధర్మం వధ, సత్యం చెరలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.విశాఖ మేయర్‌ పీఠం కూటమి గెలుపుపై వైఎస్సార్‌సీపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..‘యాదవ మహిళకు వైఎస్‌ జగన్‌ మేయర్‌ పదవి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. కుట్రలు, కుతంత్రాలతో కూటమి సర్కార్‌ మేయర్‌ పీఠం కైవసం చేసుకుంది. పార్టీ మారని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను బెదిరించాలని చూస్తున్నారు. చావుబతుకుల మధ్య కూటమి సర్కార్‌ మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకుంది. వైఎస్సార్‌సీపీ పాలనలో గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో మేం ప్రలోభపెట్టలేదు. కూటమి పాలనలో ధర్మం వధ, సత్యం చెరలో పడిపోయింది. కూటమి నేతలు గెలిచే బలం లేకున్నా అవిశ్వాస తీర్మాన లేఖ ఇచ్చారు. ధర్మం గెలిచిదంటున్న కూటమి నేతలకు మాట్లాడే అర్హత లేదు. కూటమి చావు బతుకుల మీద మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచారు. కుట్రలు తంత్రాలకు తెర తీశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. విలువలు విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు. కూటమిని తట్టుకొని నిలబడ్డ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్‌..బలం లేకుండా అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు..ధర్మం న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదు.మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు. విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారు.విప్ ఉల్లంఘించిన వారి పదవులు పోవడం కాదు..యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళకు మేయర్ పదవి ఇచ్చారు..ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని ప్రలోభ పెట్టారు.99 పైసలకే విశాఖ భూములను ఇష్టానుసారంగా కట్టబెడుతున్నారు.ఇదే తరహాలో భూములు కట్టబెడతామని లోకేష్ చెప్తున్నారు..టీసీఎస్ విశాఖ రాక ముందే భూములు అప్పనంగా కట్టబెడుతున్నారు.విశాఖ మేయర్ పీఠం చేతిలో ఉంచుకొని విశాఖను దోచుకోవాలని చూస్తున్నారు.ధర్మశ్రీ పాయింట్స్ కామెంట్స్‌..మేయర్ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ నైతికంగా గెలిచింది..కూటమి నిజంగా గెలిచే పరిస్థితి ఉంటే నెల రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు..జీవీఎంసీ డబ్బులతో ప్రత్యేక విమానాలు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల కోసం తీసుకువెళ్లారు..యాదవ్ కుల ద్రోహులు కూటమిలో ఉన్నారు..ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్‌..పది నెలల పదవి కోసం ఒక మహిళను పదవి నుంచి దించుతారా?.చంద్రబాబు మహిళా ద్రోహిగా మిగిలిపోతారు..ప్రజలు 164 సీట్లు ఇచ్చిన చంద్రబాబుకు అధికార దాహం తీరలేదు..వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను భయబ్రాంతులకు గురి చేశారు.చంద్రబాబు ప్రలోభాలకు పెట్టింది పేరున్యాయం ధర్మం గెలిచిందని కూటమి నేతలు మాట్లాడడం సిగ్గుచేటు.కుట్రలు తంత్రాలకు మేయర్ ఎన్నికలో గెలిచాయి.

Kutami Atrocities No confidence motion against Vizag Mayor Live Updates7
GVMC: అడ్డదారిలో అవిశ్వాసం నెగ్గిన కూటమి

విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో ప్రజాస్వామ్యం మళ్లీ మళ్లీ ఖూనీ అవుతోంది. బలం లేకున్నా విశాఖ మేయర్‌పై అవిశ్వాసం పెట్టి.. కుట్రలు, ప్రలోభాల పర్వాలతో అడ్డదారిలో నెగ్గింది. ఏకంగా 30 మంది కార్పొరేటర్లను కొనుగోలు చేసిన టీడీపీ.. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారిను మేయర్‌ పీఠం నుంచి దించేసింది. అధికార వ్యామోహంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. కేవలం పది నెలల కాలం ఉన్న ఓ మేయర్ పదవి కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించడం గమనార్హం. ఈ క్రమంలో దిగజారుడు రాజకీయాలు చేసింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం దాకా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. కార్పొరేటర్లను ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు పంపడం, స్టార్‌ హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేయడం లాంటి చేష్టలకు పాల్పడింది. కేరళకు వెళ్లి మరీ వైస్సార్‌సీపీ కార్పొరేటర్లను బెదిరించి.. బతిమాలి.. డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. అవిశ్వాసం నెగ్గాలంటే 74 ఓట్లు అవసరం. ఒకవైపు డబ్బు ఎర, మరోవైపు బెదిరింపులు, ఇంకోవైపు కిడ్నాపులు.. ఇలా టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అయినా సరే బొటాబొటిగా 74 మంది సభ్యులతోనే విశాఖ మేయర్‌పై అవిశ్వాసం నెగ్గింది టీడీపీ. ఇక అవిశ్వాస ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే.. భారీ భద్రత నడుమ ఓటింగ్‌ నిర్వహించాలని, ఓటింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయించాలని వైఎస్సార్‌సీపీ చేసిన విజ్ఞప్తిని అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కూటమి నేతలను అడ్డుకోని పోలీసులుఅవిశ్వాసం వేళ.. కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు కాకుండా కొందరు కూటమి నేతలను పోలీసులు జీవీఎంసీ కార్యాలయంలోకి లోపలికి అనుమతించారు. బస్సులో ఉన్న కూటమి నాయకులను వారి అనుచరులను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. ఓటింగ్‌కు వెళ్లిన సభ్యులతో కలిసి జీవీఎంసీ దర్జాగా కొందరు కూటమి నేతలు వెళ్తున్న దృశ్యాలు మీడియాకు చేరడం గమనార్హం. నీచమైన రాజకీయాలు వద్దని చెప్పాప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని చెప్పాను. మొదటినుంచి నేను వైఎస్సార్‌సీపీలో ఉన్నాను. రాజకీయమంటే వ్యాపారం కాదు. డబ్బులు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను. నీచమైన రాజకీయాలను చెయ్యొద్దని చెప్పాను. వైయస్ జగన్ వలనే నేను కార్పోరేటర్ అయ్యాను అని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ శశికళ ఈ ఉదయం ఓ వీడియో విడుదల చేశారు కూడా. ఓటింగ్‌కు ముందు వాస్తవ బలాబలాలువైఎస్సార్సీపీ 58 టీడీపీ 29జనసేన 3బీజేపీ 1సీపీఐ 1సీపీఎం 1ఇండిపెండెన్స్ 4.ఖాళీలు 1.జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లుజీవీఎంసీలో 14 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులుటీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ..వైఎస్సార్సీపీకి ముగ్గురు ఎక్స్ అఫీషియ సభ్యులు.ఎంపీ గొల్ల బాబురావు, ఇద్దరు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీ సభ్యుల సంఖ్య బలం 97+14= 111అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్సార్‌సీపీ మొత్తం బలం 61ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48ఎన్నికకు దూరంగా ఇద్దరు సీపీఎం, సీపీఐ సభ్యులు.

Should Have Used Common Sense: Sehwag Slams Kohli Patidar Other RCB Batters8
ఒక్కరికీ కామన్‌ సెన్స్‌ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?: సెహ్వాగ్‌ ఫైర్‌

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) బ్యాటర్ల తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ (Virender Sehwag) ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు పారేసుకున్నారని.. ఒక్కరు కూడా బుద్ధిని ఉపయోగించలేకపోయారంటూ ఘాటుగా విమర్శించాడు.హోం గ్రౌండ్‌లో వరుస పరాజయాలు కాగా సొంత మైదానంలో ఇతర జట్లు ఇరగదీస్తుంటే ఆర్సీబీ మాత్రం.. హోం గ్రౌండ్‌లో వరుస పరాజయాలు నమోదు చేస్తోంది. తాజాగా చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాటిదార్‌ సేన ఓటమిపాలైంది. వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో ఈ పోరును 14 ఓవర్లకు కుదించారు.పెవిలియన్‌కు క్యూ ఈ క్రమంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే వరుసగా షాకులు తగిలాయి. పంజాబ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (4), విరాట్‌ కోహ్లి (Virat Kohli- 1) వెనువెంటనే వెనుదిరిగారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (23) నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా చహల్‌ అతడిని పెవిలియన్‌కు చేర్చాడు.2️⃣ sharp catches 🫡2️⃣ early strikes ✌Arshdeep Singh and #PBKS with a solid start ⚡Updates ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/jCt2NiuYEH— IndianPremierLeague (@IPL) April 18, 2025 డేవిడ్‌ మెరుపుల వల్లమిగిలిన వాళ్లలో లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (4), జితేశ్‌ శర్మ (2), కృనాల్‌ పాండ్యా (1) పూర్తిగా విఫలం కాగా.. ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఆర్సీబీ 14 ఓవర్లలో 95 పరుగులు చేయగలిగింది.𝘽𝙊𝙊𝙈 💥Nehal Wadhera is in a hurry to finish it for #PBKS 🏃Updates ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/upMlSvOJi9— IndianPremierLeague (@IPL) April 18, 2025ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడినా నేహాల్‌ వధేరా ధనాధన్‌ ఇన్నింగ్స్‌ (19 బంతుల్లో 33 నాటౌట్‌) కారణంగా.. పంజాబ్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ల తీరుపై వీరేంద్ర సెహ్వాగ్‌ విమర్శలు గుప్పించాడు.ఒక్కరికీ కామన్‌ సెన్స్‌ లేదు.. ఇంత చెత్తగా ఆడతారా?‘‘ఆర్సీబీ బ్యాటింగ్‌ మరీ తీసికట్టుగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు నిర్లక్ష్యపు షాట్లు ఆడారు. ఒక్కరంటే ఒక్కరు కూడా.. మంచి బంతికి అవుట్‌ కాలేదు. అంతా సాధారణ బంతులే ఆడలేక పెవిలియన్‌ చేరారు.ఆర్సీబీ బ్యాటర్లలో ఒక్కరైనా కామన్‌ సెన్స్ ఉపయోగించి ఉంటే బాగుండేది. వాళ్ల చేతిలో గనుక వికెట్లు ఉండి ఉంటే స్కోరు 14 ఓవర్లలో కనీసం 110- 120గా ఉండేది. తద్వారా విజయం కోసం పోరాడే పరిస్థితి ఉండేది. కానీ వీళ్లు మాత్రం చేతులెత్తేశారు.సొంత మైదానంలో ఆర్సీబీ గెలవలేకపోతోంది. పాటిదార్‌ ఇందుకు పరిష్కారాన్ని కనుగొనాలి. నిజానికి ఆర్సీబీ బౌలర్లు బాగానే ఆడుతున్నారు. కానీ బ్యాటర్లే చిత్రంగా ఉన్నారు. సొంత మైదానంలో అందరూ వరుసగా విఫలమవుతున్నారు’’ అని క్రిక్‌బజ్‌ షోలో సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. ఇటు కోహ్లి.. అటు భువీకాగా ఈ సీజన్‌లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ నాలుగు గెలిచి పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లోనూ ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు 249 పరుగులు సాధించాడు. ఇక కోహ్లి ఓపెనింగ్‌ జోడీ అయిన ఫిల్‌ సాల్ట్‌ 212 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. కెప్టెన్‌ పాటిదార్‌ ఇప్పటికి 209 పరుగులు సాధించాడు. బౌలర్లలో ఆర్సీబీ తరఫున భువనేశ్వర్‌ కుమార్‌ టాప్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో భువీ ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు తీశాడు.చదవండి: సంజూతో విభేదాలు!.. స్పందించిన రాహుల్‌ ద్రవిడ్‌

Son gets married after father passed away to receive his blessings video viral9
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి

చెట్టంత ఎదిగిన పిల్లలకు వేడుకగా పెళ్లి చేయాలని భావిస్తారు ఏ తల్లిదండ్రులైనా. అలాగే కనిపెంచిన అమ్మానాన్నల కనుల విందుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి ఆశిస్తారు ఏ బిడ్డలైనా. కానీ కన్నకొడుకు మూడు ముళ్ల ముచ్చట చూడాలన్న కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పుట్టెడు దుఃఖ్ఖంతో కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురి చేత కంట తడి పెట్టిస్తోంది.Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov— Thanthi TV (@ThanthiTV) April 18, 2025తండ్రి నిండు మనసుతో అక్షింతలేసి ఆశీర్వదిస్తుండగా, తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన కొడుక్కి తీరని వేదని మిగిల్చిన ఘటన ఇది. దీంతో తండ్రి భౌతిక దేహం సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వధూవురులతోపాటు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగిన ఈ పెళ్లి తమిళనాడులోని కడలూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. భౌతికంగా తన తండ్రి పూర్తిగా మాయం కాకముందే, ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలిని ఒప్పించి మరీ తండ్రి మృతదేహం ఎదుటే ఆమెకు తాళి కట్టారు. బోరున విలపిస్తూ తండ్రి ఆశీస్సులు తీసుకోవడం అక్కడున్నవారినందరి హృదయాలను బద్దలు చేసింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ బంధువులు, స్థానికులు కూడా వారిని ఆశీర్వదించారు.ఇదీ చదవండి:అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్‌(63) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు అప్పు లా కోర్సు చదువుతున్నాడు. గత నాలుగేళ్లుగా విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తమ ప్రేమ సంగతిని ఇంట్లోని పెద్దలతో చెప్పారు. ఇరు కుటుంబాల అనుమతితో త్వరలోనే పెళ్లి చేసుకోవాలను కున్నారు. విరుధాచలం కౌంజియప్పర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయశాంతి డిగ్రీ చదువుతోంది. చదువు పూర్తైన తరువాత వివాహంచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..అన్నట్టు విధి మరోలా ఉంది. అప్పు తండ్రి సెల్వరాజ్‌ అనారోగ్యంతో అనూహ్యంగా కాలం చేశాడు. దీంతో గుండె పగిలిన అప్పు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

KSR Comment On Like Kanche Gachibowli Modi Reacts On AP Lands10
చంద్రబాబు చెవిలోనైనా ఆ విషయం చెబుతారా?

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వద్ద కంచ గచ్చిబౌలి వద్ద ఉన్న 400 ఎకరాల భూమికి సంబంధించి ఒకవైపు సుప్రింకోర్టు విచారణ జరుపుతుండగా, ప్రధానమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడవులపై బుల్డోజర్లు ప్రయోగిస్తోందని మోదీ ఆరోపించారు. అక్కడ జంతువులను ప్రమాదంలో పడేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ సంపదను నాశనం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అయితే.. .. ఏపీలో కూటమి ప్రభుత్వం(AP Kutami Prabhutvam) ఇప్పటికే 33 వేల ఎకరాల పచ్చటి పంటల భూములను పర్యావరణంతో సంబంధం లేకుండా నాశనం చేస్తే మద్దతు ఇచ్చిన బీజేపీ పెద్దలకు.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి నైతికంగా అర్హత ఎంత మేర ఉంటటుందన్నది ఆలోచించుకోవాలి. అది చాలదన్నట్లుగా మరో 45 వేల ఎకరాలు సమీకరిస్తామని బాబు సర్కార్ చెబుతుంటే కనీసం స్పందించని బీజేపీ.. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 👉అయినా తెలంగాణలో బీజేపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నారు కనుక విమర్శలు, ఆరోపణలు చేస్తే చేయవచ్చు. కాని దేశ ప్రధాని అంతటివారు ఈ వివాదంలో వేలు పెట్టడం పద్దతేనా?. అది సుప్రీం కోర్టు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందా? ఉండదా? అనే చర్చకు ఆస్కారం ఇస్తోంది. హామీలు అమలు చేయకుండా రేవంత్ సర్కార్ బుల్డోజర్లను వాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాలలో అభివృద్ది పరుగులు తీస్తోందని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్రాలను పొగుడుకుంటే పొగుడుకోవచ్చు. కాని ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలపై మోదీ అధిక విమర్శలు చేయడం ద్వారా ఆయనలోని రాజకీయ నేత కోణం అంతగా మంచి పేరు తేకపోవచ్చు. ఉత్తరప్రదేశ్ తదితర కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో నేరస్తుల పేరుతో ఇళ్లను ఇష్టారాజ్యంగా కూల్చివేస్తున్న తీరుపై చాలా అసంతృప్తి ఉంది. సుప్రీంర్టు సైతం దీనిపై పలుమార్లు వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ఆ విషయాలను మోదీ గమనంలోకి తీసుకుంటారో లేదో తెలియదు. రేవంత్ ప్రభుత్వం కంచ గచ్చి బౌలి భూముల విషయంలో అనుసరిస్తున్న వైఖరి సరైనదా? కాదా? అనేది ఇక్కడ చర్చ కాదు. దానిని సమర్ధించవచ్చు. వ్యతిరేకించవచ్చు. స్థానిక ప్రజలు తమ అభీష్టాన్ని ప్రభుత్వానికి చెప్పవచ్చు. అది వేరే సంగతి. కాని గతంలో దేశ ప్రధానులలో ఎవరూ ఇలా రాష్ట్రాలపై తరచు విమర్శలు చేసినట్లు అనిపించదు. ఎన్నికల సమయంలో పార్టీ పరంగా, విధానపరంగా విమర్శలు,ప్రతి విమర్శలు చేయడానికి వారు ప్రాధాన్యత ఇచ్చి ఉండవచ్చు. అంతే తప్ప, ఏ రాష్ట్రానికి వెళ్లినా అదే పనిలో ఉండడం గతంలో ఈ స్థాయిలో ఉండేది కాదని చెప్పవచ్చు. లేదా మహా అయితే పరోక్షంగా ఏమైనా ఒకటి,రెండు విమర్శలు చేసి ఉండొచ్చు. 👉మన్మోహన్ సింగ్(Manmohan Singh) ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలపై పనికట్టుకుని ఆరోపణలు చేసేవారుకాదు. కాకపోతే సింగ్ బ్యూరోక్రాట్ నుంచి రాజకీయనేతగా మారారు. మోదీ మొదట ఆర్ఎస్ఎస్ లో ఉండి ,తదుపరి రాజకీయ నేతగా ఎదిగారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలోని కంచ గచ్చిబౌలి వద్ద 400 ఎకరాల భూమిపై వివాదం ఏర్పడిన మాట నిజం. ఆ భూములలోఎలాంటి పనులు చేపట్టవద్దని పలువురు కోరిన సంగతి కూడా నిజమే. దానిపై కేంద్రప్రభుత్వపరంగా ఏవైనా ఆలోచనలు ఉంటే వాటిని సజెస్ట్ చేస్తూ రాష్ట్రానికి లేఖ రాసి ఉండవచ్చు. కాని అవేవీ చేయలేదు. 👉తెలంగాణ బీజేపీ నేతలు(Telangana BJP) ఏ విమర్శలు చేశారో వాటినే ప్రధాని మోదీ కూడా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం అవి అసలు అటవీశాఖ భూములే కాదు. ప్రభుత్వ భూములని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాతే అక్కడ కొన్ని కార్యకలాపాలు చేపట్టడం జరిగింది. ఆ భూముల ఆధారంగా పదివేల కోట్ల రుణ సమీకరణ కూడా చేశారు. ఈలోగా దీనిపై యూనివర్శిటీలో విద్యార్దులు వ్యతిరేకించి ,ఆ భూమి కూడా సెంట్రల్ యూనివర్శిటీకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌లు మద్దతు ఇవ్వడం, సడన్‌గా సుప్రీం కోర్టు కూడా సుమోటోగా జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడం జరిగింది. దీనికి రేవంత్ సర్కార్ బదులు ఇస్తూ కంచగచ్చిబౌలి(kanche Gachibowli) భూములు అటవీ భూములు కాదని, ప్రభుత్వం అధీనంలో ఉన్న భూములని స్పష్టం చేసింది. అక్కడ జంతువులకు ఆవాసం లేదని,వాటికి తగు రక్షణ కల్పించడానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. 👉ఇక్కడ కొట్టేసిన చెట్లు నిషేదిత జాబితాలో లేవని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే సుప్రీం కోర్టు దీనిపై కూడా అంత సంతృప్తి చెందలేదు. చెట్లు కొట్టివేయడానికి అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించింది. ఆ కేసు ఇంకా పూర్తి కాలేదు..కాని ఈలోగా ప్రధాని మోదీ అవి అడవులని, అక్కడ జంతువులు ఉన్నాయని, అడవిని, జంతువులను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోందని రాజకీయంగా మాట్లాడడం పద్దతేనా అనే అభిప్రాయం కలుగుతుంది. తెలంగాణలో అధికారం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుండవచ్చు. దానికి తగిన విధంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంటారు. తెలంగాణకు వచ్చినప్పుడు కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు చేస్తే అదో తరహా. కాని ఎక్కడో హర్యానాలో ఒక సభలో మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు. నిజంగానే పర్యావరణంపైన ప్రధానమంత్రికి అంత శ్రద్దాసక్తులు ఉన్నట్లయితే ఏపీలో రాజధాని పేరుతో 33వేల ఎకరాలు సమీకరించినప్పుడు బిజెపి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?. మోదీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి వెళ్లారే. అవసరమైనమేర ప్రభుత్వ భూమిని వాడుకుంటే మంచిదని అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మోడీ ఎందుకు సలహా ఇవ్వలేదు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ విడిపోయాక.. పోలవరం, అమరావతి టీడీపీ నేతలకు ఏటీఎంగా మారాయని ఆయనే ఆరోపించారు కదా?. ఆ తర్వాత 2024లో మళ్లీ పొత్తు పెట్టుకున్నాక అవన్ని తూచ్ అయిపోయినట్లనుకోవాలా?. ఇంతకుముందు తీసుకున్న 33 వేల ఎకరాలు కాకుండా,మరో 45వేల ఎకరాల భూమి సమీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడం సరైనదా? కాదా? అనేదానిపై మోదీ మాట్లాడడానికి సిద్దంగా ఉంటారా?. మరోసారి రాజధాని పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మే 2 న వస్తారట.అప్పుడైనా పర్యావరణానికి విఘాతం కలిగేలా ఇన్నివేల ఎకరాల భూములు ఎందుకు?అక్కడ పంటలను ఎందుకు నాశనం చేస్తున్నారు? పక్కనే ఉన్న కృష్ణానది మరింత కలుషితంగా మారడానికి ఈ చర్య అవకాశం ఇస్తుంది కదా? అని ప్రధాని ప్రశ్నించితే.. తెలంగాణ భూములపై చేసిన వ్యాఖ్యలను సమర్దించవచ్చు. అలా కాకపోతే అవకాశవాద రాజకీయాలకే ప్రధాని ప్రాధాన్యం ఇస్తున్నారన్న సంగతి ప్రజలకు తెలిసిపోదా?. తెలంగాణలో ఒక రకంగా, ఏపీలో మరో రకంగా మాట్లాడితే మోదీకి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.., ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు మద్య తేడా ఏముంటున్నదన్న ప్రశ్న వస్తుంది. ఏది ఏమైనా ప్రతి అంశంలోను పార్టీపరంగా కాకుండా దేశ ,రాష్ట్ర ప్రయోజనాలను గమనంలోకి తీసుకుని ప్రధాని మోదీ వ్యవహరిస్తే బాగుంటుంది కదా!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement